n_id
stringlengths 5
10
| doc_id
stringlengths 64
67
| lang
stringclasses 7
values | text
stringlengths 19
212k
|
---|---|---|---|
pib-229509 | 603c5995d13ac72ceea42290383a14f84392222cf7f8950fab26603bfafe7cbd | tel | భారత ఎన్నికల సంఘం
ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ఈసీఐ సంతాపం
మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల భారత ఎన్నికల సంఘం ప్రగాఢ సంతాపం తెలిపింది.
"అత్యంత గౌరవనీయ వ్యక్తిని భారత్ కోల్పోయింది. ఆర్థిక, రాజ్యాంగ, చారిత్రక వ్యవహారాల్లో పాండిత్యంతో రాజర్షిగా ఆయన పేరు తెచ్చుకున్నారు" అని ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా సంతాపం తెలిపారు.
"అనారోగ్యంతో ఉన్నా, ఈసీఐ ఆహ్వానాన్ని మన్నించి, ఈ ఏడాది జనవరి 23న, తొలి సుకుమార్ సేన్ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. రాష్ట్రపతిగా, 2016, 2017 సంవత్సరాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు" అని అరోరా గుర్తు చేసుకున్నారు. ప్రణబ్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నా అని చెప్పారు. |
pib-208673 | 11fdce5132ac175807e43f8bc251a81e098709e2ab5d21807cc9213c60c36091 | tel | మంత్రిమండలి
రైల్ వేఉద్యోగుల కు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులవేతనానికి సమానమైన ఉత్పాదకత తో ముడిపెట్టిన బోనస్ చెల్లింపునకు ఆమోదం తెలిపినమంత్రిమండలి
రైల్ వే ఉద్యోగుల కు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఉత్పాదకత తో ముడిపెట్టిన బోనస్ చెల్లించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ రోజు న ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.
అర్హులైన రైల్వే ఉద్యోగుల కు పిఎల్ బి ని ప్రతి సంవత్సరం దసరా/ పూజ సెలవు దినాల కంటే ముందే చెల్లించడం జరుగుతుంటుంది. ఈ సంవత్సరం కూడా దాదాపు గా 11.27 లక్షల మంది నాన్ గజిటెడ్ రైల్ వే ఉద్యోగుల కు 78 రోజుల వేతనాని కి సమానమైనటువంటి పిఎల్ బి సొమ్ము ను చెల్లించడమైంది. అర్హత కలిగిన ప్రతి ఒక్క రైల్ వే ఉద్యోగి కి 78 రోజుల కు గాను ఇచ్చేటటువంటి అధికతమ సొమ్ము 17, 951 రూపాయలు గా ఉంది. పైన ప్రస్తావించిన సొమ్ము చెల్లింపు ను వివిధ శ్రేణుల లో చేయడమైంది. అవి ఎటువంటి శ్రేణులు అంటే, వాటి లో ట్రాక్ మేంటెనర్ లు, డ్రైవర్ లు, గార్డు లు, స్టేశన్ మాస్టర్ లు, సూపర్ వైజర్ లు, టెక్నీశియన్, టెక్నీశియన్ హెల్పర్, కంట్రోలర్, పాయింట్స్ మన్ లు, మినిస్టీరియల్ స్టాఫ్ మరియు ఇతర గ్రూప్ ‘సి’ స్టాఫ్ ఉన్నారు అన్నమాట.
రైల్ వే ఉద్యోగుల కు 78 రోజుల పిఎల్ బి చెల్లింపు తాలూకు విత్తీయ ఖర్చు 1832.09 కోట్ల రూపాయలు గా ఉండవచ్చని అంచనా వేయడఃమైంది. పీఎల్ బి చెల్లింపు తాలూకు పైన ప్రస్తావించినటువంటి నిర్ణయాన్ని కోవిడ్-19 తరువాతి సవాళ్ళ కారణం గా ఏర్పడ్డ ప్రతికూల విత్తీయ స్థితి లో కూడాను తీసుకోవడం జరిగింది.
చెల్లింపు జరిగినటువంటి పిఎల్ బి దినాల వాస్తవిక సంఖ్య అనేది నిర్ణీత ఫార్మూలా ల ఆధారం గా తీసిన రోజు ల కంటే ఎక్కువ గా ఉంది. పిఎల్ బి ని చెల్లించడం అనే ప్రక్రియ రైల్ వే ల ప్రదర్శన ను మెరుగుపరచే దిశ లో పాటుపడేందుకు గాను రైల్ వే ఉద్యోగుల కు ప్రేరణ ను ఇచ్చేటటువంటి ప్రోత్సాహకం రూపం లో పనిచేస్తుంది. |
pib-108988 | 6183ab159f98e77345eff76b3ba7370463c2da247ee7eef3a8d3416caa3f6359 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ సంస్కృత భాషావేత్త పండిట్ రేవా ప్రసాద్ ద్వివేది మృతిపై ప్రధాని సంతాపం
ప్రముఖ సంస్కృత భాషావేత్త పండిట్ శ్రీ రేవా ప్రసాద్ ద్వివేది కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘సంస్కృత భాషా కోవిదుడు, మహామహోపాధ్యాయ పండిట్ శ్రీ రేవా ప్రసాద్ ద్వివేది ఇక లేరన్న వార్త నన్నెంతో మనస్తాపానికి గురిచేసింది. దేశ సాహిత్య, విద్యా రంగాల్లో ఆదర్శప్రాయ కృషిచేశారు. ఆయన కన్నుమూయడం సమాజానికి తీరని లోటు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను... ఓం శాంతి’’ అని ప్రధాని పేర్కొన్నారు. |
pib-248932 | a76430efac034d24d4edc358952e5c1b79d3da1bc9b13dda7cd267400dc6d65d | tel | యు పి ఎస్ సి
యుపీఎస్సీ ద్వారా ఆగష్టు, 2021 నెల నియామక ఫలితాలు ఖరారు
ఈ క్రింది నియామక ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగస్టు, 2021 నెలలో ఖరారు చేసింది. సిఫార్సు చేయబడిన అభ్యర్థులకు నియామక విషయం పోస్ట్ ద్వారా వ్యక్తిగతంగా తెలియజేయబడింది.
(జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. |
pib-16858 | 92cb76cb00d2c848595b1c2a5828eb29e0bbb4a3ac84ee50f63ff8d206a01ad2 | tel | కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఇ.పి.ఎఫ్.ఓ. యొక్క మినహాయింపు పొందిన సంస్థల కోసం భారీగా బదిలీ చేసే సదుపాయాన్ని ప్రారంభించిన - కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి శ్రీ అపుర్వ
ఇ.పి.ఎఫ్.ఓ. యొక్క మినహాయింపు పొందిన సంస్థల నుండి నిధులను మరియు డేటాను ఒకే సారి భారీగా బదిలీ చేసే కొత్త సదుపాయాన్ని, కార్యదర్శి, శ్రీ అపుర్వ చంద్ర, ఐ.ఎ.ఎస్., 2020 అక్టోబర్ 7వ తేదీన ఈ.పి.ఎఫ్.ఓ. ప్రధాన కార్యాలయాలకు తన మొదటి సందర్శనలో ప్రారంభించారు. మినహాయింపు పొందిన సంస్థలకు నిధుల బదిలీ వేగాన్ని పెంచడం ద్వారా వ్యాపారం చేసే సౌలభ్యాన్ని, ఈ సౌకర్యం పెంపొందిస్తుంది.
మినహాయింపు పొందిన సంస్థల నుండి ఒకే చెల్లింపు ద్వారా ఈ.పి.ఎఫ్.ఓ. కి నిధులను బదిలీ చేయడానికి ఈ.పి.ఎఫ్.ఓ. ఇప్పుడు కార్యాచరణను విడుదల చేసింది. మినహాయింపు పొందిన సంస్థలు ఈ.పి.ఎఫ్. మరియు ఎం.పి. చట్టం-1952 లోని సెక్షన్ 17 కింద మినహాయింపు పొందిన సంస్థలు మరియు ఈ.పి.ఎఫ్. ఓ. యొక్క సంపూర్ణ పర్యవేక్షణలో సభ్యుల భవిష్యనిధిని నిర్వహిస్తాయి. ఒక సభ్యుని ఉద్యోగం, ఒక మినహాయింపు సంస్థ నుండి మరొక మినహాయింపు లేని సంస్థకు మారినప్పుడు, ఆ సభ్యుని ఖాతాలో అంతవరకూ జమ అయిన పూర్తి మొత్తాన్ని ఈ.పి.ఎఫ్.ఓ. కి బదిలీ చేయడం జరుగుతుంది.
మినహాయింపు పొందిన సంస్థలు, ఇప్పటి వరకు, ప్రతి సభ్యునికి చెందిన నిధులను ఒక్కొక్కటిగా ఆమోదించి, బదిలీ చేయవలసి ఉండేది. ప్రతిరోజూ చాలా మంది ఉద్యోగుల నిధులను బదిలీ చేయాల్సిన పెద్ద, పెద్ద సంస్థలకు, ఈ ప్రక్రియ నిర్వహించడం, చాలా గజిబిజిగా ఉండడంతో పాటు చాలా ఎక్కువ సమయం పట్టేది. కొత్త సదుపాయం కింద, మినహాయింపు పొందిన సంస్థలు ఒకే చెల్లింపు ద్వారా భారీ డేటాను ఒకే సారి పొందుపరచడానికీ, పెద్ద సంఖ్యలో సభ్యుల నిధులను బదిలీ చేయడానికీ అవకాశం ఉంటుంది. ఈ చర్య వల్ల ఈ.పి.ఎఫ్.ఓ. కు చెందిన 1500 మినహాయింపు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
ఈ.పి.ఎఫ్.ఓ. మరియు మినహాయింపు పొందిన సంస్థల మధ్య అన్ని లావాదేవీలు ఇప్పటికే ఎలక్ట్రానిక్ పద్దతికి మార్చడం జరిగింది. తద్వారా నిధుల బదిలీల్లో ఆలస్యంతో పాటు ఇతర సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక సభ్యుడు తన ఉద్యోగాన్ని మినహాయింపు సంస్థ నుండి మినహాయింపు పొందిన సంస్థకు మార్చినట్లయితే, మినహాయింపు పొందిన సంస్థ యొక్క బ్యాంకు ఖాతాలోని నిధులను ఈ.పి.ఎఫ్.ఓ. ఎలక్ట్రానిక్ పద్దతిలో బదిలీ చేస్తుంది. లావాదేవీల వివరాలు సంస్థ యొక్క లాగిన్ లో అందుబాటులో ఉంచబడతాయి. మినహాయింపు సంస్థ ద్వారా నిర్వహించబడే సభ్యుని ఖాతాలో నిధులను వేగంగా జమచేయడానికి ఈ విధానం సహకరిస్తుంది.
మినహాయింపు పొందిన సంస్థలకు, పింఛను నిధి చందాలను ఎలక్ట్రానిక్ పద్దతిలో పంపించటానికి వారి నెలవారీ రిటర్న్స్ మరియు ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ ను దాఖలు చేసే సదుపాయం ఇప్పటికే కల్పించబడింది. తద్వారా ఇబ్బంది లేని పద్ధతిలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
కార్యదర్శి తన ఈ.పి.ఎఫ్.ఓ. కేంద్ర కార్యాలయ సందర్శనలో భాగంగా, ఉమాంగ్ యాప్ ద్వారా 1995 ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద స్కీమ్ సర్టిఫికేట్ పొందటానికి దరఖాస్తు చేసుకునే సౌకార్యాన్ని కూడా ప్రారంభించారు. ఈ.పి.ఎఫ్. చందాలను ఉపసంహరించుకుని, ఈ.పి.ఎఫ్.ఓ. సభ్యత్వాన్ని నిలుపుకోవాలనుకునే సభ్యులకు, పదవీ విరమణ వయస్సు సాధించిన తరువాత పెన్షన్ ప్రయోజనాలను పొందటానికి వీలుగా వారికి స్కీమ్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది.
ఉమాంగ్ యాప్ ద్వారా స్కీమ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడు సభ్యులు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవడంలో అనవసరమైన కష్టాలను, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి కాలంలో నివారించడానికి సహాయపడుతుంది. ఈ సౌకర్యం ద్వారా 5.89 కోట్లకు పైగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
శ్రీ అపుర్వ చంద్ర 2020 అక్టోబర్, 1వ తేదీన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ.పి.ఎఫ్.ఓ. సందర్శనకు వచ్చిన సందర్భంగా, ఆయనకు, కేంద్ర భవిష్యనిధి కమీషనర్ శ్రీ సునీల్ బార్త్వాల్, ఐ.ఏ.ఎస్. తో పాటు ఈ.పి.ఎఫ్.ఓ. కు చెందిన ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. "నిర్బాద్" అంటే మహమ్మారి కాలంలో చందాదారులకు ఎటువంటి ఇబ్బందులు మరియు అంతరాయం లేని సేవలను అందించడాన్ని నిర్ధారించడానికి, ఈ.పి.ఎఫ్.ఓ. చేపట్టిన ప్రధాన కార్యక్రమాల గురించి కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. |
pib-16144 | 9248059bc548549be1a8bdc5c7f58c43a1b65b62ae4f912feb5393d27ee60379 | tel | వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జీ20 వాణిజ్యం & పెట్టుబడుల సమావేశం నిర్ణయాల పత్రం, సారాంశం ఆమోదంతో ముగిసిన 'జీ20 వాణిజ్యం & పెట్టుబడుల మంత్రివర్గ సమావేశం'
పింక్ నగరం జైపుర్‌లో, 'జీ20 వాణిజ్యం & పెట్టుబడుల మంత్రివర్గ సమావేశం' ఈ రోజు ముగిసింది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. నిర్ణయాల పత్రం, అధ్యక్షదేశ సారాంశం తీసుకురావడంలో, ఆమోదం పొందడంలో జరిగిన చర్చల్లో పాల్గొన్న జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాల మంత్రులు, అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ వాణిజ్య సంస్థ, యూఎన్‌సీటీఏడీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్, ఓఈసీడీ వంటి సంస్థల ప్రతినిధుల నిబద్ధత, సహకారానికి కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై విశ్వాసాన్ని పునర్నిర్మించడం జీ20 సభ్య దేశాలుగా మన బాధ్యత అని గౌరవనీయ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. జీ20 మంత్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భవిష్యత్ సవాళ్లను తట్టుకోగల, ప్రపంచ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈల నుంచి ఎక్కువ భాగస్వామ్యాన్ని సృష్టించగల స్థితిస్థాపక, సమగ్ర ప్రపంచ విలువ గొలుసులను నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. డబ్ల్యుటీవో ప్రధానాంశంగా నియమాల ఆధారిత, బహిరంగ, భాగస్వామ్య, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థపై భారతదేశానికి ఉన్న దృఢ విశ్వాసం గురించి కూడా ప్రధాని మాట్లాడారు.
భారతదేశ అధ్యక్షతన, జైపుర్‌లో జరిగిన వాణిజ్య మంత్రివర్గ సమావేశం నిర్ణయాల పత్రంలో ఆమోదించిన ఐదు కీలక, కార్యాచరణ ఆధారిత నిర్ణయాలపై జీ20 వాణిజ్యం, పెట్టుబడి మంత్రివర్గ సమావేశం ఏకాభిప్రాయానికి వచ్చింది.
మొదటిది, వాణిజ్య పత్రాల డిజిటలీకరణపై ఉన్నత స్థాయి ప్రమాణాలను స్వీకరించడం. ఇందులో, దేశాల మధ్య కాగితం రహిత వాణిజ్యాన్ని సమర్థవంతంగా మారడంలో వివిధ కోణాలను సమగ్రపరిచే 10 సూత్రాలను జీ20 మంత్రులు వివరించారు. ఎలక్ట్రానిక్ వాణిజ్య సంబంధిత సమాచారం, పత్రాల మార్పిడికి సంబంధించిన చర్యలను అమలు చేయడంలో ఈ సూత్రాలు దేశాలకు మార్గదర్శకత్వం వహిస్తాయి. దీంతోపాటు, దేశాల మధ్య సురక్షిత పరస్పర సహకారం, పారదర్శకమైన కాగిత రహిత వాణిజ్యం నిర్వహణ వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తాయి. అటువంటి మార్పు అన్ని పరిమాణాల వ్యాపారాలకు అనుగుణంగా ఉండేలా చూడడానికి సూత్రాల్లో ప్రాధాన్యత ఇచ్చారు.
ఎంఎస్ఎంఈలకు సమాచార లభ్యతను మెరుగుపరచేందుకు 'జైపుర్ కాల్ ఫర్ యాక్షన్'ను కూడా జీ20 మంత్రులు ఆమోదించారు. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమాచార సంబంధిత సమస్యలను పరిష్కరించేలా ఐటీసీకి చెందిన ప్రపంచ వాణిజ్య సహాయ కేంద్రాన్ని ఆధునీకరించడం కోసం, యూఎన్‌సీటీఏడీ & డబ్ల్యూటీసీతో సంప్రదింపుల ద్వారా ఒక వివరణాత్మక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌ను మంత్రులు కోరారు.
జీవీసీల కోసం 'జీ20 జనరిక్ మ్యాపింగ్ ఫ్రేమ్‌వర్క్'ను కూడా జీ20 మంత్రివర్గం ఆమోదించింది. ఇందులో కీలక సమాచారం, విశ్లేషణ, జీవీసీ సమాచార ప్రాతినిధ్యం ఉంటుంది. రంగాలు, ఉత్పత్తుల స్థాయుల్లో జీవీసీల స్థితిస్థాపకతను మదింపు చేసేందుకు సాయపడే కీలక పరిమాణాలను గుర్తించాలని కూడా ఫ్రేమ్‌వర్క్ సూచించింది.
వృత్తిపరమైన సేవల కోసం 'మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్స్'లపై ఉత్తమ విధానాలను స్వచ్ఛందంగా పంచుకోవడాన్ని కూడా జీ20 మంత్రులు స్వాగతించారు. ఉత్తమ విధానాల కలయిక ఎంఆర్ఏ విజయాలను ప్రోత్సహిస్తుంది. ఇది మన వైద్యులు, నర్సులు, న్యాయవాదులు, ఇంజినీర్లు సహా వివిధ రంగాల నిపుణుల సాంకేతిక అర్హతలను ఇతర దేశాలు కూడా గుర్తించేలా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సేవలను అందించడంలో ఇది మన వృత్తి నిపుణులకు సాయం చేస్తుంది.
నియంత్రణ పరమైన వైరుధ్యాలు, అనుబంధ వాణిజ్య వ్యయాలను తగ్గించడానికి, అనవసరమైన వాణిజ్య ఘర్షణలను నివారించడానికి, వాణిజ్యం & పెట్టుబడి సంబంధిత చర్యలను పర్యవేక్షించడానికి, ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పరస్పరం సమావేశం కావలసిన అవసరాన్ని, ప్రాముఖ్యతను జీ20 మంత్రులు గుర్తించారు. 2023లో 'జీ20 స్టాండర్డ్స్ డైలాగ్' నిర్వహించాలన్న భారతదేశ సూచనను జీ20 మంత్రులు స్వాగతించారు. దీనివల్ల జీ20 సభ్య దేశాలు, విధాన నిర్ణేతలు, నియంత్రణ సంస్థలు, ఇతర వాటాదార్లు ఒకచోట చేరి ఉత్తమ నియంత్రణ విధానాలు, ప్రమాణాలు వంటి ఉమ్మడి అంశాలపై చర్చిస్తారు.
మొత్తం ఐదు నిర్ణయాలకు జీ20 మంత్రుల నుండి విస్తృత మద్దతు లభించింది.
2024 ప్రారంభంలో జరిగే డబ్ల్యూటీవో 13వ మంత్రివర్గ సమావేశంలో జరిగే ఒప్పందాల్లో ఎక్కువ భాగం వాస్తవ రూపం దాల్చేలా చూడాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ న్గోజీ ఒకోంజో-ఇవాలా జీ20 మంత్రులకు సూచించారు. డబ్ల్యూటీవోతో బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ పాత్రను జీ20 మంత్రులు స్పష్టం చేశారు. డబ్ల్యూటీవో నియమాలను రూపొందించే విభాగాన్ని బలోపేతం చేయడంలో తమ నిబద్ధతను చాటారు. ముఖ్యంగా, డబ్ల్యూటీవో 13వ మంత్రివర్గ సమావేశంలో డబ్ల్యూటీవో సంస్కరణలు సహా సానుకూల ఫలితాలు వచ్చేలా పని చేయడాన్ని కొనసాగించడానికి జీ20 మంత్రులు అంగీకరించారు.
ఈ రోజు ఆమోదించిన నిర్ణయాల పత్రం, సారాంశం జీ20 వెబ్సైట్ https://www.g20.org/en/ లో అందుబాటులో ఉంది. |
pib-278726 | ed12e69544d322d10d026ebeaa6ff725bcf3ae7aa2b8723365f67d77a5137f4c | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 200 కోట్ల డోసులు అందించారు
గత 24 గంటల్లో 4,46,671 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,44,264
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.33%
ప్రస్తుత రికవరీ రేటు 98.47%
గత 24 గంటల్లో 16,069 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,30,97,510 కు పెరిగింది.
గత 24 గంటల్లో 16,935 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 6.48%
వారపు పాజిటివిటీ రేటు 4.58%
గత 24 గంటల్లో చేసిన 2,61,470 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.96 కోట్ల పరీక్షలు చేశారు. |
pib-272075 | 740da5cc1f6fdeccae8673e415b7a185538b2c8810ead75d4a6b513508434422 | tel | కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్,ఐర్లండ్‌ల మధ్య 2010లో సంతకాలు జరిగిన పరస్పర గుర్తింపు ఒప్పందానికి , తాజా ఎం.ఆర్.ఎ కు కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్, ఐర్లండ్‌ల మధ్య 2010లో సంతకాలు జరిగిన పరస్పర గుర్తింపు ఒప్పందానికి వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా అలాగే, తాజా ఎం.ఆర్.ఎ కు ఆమోదం తెలిపింది.పరస్పర సహకారం, అకౌంటింగ్ పరిజ్ఞానంలో పురోగతి,పరస్పర రెండు సంస్థల సభ్యుల ప్రయోజనాలను కాపాడడం, ఐర్లండ్,ఇండియాలలో అకౌంటింగ్ వృత్తి సానుకూల వృద్ధికి ఒప్పందం వీలు కల్పిస్తుంది.
ప్రభావం :
(ఎం.ఆర్.ఎ ఉభయ దేశాలలోని ఈ సంస్థల సభ్యులు ఆయా దేశాలలో కొత్త మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా ఉత్తమ విధానాలు అనుసరించేందుకువీలుగా తగిన అవకాశాలు కల్పించడానికి ఇది ఉపకరించనుంది.
నేపథ్యం:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా భారత పార్లమెంటు చేత చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం 1949 ప్రకారం ఏర్పాటైన సంస్థ.
భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తిని నియంత్రించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ఇన్ ఐర్లండ్ ఐరిష్ అకౌంటెన్సీ ప్రధాన సంస్థ. ఇందులో 5000మంది సభ్యులుగా ఉన్నారు. |
pib-98098 | 3db0213abcc909490ebbfae6f57a0d173d4da56ae33ebf78695dab046dd123ff | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
"చాలా మందికి కొవిడ్ స్వల్పంగానే సోకుతోంది, అందువల్ల ఆక్సిజన్ మరియు మందుల నిల్వలపై భయాందోళనలు అక్కర్లేదు" అని కొవిడ్ 19 కు సంబంధించిన ఆందోళనలు మరియు సమస్యలపై ప్రసంగిస్తూ డాక్టర్ గులేరియా తెలిపారు.
రెమ్‌డెసివిర్ దివ్య ఔషధం కాదు, స్వల్పలక్షణాలున్న రోగులకు దాన్ని ఉపయోగించకూడదు: డాక్టర్ గులేరియా
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, మెదాంత ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరేష్ ట్రెహాన్, ఎయిమ్స్ మెడిసిన్ విభాగం హెడ్ డాక్టర్ నవనీత్ విగ్ మరియు ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ లు కొవిడ్ 19కు సంబంధించిన ఆందోళనలు మరియు సమస్యలపై ఈ రోజు ప్రసంగించారు.
ఆక్సిజన్ మరియు ఔషాధాల కొరత గురించి డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, “ఇళ్లలో రెమెడిసివిర్ మరియు ఆక్సిజన్ వంటి ఇంజెక్షన్ల నిల్వ చేయడం భయాందోళనలను సృష్టిస్తోంది. మరియు ఈ పద్దతి ఔషధాల కొరతకు కారణమవుతోంది. 85-90% మంది కొవిడ్ రోగులు తేలికపాటి జలుబు, జ్వరం, గొంతు నొప్పి మరియు వంటినొప్పితో మాత్రమే బాధపడతారు. ఇటువంటి వారికి ఇంట్లో ఉంచి చికిత్స అందిస్తే సరిపోతుంది. వారికి ఆక్సిజన్ లేదా రెమెడిసివిర్ అవసరం లేదు.” తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న 10-15% మంది రోగులకు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ లేదా ప్లాస్మా మొదలైనవి అవసరమవుతాయని, 5% కంటే తక్కువ మంది రోగులకు వెంటిలేటర్లు లేదా ఇంటెన్సివ్ కేర్ అవసరమని ఆయన అన్నారు.
రెమెడిసివిర్ ఆసుపత్రిలో ఉండటాన్ని తగ్గించదు లేదా ప్రాణాలను కాపాడదు అని ఆయన స్పష్టం చేశారు. మధ్యస్థ మరియు తీవ్రమైన కేసులలో మాత్రమే ఇది ఆసుపత్రిలో ఉండే అవసరాన్ని తగ్గించగలదు. స్వల్ప లక్షణాలున్న వారికి దీన్ని ఉపయోగించడం సమస్యలను క్లిష్టతరం చేస్తుంది. రెమ్‌డెసివిర్ దివ్య ఔషధం కాదు. ఇది ఆసుపత్రులలో మితమైన మరియు తీవ్రమైన కేసులకు మాత్రమే ఉపయోగిస్తారు అని తెలిపారు.
అవసరం లేనివారికి ఆక్సిజన్ అందించడంపై డాక్టర్ గులేరియా మాట్లాడుతూ " 94 కన్నా ఎక్కువ ఆక్సిజన్ లెవల్స్ కలిగి ఉన్నవారికి ఆక్సిజన్ అవసరం లేదు, ఎందుకంటే ఈ స్థాయికి మించి ఆక్సిజన్ లెవల్స్ పెరగడం రక్తంలో ఆక్సిజన్‌ను పెంచదు. అందువల్ల ఇది ఆక్సిజన్ సరఫరాలో కొరతను కలిగిస్తుంది మరియు తీవ్రమైన కేసులకు ఆక్సిజన్ లభ్యతను తగ్గిస్తుంది" అని తెలిపారు.
ఆర్టీ-పిసిఆర్ పాజిటివ్ టెస్ట్ తర్వాత వెంటనే తీసుకోవలసిన చర్యలపై డాక్టర్ నరేష్ ట్రెహాన్ మాట్లాడుతూ " ప్రజలు మొదట స్థానిక లేదా కుటుంబ వైద్యులను సంప్రదించాలని అన్నారు. కొవిడ్ వైద్య విధానంపై వైద్యులందరికీ తెలుసు. తద్వారా రోగి లక్షణాలను బట్టి హోం ఐసోలేషన్ కు సిఫార్సు చేయవచ్చు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడే యోగా మరియు ప్రాణాయామం గురించి డాక్టర్ ట్రెహాన్ సలహా ఇచ్చారు. డబుల్ మాస్కింగ్, భౌతిక దూరం మరియు చేతుల పరిశుభ్రత యొక్క అవసరాలను డాక్టర్ ట్రెహాన్ పునరుద్ఘాటించారు. సరైన రక్షణ కోసం మాస్క్ ను ముక్కు మరియు నోటి చుట్టూ గాలి మార్గాన్ని మూసివేయాలని అన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
అక్సిజన్ డిమాండ్‌పై డాక్టర్ ట్రెహాన్ మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిందని అయితే దాని సరఫరా, తయారీ కోసం సరిపడా సౌకర్యాలు మన పరిశ్రమకు ఉన్నాయని అన్నారు. అయితే అందుకు అవసరమైన క్రయో రవాణా లేదు. దీనిపై ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోంది. రాబోయే ఐదు నుంచి ఏడు రోజుల్లో పరిస్థితి అదుపులో వస్తుందని చెప్పారు.
పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనే అంశంపై డాక్టర్ సునీల్ కుమార్ ప్రసంగించారు. గత సంవత్సరం కోవిడ్ వచ్చినప్పుడు ఎటువంటి సంసిద్ధత లేకుండా ప్రభుత్వం అతి త్వరలో సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయికి పెంచింది. కరోనా సంక్షోభానికి ముందు ఒకటి మాత్రమే ఉన్న ప్రయోగశాలలు 2500 కి పైగా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే పరీక్షా సామర్థ్యాన్ని రోజుకు లక్షల సంఖ్యకు పెంచాము. ట్రాకింగ్ మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు పిపిఇ కిట్లు మరియు ఇతరుల తయారీని పెంచామని చెప్పారు. టీకాలు ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ టీకాల దుష్ప్రభావాలు అతి తక్కువ స్థాయిలో ఉన్నాయని.. టీకాలు మరియు తగిన ప్రవర్తన కొవిడ్ వ్యాప్తిని అరికడతాయని డాక్టర్ సునీల్ చెప్పారు.
డాక్టర్ నవ్ నీత్ మాట్లాడుతూ రోగులకు చికిత్సను అందించే మన ఆరోగ్య కార్యకర్తలను మనం రక్షించాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్య కార్యకర్తలను కాపాడటానికి కొవిడ్ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయాలి మరియు అంటువ్యాధుల సంఖ్యను తగ్గించాలి. గొలుసును విచ్ఛిన్నం చేయడం సమాజంలోని అన్ని వర్గాల బాధ్యత. అన్నింటికంటే కొవిడ్ 19 సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రజల బాధ్యత అని చెప్పారు. |
pib-26928 | 58b9628466791518c5cf14be5758b1b9c99408fc32f649f88e8167f3ed7e6ef8 | tel | నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
2000 మెగావాట్ల గ్రిడ్ అనుసంధాన సోలార్ పీవీ ప్రాజెక్ట్ నిమిత్తం ఈ-రివర్స్ వేలాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎన్‌హెచ్‌పీసీ
దేశంలో ఎక్కడైనా 2000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పీవీ ప్రాజెక్ట్ ఏర్పాటు నిమిత్తం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ ఈ-రివర్స్ వేలాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఎన్‌హెచ్‌పీసీ సీఎండీ ఎ.కె. సింగ్, సంస్థ డైరెక్టర్ వై.కె. చౌబే సమక్షంలో ఈ వేలం ప్ర్రక్రియ జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర విద్యుత్ మరియు కొత్త & పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. “2000 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన సౌర
(ఉత్పాదక సామర్థ్యపు యూనిట్ ఏర్పాటు చేయడానికి సంబంధించిన బిడ్‌ను విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ విజయవంతంగా పూర్తి చేసింది అని తెలిపారు. యూనిట్ ఒక్కింటికి రూ.2.55/ 2.556 పోటీ టారీఫ్ వద్ద ఈ-ఆర్ఏను పూర్తి చేసినట్టుగా వివరించారు. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో తాము వర్చువల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఔత్సాహిక భాగస్వామ్య పక్షాల వారితో పరస్పర సంప్రదింపులు జరుపుతూ కొత్త బిడ్లనూ తీసుకు వచ్చినట్టుగా తెలిపారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడం, వ్యాపార నిర్వహణను మరింతగా సులభతరం చేసేందుకు గాను గత కొన్ని తాము చేపట్టిన అనేక చర్యల ఫలితంగానే మేటి టారీఫ్ వద్ద ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఈ-ఆర్ఏ విజయవంతమైనట్టుగా ఆయన వివరించారు. పెట్టుబడిదారులకు ఎదురయ్యే వివిధ సమస్యలను దాదాపు కనిష్టీకరించేందుకు గాను తాము కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. మొత్తంగా 3140 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడుగురు బిడ్డర్ల పోటీ మధ్య ఈ-ఆర్ఐ నిర్వహించారు. మొత్తం 2000 మెగావాట్ల సామర్థ్యపు యూనిట్‌కు సంబంధించిన ప్రారంభ టారీఫ్‌ను తొలత యూనిట్‌కు రూ.2.71/ నుంచి రూ.2.78గా నిర్ణయించగా.. యూనిట్‌కు రూ.2.51 నుండి 2.56 / కనిష్ట ఈ-ఆర్ఏ టారీఫ్ లభించింది. కోవిడ్ - 19 కారణంగా భారతదేశంలో పూర్తి లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ, ఎన్‌హెచ్‌పీసీ ఈ-రివర్స్ వేలంను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. |
pib-105192 | 5403d7e0df80ec16154e39889825880ffeab74a8269b1e62cb869017a16a48d9 | tel | యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కామన్వెల్త్ గేమ్స్ 2022 కు భారత్ సంసిద్ధతను సమీక్షించిన అనురాగ్ సింగ్ ఠాకూర్ ఒలింపిక్స్ తరువాత పెరిగిన శిక్షణ , పోటీ వేగం
కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ గురువారం మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశంలో కామన్వెల్త్ గేమ్స్ 2022 కు భారతదేశ సంసిద్ధత ను సమీక్షించారు. రాబోయే సిడబ్ల్యుజి లో మొత్తం 215 మంది అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు.
మాజీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్, మాజీ హాకీ ప్లేయర్ విరేన్ రాస్కిన్హా, మాజీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మోనాలిసా బారువా, మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తృప్తి ముర్గుండే ఎంఒసి సమావేశానికి హాజరయ్యారు.
'అథ్లెట్ల సన్నద్ధత జోరుగా సాగుతోంది. ఒలింపిక్స్ అనంతరం శిక్షణ, పోటీల వేగాన్ని పెంచినందుకు నేను సంతోషిస్తున్నాను, ఒలింపిక్స్, పారాలింపిక్స్ తర్వాత కూడా విజయ పరంపర కొనసాగాలని ఆశిస్తున్నాం' అని శ్రీ ఠాకూర్ అన్నారు.
సమీక్ష సందర్భంగా, భారతదేశ సన్నద్ధతకు సంబంధించిన వివిధ అంశాలు వెలుగులోకి వచ్చాయి. టోక్యో 2020 ఒలింపిక్స్ తరువాత అథ్లెట్లు జాతీయ శిబిరాల్లో శిక్షణ , శిక్షణ పోటీలో బహుళ అంతర్జాతీయ ఎక్స్పోజర్లతో సహా పూర్తి స్థాయి శిక్షణకు తిరిగి చేరుకున్నారు. ఇప్పటివరకు - కేంద్ర ప్రభుత్వం బర్మింగ్ హామ్ 2022లో భారత దేశం పోటీ పడనున్న విభాగాల్లో 111 ఎక్స్ పోజర్ ట్రిప్పులకు సహాయం చేసింది.
జాతీయ క్రీడా సమాఖ్యలు కూడా జాతీయ శిబిరాలను నిర్వహించడానికి కలిసి పనిచేస్తున్నాయి.
అనేక మంది ప్రముఖ అథ్లెట్లు వారి శిక్షణా ప్రణాళిక ప్రకారం, విదేశాలలో ప్రభుత్వ ఖర్చుతో ఒలింపిక్స్ అనంతర శిక్షణ పొందుతున్నారు.
ఒలింపిక్ క్రీడల తరువాత శిక్షణకు తిరిగి వచ్చినప్పటి నుండి, జావెలిన్ థోవర్ నీరజ్ చోప్రా చులా విస్టా , అంతల్యా ఫిన్లాండ్ లో ఉంటున్నాడు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సెయింట్ లూయిస్ లో సమయం గడిపాడు, స్పెషలిస్ట్ కోచ్ డాక్టర్ ఆరోన్ హోర్షిగ్ తో శిక్షణ పొందాడు.
ఏప్రిల్ 2022 నుండి కోచ్ స్కాట్ సైమన్స్ తో కలిసి కొలారాడో స్ప్రింగ్స్ లో ఉన్న స్టీపుల్‌ఛేజర్ అవినాష్ సాబ్లే తో ఉండగా, సైక్లింగ్ జట్టు మూడు నెలలుగా స్లోవేనియా పోర్చుగల్ లో ఉంది. ఇటీవల, టేబుల్ టెన్నిస్ , బాక్సింగ్ బృందాల కోసం పోర్చుగల్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ లో ఎక్స్పోజర్ పర్యటనలు కూడా సిడబ్ల్యుజి 2022 కు ముందస్తుగా ఖరారు అయ్యాయి. |
pib-285973 | 2fba69c7f882e88eb0c0023dcec8ee4d1f166b1c5ac06451c7f5e8fd06b29ee1 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
సంప్రదాయ క్రీడా మహోత్సవం నిర్వహణకు ఒడిషా కేంద్రీయ విశ్వవిద్యాలయం చొరవపై ప్రధానమంత్రి ప్రశంస
భారతదేశ ఉన్నత క్రీడా సంప్రదాయాలు, వైవిధ్యంపై అవగాహన కల్పించే దిశగా సంప్రదాయ క్రీడా మహోత్సవం నిర్వహణకు ఒడిషా కేంద్రీయ విశ్వవిద్యాలయం చొరవ చూపడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
దీనిపై కేంద్ర సహాయమంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:
“భారతదేశ ఉన్నత క్రీడా సంప్రదాయాలు, వైవిధ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా సంప్రదాయ క్రీడా మహోత్సవం నిర్వహించాలని ఒడిషా కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1918629 |
pib-287985 | 60feca0335df8116e31d4ae7a73a7ef01f289657eeb934c139863aad6b7735c1 | tel | ఆర్థిక మంత్రిత్వ శాఖ
42వ జీ.ఎస్.టి. మండలి సమావేశం యొక్క సిఫార్సులు
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, జి.ఎస్.టి. మండలి 42వ సమావేశం ఈ రోజు ఇక్కడ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తో పాటు రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్ధిక శాఖ మంత్రులు, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్ధిక శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
జీ.ఎస్.టి. మండలి ఈ క్రింది సిఫార్సులు చేసింది:
1. పరిహార సెస్ విధింపును ఐదు సంవత్సరాల పరివర్తన కాలానికి మించి, అంటే జూన్, 2022 దాటి, ఆదాయ అంతరాన్ని తీర్చడానికి అవసరమైన కాలానికి పొడిగించాలి. మరిన్ని వివరాలు రూపొందించవలసి ఉంది.
2. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో నష్టాల కోసం కేంద్రం ఈ రోజు రాష్ట్రాలకు 20,000 కోట్ల రూపాయల నష్ట పరిహారాన్ని విడుదల చేస్తోంది. మరియు వచ్చే వారం నాటికి 2017-18 ఐ.జి.ఎస్.టి కింద సుమారు 25,000 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది.
3. రిటర్న్ ఫైలింగ్ యొక్క లక్షణాలలో మెరుగుదల :
2020 మార్చి నెలలో జరిగిన 39 వ సమావేశంలో, కౌన్సిల్ ప్రస్తుత సుపరిచితమైన జి.ఎస్.టి.ఆర్-1/3బి పథకంలో కొత్త రిటర్న్ విధానం యొక్క లక్షణాలను చేర్చడానికి అవసరమైన విధానాన్ని సిఫారసు చేసింది. అప్పటి నుండి వివిధ మెరుగుదలలను జి.ఎస్.టి. కామన్ పోర్టల్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. సులభతర వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడానికి మరియు సమ్మతి అనుభవాన్ని మెరుగుపరచడానికి, జి.ఎస్.టి కింద రిటర్న్ దాఖలు చేయడానికి భవిష్యత్ రోడ్ మ్యాప్ ను కౌన్సిల్ ఆమోదించింది. ఆమోదించబడిన ఫ్రేమ్‌వర్క్ రిటర్న్ ఫైలింగ్‌ను సరళీకృతం చేయడం మరియు ఈ విషయంలో పన్ను చెల్లింపుదారుల సమ్మతి భారాన్ని గణనీయంగా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది, పన్ను చెల్లింపుదారు మరియు అతని సరఫరాదారులచే బాహ్య సామాగ్రి యొక్క వివరాలను సకాలంలో ఇవ్వడం - తన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో అందుబాటులో ఉన్న ఐ.టి.సి.ని అన్ని వనరుల నుండి చూడటానికి అతన్ని అనుమతించడం, అనగా పన్ను చెల్లింపు కోసం గడువు తేదీకి ముందు దేశీయ సామాగ్రి, దిగుమతులు మరియు రివర్స్ ఛార్జీపై చెల్లింపులు మొదలైనవి. పన్ను చెల్లింపుదారు మరియు అతని సరఫరాదారులందరూ దాఖలు చేసిన డేటా ద్వారా ఆటో-పాపులేట్ రిటర్న్ వ్యవస్థను ప్రారంభించాలి. మరో మాటలో చెప్పాలంటే, జి.ఎస్.టి.ఆర్-1 స్టేట్మెంట్ ను మాత్రం సకాలంలో దాఖలు చేస్తే సరిపోతుంది, ఎందుకంటే జి.ఎస్.టి.ఆర్-3బి ఫారం లో తిరిగి రావడం సాధారణ పోర్టల్ లో ఆటోను సిద్ధం చేస్తుంది.
ఈ మేరకు కౌన్సిల్ ఈ క్రింది వాటిని సిఫారసు చేసింది / నిర్ణయించింది:
ఏ). 2021 జనవరి 1వ తేదీ నుండి, త్రైమాసిక పన్ను చెల్లింపుదారులచే త్రైమాసిక జి.ఎస్.టి.ఆర్.-1 ను సమకూర్చుకోవలసిన తేదీ త్రైమాసికం తరువాత నెల 13వ తేదీకి సవరించబడుతుంది;
బి). జి.ఎస్.టి.ఆర్-1 ల నుండి జి.ఎస్.టి.ఆర్-3బి యొక్క ఆటో-జనరేషన్ కోసం రోడ్ మ్యాప్:
i. 2021 జనవరి 1వ తేదీ నుండి సొంత జి.ఎస్.టి.ఆర్-1 నుండి లయబిలిటీ యొక్క ఆటో-పాప్యులేషన్; మరియు
ii. నెలవారీ దాఖలు చేసేవారికి 2021 జనవరి, 1వ తేదీ నుండి, మూడు నెలలకు ఒకసారి దాఖలు చేసే వారికి 2021 ఏప్రిల్, 1వ తేదీ నుండి, జి.ఎస్.టి.ఆర్-2బి ఫారం లో కొత్తగా అభివృద్ధి చేసిన సౌకర్యం ద్వారా సరఫరాదారుల జి.ఎస్.టి.ఆర్-1 ల నుండి ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ యొక్క ఆటో-పాప్యులేషన్.
సి). పైన వివరించిన విధంగా ఐ.టి.సి. యొక్క ఆటో పాప్యులేషన్ మరియు జి.ఎస్.టి.ఆర్-3బి లో లైబెలిటీని నిర్ధారించడానికి, జి.ఎస్.టి.ఆర్-1 ఫారంను తప్పనిసరిగా 2020 ఏప్రిల్, 1వ తేదీ నుండి జి.ఎస్.టి.ఆర్-3బి ఫారం కంటే ముందు దాఖలు చేయవలసి ఉంటుంది.
డి). ప్రస్తుత జి.ఎస్.టి.ఆర్-1 / 3 బి రిటర్న్ ఫైలింగ్ వ్యవస్థను 2021 మార్చి, 31వ తేదీ వరకు పొడిగించాలి. మరియు జి.ఎస్.టి.ఆర్-1బి రిటర్న్ ఫైలింగ్ వ్యవస్థను తప్పనిసరి రిటర్న్ ఫైలింగ్ వ్యవస్థగా మార్చడానికి జి.ఎస్.టి. చట్టాలను సవరించాలి.
4. ముఖ్యంగా సరాసరి వార్షిక టర్నోవర్ మొత్తం 5 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉన్న చిన్న పన్ను చెల్లింపుదారులపై సమ్మతి భారాన్ని తగ్గించే మరో చర్యగా, అటువంటి పన్ను చెల్లింపుదారుల నెలవారీ చెల్లింపులతో త్రైమాసిక ప్రాతిపదికన రిటర్నులను దాఖలు చేయడానికి కౌన్సిల్ గతంలో చేసిన సిఫార్సును 2021 జనవరి, 1వ తేదీ నుండి అమలుచేయనున్నారు. ఇటువంటి త్రైమాసిక పన్ను చెల్లింపుదారులు, త్రైమాసికంలో మొదటి రెండు నెలలు, ఆటో జనరేటెడ్ చలాను ఉపయోగించి గత త్రైమాసికంలో చెల్లించవలసియున్న నికర నగదు పన్ను బకాయిలో 35 శాతం చెల్లించే అవకాశం ఉంటుంది.
5. 2021 ఏప్రిల్, 1వ తేదీ నుండి ఇన్వాయిస్లలో మరియు జి.ఎస్.టి.ఆర్-1 ఫారం లో వస్తువులు, సేవల కోసం హెచ్.ఎస్.ఎన్ మరియు ఎస్.ఏ.సి. సవరించిన అవసరాన్ని ఈ క్రింది విధంగా ప్రకటించాలి:
ఏ). మొత్తం సరాసరి వార్షిక టర్నోవర్ 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ గా ఉన్న పన్ను చెల్లింపుదారులకు వస్తువులు మరియు సేవల రెండింటి సరఫరా కోసం 6 అంకెల వద్ద హెచ్.ఎస్.ఎన్ / ఎస్.ఏ.సి;
బి). మొత్తం సరాసరి వార్షిక టర్నోవర్ 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉన్న పన్ను చెల్లింపుదారులకు వస్తువులు మరియు సేవల రెండింటి యొక్క బి 2 బి సరఫరా కోసం 4 అంకెల వద్ద హెచ్.ఎస్.ఎన్/ఎస్.ఏ.సి.
సి). అన్ని పన్ను చెల్లింపుదారులచే నోటిఫైడ్ క్లాస్ సరఫరాపై 8 అంకెల హెచ్.ఎస్.ఎన్. కు తెలియజేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.
6. సిజిఎస్టి నిబంధనలకు సవరణ:
సి.జి.ఎస్.టి నిబంధనలు మరియు ఫారాలలోని వివిధ సవరణలు సిఫారసు చేయబడ్డాయి, ఇందులో ఎస్.ఎమ్.ఎస్. ద్వారా నిల్ ఫారం సి.ఎమ్.పి-08 ను అమర్చడానికి కూడా సదుపాయం ఉంది.
7. చెల్లించాల్సిన / పంపిణీ చేయవలసిన రిఫండ్ ను 2021 జనవరి, 1వ తేదీ నుండి, నమోదు చేసుకున్న వ్యక్తి యొక్క పాన్ మరియు ఆధార్‌తో అనుసంధానించబడిన చెల్లుబాటు అయ్యే బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.
8. ముఖ్యంగా యువ అంకురసంస్థల ద్వారా దేశీయ ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రోత్సహించడానికి, ఇస్రో, ఆంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఎన్.ఎస్.ఐ.ఎల్. సరఫరా చేసే ఉపగ్రహ ప్రయోగ సేవలకు మినహాయింపు ఉంటుంది. |
pib-182563 | 18792d117a5ac481cea00564a3a0c816db8ca1c860ec141eea414364b5995b50 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
స్వామి వివేకనందుల వారు 1893వ సంవత్సరం లో శికాగో లో ఇచ్చిన ఉత్కృష్ట ఉపన్యాసాన్ని గుర్తు కు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి
స్వామి వివేకనందుల వారు 1893వ సంవత్సరం లో శికాగో లో ఇచ్చినటువంటి అసాధారణమైన ఉపన్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. స్వామి వివేకనంద తన అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉపన్యాసాలలో ఒక ఉపన్యాసాన్ని చ్చింది 1893వ సంవత్సరం లో ఇదే రోజు న అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్వామి వివేకనందుల వారి ప్రసంగం యావత్తు ప్రపంచాని కి భారతదేశం యొక్క సంస్కృతి మరియు సభ్యత ల తాలూకు తక్షణ దర్శనాన్ని అందించింది అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సెప్టెంబర్ 11వ తేదీ కి స్వామి వివేకనంద తో ఒక విశిష్టమైన సంబంధం ఉంది. ఆయన తన అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉపన్యాసాలలో ఒక ఉపన్యాసాన్ని శికాగో లో 1893వ సంవత్సరం లో ఇదే రోజు న ఇచ్చారు. ఆయన ప్రసంగం ప్రపంచానికి భారతదేశం యొక్క సంస్కృతి మరియు భారతదేశం యొక్క సభ్యత ల తాలూకు తక్షణ దర్శనాన్ని అందించింది.’’ అని పేర్కొన్నారు. |
pib-110452 | 664d6d17feb294406ce37e4f11c2e8d2c1e058603080957720576ad994cf2ef3 | tel | రక్షణ మంత్రిత్వ శాఖ
యుకె ప్రతినిధి బృందంతో సమావేశమైన రక్షణ కార్యదర్శి
యుకె రక్షణశాఖ మంత్రి అలెక్స్ చాక్‌తో రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. గౌరవనీయ ప్రధానమంత్రి 13 ఫిబ్రవరి 2023న ప్రారంభించిన ఎయిరో ఇండియా 2023 సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు.
సంభావ్య రక్షణ పారిశ్రామిక సహకారంలో అవకాశాలు సహా అనేక ప్రస్తుత, భవిష్యత్ రక్షణ సహకార అంశాల గురించి చర్చించారు. భారత్‌కు బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ యుకె మంత్రి వెంట ఉన్నారు. |
pib-292989 | b42bd2db725fd69a145bf206e757ca3609bf8feb54cc3f772e15fb871e4916f1 | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
16 సెప్టెంబర్, 2023న ఆగ్రాలోని జీఐసి గ్రౌండ్లో నిర్వహించే అవయవ దానం ప్రతిజ్ఞకు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా నాయకత్వం వహిస్తారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి ప్రొఫెసర్. ఎస్పీ సింగ్ బఘేల్ పాల్గొననున్నారు.
23 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు మరియు 87 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లకు శంకుస్థాపన చేయనున్న డాక్టర్ మాండవ్య
ఆగ్రాలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను కూడా ప్రారంభించనున్న కేంద్రమంత్రి
అవయవ దాన రిజిస్ట్రీని ఆవిష్కరించనున్న డాక్టర్ మాండవ్య
అవయవాలు దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయనున్న 10,000 మంది
17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య సేవల సంతృప్త కవరేజీ కోసం సేవా పఖ్వాడా
కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి, ప్రొఫెసర్ SP సింగ్ బఘెల్ సమక్షంలో 16 సెప్టెంబర్ 2023న ఆగ్రాలోని జిఐసి గ్రౌండ్లో అవయవ దానం కోసం ప్రతిజ్ఞ చేయనున్నారు. ఆగ్రాలో దాదాపు 10,000 మంది అవయవాలు దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయనున్నారు.
డాక్టర్ మాండవ్య ఆగ్రాలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను మరియు అవయవ దాన రిజిస్ట్రీని కూడా ప్రారంభిస్తారు. అవయవాలను దానం చేయడానికి నమోదు చేసుకోవడానికి, ఆధార్ నంబర్ మరియు ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్ మాత్రమే అవసరం. అదే రోజున ఆగ్రాలో 23 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు మరియు 87 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లకు డాక్టర్ మాండవ్య శంకుస్థాపన చేస్తారు.
దీని తర్వాత అవసరమైన ఆరోగ్య సేవల సంతృప్తత కోసం 'సేవా పఖ్వాడా' సెప్టెంబరు 17 నుండి అక్టోబర్ 2, 2023 వరకు అమలు చేయబడుతుంది. 'ఆయుష్మాన్ భవ' ప్రచారాన్ని గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 13, 2023న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం మరియు సమగ్రతను పునర్నిర్వచించాలనే లక్ష్యంతో 'సేవా పఖ్వాడా'లో మొత్తం దేశం మరియు మొత్తం-సమాజ విధానాన్ని రూపొందించారు. సేవా పఖ్వాడా యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామం మరియు పట్టణానికి సమగ్ర ఆరోగ్య సంరక్షణ కవరేజీని విస్తరించడం, భౌగోళిక అడ్డంకులను అధిగమించడం మరియు ఎవరూ వెనుకబడిపోకుండా చూసుకోవడం.
ఈ సినర్జిస్టిక్ విధానం దాని మూడు భాగాలైన ఆయుష్మాన్ - ఆప్కే ద్వార్ 3.0, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఆయుష్మాన్ మేళాలు మరియు ప్రతి గ్రామం మరియు పంచాయతీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మరియు ఆయుష్మాన్ సభల ద్వారా ఆరోగ్య సేవల కవరేజీని సంతృప్తపరచడం లక్ష్యంగా పెట్టుకుంది:
ఆయుష్మాన్ ఆప్కే ద్వార్ 3.0: పిఎం-జెఏవై పథకం కింద నమోదు చేసుకున్న మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డ్‌లను అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. తద్వారా ఎక్కువ మంది వ్యక్తులు అవసరమైన ఆరోగ్య సేవలను పొందేలా చూస్తారు.
హెచ్డబ్ల్యుసిలు మరియు సిహెచ్‌సిలలో ఆయుష్మాన్ మేళాలు: ఆయుష్మాన్ భారత్- హెచ్డబ్ల్యుసిలు మరియు సిహెచ్‌సిలలో ఈ మేళాలు ఏబిహెచ్ఏ ఐడీలను సృష్టించడానికి మరియు ఆయుష్మాన్ భారత్ కార్డ్‌ల జారీని సులభతరం చేస్తాయి. వారు ముందస్తు రోగ నిర్ధారణ, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు, నిపుణులతో టెలికన్సల్టేషన్ మరియు తగిన సిఫార్సులను కూడా అందిస్తారు.
ఆయుష్మాన్ సభలు: ప్రతి గ్రామం మరియు పంచాయతీలో జరిగే ఈ సమావేశాలు ఆయుష్మాన్ కార్డ్‌లను పంపిణీ చేయడంలో, ఏబిహెచ్ఏ ఐడీలను రూపొందించడంలో మరియు అంటువ్యాధులు, క్షయ , సికిల్ సెల్ వంటి ముఖ్యమైన ఆరోగ్య పథకాలు మరియు వ్యాధుల పరిస్థితులపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఆయుష్మాన్ భవ ప్రచారం అన్ని ఆరోగ్య పథకాల సంతృప్త కవరేజీని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రభుత్వ రంగాలు, పౌర సమాజ సంస్థలు మరియు కమ్యూనిటీలను ఒక ఉమ్మడి మిషన్ కింద ఏకం చేస్తుంది, ప్రతి వ్యక్తి ఎటువంటి అసమానత లేదా మినహాయింపు లేకుండా అవసరమైన ఆరోగ్య సేవలను పొందేలా చూస్తుంది.
స్వచ్ఛంద రక్తదానం కోసం లింక్: https://www.eraktkosh.in/BLDAHIMS/bloodbank/transactions/bbpublicindex.html
అవయవ దానం కోసం లింక్: http://www.notto.abdm.gov.in/ |
pib-185774 | 0e5caca7f5a9b72a3e5cada7490c8625f3c1712322055d602cb35d632dcec85d | tel | మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
23 రాష్ట్రాలు యుటిల నుండి 1000 మంది యువత పాల్గొనేందుకు యువ సంగం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
29 పర్యటనల ద్వారా భారతదేశంలోని 22 రాష్ట్రాలను సందర్శించిన 1200 మంది యువకుల
ఉత్సాహమైన భాగస్వామ్యంతో జరిగిన యువ సంగం తొలి దశ
ఆన్లైన్ పోర్టల్ ద్వారా యువ సంగం రిజిస్ట్రేషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, యూటీల నుండి 1000 మంది యువకుల దీనిలో భాగస్వామ్యం అవుతారని అంచనా. ఈ చొరవ కింద ఎక్స్పోజర్ టూర్లు 2023 ఏప్రిల్, మే నెలల్లో నిర్వహిస్తారు. . వారు జత చేసిన రాష్ట్రానికి 45 నుండి 50 మంది సమూహంలో ప్రయాణిస్తారు. ఇది ఐదు విస్తృత ప్రాంతాలైన పర్యాటాన్ , పరంపర , ప్రగతి , ప్రోద్యోగిక్ , పరస్పర సంపర్క్ అనే ఐదు విస్తృత రంగాల క్రింద వివిధ కోణాలను స్పృశిస్తూ బహుమితీయ అనుభవాన్ని అందిస్తుంది. కార్యక్రమంలో, విద్యార్థులు భాష, సాహిత్యం, వంటకాలు, పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటక రంగాలపై పరస్పరం ఆలోచనలు పంచుకుంటారు. సంక్షిప్తంగా, వారు పూర్తిగా భిన్నమైన భౌగోళిక, సాంస్కృతిక దృష్టాంతంలో జీవించే ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు.
18-30 ఏళ్ల వయస్సులో ఉన్న ఆసక్తిగల యువత ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పోర్టల్ https://ebsb.aicte-india.org/ లో నమోదు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి-మార్చి 2023లో ఈశాన్య ప్రాంతంపై ప్రధాన దృష్టి సారిస్తూ 29 పర్యటనల ద్వారా 22 రాష్ట్రాలను సందర్శించిన సుమారు 1200 మంది యువకుల భారీ భాగస్వామ్యంతో యువ సంగం మొదటి రౌండ్ ఇటీవల ముగిసింది. పాల్గొనేవారు స్ఫూర్తిని అందించిన సుసంపన్నమైన అనుభవాన్ని పొందారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దాని నిజమైన అర్థంలో ఉంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద 'యువ సంగం' , ప్రజలను బలోపేతం చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా యువతలో ప్రేరణ పెంచే లక్ష్యంతో వివిధ మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వేలాది మంది యువతలో అవగాహన, ఉమ్మడి స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది, ఇది దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. నిజమైన శ్రేష్ఠ భారత్‌ను నిర్మించడంలో అపారంగా దోహదపడుతుంది. |
pib-122295 | c8a81170b61541dc973fbb1c9e9c5ca566f11e0632145ae79dc88bb82a7e7efa | tel | యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ఆవిష్కరించిన క్రీడామంత్రి కిరణ్ రిజిజు
ఫిట్ ఇండియా ను నడిపించే చోదకశక్తి విద్యార్థులే: కిరణ్ రిజిజు
ఫిట్ ఇండియా స్కూల్ వీక్ రెండో ఎడిషన్ ను కేంద్ర క్రీడాశాఖామంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ రోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో బాటు ఫిట్ ఇండియా మిషన్ డైరెక్టర్ ఏక్తా విష్ణోయ్, సిబిఎస్ఇ చైర్మన్ మనోజ్ అహుజా, సిఐఎస్ సిఇ చైర్మన్ డాక్టర్ జి. ఇమ్మాన్యుయేల్, కాసర్ గడ్ కు చెందిన ఎంపి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ అబ్దుల్ జలీల్ మార్థ్య, గ్రేటర్ నోయిడా జేపీ పబ్లిక్ స్కూల్ క్రీడాశాఖాధిపతి కుమారి నీరజ్ సింగ్, జేపీ స్కూల్ విద్యార్థి ప్రకృతి ఆదర్శ్, ఎంపి ఇంటర్నేషనల్ విద్యార్థి యాసిర్ అమీన్ అలి పాల్గొనగా స్పోర్ట్స్ యాంకర్ మనీష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమం ప్రధానంగా పిల్లల్లో శారీరక వ్యాయామం పట్ల, క్రీడల పట్ల ఆసక్తి పెంచి, ప్రోత్సహించటం, అలవాటు చేయటం కోసం ఉద్దేశించినది. అలవాట్లు మొదలయ్యే బాల్య దశలోనే పిల్లలను ఈ దిశలో ప్రోత్సహించటం మంచిదనే ఉద్దేశంతో ఫిట్ ఇండియా ను పాఠశాలలకు పరిచయం చేస్తున్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ రిజిజు మాట్లాడుతూ, పాఠశాల స్థాయిలోనే ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇవ్వాలసిన అవసరాన్ని చెప్పారు, దేశం ఫిట్ గా ఉండాలంటే విద్యార్థులే దానికి చోదక శక్తి అన్నారు. పెద్ద సంఖ్యలో పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటానికి ఆసక్తి చూపటం, వారం వారం ఈ సంఖ్య పెరగటం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రతి భారతీయుడు ఫిట్ గా ఉండాలన్న లక్ష్య సాధనకు కావాల్సిన శక్తి పాఠశాలల్లోనే తయారవుతోందన్నారు.
నిరుడు నవంబర్ లో మొదలైన ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ప్రచారోద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా 15,000 పాఠశాలలు పాల్గొన్నాయి. లైవ్ సెషన్ లో భాగంగా క్రీడా మంత్రిని ఒక ప్రశ్న అడిగే అవకాశం జేపీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ప్రకృతి ఆదర్శ్ కు రాగా మంత్రి తన వయసు కంటే తక్కువగా కనబడటానికి ఆయన అనుసరిస్తున్న ఫిట్ నెస్ మంత్ర ఏమితో చెప్పాలని కోరింది. మంత్రి శ్రీ రిజిజు నవ్వుతూ సమాధానమిచ్చారు. “ నేను 25-30 ఏళ్ళ కుర్రాడినే అనుకుంటూ అందుకు తగినట్టే ఫిట్ గా ఉండటానికి చేయాల్సిందంతా చేస్తా. అలాంటి పట్టుదల, ప్రేమ ఉండాలి” అన్నారు.
ప్రస్తుత కరోనా సంక్షోభ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. ప్రతిపాదించిన కార్యక్రమాలను ఆయా పాఠశాలలు వర్చువల్ పద్ధతిలోనే నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి పాఠశాలలు తమంతట తాముగా https://fitindia.gov.in/fit-india-school-week/ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ జరుపుకోవటానికి 2020 డిసెంబర్ లో ఏదైనా ఒక వారాన్ని కూడా వారే ఎంచుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో వారికిచ్చే జాబితా నుంచి ఏదైనా అంశాన్నిఎంచుకోవచ్చు. ఈ ఏడాది తలపెట్టిన కొన్ని అంశాల్లో ఏరోబిక్స్, పెయింటింగ్, క్విజ్/డిబేట్, డాన్స్, స్టెప్ అప్ చాలెంజ్ లాంటివి ఉన్నాయి. |
pib-155326 | 42a78792da74c2986313c48bd84dd576c9feb5fd3693b76d26aa4df3b216b66b | tel | రక్షణ మంత్రిత్వ శాఖ
డిఫెన్స్ ఎక్స్పో 2022కు సంబంధించిన ఏర్పాట్లను రక్షణ మంత్రి సమీక్షించారు; కొవిడ్ ప్రోటోకాల్‌లలో సడలింపు వల్ల ఈ కార్యక్రమాన్ని అదనంగా ఒక రోజు నిర్వహిస్తారు. దీనివల్ల మరింత ఆసక్తి నెలకొంది.
–గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 2022 మార్చి 10–-14 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది
–రాజ్‌నాథ్ సింగ్ డిఫెన్స్ ఎక్స్పో 2022 మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరి 18, 2022న ఢిల్లీలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో వచ్చేనెల జరగనున్న భూ, నౌకాదళం , స్వదేశీ భద్రతా వ్యవస్థలపై ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శన అయిన డిఫెన్స్ ఎక్స్పో-2022కు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ ఈవెంట్ ప్రపంచంలోని అతిపెద్ద డిఫెన్స్ అంతర్జాతీయ ప్రదర్శనలలో ఒకటి కానుంది. కొవిడ్19 కేసుల తగ్గుదల కారణంగా భారతదేశం తన ఆంక్షలను సడలించినందున, ఈ డిఫెన్స్ ఎక్స్పో 12వ ఎడిషన్‌పై దేశీయంగా అంతర్జాతీయంగా ఆసక్తి ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 930 మంది ఎగ్జిబిటర్లు మెగా ఈవెంట్ కోసం నమోదు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1,000 మించి పెరుగుతుందని భావిస్తున్నారు. విదేశాల రక్షణ మంత్రుల ధృవీకరణలు కూడా జరుగుతున్నాయి. కోవిడ్‌కు ముందు కాలంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఫిబ్రవరి 2020లో జరిగిన ఈవెంట్ ఎడిషన్‌తో దీనిని పోల్చవచ్చు.
.
కోవిడ్ ప్రోటోకాల్స్‌లో సడలింపు వల్లడిఫెన్స్ ఎక్స్పో-2022లో ఎక్కువ ఆసక్తిని కలిగించిందని, దీంతో రాజ్‌నాథ్ సింగ్ ఈవెంట్‌ను ఒక రోజు పొడిగించారు. ఎగ్జిబిషన్ ఇప్పుడు మార్చి 10-–14, 2022 మధ్య నిర్వహించడం జరుగుతుంది. ఇది మూడు పని దినాలలో రక్షణ వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది రెండు పబ్లిక్ రోజులలో గుజరాత్‌లోని యువ పారిశ్రామికవేత్తలు, కళాశాల/స్కూల్ మిలీనియల్స్‌ను కలుపుతుంది. డిఫెన్స్ ఎక్స్పో-2022ను భౌతిక, వర్చువల్ రంగాలలో స్టాల్స్‌తో హైబ్రిడ్ ఎగ్జిబిషన్‌గా నిర్వహిస్తారు. ఎగ్జిబిటర్లు భౌతిక వర్చువల్ హాజరీల అవసరాలను తీర్చగలుగుతారు కాబట్టి ఇది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. వర్చువల్‌గా హాజరైనవారు సెమినార్లలో పాల్గొనవచ్చని, ఎగ్జిబిటర్లు & ప్రతినిధులతో సంభాషించవచ్చని రక్షణ మంత్రికి వివరించడం జరిగింది. బిజినెస్ -టు -బిజినెస్ సమావేశాలను నిర్వహిస్తారు. ఉత్పత్తి వివరాలను సపోర్టింగ్ వీడియోలను వీక్షించవచ్చు.
హెలిప్యాడ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో మూడు వేదికల విధానంలో మెగా ఎగ్జిబిషన్ ప్లాన్ చేయబడమైనది; మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈవెంట్లు సెమినార్లు, సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో ప్రజలకు ప్రత్యక్ష ప్రదర్శన ఉంటుంది. ఫేస్‌మాస్క్‌ని తప్పనిసరిగా ధరించడం, నాన్-కాంటాక్ట్ ఇంటరాక్షన్లు, శ్వాసకోశ పరిశుభ్రత మొదలైన భద్రతా ప్రోటోకాల్‌లు ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ప్రోటోకాల్‌లకు అనుగుణంగా అన్ని వేదికల వద్ద అమలు అవుతాయి.
అహంకార భావాన్ని పెంపొందించడానికి, ఈవెంట్ ఇతివృత్తానికి 'గర్వకారణానికి మార్గం' అని నామకరణం చేశారు. మొదటి-రకం కార్యక్రమంలో, ఈ ఈవెంట్ భారతదేశం దృఢ సంకల్పాన్ని అగ్రస్థానంలో మొదటిగా చూపుతుంది. స్వదేశీ సాంకేతిక లాజిస్టిక్ పరాక్రమంతో ముందంజలో ఉన్న ఈ ఈవెంట్ రక్షణ పరిశ్రమ, స్టార్ట్-అప్లు ఎంఎస్ఎంఈలకు హాజరయ్యే విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులతో పటిష్టమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి ప్రేరేపిస్తుంది. డిఫెన్స్ ఎక్స్పో-2022 భారతదేశం తన వ్యాపార ప్రయోజనాలను మరింతగా పెంచుకోవాలనే సంకల్పానికి ప్రతీక. ఈ ప్రాంతంలో శాంతి భద్రతను పెంపొందించే దిశగా ప్రపంచ కార్యక్రమాలను చేపట్టింది. గుజరాత్ ప్రభుత్వ సహకారంతో రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ఏర్పాట్లను రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు సురక్షితమైన విజయవంతమైన డిఫెన్స్ ఎక్స్పో-2022 పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు
సమీక్ష సందర్భంగా రక్షణ మంత్రి ద్వారా డిఫెన్స్ ఎక్స్పో-2022 మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు. ఈవెంట్‌కు సంబంధించిన అన్ని సమస్యల కోసం ఇది ఇంటరాక్టివ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ఆండ్రాయిడ్/ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎగ్జిబిటర్లు, హాజరీలు మీడియాకు మద్దతు ఇచ్చే ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఎగ్జిబిటర్లు, షెడ్యూల్, స్పీకర్లు, వేదిక మ్యాప్‌లు, డ్రైవింగ్ దిశలు, ప్రచురణలు అలాగే సందర్శకులు, ఎగ్జిబిటర్లకు నోటిఫికేషన్ల సమాచారాన్ని అందిస్తుంది. డెలిగేట్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలతో సహా నిర్మాణాత్మక అభిప్రాయం వంటి కొత్త ఫీచర్లు యాప్‌కి జోడించబడమైనది.
రక్షణ మంత్రితోపాటు రక్షణ కార్యదర్శి అజయ్ భట్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ డాక్టర్ అజయ్ కుమార్, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ వీఆర్ చౌదరి, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్ హరి కుమార్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ) మనోజ్ పాండే ఎంఓడీ సంజీవ్ మిట్టల్ ఇతర సీనియర్ సివిల్ & మిలిటరీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెప్టెంబరు 02, 2021న, ఏక్తా నగర్లో జరిగిన రక్షణ మంత్రి డిఫెన్స్ ఎక్స్పో 2022 సమీక్షకు సంబంధించి, భారత ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వం మధ్య పాత్రలను బాధ్యతలను నిర్వచిస్తూ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికత స్వదేశీ రక్షణ తయారీ రంగం వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా విస్తృత భాగస్వామ్యం ఉంటుందని రక్షణ మంత్రి అప్పుడు కూడా అన్నారు.
(Visitor Counter : 85 |
pib-16153 | 1183a740b46d14722d559c535bc50fa18380962b1b35fc6f41776772337ff5d3 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
నైట్రోజన్ ప్లాంటుల ను ఆక్సీజన్ ప్లాంటులు గా మార్చే పని లో ప్రగతి పై సమీక్ష ను నిర్వహించిన ప్రధాన మంత్రి
కోవిడ్-19 మహమ్మారి ప్రాబల్యం నడుమ వైద్య చికిత్స కు ఉపయోగించే ఆక్సీజన్ అవసరాన్ని దృష్టి లో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆక్సీజన్ ఉత్పత్తి కోసం ప్రస్తుత నైట్రోజన్ ప్లాంటుల ను ఆక్సీజన్ ప్లాంటులు గా మార్చడం తాలూకు సాధ్యాసాధ్యాల ను గురించి తెలుసుకొంది. వివిధ పరిశ్రమల లో ఆక్సీజన్ ఉత్పత్తి చేసేటట్టు గా మార్పిడి చేయగలిగినటువంటి నైట్రోజన్ ప్లాంటుల ను గుర్తించడమైంది.
ప్రస్తుతం ప్రెశర్ స్వింగ్ ఎడ్ సార్ప్ శన్ నైట్రోజన్ ప్లాంటులుగా ఉన్న వాటిని ఆక్సీజన్ ఉత్పత్తి చేసే ప్లాంటులు గా మార్చే ప్రక్రియ పై చర్చించడం జరిగింది. నైట్రోజన్ ప్లాంటుల లో కార్బన్ మాలిక్యులర్ సీవ్ ను ఉపయోగించడం జరుగుతుంది, ఆక్సీజన్ ను ఉత్పత్తి చేయాలి అంటే జియోలైట్ మాలిక్యులర్ సీవ్ ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ కారణంగా, సిఎమ్ఎస్ స్థానం లో జడ్ఎమ్ఎస్ ను మార్చడం తో పాటు, మరికొన్ని మార్పులు.. ఉదాహరణ కు ఆక్సీజన్ ఎనలైజర్, కంట్రోల్ పానెల్ సిస్టమ్, ఫ్లో వాల్వ్స్ వంటివి.. కూడా చేపట్టడం ద్వారా ప్రస్తుత నైట్రోజన్ ప్లాంటుల లో ఆక్సీజన్ ఉత్పత్తి అయ్యే విధం గా మార్పిడి చేయడానికి వీలు ఉంటుంది.
పరిశ్రమల తో సంప్రదింపులు జరిపిన తరువాత ఇప్పటి వరకు 14 పరిశ్రమల ను గుర్తించడమైంది; వాటి లో నైట్రోజన్ ప్లాంటు ల రూపురేఖల ను మార్చే పని చక చక సాగుతున్నది. దీనికి అదనం గా, పారిశ్రామిక సంఘాల సహాయం తో 37 నైట్రోజన్ ప్లాంటుల ను కూడా ఈ కార్యానికై గుర్తించడం జరిగింది.
ఆక్సీజన్ ఉత్పత్తి కోసం మార్పిడి చేసినటువంటి నైట్రోజన్ ప్లాంటుల ను సమీపం లోని ఆసుపత్రుల కు తరలించడమో, లేదా ప్లాంటు ను మార్చడం సాధ్యపడని పక్షం లో దానిని అక్కడికక్కడే ఆక్సీజన్ ఉత్పత్తి కోసం వాడుకోవడమో చేయవచ్చును. ఇలా చేయడం ద్వారా ఉత్పత్తి చేసే ప్రాణవాయువు ను ప్రత్యేక ఉపకరణాల ద్వారా గాని, లేదా సిలిండర్ ల ద్వారా గాని ఆసుపత్రి లోపలకు చేరవేయవచ్చును.
సమావేశం లో ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి, హోం సెక్రట్రి, రోడ్ ట్రాన్స్ పోర్ట్ & హైవేస్ సెక్రట్రి లతో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. |
pib-13353 | 3da715b505299daa6b5a561d71c72164e1048523e009ccc8f9ab49044a16b8f1 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
స్వచ్ఛతా హీ సేవ ఉద్యమం లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవలసిందంటూ పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి
‘స్వచ్ఛతా హీ సేవ మూవ్ మెంట్’ లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
‘‘అక్టోబరు నెల 2వ తేదీ నాడు మనం జరుపుకోబోయే గాంధీ గారి 150వ జయంతి ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. ఇది బాపూ జీ కన్న ఒక పరిశుభ్రమైన భారతదేశం కల ను పండించే దిశ గా చేపడుతున్న ఒక చరిత్రాత్మకమైన ప్రజా ఉద్యమమైన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కు నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యే రోజు కూడా.
స్వచ్ఛ్ భారత్ ఆవిష్కారం దిశ గా కృషి చేస్తున్న వారందరికీ నేను వందనమాచరిస్తున్నాను.
‘స్వచ్ఛతా హీ సేవ మూవ్ మెంట్’ సెప్టెంబర్ 15వ తేదీ నాడు మొదలవుతుంది. బాపు జీ కి నివాళి ని అర్పించే ఓ మహత్తరమైనటువంటి మార్గమిది.
రండి, ఈ ఉద్యమం లో భాగం పంచుకోండి. అలాగే, స్వచ్ఛ్ భారత్ ను ఆవిష్కరించే ప్రయత్నాలనూ బలపరచండి.
15వ తేదీ న ఉదయం తొమ్మిదిన్నర గంటల కు మనమంతా కలసికట్టుగా ‘స్వచ్ఛతా హీ సేవ మూవ్మెంట్’ను ప్రారంభించుకొందాం. స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను బలోపేతం చేసేందుకు క్షేత్ర స్థాయి లో అవిశ్రాంతం గా కృషి చేసిన వారందరి తోనూ ముఖాముఖి సంభాషించడం కోసం నేను వేచివుంటాను. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం స్వచ్ఛత కార్యకలాపాలు ఆరంభమవుతాయి” అని ప్రధాన మంత్రి తన సందేశం లో పేర్కొన్నారు.
( |
pib-128995 | 1b76a6ea121d9f553ff72cf9e9b2e7bab1be4935dce104958fed97f4a79baf7a | tel | రక్షణ మంత్రిత్వ శాఖ
రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ బిన్ అబ్దుల్లా మహమ్మద్ అల్-ముతైర్ భారత దేశ చారిత్రక పర్యటన
రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ బిన్ అబ్దుల్లా మొహమ్మద్ అల్-ముటైర్, 14 ఫిబ్రవరి 2022న భారతదేశ పర్యటనకు చేరుకున్నారు. చారిత్రాత్మక మరియు మైలురాయి పర్యటన. రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ కమాండర్ ఒకరు భారత దేశ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ఈ పర్యటన మరింతగా పెంపొందించడాన్ని సూచిస్తుంది. జనరల్ ఎంఎం నరవాణే 2020 డిసెంబర్లో సౌదీ అరేబియా పర్యటన చేశారు. అది ఒక చారిత్రాత్మక పర్యటన, భారత ఆర్మీ చీఫ్ సౌదీ అరేబియాను సందర్శించడం అదే తొలిసారి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం. లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ బిన్ అబ్దుల్లా మహ్మద్ అల్-ముతైర్ను 15 ఫిబ్రవరి 2022న సౌత్ బ్లాక్‌లో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఆహ్వానం పలికారు, అక్కడ అతనికి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ అందించారు. ఇరు దేశాల మధ్య ముఖ్యమైన ద్వైపాక్షిక చర్చల కోసం ఆయన సీఓఏఎస్ను కలుసుకున్నారు, ఇరువురు భద్రతా అంశాల గురించి వివరించాడు. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు ఆర్థిక శ్రేయస్సు, తీవ్రవాద భయాలను తొలగించడం మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం వంటి సాధారణ ప్రయోజనాల కారణంగా ఎంతగానో వృద్ధి చెందాయి. రక్షణ దౌత్యం అనేది మొత్తం సంబంధాల యొక్క ప్రధాన సిద్ధాంతాలలో ఒకటి. లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ బిన్ అబ్దుల్లా మహమ్మద్ అల్-ముటైర్ 16 ఫిబ్రవరి 2022న సౌదీ అరేబియాకు తిరుగు ప్రయాణమవుతారు. |
pib-167492 | d6777df045c6687f9236fd9c74b95f2e83469677d10fa29cecc33664852e584f | tel | వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జర్మనీతో వర్చువల్ కొనుగోలు, అమ్మకందారుల సమావేశాన్ని నిర్వహించిన ఏపీఈడీఏ
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికారిక సంస్థ .. వివిధ ఎగుమతి ప్రచార కార్యకలాపాల ద్వారా షెడ్యూల్ చేసిన వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి కాలంలో వర్చువల్ విధానంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి ఏపీఈడీఏ తన వంతు ప్రయత్నాన్ని కొనసాగించింది. విదేశాలలో ఉన్న భారతీయ మిషన్ల సహకారంతో దిగుమతి చేసుకునే దేశాలతో పలు వర్చువల్ కొనుగోలు, అమ్మకందారుల సమావేశాలు నిర్వహించింది. ఈ శ్రేణిలో భాగంగా దేశం నుండి తాజా పండ్లు మరియు కూరగాయల ఎగుమతిని ప్రోత్సహించడానికి గాను ఈ నెల 25న జర్మనీ దిగుమతిదారులతో వర్చువల్ నెట్వర్కింగ్ సమావేశాన్ని నిర్వహించింది. బెర్లిన్ నగరంలోని భారత రాయబార కార్యాలయం, జర్మన్ అగ్రిబిజినెస్ అలయన్స్ సహకారంతో ఏపీఈడీఏ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెర్లిన్ నగరంలోని భారత రాయబార కార్యాలయ మిషన్ డిప్యూటీ హెడ్ శ్రీమతి పరమితా త్రిపాఠి, ఏపీఈడీఏ సంస్థ చైర్మెన్ డాక్టర్ ఎం.అంగముత్తు, జర్మన్ అగ్రిబిజినెస్ అలయన్స్ చైర్పర్సన్ శ్రీమతి జూలియా హర్నాల్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ ఎం. అంగముత్తు మాట్లాడుతూ భారతీయ జీఐ మరియు సేంద్రీయ ఉత్పత్తులతో పాటు ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల ప్రాధాన్యతలను గురించి ప్రధానంగా ఈ సమావేశంలో వివరించారు. భారత రాయబార కార్యాలయం, మిషన్ డిప్యూటీ హెడ్ శ్రీమతి పరమితా త్రిపాఠి మాట్లాడుతూ విశిష్ఠమైన రుచులు, లక్షణాల కారణంగా భారతీయ ఉద్యానవన ఉత్పత్తులు మేటి ఉనికిని కలిగి ఉన్నాయని నొక్కి చెప్పారు. ఎగుమతుల్లో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల బలం గురించి ప్రత్యేకంగా ద్రాక్ష మరియు తాజా పండ్లు మరియు కూరగాయల విషయమై తెలియజేస్తూ భారతీయ పక్షాన ప్రదర్శనలు నిలిచాయి. జర్మనీ వైపు నుండి, జర్మనీ మార్కెట్ యొక్క అవసరాలు, అంచనాలపై ప్రదర్శనలు నిలిచాయి.
భారతీయ వ్యవసాయ ఉత్పత్తులపై జర్మనీ కొనుగోలుదారుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఎగుమతులను సులభతరం చేయడానికి తాజా పండ్లు మరియు కూరగాయల ఎగుమతిలో భారత దేశ బలాన్ని ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. |
pib-28536 | 67347f6e4a467460831c6dc66a5e5df8feca0a6da57852bc413809d2ddf443b8 | tel | గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్‌కు సంబంధించిన ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ కోసం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం
వివిధ పథకాల అమలు కోసం మంత్రిత్వ శాఖల మధ్య భాగస్వామ్యం రూపొందించడం ముఖ్యమైన అజెండాలో ఒకటిగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తద్వారా వనరుల వినియోగం ఆప్టిమైజ్ చేయడంతో పాటు ప్రజలకు గరిష్ఠ ప్రయోజనాలు అందుతాయి.
ప్రస్తుతమున్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల అభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక మరియు వ్యాపార సహకారాన్ని అందించే ఉద్దేశ్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అఖిల భారత “కేంద్ర ప్రాయోజిత ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్” పథకాన్ని ప్రారంభించింది. 2020-21 నుండి 2024-25 వరకు ఐదేళ్ల కాలంలో రూ .10,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
ఆహార ప్రాసెసింగ్‌లో స్వయం సహాయక బృందం వ్యవస్థాపకులకు తోడ్పడటానికి పిఎం-ఎఫ్ఎంఈ అమలుపై కలిసి పనిచేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు దీన్‌దయాళ్ యోజన- గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లు అంగీకరించింది. ఈ పథకం యొక్క అన్ని దశల్లో రెండు మంత్రిత్వ శాఖలు స్వయం సహాయక సంఘ సభ్యులకు మూలధన సహాయాన్ని అందించే అంశంపై కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా మూలధన వ్యయం కింద సాధనాల కొనుగోలుకు ఆయా సంస్థల టర్నోవర్, అవసరం ఆధారంగా ఒక్కో గ్రూప్ సభ్యుడికి గరిష్టం రూ.40,000/ అందజేస్తారు.పథకంలో ఈ కార్యక్రమ అమలును సులభతరం చేయడానికి జాతీయ స్థాయిలో రెండు మంత్రిత్వ శాఖల బృందాలు ఈ పథకం, మార్గదర్శకాలు, ఉమ్మడి సలహాదారులు, శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు మొదలైన వాటి కోసం కార్యాచరణను రూపొందించడానికి కలిసి పనిచేశాయి.
రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాల్లోని రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నియమించిన రాష్ట్ర నోడల్ ఏజెన్సీలు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి సమన్వయంతో నిర్వహిస్తున్నాయి. అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించడం, వారి ఆకాంక్షలను మరియు వృద్ధి ప్రణాళికలను తెలుసుకోవడం, డిజిటలైజ్ చేయడం, సమీక్షించడం, సిఫార్సు చేయడం మరియు ఆమోదించడం వంటివి ఇందులో ఉన్నాయి.
2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 17427 మంది లబ్ధిదారులను పరిశీలించి వారికి విత్తన మూలధన మద్దతు కోసం రూ. 51.85 కోట్లు సిఫార్సు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాలు మార్గదర్శకులుగా ఉన్నాయి. మొత్తం లబ్ధిదారులలో 83% పైగా మరియు సిఫార్సు చేయబడ్డ మొత్తంలో 80 శాతం ఈ రాష్ట్రాలు కలిగి ఉన్నాయి.
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్, గోవా, గుజరాత్, హర్యానా,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం,తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని 6694 బృందాల్లోని 10314 మంది లబ్దిదారులకు రూ. 29.01 కోట్లు అందించడానికి ఆమోదం లభించింది. క్లస్టర్ లెవల్ ఫెడరేషన్స్ మరియు విలేజ్ ఆర్గనైజేషన్స్ వంటి కమ్యూనిటీ సంస్థల నెట్వర్క్ ద్వారా ఆయా రాష్ట్రాలు సంబంధిత స్వయం సహాయక సంఘాలు మరియు స్వయం సహాయక సంఘ సభ్యులకు నిధులను విడుదల చేసే పనిలో ఉన్నాయి.
స్వయం సహాయక సంఘ సభ్యులచే నిర్వహించబడుతున్న గ్రామీణ ఆహార ప్రాసెసింగ్ సంస్థలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి ఒక బలమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఈ కలయిక రెండు మంత్రిత్వ శాఖల బలాన్ని పెంచింది అలాగే ఆహార ప్రాసెసింగ్ రంగంలో గ్రామీణ మహిళల జీవనోపాధిని మరింత మెరుగుపరుస్తుంది. |
pib-217322 | e0921683457475f1c96ad7ecfbf1039b6cb40627a23299cc98016a8246d91363 | tel | చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ఇ-కోర్టు ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా హైస్పీడ్ వైడ్ ఏరియా నెట్ వర్్క తో అనుసంధానం చేయాలని లక్ష్యించిన 2992 కోర్టుల సముదాయాలలో 2927 సముదాయాల అనుసంధానం
సుదూర ప్రాంతాలలో ప్రాంతాలలో ఆర్ ఎఫ్, విశాట్ తదితరాల వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు
ఇటీవలే ప్రారంభించిన సబ్ మెరైన్ ద్వారా త్వరలోనే అండమాన్ నికోబార్ దీవులలో 5 టిఎన్ ఎఫ్ ప్రాంతాల అనుసంధానం
న్యూఢిల్లీ, డిసెంబర్ 11, : భారత దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టు సముదాయాలలో 2927 సముదాయాలను ఇ-కోర్టుల ప్రాజెక్టు కింద హైస్పీడ్ వైడ్ ఏరియా నెట్‌వర్్క తో అనుసంధానం చేయడం జరిగింది. అనుసంధానం చేయాలని సంకల్పించిన 2992 సముదాయాలలో ఈ ప్రాజెక్టు కింద హైస్పీడ్ వాన్ ద్వారా 97.86% న్ని అనుసంధానం చేసేందుకు దారి తీసింది. న్యాయ శాఖ , బిఎస్ ఎన్ ఎల్ కలిసి మిగిలిన ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 2992 కోర్టు సముదాయాలను ఆప్టికల్ ఫైబర్ కేబుల్ , రేడియో ఫ్రీక్వెన్సీ , వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ తదితర పద్ధతుల ద్వారా అనుసంధానం చేయాలని సుప్రీం కోర్టు ఇ-కమిటీతో కలిసి న్యాయ శాఖ ఇ- కోర్ట్స్ ప్రాజెక్టు కింద ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ నెట్‌వర్క్‌ను రూపొందించాలని సంకల్పించింది. ఈ మొత్తం సముదాయాలకు ఎంపిఎల్ెస్, విపిఎన్ నిర్వహించి, సేవలను అందించే బాధ్యతను దేశవ్యాప్తంగా ఉనికిలో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యాధునిక టెలికాం మౌలిక సదుపాయాలు, ప్రసార పరికరాలను కలిగిన బిఎస్ ఎన్ ఎల్ కు 2018 మే మాసంలో అప్పగించడం జరిగింది. ఈశాన్య ప్రాంతం, జమ్ము కాశ్మీర్, ఉత్తరాఖండ్, అండమాన్ నికొబార్ దీవులు సహా దేశం నలుమూలల్లో బిఎస్ ఎన్ ఎల్ ఉనికిలో ఉంది.
బేధాన్ని తొలగించేందుకు న్యాయ శాఖ కృషి కారణంగా ఇటువంటి ప్రాంతాలలో ఆర్ ఎఫ్, విశాట్ తదితర ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బిఎస్ ఎన్ ఎల్, కోర్టులు సహా వివిధ భాగస్వాములతో నిరంతర చర్చలు, సమావేశాలు, సమన్వయం ద్వారా న్యాయ శాఖ 2019లో 58గా ఉన్న మొత్తం టిఎన్ ఎఫ్ ప్రాంతాలను, 2020లో 14కు తగ్గించింది. తద్వారా ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు యత్నించింది, ఎందుకంటే విశాట్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా అనుసంధానం చాలా ఖరీదైంది. ఇటీవలే ప్రారంభించిన సబ్ మెరైన్ కేబుల్ ను అండమాన్ నికోబార్ దీవులలోని 5 టిఎన్ ఎఫ్ ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు వినియోగించాలని న్యాయ శాఖ నిర్ణయించింది.
కోవిడ్ -19 సంక్షోభ కాలంలో అనుసంధానం ప్రాముఖ్యత ఎక్కువైంది, ఎందుకంటే ప్రస్తుతం కోర్టులు కేసులను ఆన్లైన్ ద్వారా విచారణ చేయాలన్న వత్తిడి భారీగా పెరిగింది. ఈ క్రమంలో మారిన పరిస్థితిలో బాండ్విడ్త్ అవసరాన్ని సమీక్షించేందుకు బిఎస్ ఎన్ ఎల్, ఎన్ ఐసి, ఇ- కమిటీ తదితరాలతో ఉన్నత స్థాయి కమిటీని న్యాయ శాఖ ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఇ-కమిటీతో కలిసి న్యాయ శాఖ డిజిటల్ పరివర్తన దిశగా భారీగా అంగ వేసింది, న్యాయవ్యవస్థను పరివర్తనకు లోను చేసేందుకు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించడంలో, సాధారణ పౌరులకు న్యాయం అందుబాటులోకి తెచ్చేందుకు అది సాధించిన విజయాలను అన్ని స్థాయిల్లో మన్ననలను అందుకుంటోంది.
భారతీయ న్యాయ వ్యవస్థలో జాతీయ విధానం, సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ అమలుకు కార్యాచరణ ప్రణాళిక జాతీయ ఇ-గవర్నెన్స్ ప్రణాళిక, ఇ- కోర్టుల ప్రాజక్టు అన్నది ఇంటిగ్రేటెడ్ మిషన్ మోడ్ ప్రాజెక్టు కింద 2007 నుంచి అమలులో ఉంది.
ఇ- కోర్టుల ప్రాజెక్టు మొదటి దశ లో 14,249 జిల్లా & అనుషంగిక కోర్టుల కంప్యూటరీకరణను ప్రభుత్వం ఆమోదించింది. మెరుగైన న్యాయ నిర్వహణ కోసం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ని దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా, అనుషంగిక కోర్టుల సార్వత్రిక కంప్యూటీకరణ ద్వారా లిటిగెంట్లు, న్యాయవాదులు, న్యాయవ్యవస్థకు నియమిత సేవలను అందించాలన్నది ఇ-కోర్టుల ప్రధాన లక్ష్యం. అన్ని కోర్టులలోనూ సార్వత్రిక కంప్యూటరీకరణను ఐసిటి పెంచడాన్ని కల్పన చేస్తూ, ప్రాజెక్టు రెండవ దశను జులై 2015లో రూ.1670 కోట్ల బడ్జెట్‌ను కేబినెట్ ఆమోదించింది. దీని కింద 16,845 కోర్టులను కంప్యూటరీకరించడం జరిగింది. |
pib-297239 | e0b5804629ff1367bba7a162d44d68760512fb2065caf3a183ac684bb5d29dce | tel | శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
రేపు న్యూ ఢిల్లీలో “భారతదేశంలో ఆరోగ్యం, సైన్స్‌లో మహిళలు ప్రముఖంగా మారుతున్నారు” అనే అంశంపై సదస్సును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ట్రస్టీ బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కోచైర్ మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కూడా ఈ అంశంపై తన ఆలోచనలను పంచుకుంటారు.
భారతదేశం గ్లోబల్ హెల్త్ ఎకోసిస్టమ్‌లో నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడానికి సాధించగల మార్గాలు లక్ష్యాలను గుర్తించడానికి ఈ సదస్సు ప్రయత్నిస్తుంది.
కేంద్ర రాష్ట్ర మంత్రి సైన్స్ & టెక్నాలజీ; సహాయమంత్రి ఎర్త్ సైన్సెస్; ఎంఓఎస్ పీఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ స్పేస్, డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో “భారతదేశంలో ఆరోగ్యం సైన్స్‌లో మహిళలకు నాయకత్వం వహిస్తున్నారు” అనే సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, కో-చైర్ ట్రస్టీ బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఉమెన్ లిఫ్ట్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమీ బాట్సన్ కూడా సదస్సులో ప్రసంగిస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ , డిబిటికి చెందిన పిఎస్‌యు, విమెన్లిఫ్ట్ హెల్త్ గ్రాండ్ ఛాలెంజెస్ ఇండియా సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు మహిళల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ప్రచారం చేస్తుంది. ఆరోగ్యం విజ్ఞాన శాస్త్రంలో నాయకత్వం భారతదేశం గ్లోబల్ హెల్త్ ఎకోసిస్టమ్‌లో నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడానికి సాధించగల మార్గాలు లక్ష్యాలను గుర్తించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ సమావేశం గత కొన్ని సంవత్సరాలుగా అపూర్వమైన సవాళ్లను అధిగమించడంలో స్టెమ్ ఆవిష్కరణ ఆరోగ్య సంరక్షణను వారి అలుపెరగని స్థితిస్థాపకత అచంచలమైన పట్టుదలతో అభివృద్ధి చేయడంలో భారతీయ మహిళల విజయాలను గౌరవిస్తుంది. సదస్సుకు ముందు మాట్లాడుతూ, బిరాక్ బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి & చైర్పర్సన్ డాక్టర్ రాజేష్ గోఖలే మాట్లాడుతూ “శతాబ్దాలుగా మహిళా నాయకత్వం పరివర్తన చెందింది. నేను మహిళలందరినీ అభినందిస్తున్నాను మన ప్రధాన మంత్రి కలలు కనే అగ్రరాజ్యంగా భారతదేశం మారడానికి, నాయకత్వ స్థానాల్లో ఎక్కువ మంది మహిళలకు సాధికారత కల్పించాల్సిన సమయం ఇదేనని నేను నమ్ముతున్నాను”అని వివరించారు. బిరాక్ సీనియర్ అడ్వైజర్, డీబీటీ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అల్కా శర్మ మాట్లాడుతూ, "మహిళల నాయకత్వం ఇప్పుడు అత్యున్నత స్థాయిలో గుర్తింపు పొందింది క్రమంగా పెరుగుతోంది. బిరాక్ వివిధ పథకాలు కార్యక్రమాల ద్వారా, దేశవ్యాప్తంగా పరిశోధకులు, వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నాం. మద్దతు ఇస్తున్నాం. మహిళల నాయకత్వంపై జాతీయ దృష్టిని పెంపొందించడంలో ఈ సదస్సు ఖచ్చితంగా సహాయపడుతుంది" ఆమె అన్నారు.
గ్లోబల్ హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్ ప్రధానంగా మహిళలు అయినప్పటికీ వారు నాయకత్వం నిర్ణయం తీసుకునే స్థానాల్లో, ముఖ్యంగా ఉన్నత కార్యనిర్వాహక లేదా బోర్డు స్థాయిలలో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్టెమ్‌లో తక్కువ ప్రాతినిధ్యం కూడా ప్రధాన ఆందోళనలలో ఒకటి. భారతదేశంలో, హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్ భాగస్వామ్యం పురుషులు మహిళల మధ్య కొంతవరకు సమానంగా ఉన్నప్పటికీ, నాయకత్వ పాత్రలలో తక్కువ మంది మహిళలు ఉన్నారు. ఈ సమస్య ప్రాముఖ్యతను గుర్తించి, బిరాక్ భారతదేశం అత్యంత క్లిష్టమైన ఆరోగ్య అభివృద్ధి సమస్యలను తగ్గించడానికి శాస్త్రీయ సాంకేతిక పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తోంది. వ్యవసాయం, ఆహారం పౌష్టికాహారానికి సంబంధించిన కార్యక్రమాలు తల్లి పిల్లల ఆరోగ్య సమస్యలను తగ్గించడం ద్వారా మహిళలకు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంపై కేంద్రీకృతమై ఉన్నాయి. బిరాక్ టై విమెన్ ఇన్ ఎంటర్ప్రెన్యూరియల్ రీసెర్చ్ వంటి కార్యక్రమాలు ఔత్సాహిక పరిశోధనలో మహిళలపై దృష్టి సారిస్తాయి.- సైన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మహిళలను బలంగా ప్రోత్సహించడం గుర్తించడం జరుగుతుంది. కో-హోస్ట్ విమెన్లిఫ్ట్ హెల్త్, మిడ్-కెరీర్ మహిళలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వారు నివసించే పని చేసే వాతావరణాలను ప్రభావితం చేయడం ద్వారా ప్రతిభావంతులైన మహిళలను సీనియర్ నాయకత్వంలోకి వేగవంతం చేయడానికి పని చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కుమార్ పాల్, డాక్టర్ రాజీవ్ ఈ సదస్సు వక్తల బృందంలో ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ సెక్రటరీ, హెల్త్ రీసెర్చ్, డాక్టర్ టెస్సీ థామస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ సిస్టమ్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఆరోగ్యం సైన్స్‌లో పనిచేస్తున్న అనేక ఇతర ప్రముఖులు కూడా వస్తారు.
డీబీటీ గురించి
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ , సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, జంతు శాస్త్రాలు, పర్యావరణం పరిశ్రమలలో దాని విస్తరణ, వర్తింపు ద్వారా భారతదేశంలో బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
బిరాక్ గురించి
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ , భారత ప్రభుత్వం, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేయబడింది, ఇది లాభాపేక్ష లేని సెక్షన్ 8, షెడ్యూల్ బీ, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్, ఇది ఇంటర్ఫేస్ ఏజెన్సీగా పని చేస్తుంది. దేశం ఉత్పత్తి అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలను అమలు చేయడానికి అభివృద్ధి చెందుతున్న బయోటెక్నాలజీ పరిశ్రమను ప్రోత్సహిస్తుంది.
విమెన్ లిఫ్ట్ గురించి
ఉమెన్లిఫ్ట్ హెల్త్ కాన్ఫరెన్స్ అనేది స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం చొరవ. 2017 నుండి నిర్వహించబడుతున్నది. ఇది ప్రపంచ ఆరోగ్య సంఘం అంతటా స్థాపించబడిన అభివృద్ధి చెందుతున్న నాయకులను కలుసుకోవడానికి ఆరోగ్య నాయకత్వంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి కలిసి పని చేయడానికి ఒక ఫోరమ్‌ను అందించడానికి, వైవిధ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పెరుగుతున్న వేగానికి దోహదం చేస్తుంది. గ్లోబల్ హెల్త్‌లో మహిళల నాయకత్వం మహిళల నాయకత్వం కోసం దేశాలు, రంగాలు విభాగాల్లో అవకాశాలు సవాళ్లపై అవగాహనను విస్తరించడం దీని లక్ష్యం. |
pib-134387 | 3c9dd8456198ae204da92617c0e449f80b5a3dd1d5e588d356803b1e63b3c7bb | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ టీకాల లభ్యతపై తాజా సమాచారం
రాష్ట్రాలు, యూటీలకు ఇప్పటివరకు 192.27 కోట్లకు పైగా డోసులు పంపిణీ
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో 20.53 కోట్లకుపైగా నిల్వలు
దేశవ్యాప్తంగా కొవిడ్-19 టీకాల వేగాన్ని మరింత పెంచడానికి పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమం గత ఏడాది జనవరి 16న ప్రారంభమైంది. కొవిడ్ టీకాల సార్వత్రికీకరణ కొత్త దశ 2021 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాల లభ్యత, టీకాల లభ్యతపై దూరదృష్టిని పెట్టడం ద్వారా టీకా కార్యక్రమం వేగవంతమైంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చక్కటి ప్రణాళికతో పని చేయడానికి, టీకా సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడానికి దీనిని ప్రారంభించారు.
సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా కొవిడ్ టీకాలను అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోంది. టీకా సార్వత్రీకరణ కొత్త దశలో, దేశంలో తయారవుతున్న టీకాల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించి, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది.
|
|
టీకా డోసులు
|
|
|
|
పంపిణీ చేసినవి
|
|
1,92,27,23,625
|
|
అందుబాటులోని నిల్వలు
|
|
20,53,77,891
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా , ప్రత్యక్ష సేకరణ పద్ధతిలో 192.27 కోట్లకు పైగా టీకా డోసులు అందాయి.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 20.53 కోట్లకుపైగా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. |
pib-186553 | b585bfc938aeb33e2a910a65e6175902ae9e2bbbf16c53a5a7ac11a650e0bfe2 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం లోనికొన్ని ప్రాంతాల లో మితిమీరిన వర్షపాతం ఫలితం గా ఏర్పడ్డ స్థితి ని సమీక్షించినప్రధాన మంత్రి
సీనియర్ మంత్రుల తో మరియు అధికారుల తో ఆయన మాట్లాడారు
భారతదేశం లోని కొన్ని ప్రాంతాల లో మితిమీరిన వర్షపాతం దరిమిలా తలెత్తిన స్థితి ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సీనియర్ మంత్రుల తో మరియు అధికారుల తో మాట్లాడడం తో పాటు గా ఏమి చేయాలనే దాని పై సమాలోచనలు జరిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘సీనియర్ మంత్రుల తో మరియు అధికారుల తో ప్రధాన మంత్రి మాట్లాడి, భారతదేశం లో కొన్ని ప్రాంతాల లో మితిమీరిన వర్షపాతం నేపథ్యం లో ఏర్పడ్డ స్థితి పై ఏమి చేయాలో సమాలోచనలు జరిపారు. ప్రభావితుల యొక్క శ్రేయం దిశ లో స్థానిక పాలన యంత్రాంగాలు, ఎన్ డిఆర్ఎఫ్ మరియు ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు పాటుపడుతున్నాయి.’’ అని తెలిపింది. |
pib-282626 | fdefd778812f37785120bbdce87fe9dce8546699ebd4792da4bcbc484e381588 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
కోయంబత్తూరు లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
నౌకాశ్రయాల కు ప్రముఖ పాత్ర ను కట్టబెడుతూ అభివృద్ధిని సాధించడం పట్ల భారతదేశానికి ఉన్న నిబద్ధత ను ‘సాగర్ మాల పథకం’ ద్వారా గమనించవచ్చు: ప్రధాన మంత్రి
ఈ రోజున ప్రారంభించిన అభివృద్ధి పనులు కోయంబత్తూరు తో పాటు, యావత్తు తమిళ నాడు కు మేలు చేస్తాయి: ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1000 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన నైవేలీ నూతన థర్మల్ పవర్ ప్రాజెక్టు ను, ఎన్ఎల్సిఐఎల్ కు చెందిన 709 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్తు పథకాన్ని దేశానికి అంకితం చేశారు. లోయర్ భవానీ ప్రాజెక్టు సిస్టమ్ విస్తరణ, పునర్ నవీకరణ, ఆధునీకరణ పనులకు, వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో 5 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన గ్రిడ్ సంధానిత క్షేత్ర ఆధారితమైన సోలర్ పవర్ ప్లాంటు రూపకల్పన, స్థాపన, ప్రారంభం తాలూకు పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. తొమ్మిది స్మార్ట్ సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్స్ ల అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో కోరమ్ పల్లమ్ బ్రిడ్జ్ తాలూకు 8- దోవల ను, రైల్ ఓవర్ బ్రిడ్జ్ ని, ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్’ లో భాగం గా నిర్మించిన అద్దె ఇళ్ళ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశీ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కోయంబత్తూరు ను పరిశ్రమ, నూతన ఆవిష్కరణ ల నగరంగా అభివర్ణించారు. ఈ రోజు న ప్రారంభించిన అభివృద్ధి పనులు కోయంబత్తూరు కు, యావత్తు తమిళ నాడుకు లబ్ధి ని చేకూరుస్తాయి అని ఆయన అన్నారు.
భవానీ సాగర్ ఆనకట్ట ఆధునీకరణ ద్వారా అనేక జిల్లాల లో 2 లక్షల ఎకరాల కు పైగా భూములు సాగునీటి ని అందుకొనే కారణంగా రైతులు లాభపడతారని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం పారిశ్రామిక వృద్ధి కి ప్రధానమైన తోడ్పాటు ను అందిస్తున్నందుకుగాను తమిళ నాడు ను ఆయన ప్రశంసించారు. పారిశ్రామిక వృద్ధి తాలూకు మౌలిక అవసరాల లో విద్యుత్తు సరఫరా అనేది ఒక మౌలిక అవసరం అయినందువల్ల అనేక పెద్ద విద్యుత్తు ప్రాజెక్టుల ప్రారంభం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 709 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్తు పథకం పూర్తిగా దేశీయం గా రూపొందిందని, ఈ ప్రాజెక్టు వ్యయం 3,000 కోట్ల రూపాయల కు పైగానే ఉందని ఆయన అన్నారు. 7,800 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన మరొక 1000 ఎండబ్ల్యు సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా తమిళ నాడు కు ఎంతో ఉపయోగం ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్తు లో 65 శాతానికి పైగా విద్యుత్తు ను తమిళ నాడు కు ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
వి.ఒ. చిదంబరనార్ పోర్టు , తూత్తుకూడి లకు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించిన క్రమం లో మాట్లాడుతూ, తమిళ నాడు కు సముద్ర సంబంధిత వ్యాపారం లో, నౌకాశ్రయాలు ప్రధాన పాత్ర ను పోషిస్తున్న అభివృద్ధి ప్రక్రియ లో ఒక గొప్ప చరిత్ర అంటూ ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు న ప్రారంభించిన పథకాలు ఈ నౌకాశ్రయం లో ఓడ నుంచి సరుకుల ను దింపే, ఓడ లోకి సరుకుల ను నింపే సామర్ధ్యం మరింత అధికం కానుందని, అంతేకాకుండా ఈ కార్యక్రమం పర్యావరణానికి మైత్రీపూర్వకం గా కూడా రూపుదాల్చింది అని ఆయన వివరించారు. తగిన వనరులు ఉన్నటువంటి నౌకాశ్రయాలు భారతదేశం ‘ఆత్మనిర్భర్’ గా మారడానికి తోడ్పడుతాయని, లాజిస్టిక్స్ పరంగా, వ్యాపారం పరంగా భారత్ ఒక గ్లోబల్ హబ్ గా ఎదిగేందుకు సైతం అవి దోహదపడుతాయని ఆయన అన్నారు. మహా స్వాతంత్య్ర యోధుడు విఒసి గారికి శ్రీ మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘ఒక హుషారైన భారతదేశ శిప్పింగ్ పరిశ్రమ తో పాటు సముద్ర సంబంధిత అభివృద్ధి చోటు చేసుకోవాలి అంటూ ఆయన కన్న కలలు మనకు గొప్ప ప్రేరణ ను అందిస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. వి.ఒ.సి పోర్టు గ్రిడ్ కు సంధానం అయిన 5 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన క్షేత్ర ఆధారిత సోలర్ పవర్ ప్లాంటు ను 20 కోట్ల రూపాయల వ్యయం తో చేపట్టినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 140 కెడబ్ల్యు సామర్ధ్యం కలిగిన రూఫ్ టాప్ సోలర్ ప్రాజెక్టు పనులు పురోగమిస్తున్నాయని తెలిపారు. దీనిని ‘ఊర్జా ఆత్మనిర్భరత’ కి ఒక ఉదాహరణ గా ఆయన పేర్కొన్నారు.
నౌకాశ్రయాల కు పెద్దపీట వేస్తూ అభివృద్ధి ని సాధించాలన్న భారత ప్రభుత్వ వచన బద్ధత ను ‘సాగర మాల పథకం’ అమలు ద్వారా గ్రహించవచ్చని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. 2015- 2035 సంవత్సరాల మధ్య కాలం లో అమలు చేయడానికి గాను దాదాపు 575 ప్రాజెక్టుల ను గుర్తించడం జరిగిందని, వీటికి మొత్తం 6 లక్షల కోట్ల రూపాయల కు పైగా వ్యయమవుతుందని ఆయన వివరించారు. ఈ కృషి లో నౌకశ్రయాల ఆధునీకరణ, కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి, నౌకాశ్రయాల సంధానాన్ని మెరుగు పరచడం, నౌకాశ్రయాల కు పెద్ద పీట వేస్తూ పారిశ్రామికీకరణ ను చేపట్టడం, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వంటివి భాగం గా ఉన్నాయన్నారు. చెన్నై లోని శ్రీ పెరంబదూర్ సమీపం లో గల మాప్పేడు లో ఒక కొత్త మల్టి మాడల్ లాజిస్టిక్స్ పార్కు ను త్వరలోనే ప్రారంభించుకోనున్నామని ఆయన తెలిపారు. ‘సాగర్ మాల కార్యక్రమం’ లో భాగం గా కోరమ్ పల్లమ్ బ్రిడ్జి ని 8 దోవ లు కలిగింది గా విస్తరించే పని ని సైతం చేపట్టడమైందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు నౌకాశ్రయం నుంచి ఎలాంటి రద్దీ కి తావు ఉండని విధం గా, నిరంతరాయమైన రాక పోకల కు మార్గాన్ని సుగమం చేయడం ఒక్కటే కాకుండా ఓడ సరుకుల ను తరలించేందుకు పట్టే కాలాన్ని మరింతగా తగ్గించగలదని శ్రీ మోదీ వివరించారు.
ప్రతి ఒక్క వ్యక్తి గౌరవాని కి పూచీ పడటం అనేది అభివృద్ధి కి కీలకం గా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘గౌరవం దక్కేటట్టు చూసే మౌలిక పద్ధతులలో ప్రతి ఒక్కరి కి ఆశ్రయాన్ని కల్పించడం అనేది ఒకటి గా ఉంది. మన ప్రజల కలల కు, ఆకాంక్షల కు రెక్కలు తొడగటం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ను మొదలుపెట్టడం జరిగింది’’ అని ఆయన అన్నారు. అనేక ప్రాంతాల లో నిర్మాణం పూర్తి అయిన 4,144 అద్దె ఇళ్ల ను ప్రారంభిస్తున్నందుకు, తమిళ నాడు అంతటా స్మార్ట్ సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్ లకు శంకుస్థాపన చేస్తున్నందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 332 కోట్ల రూపాయలు అని, ఈ గృహాల ను స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడచిన తరువాత సైతం తల దాచుకోవడానికి ఇల్లు అంటూ లేని వారికి అప్పగించడం జరుగుతుందని కూడా ఆయన అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్ లు ఆయా నగరాల లో వివిధ సేవలను నిర్వహించేందుకు వివేకయుతమైనటువంటి పరిష్కారాలను ఐటీ దన్ను తో ఒకే చోటు లో అందిస్తాయని ఆయన వివరించారు. |
pib-32835 | 47cb32c5173c365f8a7f19b9decae67c6d670849c0a02f5d1e6734ad37918469 | tel | ఆర్థిక మంత్రిత్వ శాఖ
రూ. 10.68కోట్ల మోసం బట్టబయలు!
నవీముంబై సి.జి.ఎస్.టి కమిషనరేట్ దాడుల్లో
ఇన్.పుట్ క్రెడిట్ అక్రమాల గుట్టు రట్టు..
స్టీల్ కంపెనీ యజమాని అరెస్ట్
పది కోట్ల రూపాయలకు పైగా అక్రమ కార్యకలాపాల గుట్టును నవీ ముంబైకి చెందిన వస్తు సేవల పన్ను కేంద్ర కమిషనరేట్ బుధవారం బట్టబయలు చేసింది. ఈ కేసులో నవనీత్ స్టీల్స్ అనే సంస్థ యజమానిని ఫిబ్రవరి 2వ తేదీన అరెస్ట్ చేశారు. రూ. 60కోట్ల రూపాయలకు బోగస్ ఇన్వాయిస్ బిల్లులు చూపించి, ఇన్.పుట్ క్రెడిట్ సదుపాయాన్ని అక్రమంగా వాడుకున్న ఈ సంస్థ ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం కలిగించిందని అధికారులు తెలిపారు.
నవనీత్ స్టీల్స్ సంస్థపై నవీ ముంబై సి.జి.ఎస్.టి. పరిధిలోని పన్ను ఎగవేత నిరోధక శాఖ అధికారుల బృందం జరిపిన విచారణలో ఈ అక్రమాల గుట్టు బట్టబయలైంది. అల్యూమినియం, స్టీల్ లోహాల ముడి సామగ్రి, తుది ఉత్పాదనల వాణిజ్యాన్ని తమ సంస్థ సాగిస్తున్నట్టుగా ఆ సంస్థ యజమాని ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే,.. అసలు ఉనికిలోనే లేని పలు రకాల బోగస్ సంస్థల ద్వారా ఐ.టి.సి. సదుపాయాన్ని ఈ సంస్థ అక్రమంగా వాడుకుందని విచారణలో తేలింది. నిందితుడైన సంస్థ యజమానిని 2017వ సంవత్సరపు సి.జి.ఎస్.టి చట్టంలోని సెక్షన్ 69 కింద అరెస్ట్ చేశారు. ఇదే చట్టంలోని సెక్షన్ 132 & కింద నేరానికి పాల్పడినట్టు అభియోగం నమోదు చేశారు. యజమానిని ఫిబ్రవరి 3వ తేదీన బేలాపూర్.లోని వషీలో ఉన్న ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని, 14రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని నవీ ముంబై సి.జి.ఎస్.టి., సెంట్రల్ ఎక్సయిజ్ కమిషనర్ ప్రభాత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
అక్రమ కార్యకలాపాలకు, పన్ను ఎగవేతకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వారిపై గట్టి చర్యలు తీసుకునేందుకు ముంబై జోన్ సి.జి.ఎస్.టి. విభాగం ప్రారంభించిన దాడుల్లో భాగంగా ఈ కేసును నమోదు చేశారు. నవీ ముంబై కమిషరేట్ పరిధిలో అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో రూ. 425కోట్ల మేర పన్ను ఎగవేత కార్యకలాపాలను పసిగట్టారు. ఇందుకు సంబంధించి రూ. 20కోట్లను స్వాధీనం చేసకుని 11మందిని అరెస్ట్ చేశారు.
పన్ను ఎగవేతకు పాల్పడేవారిని గుర్తించేందుకు సి.జి.ఎస్.టి. శాఖ డేటా అనాలసిస్ ఉపకరణాలను వనియోగిస్తోంది. డేటా అనాలిసిస్, నెట్వర్ అనాలిస్ ప్రక్రియల ద్వారా గత ఐదు నెలల కాలంలో 625కి పైగా పన్ను ఎగవేత కేసులను ముంబై జోన్ సి.జి.ఎస్.టి. అధికారులు నమోదు చేశారు. రూ. 5,500కోట్ల మేర పన్ను ఎగవేతను కనుగొన్నారు. రూ. 630కోట్లను స్వాధీనం చేసుకుని 48మందిని అరెస్ట్ చేశారు. నిజాయితీగా పన్ను చెల్లించే వారిని అనారోగ్యకరమైన పోటీకి గురిచేస్తూ, ప్రభుత్వ ఖజనాకు నష్టంకలిగిస్తూ పలు రకాల అక్రమాలకు పాల్పడేవారిని, పన్ను ఎగవేదార్లను పట్టుకునేందుకు రానున్న రోజుల్లో సి.జి.ఎస్.టి. శాఖ తన దాడులను మరింత తీవ్రతరం చేయబోతోంది. |
pib-85118 | b2ea36bbf164c0cfcf8691a65de20fb1b558bae343fbf5b809a3c10f681755aa | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మరియు కంబోడియా ప్రధానమంత్రి గౌరవనీయులు సండెక్ అక్క మోహ సేన పడేయ్ టెకో హున్ సేన్ మధ్య టెలిఫోన్ సంభాషణ.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు కంబోడియా ప్రధానమంత్రి గౌరవనీయులు సండెక్ అక్క మోహ సేన పడేయ్ టెకో హున్ సేన్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.
కోవిడ్-19 మహమ్మారి గురించి ఇరువురు నాయకులు చర్చించారు. ఒకరి దేశంలో చిక్కుకున్న మరొకరి దేశస్థులను వారి స్వదేశాలకు తరలించే ప్రక్రియలో పరస్పరం సహకారాన్ని కొనసాగించాలని వారు అంగీకరించారు.
భారతదేశంతో నాగరిక మరియు సాంస్కృతిక సంబంధాలను పంచుకుంటూ, ఆసియాన్ లో ముఖ్య సభ్యదేశమైన కంబోడియాతో తన సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న భారతదేశ నిబద్ధతను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.
ఐ.టి.ఈ.సి. పధకం కింద సామర్ధ్య నిర్మాణం, మెకాంగ్-గంగా సహకార ఫ్రేమ్ వర్క్ కింద క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులతో సహా ఇరు దేశాల మధ్య నెలకొన్న బలమైన అభివృద్ధి భాగస్వామ్యాన్ని ఇరువురు నాయకులు సమీక్షించారు
భారతదేశంతో తమ దేశానికి ఉన్న సంబంధాల ప్రాముఖ్యతను కంబోడియా ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. కంబోడియా వ్యక్తం చేసిన మనోభావాలకు ప్రతిస్పందిస్తూ, భారతదేశం అవలింబిస్తున్న "యాక్ట్ ఈస్ట్ విధానం" లో కంబోడియా పోషిస్తున్న విలువైన పాత్రను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. |
pib-9522 | 7e282a946a93fbc355cbdaf14f7f58129e9b7b2f950f77ad2562707283850a47 | tel | కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కంపెనీలకు, పరిమిత రుణభార భాగస్వామ్యాలకు కోవిడ్ సడలింపులు
కోవిడ్ సంక్షోభ సమయంలో కంపెనీల మీద, పరిమిత ఋణభార భాగస్వామ్య సంస్థలమీద భారం పడకుండా చూసేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కొన్ని రాయితీలు, మినహాయింపులు, సడలింపులు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ మేరకు లోక్ సభలో ఒక ప్రశ్నకు ఈరోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
తీసుకున్న చర్యలను ఇలా వివరించారు:
30.03.2020 తేదీతో 12/2020 నెంబర్ జనరల్ సర్క్యులర్ జారీచేయటం ద్వారా కంపెనీల తాజా ఆరంభ పథకం ప్రవేశపెట్టటం. దీనివలన కంపెనీలు ఎలాంటి అదనపు ఫీజూ లేకుండా, చట్టపరమైన చర్యలకూ తావులేకుండా డాక్యుమెంట్లు దాఖలు చేసే అవకాశం కల్పించబడింది.
పరిమిత ఋణ భాగస్వామ్య పరిష్కార పథకం, 2020 ప్రవేశపెట్టి సి ఎఫ్ ఎస్ ఎస్ 2020 లోని ప్రయోజనాలనే కల్పించటం
కార్పొరేట్ సంస్థలు బోర్డు, సర్వ సభ్య సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో జరుపుకోవటానికి వెసులుబాటు కల్పిస్తూ జనరల్ సర్క్యులర్ నెం. 14/2020 జారీ
అకౌంటింగ్, ఆడిట్, బదలాయింపు, వాపసు కు సంబంధించి వివిధ డాక్యుమెంట్ల సమర్పణకు 2016 నిబంధనలలోని సెక్షన్ 124, 125 కింద ప్రత్యేక నిబంధనలు ప్రవేశపెట్టటం
2019 మార్చి 31 తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు సర్వసభ్య సమావేసాలు జరుపుకోవటానికి ప్రత్యేక మినహాయింపులు ఇస్తూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుకోవటానికి అనుమతి ఇస్తూ 20/2020 . 28/2020 నెంబర్ల సర్క్యులర్లను 21-04-2020 తేదీతో జారీ చేయటం
కార్పొరేట్ సంస్థలు ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఉపద్రవాల సహాయ కార్యకాలాపాల నిర్వహణ వంటి రంగాలలో సి ఎస్ ఆర్ నిధులు వెచ్చించేందుకు అనుమతి
2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక సర్వసభ్య సమావేశం గడువు ముగిసిన మూడు నెలల తరువాత కూడా జరుపుకోవటానికి పొడిగింపు. దీనివలన 12 లక్షల కంపెనీలకు లబ్ధి. ఇందుకోసం ఎలాంటి దరఖాస్తూ చేసుకోవాల్సిన అవసరం గాని, ఆలస్యపు రుసుకు చెల్లించాల్సిన అవసరం గాని లేకుండా ఒక్కో ఆర్ వో సి 08.09.2020 నాడు ఆదేశాల జారీ |
pib-144081 | 15a4f1c92af4f7efb9c4c930a56f9c409aad12177a5bfd6125a2110f8ddd8da1 | tel | పర్యటక మంత్రిత్వ శాఖ
రెండవ పర్యాటక వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకోసం సాహసోపేత కార్యక్రమాల పర్యాటకం అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమ నిర్వహణ.
నేల, నీరు, ఆకాశం, గాలి అనే నాలుగు అంశాల ఆధారంగా సాహసోపేత కార్యక్రమాల పర్యాటకరంగంలో అనేక అవశాలున్నాయి: శ్రీ జి.కె.రెడ్డి
ప్రపంచ సాహసోపేత కార్యక్రమాల పర్యాటకరంగ పటంలోని అగ్రగామి దేశాల సరసన భారతదేశాన్ని చేర్చడానికి భారతదేశ కృషి : జి.కె.రెడ్డి
కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న జి20 కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటైన రెండవ పర్యాటక రంగ వర్కింగ్ గ్రూప్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఈ సమావేశం సందర్భంగా సాహసోపేత కార్యక్రమాల పర్యాటకరంగంద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపైన ప్రత్యేక ప్రతినిధులతో చర్చను నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కీలక ఉపన్యాసం ఇచ్చారు.
ఈ సమావేశానికి విచ్చేసిన అతిథులకు సంప్రదాయ జానపద కళాకారులు స్వాగతం పలికారు. బ్రిటన్ , మెక్సికో, కెనడా, జర్మనీ, జపాన్, బ్రెజిల్‌తోపాటు పలు అంతర్జాతీయ పర్యాటక సంస్థల ప్రతినిధులు అడ్వెంచర్ టూరిజం చర్చలో పాల్గొన్నారు. భారతదేశాన్నించి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రతినిధులు ఈ చర్చలో పాల్గొన్నారు.
సాహసోపేత కార్యక్రమాల పర్యాటకరంగాన్ని ఎలా ప్రోత్సహించాలి, దేశ విదేశాల్లో పరిస్థితులు ఎలా వున్నాయి తదితర అంశాలను ఇందులో చర్చించారు.
ఈ సందర్భంగా కీలక ఉపన్యాస మిచ్చిన కేంద్ర సాంస్కృతి,పర్యాటకశాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి నేల, నీరు, ఆకాశం, గాలి అనే నాలుగు అంశాల ఆధారంగా భారతదేశంలో అనేక సాహసోపేత కార్యక్రమాలను నిర్వహించడానికిగాను పలు అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. హిమాలయాల్లో 70శాతం భారతదేశంలోనే వున్నాయని, 7 వేల కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం భారత్ సొంతమని, 70 వేల కిలోమీటర్ల ఇసుక ఎడారి భారతదేశంలో వుందని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. కుఛ్, లద్దాహ్ లలోని ప్రత్యేక అటవీ ప్రాంతాలతోపాటు ఏడువందల అభయారణ్యాలు, జాతీయ పార్కులు, పులుల సంరక్షణ కేంద్రాలు భారత్ లోవున్నాయని మంత్రి వివరించారు.
భారతదేశంలో అడ్వెంచర్ టూరిజానికి దేశీయంగాను, విదేశీయులనుంచి చక్కటి ఆదరణ లభిస్తోందని కేంద్రమంతి తెలిపారు. వివిధ వయో వర్గాలకు చెందిన ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆయా రకాల సాహసోపేత పర్యాటక కా్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు.
వివిధ రకాల సాహసోపేత కార్యక్రమాలను ప్రోత్సహించడానికిగాను, వాటిపట్ల అవగాహన పెంచడానికిగాను కేంద్రప్రభుత్వం పలు రకాల విధానపరమైన, వ్యూహాత్మకమైన నిర్ణయాలను తీసుకొని అమల్లో పెడుతోందని కేంద్రమంత్రి అన్నారు. పర్యాతారోహణ, క్యాంపుల ఏర్పాటు, బంగీ జంపింగ్, ట్రెక్కింగ్, స్కీయింగ్, స్కూబా డైవింగ్, అడవుల్లో సఫారీ యాత్రలు నిర్వహిస్తున్నామన్నారు.
పర్యావరణ సంరక్షణకోసం సుస్థిరమైన జీవనవిధానంతో కూడిన మిషన్ లైఫ్ లక్ష్యాల సాధనకోసం భారతదేశం కట్టుబడి వుందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులను ప్రోత్సహించడానికిగాను యూత్ టూరిజం క్లబ్బులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వీటిద్వారా విద్యార్థుల్లో తగిన చైతన్యం తెస్తున్నామని భారతదేశ పర్యావరణం, సాంస్కృతిక, ఆధ్యాత్మకి వారసత్వం గురించి తెలియజేస్తూ వారిని బాధ్యతాయుతంగా వుండేలా తయారు చేస్తున్నామని అన్నారు. అడ్వెంచర్ టూరిజం విభాగంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆయా పర్యాటక ప్రాంతాల నిర్వహణకు ఆర్ధిక సాయం, నైపుణ్య మానవనరుల తయారీ, భద్రత కల్పించడం, పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలు, బ్రాండింగ్ మొదలైన అంశాల మీద దృష్టిపెట్టామని అన్నారు.
జాతీయ స్థాయిలో అడ్వెంచర్ పర్యాకరంగంపైనా వ్యూహాత్మక విధానాన్ని తయారు చేశామని దాని ద్వారా ఈ రంగంలోని పలు అంశాలపైన దృష్టి పెట్టామని అన్నారు. ఆయా ప్రాంతాలకు ర్యాంకులివ్వడం, చట్టాల అమలు, భారీ స్థాయిలో కార్యక్రమాలు, మార్గదర్శకాలు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రక్షించే బృందాలు, ప్రత్యేకమైన వెబ్ సైట్, సోషల్ మీడియా పేజీల తయారీ మొదైలనవాటిపైన ఆయన మాట్లాడారు.
సాహసోపేత కార్యక్రమాల పర్యాటకరంగంలో ప్రపంచంలోనే భారతదేశం ముందుభాగంలో వుండేలా మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలను నెలకొల్పుతున్నామని మంత్రి వివరించారు.
ఈ సందర్భంగా జి20 ప్రధాన సమన్వయకర్త శ్రీ హర్ష శ్రింగాలా మాట్లాడుతూ ప్రకృతికి దగ్గరగా సుస్థిర పద్ధతుల్లో నివసిస్తున్న ప్రజలను ఈ కార్యక్రమాలద్వారా చూడవచ్చని వారి గురించి తెలుసుకోవచ్చని అన్నారు. దేశంలోని ఆయా పర్యాటక ప్రాంతాలను సందర్శించే జి 20 ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లోని పర్యాటక సామర్థ్యం గురించి తెలుసుకుంటారని అన్నారు.
భారతదేశ అభివృద్ధికి వాణిజ్యం, సాంకేతికత రంగాలతోపాటు పర్యాటక రంగం దోహదం చేస్తుందని ప్రధాని పదే పదే చెబుతున్నారని శ్రీ హర్ష శ్రింగాలా అన్నారు. వాతావరణ పరంగా తీసుకున్నప్పుడు భారతదేశానికి ఖండానికి వుండాల్సిన లక్షణాలున్నాయని అపారమైన పర్యాటక సామర్థ్యం భారత్ సొత్తని అన్నారు.
సాహసోపేత కార్యక్రమాల పర్యాటక పరంగా భారతదేశ విశేషాలను వివరించారు. జి20 అధ్యక్షస్థానంలో వున్న భారతదేశం ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదాన్ని వినిపిస్తోందని అన్నారు.
పలు సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో జి20 స్థాయిలో జరుగుతున్న చర్చలు ప్రపంచదేశాలకు ఉపయోగపడతాయని శ్రీ శ్రింగాల అన్నారు.
ముగింపు ప్రసంగం చేసిన పర్యాటక రంగ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ 2030 నాటికి సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు అడ్వెంచర్ పర్యాకరంగ చర్చలు దోహదం చేస్తాయని అన్నారు.
ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న ప్రతినిధులు సాహసోపేత కార్యక్రమాల పర్యాటక రంగ విజయాలు, విధానాలు, అవకాశాల గురించి లోతుగా చర్చించారు.
సిలిగురిలో ఏర్పాటు చేసిన రెండవ పర్యాటక వర్కింగ్ గ్రూప్ సమావేశంలో 130మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఈ సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధులకోసం పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బాల్ పాటలు, గిరిజన నృత్యాలు, సంప్రదాయా తప్పా నృత్యం, తమాంగ్ జానపద నృత్యం, చాహు నృత్యం, భారత సైనికుల పైప్ బ్యాండ్ మొదలైన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.
ఆయుష్ మంత్రిత్వశాఖ సమన్వయంతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
స్థానిక కళల్ని, కళారంగ ఉత్పత్తుల్ని ఈ సమావేశ ప్రతినిధులకు పరిచయం చేయడం జరుగుతుంది. కేంద్ర పర్యాటకశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా షాపులు నెలకొల్పుతారు. ప్రతినిదులు స్వయంగా పాల్గొని ఆయా కళాఖండాల తయారీ అనుభవాన్ని పొందుతారు. దీనికోసం డూ ఇట్ యువర్ సెల్ఫ్..మీకై మీరు తయారు చేయండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డార్జలింగ్ లోని హిమాలయా పర్వతారోహణ కేంద్రం తమ సామగ్రిని ప్రదర్శిస్తుంది.
ఈ సమావేశానికి వస్తున్నప్రతినిధులకు ఓడిఓపి జాబితానుంచి ఎంపిక చేసిన జ్ఞాపికలను అందించడం జరుగుతుంది. ఇందులో బుర్ధ్వాన్ జిల్లాకు చెందిన వుడన్ వూల్, బంకూరా జిల్లాకు చెంది డోక్రా జిఐ హక్కు ఫిష్, మాల్డా జిల్లాకు చెందిన బంగ్లాశ్రీ సిల్క్ ప్యాకెట్ స్వ్కేర్ మొదలైనవి వున్నాయి.
ఈ మధ్యకాలంలో సాహసోపేత కార్యక్రమాలకు సంబంధించిన పర్యాటక విభాగానికి ఇంటా బైటా ఆదరణ లభిస్తోంది. దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్ర పర్యాటకశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా దీన్ని రూపొందించారు. ఈ రంగానికి సంబంధించిన పలువురు నిపుణులు తమ అనుభవాలను పంచుకుంటారు. అడ్వెంచర్ టూరిజంకు సంబంధించిన అంతర్జాతీయ, దేశీయ అభిప్రాయాలను వెల్లడిస్తారు.
జి20కి భారతదేశం అధ్యక్షస్థానంలో వుంది. దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించడానికిగాను ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏప్రిల్ 3నుంచి 5వరకు వుంటుంది. అడ్వెంచర్ టూరిజం కింద సుస్థిర అభివృద్ధి విధానాలను వివరిస్తారు. సిలిగురినుంచి ఏప్రిల్ 2న హిమాలయన్ డ్రైవ్ కార్ ర్యాలీని నిర్వహిస్తున్నారు.
గుజరాత్ లోని రాన్ ఆఫ్ కఛ్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 7నుంచి 9వరకూ టూరిజం వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పర్యావరణ హిత పర్యాటకం, డిజిటలీకరణ, నైపుణ్యాలు, పర్యాటకరంగ ఎంఎస్ ఎం ఈలు, పర్యాటక కేంద్ర నిర్వహణ మొదలైన ఐదు అంశాలను చర్చించారు. వాటికి జి20 సభ్యదేశాల ప్రతినిధులు సంఘీభావం పలికారు. రెండవ పర్యాటక వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఐదు ప్రాధాన్యత అంశాలపైన చర్చలుంటాయి. విస్తృతంగా చర్చిస్తారు. తద్వారా పర్యాటక వర్కింగ్ గ్రూప్ అవుట్ కమ్ డాక్యుమెంటును రూపొందిస్తారు. పర్యాటక రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన రోడ్డుమ్యాపును కార్యాచరణ విధానాన్ని తయారు చేస్తారు. ఈ సమావేశాల్లో ట్రావెల్ ఫర్ లైఫ్ కార్యక్రమాన్ని పరిచయం చేస్తారు. మానవత కేంద్ర ప్రపంచీకరణ సాధనకోసం గౌరవనీయులైన ప్రధాని దార్శనికత ప్రకారం ఈ రంగంలో నూతన విధానాలకోసం పర్యాటక వర్కింగ్ గ్రూప్ పని చేస్తోంది.
జి20 అధ్యక్షస్థానంలో వున్న భారతదేశం దేశవ్యాప్తంగా 59 నగరాల్లో 200 సమావేశాలను నిర్వహిస్తున్నారు. భారతదేశ భౌగోళిక, అమూల్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని ఈ నగరాలు చాటుతున్నాయి కాబట్టే వీటిని ఎంపిక చేశారు. |
pib-27430 | 25172b439d452ed6a34552b438b6cf07cf39e4d54fd669a6a86ff8e94bc212c3 | tel | గనుల మంత్రిత్వ శాఖ
2023 జులై 10.7% పెరిగిన ఖనిజ ఉత్పత్తి పదిహేను కీలక ఖనిజాల ఉత్పత్తిలో వృద్ధి
2023 జులైలో, గనులు & క్వారీ రంగం ఖనిజ ఉత్పత్తి సూచిక 111.9 వద్ద ఉంది. జులై 2022 స్థాయితో పోలిస్తే ఇది 10.7 % వృద్ధి. 'ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్' తాత్కాలిక గణాంకాల ప్రకారం, 2023 ఏప్రిల్-జులైలో మొత్తం వృద్ధి, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 7.3%గా ఉంది.
2023 జులైలో కీలక ఖనిజాల ఉత్పత్తి స్థాయిలు: బొగ్గు 693 లక్షల టన్నులు, లిగ్నైట్ 32 లక్షల టన్నులు, సహజ వాయువు 3062 మిలియన్ క్యూ.మీ, పెట్రోలియం 25 లక్షల టన్నులు, బాక్సైట్ 1477 వేల టన్నులు, క్రోమైట్ 280 వేల టన్నులు, రాగి కాన్సెన్ట్రేట్ 10 వేల టన్నులు, బంగారం 102 కిలోలు, ఇనుప ఖనిజం 172 లక్షల టన్నులు, లెడ్ కాన్సెన్ట్రేట్ 30 వేల టన్నులు, మాంగనీస్ ఖనిజం 217 వేల టన్నులు, జింక్ కాన్సెన్ట్రేట్ 132 వేల టన్నులు, సున్నపురాయి 346 లక్షల టన్నులు, ఫాస్ఫోరైట్ 120 వేల టన్నులు, మాగ్నసైట్ 10 వేల టన్నులు.
2022 జులైతో పోలిస్తే 2023 జులైలో సానుకూల వృద్ధిని చూపిన కీలక ఖనిజాలు: క్రోమైట్ , మాంగనీస్ ఖనిజం , బొగ్గు , సున్నపురాయి , ఇనుప ఖనిజం , బంగారం , రాగి కాన్సెన్ట్రేట్ , సహజ వాయువు , లెడ్ కాన్సెన్ట్రేట్ , జింక్ కాన్సెన్ట్రేట్ , మాగ్నసైట్ , పెట్రోలియం . ప్రతికూల వృద్ధిని చూపిన ఇతర కీలక ఖనిజాలు: లిగ్నైట్ , బాక్సైట్ , ఫాస్ఫోరైట్ , వజ్రాలు . |
pib-106814 | eb998b3ed67a91a964c4db9e160f59fe6c696c10d8cb2eeb4d00b3d8fd2eb6aa | tel | యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆగస్టు 12 న విజ్ఞాన్ భవన్లో 22 మంది అవార్డు గ్రహీతలకు 2017-18 మరియు 2018-19 జాతీయ యువ పురస్కారాలను ప్రదానం చేస్తారు.
మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ S.O.L.V.E.D ఛాలెంజ్ విజేతలకు అవార్డులు అందజేస్తారు
ప్రధానాంశాలు:ఎన్‌వైఎ 2017-18కు 14 అవార్డులు మరియు ఎన్‌వైఎ 2018-19కు 8 అవార్డులు ఇవ్వబడతాయిఈ అవార్డులో ఒక పతకం, ఒక సర్టిఫికేట్‌తో పాటు వ్యక్తులకు రూ .1,00,000/-, సంస్థకు రూ. 3,00,000/ నగదు బహుమతి అందించబడుతుంది.
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ జాతీయ యువ పురస్కారాలను 2017-18 మరియు 2018-19 సంవత్సరాలకు గాను ఆగష్టు 12, 2021 న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రదానం చేస్తారు. ఎంటర్ప్రైజ్ ఛాలెంజ్ ఎస్.ఓ.ఎల్.వి.ఈ.డి. 2021 విజేతలను యువజన వ్యవహారాలు & క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రామాణిక్ సన్మానిస్తారు.
వ్యక్తిగత మరియు సంస్థల విభాగాలలో మొత్తం 22 జాతీయ యువత అవార్డులు ఇవ్వబడతాయి. ఎన్‌వైఏ 2017-18 సంవత్సరానికి మొత్తం 14 అవార్డులు ఇవ్వబడతాయి. ఇందులో వ్యక్తిగత విభాగంలో 10 అవార్డులు మరియు ఆర్గనైజేషన్ కేటగిరీలో 4 అవార్డులు ఉంటాయి. ఎన్‌వైఏ 2018-19 సంవత్సరానికి మొత్తం 8 అవార్డులు ఇవ్వబడతాయి, ఇందులో వ్యక్తిగత విభాగంలో 7 అవార్డులు మరియు ఆర్గనైజేషన్ కేటగిరీలో 1 అవార్డులు ఉంటాయి. ఈ అవార్డులో ఒక పతకం, ఒక సర్టిఫికేట్ మరియు వ్యక్తులకు రూ .1,00,000/-, సంస్థకు రూ. 3,00,000/ నగదు బహుమతి అందించబడుతుంది.
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాల విభాగం..వ్యక్తులు మరియు ఆరోగ్యం మరియు అభివృద్ధి మరియు సామాజిక సేవ, మానవ హక్కులు, క్రియాశీల పౌరసత్వం, సమాజ సేవ మొదలైన వివిధ రంగాలలో అద్భుతమైన పని మరియు సహకారం అందించిన వ్యక్తులకు జాతీయ యువ అవార్డులను అందజేస్తుంది.
జాతీయ అభివృద్ధి మరియు సామాజిక సేవా రంగంలో రాణించడానికి యువకులను ప్రోత్సహించడం, సమాజం పట్ల బాధ్యత పెంపొందించడానికి యువతను ప్రోత్సహించడం తద్వారా మంచి పౌరులుగా వారి స్వంత వ్యక్తిగత సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు అందించడం ఈ అవార్డుల లక్ష్యం. సామాజిక సేవతో సహా దేశాభివృద్ధి కోసం యువతతో కలిసి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు చేసిన అత్యుత్తమ పనికి ఈ అవార్డు ఒక గుర్తింపును అందిస్తుంది.
యునైటెడ్ నేషన్స్ వాలంటీర్స్ మరియు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సహకారంతో యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2020 లో సాల్వ్డ్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. భారతదేశంలోని గ్రామీణ, అర్బన్ మరియు పట్టణ ప్రాంతాల్లోని యువతలో వినూత్న మరియు యువ తృత్వంలోని వ్యవస్థాపక పరిష్కారాలను గుర్తించడానికి మరియు పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. భారతదేశంవ్యాప్తంగా 850 మందికి పైగా యువత దరఖాస్తు చేసుకున్నారు మరియు అనేక రౌండ్ల పోటీలు మరియు శిక్షణ తర్వాత 10 మంది విజేతలను జమ్మూ & కాశ్మీర్, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుండి ఎంపిక చేశారు. |
pib-210843 | 33597548069148ad11aa5277717782049bdbd54ec5792be1709eaa0f8fd2b834 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
డిఆర్‌డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లాబరేటరిస్ అయిదింటి ని దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
డిఆర్‌డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లాబరేటరిస్ అయిదింటి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బెంగళూరు లోని డిఫెన్స్ రిసర్చ్ ఎండ్ డివెలప్ మెంట్ ఆర్గనైజేశన్ లో దేశ ప్రజల కు ఈ రోజు న అంకితం చేశారు.
డిఆర్‌డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లాబరేటరిస్ లు అయిదు నగరాల లో ఏర్పాటయ్యాయి. ఆ నగరాలు.. బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్‌కాతా మరియు హైదరాబాద్. ప్రతి ఒక్క ప్రయోగశాల ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, కాగ్నిటివ్ టెక్నాలజీస్, అసిమెట్రిక్ టెక్నాలజీస్, ఇంకా స్మార్ట్ మెటీరియల్స్ ల వంటి భవిష్యత్తు లో అనుసరించదగ్గ రక్షణ వ్యవస్థ లను అభివృద్ధి పరచడం కోసం ప్రాముఖ్యం కలిగిన ఒక కీలకమైన అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని ఆవిష్కరించడం గురించి కృషి చేస్తుంది.
ఈ తరహా ప్రయోగశాల లను ఏర్పాటు చేయాలన్న ప్రేరణ 2014వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీ న జరిగిన డిఆర్‌డిఒ పురస్కార కార్యక్రమ సందర్భం లో స్వయం గా ప్రధాన మంత్రి నుండే లభించింది. శ్రీ నరేంద్ర మోదీ అప్పట్లో యువజనుల కు సాధికారిత ను కల్పించవలసింది గా డిఆర్‌డిఒ కు సూచన చేశారు.
PMO India
✔@PMOIndia
Watch Live! https://twitter.com/narendramodi/status/1212720616844881920 …
Narendra Modi
✔@narendramodi
Addressing a programme at DRDO in Bengaluru. Watch. https://www.pscp.tv/w/cN3hNDMyMjExNTJ8MUJkeFlld2JPYnZ4WCXUvtyXzQlqbTqWikCX5ri8cRJQycOB8V-SolGJDdJh …
1,011
6:35 PM - Jan 2, 2020
Twitter Ads info and privacy
263 people are talking about this
అందుకు గాను వారి కి సవాళ్ళ తో కూడిన పరిశోధన సంబంధిత అవకాశాల ను మరియు నిర్ణయాల ను చేసేటటువంటి అధికారాల ను ఇవ్వాలని ఆయన అన్నారు.
ఈ సందర్భం గా ప్రధాన మంత్రి తన ప్రసంగ క్రమం లో, దేశం లో ఆవిర్భవించే సాంకేతిక పరిజ్ఞాన రంగం లో పరిశోధన మరియు అభివృద్ధి తాలూకు ఆకృతి ని మలచడం లో ఈ ప్రయోగశాల లు సహాయకారి కాగలుగుతాయన్నారు.
ఒక క్రొత్త దశాబ్ది కి స్థిరమైనటువంటి మార్గసూచీ ని రూపొందించవలసింది గా శాస్త్రవేత్తల ను ప్రధాన మంత్రి కోరారు. అటువంటి నూతన దశాబ్ది లో డిఆర్‌డిఒ భారతదేశం లోని వివిధ రంగాల లో శాస్త్ర పరిశోధన లకు వేగాన్ని మరియు దిశ ను నిర్దేశించే స్థితి లో ఉండాలి అని ఆయన అన్నారు.
శాస్త్రవేత్తల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతదేశం యొక్క క్షిపణి కార్యక్రమం ప్రపంచం లోని విశిష్ట కార్యక్రమాల లో ఒక కార్యక్రమం గా ఉందన్నారు. ఆయన భారత అంతరిక్ష కార్యక్రమాన్ని మరియు వాయు రక్షణ వ్యవస్థ లను కూడా ప్రశంసించారు.
విజ్ఞానశాస్త్ర పరిశోధన రంగం లో భారతదేశం వెనుకబడి ఉండజాలదని ప్రధాన మంత్రి అన్నారు. జాతీయ భద్రత కోసం అవసరమైన నూతన ఆవిష్కరణ లు మరియు సాంకేతిక పరిజ్ఞానాల కోసం కాలాన్ని వెచ్చించగలిగేలా శాస్త్రవేత్తల సముదాయం తో కలసి అదనపు కృషి చేయడం లో పాలు పంచుకోవడానికి ప్రభుత్వం సిద్ధం గా ఉందని ఆయన తెలిపారు.
మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ను పటిష్ట పరచడం లోను, అలాగే దేశం లో ఒక హుషారైన రక్షణ రంగాన్ని ప్రోత్సహించడం లోను డిఆర్‌డిఒ యొక్క నూతన ఆవిష్కరణ లు ఒక ప్రధానమైన పాత్ర ను పోషించగలవు అని ఆయన అన్నారు.
.
డిఆర్‌డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లా బ్స్ ను అయిదింటి ని ఏర్పాటు చేయడం తో భావి తరాల లో అనుసరించదగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడం మరియు తత్సంబంధిత పరిశోధనలు చేయడం కోసం పునాది ని వేసినట్టు అవుతోంది. భారతదేశాన్ని స్వయంసహాయ దేశం గా తీర్చిదిద్దే లక్ష్యం నుండి రక్షణ సంబంధిత సాంకేతిక విజ్ఞాన పరం గా భావి అవసరాల కు తగినది గా ఉండేటట్లు ఒక పెద్ద ముందడుగు ను డిఆర్‌డిఒ వేసే విధం గా ఈ ప్రయోగశాల ల స్థాపన దోహదపడుతుంది.
శరవేగం గా మార్పుల కు లోనవుతున్నటువంటి ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ రంగం లో పరిశోధన ను బెంగళూరు లో చేపడుతారు. అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి క్వాంటమ్ టెక్నాలజీ రంగం లో పరిశోధన లు ఐఐటి ముంబయి కేంద్రం గా సాగుతాయి. భవిష్యత్ కాలం కాగ్నిటివ్ టెక్నాలజీస్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రంగం లో పరిశోధన కు నడుం బిగించే ప్రయోగశాల కు ఐఐటి చెన్నై నిలయం గా ఉంటుంది. యుద్ధాలు చేసే పద్ధతుల ను మార్చివేయగలిగినటువంటి అసిమెట్రిక్ టెక్నాలజీస్ సంబంధిత పరిశోధన లకు కోల్‌కాతా లోని జాదవ్ పుర్ యూనివర్సిటీ ప్రాంగణం కేంద్ర స్థానం గా ఉంటుంది. ఇక, స్మార్ట్ మెటీరియల్స్ మరియు వాటి వినియోగ పద్ధతులు అనేవి మరొక అత్యంత కీలకమైన రంగం గా ఉంది. ఈ రంగం లో పరిశోధన ను హైదరాబాద్ ముఖ్య స్థానం గా చేపట్టడం జరుగుతుంది.(Visitor Counter : 260 |
pib-13655 | 0e3666fb1c139ef8997ffd6cdc044b60782f413f0597de2a3da4001c7e23e82f | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆరోగ్యంపై భారత్-అమెరికా డైలాగ్ -2021
4వ భారత్-అమెరికా హెల్త్ డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
"మన రెండు దేశాల మధ్య సహయోగం- సైంటిఫిక్ ఆవిష్కారణ, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగంలో ఎదురయ్యే సవాళ్ల నిర్వహణను మరింత ముందుకు తీసుకెళ్తుంది": డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు తమ మంత్రిత్వ శాఖలో భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన 4 వ ఇండో-యుఎస్ హెల్త్ డైలాగ్ ప్రారంభ సెషన్లో ప్రసంగించారు.
యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ లో గ్లోబల్ అఫైర్స్ కార్యాలయం డైరెక్టర్ శ్రీమతి లాయిస్ పేస్ ఈ సంభాషణ కోసం యుఎస్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆసియా మరియు పసిఫిక్, యుఎస్ డిపార్ట్మెంట్ లో గ్లోబల్ అఫైర్స్ కార్యాలయం డైరెక్టర్ శ్రీమతి మిచెల్ మెక్కానెల్ పాల్గొన్నారు. డాక్టర్ మిచెల్ వోల్ఫ్, శ్రీమతి డయానా ఎం. బెన్సైల్ కూడా దీనిలో హాజరయ్యారు.
అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ, మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రెండు దేశాల మధ్య ఆరోగ్య రంగంలో కొనసాగుతున్న బహుళ సహకారాలపై చర్చించడానికి రెండు రోజుల డైలాగ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ దశ చర్చల కోసం ప్రణాళిక చేసిన అంశాల ప్రకారం ఎపిడెమియోలాజికల్ పరిశోధన మరియు నిఘా, వ్యాక్సిన్ అభివృద్ధి, వన్ హెల్త్, జూనోటిక్ మరియు వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు, ఆరోగ్య వ్యవస్థలు మరియు ఆరోగ్య విధానాలు మొదలైన వాటిని బలోపేతం చేయడానికి సంబంధించిన సమస్యలను కలిగి ఉంటాయి.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇరుపక్షాల మధ్య పరస్పర సంఘీభావాన్ని మంత్రి ఈ కార్యక్రమం ముందుంచారు. ఇక్కడ ఇరుపక్షాలు తమ నిరంతర మద్దతును అందించాయి. కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి యుఎస్ ఆధారిత ఏజెన్సీలతో సహకరించే భారతీయ వ్యాక్సిన్ కంపెనీలలో కనిపించే ఔషధాలు, చికిత్సలు, వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించి పరిశోధన, అభివృద్ధిలో భారతదేశం మరియు యుఎస్ సహకారాన్ని మెరుగుపరిచిన తీరును ఆమె ప్రశంసించారు.
మానసిక ఆరోగ్యంపై 2020 లో సంతకం చేసిన అవగాహన ఒప్పందాన్ని గుర్తు చేసిన మంత్రి, ఇరు దేశాల మధ్య ఆరోగ్య రంగంలో మెరుగైన సహకారాన్ని మరియు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినట్లు వివరించారు. భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అమెరికా ఆరోగ్య మరియు మానవ సేవల శాఖ మధ్య మరో అవగాహన ఒప్పందం ఖరారు అయింది. ఆరోగ్య భద్రత వంటి సమస్యలను కవర్ చేసే సహకారానికి సంబంధించిన ప్రధాన అంశాలు మరియు భద్రత; అంటువ్యాధులు మరియు అంటువ్యాధులు కాని వ్యాధులు; హెల్త్ సిస్టమ్స్; మరియు ఆరోగ్య విధానం.
ప్రపంచ ఆరోగ్య ముప్పుల ముందస్తు శాస్త్రీయ ఆవిష్కరణ మరియు నిర్వహణలో సహాయపడటానికి దేశాల మధ్య బాగా రూపొందించిన మరియు ధృవీకరించబడిన శాస్త్రీయ విధానాల ప్రస్తావన వచ్చింది. అంటు వ్యాధులను నివారించడానికి మరియు నియంత్రించడానికి ఈ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని డాక్టర్ పవార్ పునరుద్ఘాటించారు. ఆవిష్కరణల ద్వారా ఆరోగ్య వ్యవస్థల అసమానతలపై పోరాడటానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగం కలిసి పనిచేయాలని, ఆ సామర్థ్యాలను మిళితం చేయాలని కూడా ఆమె స్పష్టం చేశారు.
భారతదేశం, అమెరికాలోని బహుళ ఏజెన్సీలతో ఆరోగ్య ఎజెండాలో భాగస్వామ్య పరిధిని విస్తృతం చేయడానికి ఉపయోగపడే వివరణాత్మక చర్చల కోసం పాల్గొనే వారందరికీ ఈ వేదిక ఒక అవకాశాన్ని అందిస్తుందని ఆమె తెలిపారు. |
pib-274300 | d636eaf51b5d31b50e95ed85711e64d28a24af6308685cb40be39e3d3779648e | tel | పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశంలో పర్యావరణ అనుకూల ఇంధనాన్ని వినియోగిస్తున్న 86 విమానాశ్రయాలు
55 విమానాశ్రయాల మొత్తం ఇంధన వినియోగంలో పర్యావరణహిత ఇంధన వాటా 100%
పునరుత్పాదక / పర్యావరణహిత వినియోగంపై నిరంతరం దృష్టిని సారిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు
దేశవ్యాప్తంగా 86 విమానాశ్రయాలు పర్యావరణ అనుకూల ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాయి. విమానాశ్రయాల మొత్తం ఇంధనం వినియోగంలో 55 విమానాశ్రయాలకు పర్యావరణ అనుకూల ఇంధనం వినియోగ వాటా 100% ఉంది. ఈ విమానాశ్రయాల జాబితా అనుబంధంలో జతపరచడమైంది.
ఏది ఏమైనప్పటికీ, సాంప్రదాయ ఇంధన వనరులను ఉపయోగించడం విమానాశ్రయాలలో కార్బన్ ఉద్గారానికి ప్రధాన వనరుగా ఉంది. అందువల్ల పునరుత్పాదకం కాని ఇంధనానికి బదులుగా పర్యావరణ అనుకూల ఇంధనాన్ని అందించడం విమానాశ్రయం కార్బన్ జాడలను తగ్గించడంలో సహాయపడుతోంది.
కనుక, ఎంఒసిఎ షెడ్యూల్డ్ కార్యకలాపాలతో కూడిన అన్ని కార్యాచరణ విమానశ్రయాలు, నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను నిర్మిస్తున్నవారు పర్యావరణ అనుకూల ఇంధనంతో కర్బన తటస్తను & నెట్ జీరోను సాధించే దిశగా పని చేయాలని సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు నిరంతరం పునరుత్పాదక/ పర్యావరణ అనుకూల ఇంధనాన్ని ఉపయోగించడంపై నిరంతరం దృష్టి పెడుతున్నాయి. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్ కార్యక్రమం ప్రకారం హీత్రూ, బ్రిస్టల్, యునైటెడ్ కింగ్డమ్ లోని లండన్ గాట్విక్, నెదర్లాండ్స్ అమ్‌స్టర్‌డామ్, గ్రీసులో ఏథెన్స్, నార్వేలోని ఓస్లో, బెల్జియంలోని బ్రుసెల్స్, హంగరీలోని బుడాపెస్ట్, డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్, యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ డీగో, కెనెడాలోని వాంకూవర్, యునైటెడ్ ఎమిరైట్స్‌లోని షార్జా తదితర విమానాశ్రయాలు పర్యావరణ అనుకూల/ పునరుత్పాదక ఇంధనం సహా పలు చర్యలను తీసుకోవడం ద్వారా కర్బన తటస్తను సాధించాయి.
ఈ సమాచారాన్ని పౌర విమాన యాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె. సింగ్ లోక్‌సభలో గురువారం అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. |
pib-1713 | 7eed66187f6489b661adef1cad14100de2f681f16f63ec6a405b84b74f42bb81 | tel | వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చే ప్లాస్టిక్ పరిశ్రమలో అత్యధిక పనితీరు కనబరిచిన ఎగుమతిదారులను సత్కారం, ముంబైలో 'ఎగుమతి ఎక్సలెన్స్’ అవార్డుల ప్రదానం.
భారతీయ ప్లాస్టిక్ పరిశ్రమ రంగ ఎగుమతులు 4-5 ఏళ్లలో రూ. 3 లక్షల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లు చేరాలన్న సంకల్పం
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు భారతీయ ప్లాస్టిక్ పరిశ్రమ ప్రస్తుత స్థాయి నుంచి రూ. 3 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలకు రూ. 4-5 ఏళ్లలో 10 లక్షల కోట్ల వృద్ధి సాధిస్తుందని, ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి ఇది జాతీయ సేవ అని మంత్రి చెప్పారు; ఇది కనీసం 1 - 1.5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుంది, ఇది దేశ అభివృద్ధికి దోహదమవుతుంది.
ఈరోజు ముంబైలో ప్లాస్టిక్స్ ఎక్స్పోర్ట్ ప్రచార మండలి అపెక్స్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ట్రేడ్ బాడీ 'ఎగుమతి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2017-2021'ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, పరిశ్రమను ఉద్యోగాల కల్పనకు, ముఖ్యంగా ఉద్యోగాల కల్పనకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చే పరిశ్రమగా తాను చూస్తున్నానని కేంద్ర మంత్రి అన్నారు. MSME రంగం, అభివృద్ధి చక్రంలో వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన అనేక మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది.
ప్లాస్టిక్ పరిశ్రమ నాణ్యతకు ప్రమాణంగా ఉద్భవించాలి, పెద్ద గ్లోబల్ మార్కెట్ వాటా దిశగా దాని మార్గాన్ని రూపొందించాలని మంత్రి పిలుపునిచ్చారు.
దిగుమతుల పరిమాణాన్ని తగ్గించి స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని మంత్రి పరిశ్రమకు సూచించారు. 17 బిలియన్ డాలర్ల దిగుమతుల పరిమాణం మనం పట్టుకోవటానికి స్పష్టమైన మార్కెట్ వేచి ఉందని చూపిస్తుంది అని మంత్రి అన్నారు. “వచ్చే 25 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ 7%-8% వృద్ధితో, రాబోయే 4-5 ఏళ్లలో ప్లాస్టిక్ పరిశ్రమ 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మార్చడం సాధ్యమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మనం ఆ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
“ఈ రోజు ప్రపంచం భారతదేశం వైపు చూస్తున్నందున మనం ఇప్పుడు గణనీయమైన వృద్ధిని చూడవలసి ఉంది, ఇది సరఫరా లంకెలలో భాగం. ప్లాస్టిక్ రంగంలో భారతదేశానికి అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్నాయి; మేము ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పోటీని ఎదుర్కొనగలం" అని శ్రీ గోయల్ జోడించారు.
పరిశ్రమ పెద్దగా ఆలోచించి తమ ముద్రను ప్రపంచమంతా విస్తరించాలని మంత్రి కోరారు. "మేము ఇటీవల సంతకం చేసిన అరబ్ దేశాలు- ఆస్ట్రేలియా ఉచిత వాణిజ్య ఒప్పందాలు మీకు సమకాలీన రంగాలలో అవకాశాలను కలిగిస్తాయి, అయితే మనం అంతర్జాతీయ ప్రమాణాలను స్వీకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది, కాబట్టి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో పైపై ఎక్కువ వాటాను ఎలా పొందవచ్చో చూడండి" అని అన్నారు.
గోయల్ ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిన ఆవశ్యకత నొక్కి చెప్పారు. సాంకేతికతను ఆధునికరించాలని, కార్యక్రమాల స్థాయిని పెంచాలని పరిశ్రమకు తన విజ్ఞప్తిని మంత్రి పునరుద్ఘాటించారు. “మన ఉత్పత్తులన్నీ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉండకూడదు; దీర్ఘకాలంలో పరిశ్రమను నిలబెట్టడంలో సహాయపడే అధిక నాణ్యత ప్రమాణాలను మనం స్వీకరించాల్సిన సమయం ఇది. నిర్మాణ,ఆరోగ్య, సంరక్షణ రంగాల వంటి రంగాలు ప్లాస్టిక్ పరిశ్రమకు చాలా అవకాశాలను అందిస్తాయి; ఆటోమొబైల్ రంగం, విమాన రంగాలలో ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో ప్లాస్టిక్లు సహాయపడతాయని మంత్రి జోడించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉటంకిస్తూ, పరిశ్రమ విదేశీ ఆశయాలను సాధించేందుకు విదేశీ మిషన్ల సహాయాన్ని మంత్రి హామీ ఇచ్చారు. "వాణిజ్యం, సాంకేతికత, పర్యాటక రంగాలను వారి కీలక పనితీరు సూచిక లో భాగంగా చూడాలని మా ప్రధానమంత్రి మా విదేశీ మిషన్లను ఆదేశించారు; స్థానిక వ్యాపారాలతో మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి మా మిషన్ హెడ్లందరూ మీకు మద్దతు ఇవ్వడానికి, సులభతరం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు.
ఈ రంగంలో సుస్థిరత కోసం గాలిస్తూ, భారతీయులకు పర్యావరణ స్పృహ ఉందని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. “ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం, రీసైకిల్ చేయడం, పునర్వినియోగం చేయడం వంటి మార్గాలను రూపొందించడం చాలా ముఖ్యం, తద్వారా అది మన పర్యావరణ వాస్తవం తో గందరగోళం చెందదు. ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయడం, తిరిగి ప్రాసెస్ చేయడం గురించి మనం తీవ్రంగా ప్రయత్నించాలి; ఒకసారి మనం దీన్ని చేయగలిగితే, అది ప్లాస్టిక్‌లను ఉపయోగించడంపై ప్రతికూలతను గణనీయంగా తగ్గిస్తుంది.
కోవిడ్-19 సమయంలో, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొనసాగుతున్న ప్రపంచ పరిస్థితులలో సవాళ్లతో కూడిన లక్ష్యాలను సాధించడం కోసం పరిశ్రమలను ముఖ్యంగా ప్లాస్టిక్ పరిశ్రమను మంత్రి అభినందించారు. |
pib-165168 | dd86b6a11317e589fb6d180978b68fea2fdd99368d2636f8353e918e2b37ecf1 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన - ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం "ఎక్స్" సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశం ఇస్తూ,
“ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని, యు.పి. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కలిశారు." అని పేర్కొంది. |
pib-234888 | 95d1f6a7cfa640e05a8e75327196579531b0528c302eb31964fca4161b50b2d6 | tel | ఆర్థిక మంత్రిత్వ శాఖ
మణిపూర్ పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలను పూర్తి చేసిన 4వ రాష్ట్రం,
రూ.75 కోట్ల అదనపు రుణసమీకరణకు అనుమతి మంజూరు
పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలను పూర్తి చేసిన 4 రాష్ట్రాలకు రూ.7,481 రూపాయాల
అదనపు రుణసమీకరణకు అనుమతి మంజూరు
2020 మే 17న రాష్ట్రాలకు రాసిన లేఖలో ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన “పట్టణ స్థానిక సంస్థలు ” సంస్కరణలను విజయవంతంగా చేపట్టిన దేశంలో 4 వ రాష్ట్రంగా మణిపూర్ నిలిచింది. అందువల్ల ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా రూ .75 కోట్ల ఆర్థిక వనరులు అదనపు సమీకరణకు రాష్ట్రం అర్హత సాధించింది. . దీనికి అనుమతి 2021 జనవరి 11 న ఖర్చుల శాఖ జారీ చేసింది. ఈ సంస్కరణను పూర్తి చేసిన మణిపూర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణ సరసన చేరింది.
సంస్కరణలు పూర్తి చేసినందుకు, ఈ నాలుగు రాష్ట్రాలకు అదనంగా రూ.7,481 కోట్లు అదనపు రుణసమీకరణకు అనుమతి లభించింది. ఆ రాష్ట్రాల వివరాలు:
ఆంధ్రప్రదేశ్: రూ.2,525 కోట్లు
మధ్యప్రదేశ్: రూ.2,525 కోట్లు
మణిపూర్: రూ.75 కోట్లు
తమిళనాడు: రూ.2,508 కోట్లు
పట్టణ స్థానిక సంస్థలలో సంస్కరణలు మరియు పట్టణ వినియోగ సంస్కరణలు రాష్ట్రాల్లో యుఎల్‌బిల ఆర్ధిక బలోపేతం, మెరుగైన ప్రజారోగ్యం, పారిశుధ్య సేవలను అందించడానికి వీలు కల్పిస్తాయి. ఆర్థికంగా పునరుజ్జీవింపబడిన యుఎల్బిలు మంచి పౌర మౌలిక సదుపాయాలను కూడా సృష్టించగలవు.
ఈ లక్ష్యాలను సాధించడానికి ఖర్చుల విభాగం నిర్దేశించిన సంస్కరణలు:
యుఎల్‌బిలలోని ఆస్తి పన్ను యొక్క ఫ్లోర్ రేట్లను రాష్ట్రాలు నోటిఫై చేస్తాయి, ఇవి ప్రస్తుత సర్కిల్ రేట్లతో అనుగుణంగా ఉంటాయి నీటి సరఫరా, డ్రైనేజీ, మురుగునీటి పారుదల ఫ్లోర్ రేట్లు ప్రస్తుత ఖర్చులు / గత ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబిస్తాయి.
ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆస్తిపన్ను / వినియోగదారు ఛార్జీల ఫ్లోర్ రేట్లను క్రమానుగతంగా పెంచే వ్యవస్థను రాష్ట్రం అమలు చేస్తుంది.
కోవిడ్-19 మహమ్మారి సవాళ్లను ఎదుర్కోవటానికి అవసరమైన వనరుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం 2020 మే 17 న రాష్ట్రాల రుణ పరిమితిని వారి స్థూల రాష్ట్రాల దేశీయ ఉత్పత్తి లో 2 శాతం పెంచింది. ఈ ప్రత్యేక పంపిణీలో సగం రాష్ట్రాలు పౌరుల కేంద్రీకృత సంస్కరణలను చేపట్టడానికి అనుసంధానించబడ్డాయి. ప్రతి రంగంలో సంస్కరణలు పూర్తయిన తర్వాత జిఎస్‌డిపిలో 0.25 శాతానికి సమానమైన అదనపు నిధులను సేకరించడానికి రాష్ట్రాలకు అనుమతి లభిస్తుంది. సంస్కరణల కోసం గుర్తించిన నాలుగు పౌర-కేంద్రీకృత ప్రాంతాలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థ అమలు, వ్యాపార సంస్కరణ చేయడం సులభం, పట్టణ స్థానిక సంస్థ / వినియోగ సంస్కరణలు మరియు విద్యుత్ రంగ సంస్కరణలు.
ఇప్పటివరకు 10 రాష్ట్రాలు ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు వ్యవస్థను అమలు చేశాయి, 7 రాష్ట్రాలు సులభతర వ్యాపార సంస్కరణలు పూర్తిచేశాయి. 4 రాష్ట్రాలు స్థానిక సంస్థ సంస్కరణలను చేశాయి. సంస్కరణలు చేసిన రాష్ట్రాలకు ఇప్పటివరకు జారీ చేసిన మొత్తం అదనపు రుణ అనుమతి రూ .54,265 కోట్లు.
(Visitor Counter : 123 |
pib-249472 | 623f2e0f40ece68d4e2690c2d9ccb19b21029ac08d905791c37793d4dfdc9731 | tel | నౌకారవాణా మంత్రిత్వ శాఖ
సాగరమాల - ఏడేళ్ల అద్భుతమైన విజయం
పోర్ట్‌లలో నాణ్యమైన సర్వీస్ డెలివరీ టర్నరౌండ్ సమయం 2013-14లో 44.70 గంటల నుండి 26.58 గంటలకు తగ్గింది
నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ మరియు ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ కోసం కుదిరిన ఒప్పందాలు
సాగరమాల మొబైల్ యాప్‌ను ప్రారంభించిన కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్
కోస్టల్ మరియు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ కార్గో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు
రో-రో/రో-పాక్స్ టెర్మినల్ ద్వారా వాటర్ టాక్సీలు మరియు క్రూయిజ్ టెర్మినల్స్ ప్రాధాన్యతలో ఉన్నాయి
ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ విజయవంతమైన ఏడు సంవత్సరాల సాగరమాల కార్యక్రమ జ్ఞాపకార్థం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. గత 7 సంవత్సరాలలో ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ సాధించిన ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించడం ఈ ఈవెంట్ యొక్క ముఖ్యాంశం. సాగరమాల యొక్క మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర మంత్రి, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ శ్రీ సర్బానంద సోనోవాల్ రాష్ట్ర మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్; రాష్ట్ర మంత్రి, శ్రీ శంతను ఠాకూర్; కార్యదర్శి, డా. సంజీవ్ రంజన్ మరియు ఇతర సీనియర్ అధికారులు మరియు ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, ఓడరేవుల సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సాగరమాల కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. నాణ్యమైన సర్వీస్ డెలివరీ కారణంగా 2013-14లో 44.70 గంటల నుంచి ఓడరేవుల్లో టర్నరౌండ్ టైమ్ 26.58 గంటలకు తగ్గిందని ఆయన చెప్పారు.
మంత్రిత్వ శాఖ యొక్క రిపోర్ట్ కార్డ్ రూ. 5.48 లక్షల కోట్లు విలువైన 802 ప్రాజెక్ట్‌లను ప్రదర్శిస్తుందని మంత్రి తెలిపారు. సాగరమాల కార్యక్రమం కింద 2035 నాటికి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 194 ప్రాజెక్టులు రూ. 99,000 కోట్లు పూర్తయ్యాయి. మొత్తం 29 ప్రాజెక్టుల విలువ రూ. PPP మోడల్ కింద 45,000 కోట్లు విజయవంతంగా అమలు అవుతున్నాయి. తద్వారా ఖజానాపై ఆర్థిక భారం తగ్గింది. ఇంకా, రూ. 218 ప్రాజెక్టులు ఉన్నాయి. 2.12 లక్షల కోట్లు నిర్మాణంలో ఉన్నాయి మరియు 2 సంవత్సరాలలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇది కాకుండా 390 ప్రాజెక్టులు రూ. 2.37 లక్షల కోట్లు అభివృద్ధి పైప్‌లైన్‌లో ఉన్నాయి.
శ్రీ సోనోవాల్ సాగరమాల కింద అభివృద్ధి చేసిన నైపుణ్య కేంద్రాల గురించి కూడా ప్రస్తావించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ ఇది ప్రారంభం నుండి 50+ కోర్సుల్లో 5000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చింది. IIT మద్రాస్‌లోని నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్, వాటర్‌వేస్ అండ్ కోస్ట్స్ ఓడరేవులు మరియు జలమార్గాలకు సంబంధించి 70కి పైగా పరిశోధన మరియు సాంకేతిక సహాయ ప్రాజెక్టులను నిర్వహించింది. IWAI, షిప్‌యార్డ్‌లు మరియు ఓడరేవులకు పరిశోధన, పరీక్షలు మరియు ప్రయోగాల సౌకర్యాన్ని అందించడానికి IIT ఖరగ్‌పూర్‌లో ఇన్‌ల్యాండ్ మరియు కోస్టల్ మారిటైమ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయబడింది. శిక్షణ కోసం మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇప్పటికే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ మరియు చెన్నై పోర్ట్ అథారిటీల ప్రాంగణంలో పనిచేస్తున్నాయి. ఇందులో 1200 మంది అభ్యర్థులు శిక్షణ పొందారు. అలాగే 35,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు అలంగ్‌లోని సేఫ్టీ ట్రైనింగ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్లో శిక్షణ పొందారు. అదనంగా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్- గ్రామీణ కౌశల్య యోజన సాగరమాల కన్వర్జెన్స్ ప్రోగ్రామ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, తీరప్రాంత జనాభాలో నైపుణ్యం సాధించడానికి, 1,900 మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిందని ఆయన తెలిపారు.
పోర్ట్ కనెక్టివిటీ, ప్రోగ్రామ్ యొక్క మరొక ముఖ్యమైన అంశం దాని పరిధిలో 80 ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది. వీటిలో కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు, కీలకమైన మార్గాల్లో కంటైనర్ల సమర్ధవంతమైన కదలికను ప్రారంభించడానికి సరుకు రవాణా-స్నేహపూర్వక ఎక్స్‌ప్రెస్‌వేలు మరియు వ్యూహాత్మక అంతర్గత జలమార్గాల అభివృద్ధి ఉన్నాయి. తీరప్రాంతం వెంబడి పారిశ్రామిక మరియు ఎగుమతి వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో ఓడరేవు-నేతృత్వంలోని పారిశ్రామికీకరణ చేపట్టబడింది. తీరప్రాంతం వెంబడి ఉన్న 14 కోస్టల్ ఎకనామిక్ జోన్ల ద్వారా ఇది సాకారం అవుతుంది. మరొక ముఖ్యమైన చొరవ, మహారాష్ట్ర ఉత్తర తీరంలో వధావన్ వద్ద కొత్త డీప్ డ్రాఫ్ట్ పోర్ట్ అభివృద్ధి రూపుదిద్దుకుంటోంది. ఈ పోర్ట్ అల్ట్రా లార్జ్ కంటైనర్ వెస్సెల్స్ ని అందిస్తుంది. పోర్ట్ కమ్యూనిటీ సిస్టమ్‌పై దృష్టి సారించి ప్రధాన పోర్ట్‌లను స్మార్ట్ పోర్ట్‌లుగా మార్చడానికి అనేక చర్యలు తీసుకోబడ్డాయి; లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ సర్వీస్; RFID సొల్యూషన్స్; ఎంటర్ప్రైజ్ బిజినెస్ సిస్టమ్స్; డైరెక్ట్ పోర్ట్ డెలివరీ ; డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ ; స్కానర్లు/ కంటైనర్ స్కానర్లు మరియు విధానాలను సులభతరం చేయడం.
ఈ సందర్భంగా ప్రధాన ఓడరేవులు తమ సాగరమాల ప్రాజెక్టులను ప్రదర్శించే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాయి.
పోర్ట్ ఆధునీకరణ & కొత్త ఓడరేవు అభివృద్ధి, పోర్ట్ కనెక్టివిటీ పెంపుదల, ఓడరేవు-నేతృత్వంలోని పారిశ్రామికీకరణ మరియు కోస్టల్ కమ్యూనిటీ అభివృద్ధిని సాధించే లక్ష్యాలతో సాగరమాల కార్యక్రమం మార్చి 2015లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సాధ్యమైన చోట పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ద్వారా సముద్ర ప్రాజెక్టులను అమలు చేయడానికి మొదటి ప్రయత్నంతో ఒక దశలవారీ విధానాన్ని అనుసరించింది. సాంఘిక మరియు ఆర్థిక భాగస్వామ్యాన్ని ఎక్కువగా కలిగి ఉన్న కానీ తక్కువ IRR ఉన్న ప్రాజెక్టులు సాగరమాల కార్యక్రమం కింద నిధుల మద్దతు ద్వారా అమలు చేయబడుతున్నాయి.
పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు, కోస్టల్ బెర్త్ ప్రాజెక్ట్‌లు, రోడ్ & రైల్ ప్రాజెక్ట్‌లు, ఫిషింగ్ హార్బర్లు, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, క్రూయిజ్ టెర్మినల్ మరియు రో-పాక్స్ ఫెర్రీ సర్వీస్‌ల వంటి ప్రత్యేక ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర MoPSW ఏజెన్సీలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. |
pib-233594 | b6a3f001e6b4f5c4cad7a0edfedaff7173b2bf31694e20c98bfa48046255938e | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
యోగ దినాన్ని పాటించవలసింది గా మరియు యోగ ను దైనందిన జీవనం లో ఒక భాగంగా
‘మన దైనందిన జీవనం లో యోగ’ అనే అంశం పై ఒక చిత్రాన్ని ఆయన శేర్ చేశారు
యోగ దినాన్ని జరుపుకోవలసింది గా మరియు దైనందిన జీవనం లో యోగ ను ఒక భాగం గా చేసుకోవలసింది గా ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ‘మన దైనందిన జీవనం లో యోగ’ అనే అంశం పై ఒక చిత్రాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో –
‘‘మరి కొన్ని రోజుల లో, ప్రపంచం అంతర్జాతీయ యోగ దినాన్ని జరుపుకోనుంది. యోగ దినాన్ని జరుపుకోవలసిందిగా మరియు మీ దైనందిన జీవనం లో యోగ ను ఒక భాగం గా మలచుకోవలసిందిగా మీ అందరి కి నేను విప్తి చేస్తున్నాను. అనేక లాభాలు ఉన్నాయి..’’ అని పేర్కొన్నారు. |
pib-6080 | 7949b1ca304f6e399be4406b8c16b2498416091ff444a465e99759abbac3312b | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడిషాలో ఏరియల్ సర్వే తర్వా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వైరస్ పై పోరాటం జరుగుతోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంకా అన్ని ప్రభుత్వ విభాగాలు, దేశ ప్రజలందరూ కలిసి గత రెండు రెండున్నర నెలలుగా అలుపెరగని యుద్ధం చేస్తున్నారు.
(ఇలాంటి సమయంలో మరో ప్రధాన సంక్షోభం పెను తుపాను రూపంలో ముంచుకొచ్చింది. ఇది అందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేసింది. తుపాను ఒడిషానుంచి బెంగాల్ వైపు వెళ్లిన సమయంలో ఒడిషా రాష్ట్రం ఎంతమేరకు ప్రభావితమైందనే విషయం ఆందోళన కలిగిస్తోంది. వ్యవస్థీకృతంగా వున్న సదుపాయాల కారణంగాను, తుపాను పరిస్థితుల్లో ఏం చేయాలనేదానిపై గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన వుండడంవల్ల ఒడిషాలో ప్రాణ నష్టం చాలా తక్కువగా వుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నందుకు ఒడిషా ముఖ్యమంత్రికి, ప్రభుత్వ అధికారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇలాంటి పెను తుపాను వచ్చినప్పుడు ఆస్తి నష్టం అపారంగా వుంటుంది. అయితే పశ్చిమ బెంగాల్ తో పోల్చుకున్నప్పుడు ఒడిషాలో ఆస్తి నష్టం తక్కువగానే వుంది. కానీ తుపాను ఒడిషాను దాటి వెళ్లిపోతున్న సమయంలో తన ప్రతాపాన్ని తీవ్రంగానే చూపింది. ఇది రాష్ట్రానికి సంక్షోభాన్ని మిగిల్చింది. ఇళ్లకు, వ్యవసాయానికి, విద్యుత్ రంగానికి, కమ్యూనికేషన్ వ్యవస్థలకు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం గురించి పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన దగ్గర వున్న ప్రాధమిక సమాచారాన్నంతా నాకు ఇచ్చింది.
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదిక పంపుతుంది. కేంద్ర ప్రభుత్వ టీమ్ త్వరలోనే రాష్ట్రంలో పర్యటన చేస్తుంది. మొత్తం పరిస్థితిని సమీక్షిస్తుంది. ఆ తర్వాత పునరావాస, దీర్ఘకాలిక సహాయ చర్యలను చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి అన్ని విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ పనులను కొనసాగించడం జరుగుతుంది.
తక్షణ అవసరాలకోసం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయాల ముందస్తు సహాయం అందించడం జరుగుతోంది. రాష్ట్రానికి కావలసిన అవసరాల మేరకు, సహాయక చర్యలకు సంబంధించి సంపూర్ణమైన ప్రణాళికలు తయారు చేసుకున్న తర్వాత రాష్ట్రంతో కలిసి కేంద్రం అన్ని విధాలా సహాయం చేస్తుంది. తుపాను సంక్షోభాన్నించి రాష్ట్రాన్ని బైటపడేయడానికి అన్ని విధాలా సహకరిస్తుంది.
థ్యాంక్స్ ఎలాట్! |
pib-175657 | 984ffcaa612b914fc9e46cb2e33f26d96dadc4a491701ccab598c4439258bc02 | tel | ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఐఎఫ్ఎస్ సిఏకి తుది నివేదిక సమర్పించిన ఐఎఫ్ఎస్ సి అంతర్జాతీయ రిటైల్ బిజినెస్ అభివృద్ధి కమిటీ
అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల కేంద్రాల సంస్థ 2020 ఆగస్టు 3వ తేదీన ఐఎఫ్ఎస్ సి అంతర్జాతీయ రిటైల్ వ్యాపారాభివృద్ధి కమిటీని నియమించింది. ఐఎఫ్ఎస్ సిలోఅంతర్జాతీయ రిటైల్ వ్యాపారాల అభివృద్ధిపై అధ్యయనం చేసి ఒక సమగ్ర ప్రణాళిక సూచించడంతో పాటు తనవంతుగా ఏవైనా సలహాలుంటే తెలియచేయడం కోసం నియమించిన ఈ కమిటీ నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇచ్చారు. బ్యాంకింగ్, బీమా సర్వీసులపై కమిటీ ఇప్పటికే రెండు నివేదికలు అందించింది. తాజా నివేదికలో పెట్టుబడి మార్కెట్లపై తన సిఫారసులు అందచేసింది. వీటికి తోడు ఐఎఫ్ఎస్ సి స్థూల అభివృద్ధిపై కూడా కమిటీత తన సిఫారసులు అందచేసింది.
భారతదేశం నుంచి ఫైనాన్షియల్ సర్వీసులు అందించేందుకు గల అవకాశాలు విశేషంగా తెలియచేయడంతో పాటు ఐఎఫ్ఎస్ సి ద్వారా భారత్ ను అంతర్జాతీయ స్థాయికి చేర్చడంపై కూడా కమిటీ సలహాలు అందించింది. వ్యాపారానుకూలతతో పాటు అత్యుత్తమ ప్రమాణాలు ఆచరించి తనను తాను ఒక బెంచ్ మార్క్ గా నిలిపేందుకు వీలుగా ఐఎఫ్ఎస్ సిఏ సువిశాలమైన నియంత్రణ యంత్రాంగాన్ని సమతూకం చేసుకోవాలని ఆ కమిటీ పేర్కొంది.
ఐఎఫ్ఎస్ సిలో అంతర్జాతీయ రిటైల్ వ్యాపారాలను ప్రోత్సహించేందుకు తక్షణ అవకాశాలున్నాయని పేర్కొంటూ అలా చేయడం వల్ల ఎ) ఉపాధికల్పన, బి) భారత్ కు అదనపు వనరుల లభ్యత, సి) మౌలిక వసతుల నిర్మాణానికి అవసరం అయిన నిధుల ఆకర్షణ లక్ష్యాలు నెరవేరతాయని పేర్కొంది.
అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసుల కేంద్రాల చట్టం, 2019 కింద ఐఎఫ్ఎస్ సిఏకు సంక్రమించిన విధుల నేపథ్యంలో ఐఎఫ్ఎస్ సిఏ అభివృద్ధి, నియంత్రణ కోణంలోఅనుసరించగల ద్వంద్వ పాత్రను ఆ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐఎఫ్ఎస్ సి ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక సంస్థలకు అనుకూల వాతావరణం కల్పించడం కోసం ప్రాథమిక సంవత్సరాల్లో ఐఎఫ్ఎస్ సిఏ అభివృద్ధి పాత్ర అత్యంత కీలకమని పేర్కొంది.
“ప్రపంచ మార్కెట్లతో శక్తివంతమైన అనుసంధానత కలిగిన అగ్రశ్రేణి ప్రపంచ ఆర్థిక కేంద్రంగా భారతదేశంలో ఐఎఫ్ఎస్ సిని అభివృద్ధి చేయడం మా విజన్. ప్రపంచ దేశాల నుంచి నిధులు ఆకర్షించడంలో ఐఎఫ్ఎస్ సిని ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో అతి పెద్దదైన భారత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైబడి ఉన్న భారతీయ సంతతి ప్రజలు కీలకంగా నిలుస్తారు” అని ఐఎఫ్ఎస్ సిఏ చైర్మన్ శ్రీ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు.
“సరికొత్త నియంత్రణ వ్యవస్థతో కూడిన ఈ సరికొత్త ఐఎఫ్ఎస్ సి ప్రగతిశీలక నియంత్రణ యంత్రాంగం, అనుకూలమైన పని వాతావరణంతో ఆర్థిక ఉత్పత్తులు, సేవల్లో నవ్యతకు పట్టం కట్టడం ద్వారా సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ గా నిలుస్తుంది. భారతదేశం నుంచి ఆర్థిక సర్వీసులు అనే విధానంతో ఐఎఫ్ఎస్ సి భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా విజన్ కు కూడా కీలకంగా నిలుస్తుంది” అని కమిటీ చైర్మన్ శ్రీ ప్రదీప్ షా అన్నారు.
నివేదిక కార్యనిర్వాహక వివరణ www.ifsca.gov.in ద్వారా అందుబాటులో ఉంటుంది.
ఈ కమిటీ బ్యాంకింగ్, బీమా, పెట్టుబడి మార్కెట్లపై చేసిన కీలక సిఫారసులు...
1. బ్యాంకింగ్ :
- ప్రవాస భారతీయుల ఎల్ఆర్ఎస్ పెట్టుబడులతో పాటు ఐఎఫ్ఎస్ సి బ్యాంకింగ్ యూనిట్ల నుంచి రిటైల్/ వ్యక్తిగత క్లయింట్లకు బ్యాంకింగ్ ఉత్పత్తులు, సొల్యూషన్లు అందించడం ద్వారా రిటైల్ భాగస్వామ్యం పెరిగేందుకు అనుమతించాలి.
- ఐబిఏ ద్వారా విభిన్న భౌగోళిక ప్రాంతాల్లోని విభిన్న మార్కెట్లలో పెట్టుబడులను అనుమతించడం ద్వారా వెల్త్ మేనేజ్ మెంట్ సామర్థ్యాలు అందుబాటులోకి తేవాలి.
- ఐబియులు ఐఎఫ్ఎస్ సి ద్వారా విదేశీ కరెన్సీ క్లియరింగ్ సర్వీసులు అందించడానికి అనుమతించాలి. ఇందుకు వీలుగా ఐఎఫ్ఎస్ సిలో కేంద్రీయ క్లియరింగ్ యంత్రాంగం ఏర్పాటు చేయాలి.
- ఐబియు విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ గా నమోదు కావడానికి అనుమతించడం ద్వారా రూపాయి మారకంలో జారీ చేసే ప్రభుత్వ సెక్యూరిటీలు , కార్పొరేట్ బాండ్లు, ఆమోదనీయయమైప ఇతర రూపాయి మారకం సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలి.
- ఎఫ్ సివై లోని రవాణాకు ముందర, రవాణా అనంతరం వస్తువులపై భారత ఎగుమతిదారులకు రుణం అందించేందుకు ఐబియుకు అనుమతి ఇవ్వాలి.
- ఆసక్తి గల అన్ని సంస్థల కోసం కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసేందుకు ఐబియుకు అనుమతి ఇవ్వాలి.
- లిక్విడిటీ నిష్పత్తి నిర్వహించాల్సిన నిబంధనను తొలగించాలి.
2. బీమా :
- ఐఎఫ్ఎస్ సి ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న బీమా కంపెనీల నుంచి శాశ్వత ప్రవాస భారతీయులు , భారత సంతతి ప్రజలు వ్యక్తిగతంగాను, భారతదేశంలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యుల పేరిట జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేసేందుకు అనుమతించాలి. అలాగే వారు తమకు అనుకూలమైన కరెన్సీలో ప్రీమియం చెల్లించేందుకు అనుమతించాలి.
- ఎన్ఆర్ఐలు, పిఐఓలకు వ్యక్తిగతంగాను, భారతదేశంలో నివశిస్తున్న వారి కుటుంబ సభ్యుల కోసం ఆరోగ్య బీమా ఉత్పత్తులు జారీ చేసేందుకు బీమా కంపెనీలను అనుమతించాలి.
- వ్యాపారాలు విస్తరించుకునేందుకు బీమా కంపెనీలు ఐఎఫ్ఎస్ సిలో అనుబంధ విభాగాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలి.
- ఐఎఫ్ఎస్ సి ఆసియా, ఆఫ్రికాలకు రీ ఇన్సూరెన్స్ కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అనుమతించాలి. మరిన్ని రీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఐఎఫ్ఎస్ సి లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అలాగే ప్రపంచ విమాన పరిశ్రమకు బీమా అందించే కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం కల్పించాలి.
- ఐఎఫ్ఎస్ సిలో మధ్య శ్రేణి విదేశీ రీ ఇన్సూరెన్స్ కంపెనీలు కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు నికర స్వంత నిధుల నిబంధన కింద కనీస నిధుల పరిమాణం రూ.500 కోట్ల కన్నా తగ్గించాలి.
- విదేశాల్లో బీమా కార్యకలాపాలను ప్రోత్సహించడానికి వీలుగా భారతీయ ఇన్వెస్టర్లు తక్కువ మూలధనంతో డైరెక్ట్, రీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనుమతించాలి.
- విస్తారమైన బీమా మార్కెట్ అందుబాటులోకి తేవడానికి వీలుగా విదేశీ రీ ఇన్సూరెన్స్ బ్రోకర్లు ఐఎఫ్ఎస్ సిలో కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలి.
3. ఆస్తుల నిర్వహణ, పెట్టుబడి మార్కెట్లు :
- ఎల్ఆర్ఎస్ రూట్ లో ఐఎఫ్ఎస్ సి ద్వారా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్లు , మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు దేశీయంగా నివశిస్తున్న భారతీయులకు అనుమతి ఇవ్వాలి.
- ఎల్ఆర్ఎస్ రూట్ లో ఐఎఫ్ఎస్ సిలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎక్స్చేంజిల్లో లిస్టింగ్ అయిన కంపెనీల్లో దేశీయంగా నివశిస్తున్న భారతీయులు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలి.
- ఐఎఫ్ఎస్ సి నుంచి ఈక్వటీ లేదా రుణపత్రాల జారీకి విదేశీ, భారతీయ కంపెనీలను అనుమతించేందుకు అవసరం అయిన నిబంధనావళి రూపొందించాలి.
- బ్యాంకులు ప్రత్యేక కంపెనీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థల ద్వారా ట్రేడింగ్/ క్లియరింగ్ సభ్యులుగా పని చేసేందుకు అనుమతించాలి.
- ఐఎఫ్ఎస్ సి ఫండ్ మేనేజర్లు ఇతర అంతర్జాతీయ సంస్థల తరహాలో తేలికపాటి, ఆచరణీయ రక్షిత కేంద్రాలుగా వ్యవహరించేందుకు వీలు కల్పించే విధానాలు అనుసరించాలి.
- ఐఎఫ్ఎస్ సిలో అమెరికన్ డాలర్, ఎఫ్ సివై సెటిల్మెంట్ల కోసం పేమెంట్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి.
- ఐఎఫ్ఎస్ సిలోని ఫండ్ల నిర్వహణకు వయబుల్ క్యాపిటల్ కంపెనీ తరహా హైబ్రిడ్ వ్యవస్థలను అనుమతించాలి.
భారత ప్రభుత్వం శ్రీ ఇంజేటి శ్రీనివాస్ చైర్మన్ గా ఐఎఫ్ఎస్ సిలో అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల అభివృద్ధి, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటుకు ఐఎఫ్ఎస్ సిఏను ఏర్పాటు చేసింది. శ్రీ జి.శ్రీనివాస్ , శ్రీ సిద్ధార్థ సేన్ గుప్తా , శ్రీ శ్యామల్ ముఖర్జీ , శ్రీ ప్రకాశ్ సుబ్రమణియన్ , శ్రీ దీపేష్ షా , శ్రీ నితిన్ జైస్వాల్ ఐఎఫ్ఎస్ సిఏలో ఇతర సభ్యులు.
భారత విదేశీ వ్యాపారాలను గిఫ్ట్ సిటీలోని ఐఎఫ్ఎస్ సి ద్వారా జరిగేలా చూడడంతో పాటు భారత కేంద్రీకృత అంతర్జాతీయ ఆర్థిక సర్వీసులకు గేట్ వేగా అభివృద్ధి చేయడం, లండన్, హాంకాంగ్, సింగపూర్, దుబాయ్ తరహాలో అంతర్జాతీయ ఆర్థిక సర్వీసులకు ప్రపంచ హబ్ గా మార్చడం ఐఎఫ్ఎస్ సి ఏర్పాటు ప్రధాన లక్ష్యం. |
pib-114143 | 7af32d71afd403b7037caa4618db4c89990e9b35fca54fc6454a242f21c4bbdb | tel | నౌకారవాణా మంత్రిత్వ శాఖ
వివిధ పీపీపీ సమస్యల పరిష్కారం కోసం ఎస్సీడీపీఎం 2.0 కార్యక్రమం కింద ‘పీపీపీ సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహణ: అన్ని ప్రధాన నౌకాశ్రయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు పరిష్కరించడానికి మార్గదర్శకాలు జారీ
పీపీపీ సంబంధిత వర్గాల సమస్యలు పరిష్కరించే ప్రధాన మార్గంగా మారిన 'ప్రత్యేక కార్యక్రమం 2.0'
ఓడరేవులకు చెందిన అన్ని టెర్మినల్ ఆపరేటర్ల మధ్య నిర్ణయాత్మక చర్చలు
'పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం' 2.0లో భాగంగా; కేంద్ర నౌకాశ్రయాలు, నౌక రవాణా & జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని ప్రధాన పోర్టులు కార్యశాలలు నిర్వహించాయి. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించడానికి పీపీపీ సంబంధిత వర్గాల కోసం ఈ కార్యశాలలను ఏర్పాటు చేశాయి. సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం, మిగిలిన సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కాలావధి ప్రకటించడం కార్యశాలల నిర్వహణలో ప్రాథమిక లక్ష్యం.
ప్రధాన ఓడరేవుల్లో, పారాదీప్ పోర్ట్ అథారిటీ వివిధ వర్గాలతో పీపీపీ ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించింది. సంబంధిత వర్గాలు/క్యాప్టివ్ బెర్త్ ఆపరేటర్ల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ల సమస్యలను శ్రద్ధగా విన్న పోర్ట్ మేనేజ్మెంట్, వాటిలో చాలా వరకు పరిష్కరించింది.
కాండ్లాలోని దీనదయాళ్ పోర్ట్ అథారిటీ కూడా పీపీపీ ఫిర్యాదుల పరిష్కారం కోసం కార్యశాలను నిర్వహించింది. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, కాండ్లా ఇంటర్నేషనల్ కంటైనర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ వంటి వర్గాలు ఇందులో పాల్గొన్నాయి.
టెర్మినల్ ఆపరేటర్ల కోసం మంత్రిత్వ శాఖ జారీ మార్గదర్శకాల ప్రకారం జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కూడా 'పీపీపీ ఫిర్యాదుల పరిష్కార సమావేశం' నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జేఎన్‌పీఏ చైర్మన్, పీపీపీ నమూనా గురించి వివరించారు. మొర్ముగావ్ పోర్ట్ అథారిటీ కూడా 'పీపీపీ ఫిర్యాదుల పరిష్కార సమావేశం' నిర్వహించింది. టెర్మినల్ ఆపరేటర్లు మెస్సర్స్ ఎస్డబ్ల్యూపీఎల్ , అదానీ మొర్ముగావ్ పోర్ట్ టెర్మినల్ లిమిటెడ్ పాల్గొన్నాయి.
న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ కూడా ప్రత్యేక కార్యక్రమం 2.0లో భాగంగా, ఇప్పటికే ఉన్న పీపీపీ & క్యాప్టివ్ టెర్మినల్/బెర్త్ వర్గాలతో 'పీపీసీ ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం'పై హైబ్రిడ్ వర్క్‌షాపు నిర్వహించింది. ఎన్ఎంపీఏకు చెందిన అందరు విభాగాధిపతులు, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పీపీపీ ఫిర్యాదుల వర్క్‌షాప్ పరిష్కార కార్యక్రమానికి సంబంధిత అన్ని వర్గాలవారు హాజరయ్యారు. ఇక్కడ కూడా వివిధ సమస్యలపై చర్చించారు.
కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయం, తన వాటాదారులతో పీపీపీ సమస్యల పరిష్కార కార్యశాలను నిర్వహించింది. టీఎంఐఎల్ఎల్తో దీర్ఘకాలంగా ఉన్న ఒక సమస్యను ఇక్కడ చర్చించి ఒక ఉమ్మడి పరిష్కారం తీసుకున్నారు. పాల్గొన్నవారిలో, సెంచరీ పోర్ట్స్ లిమిటెడ్ ప్రతినిధి మాట్లాడారు. తాము ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదని, ఒప్పందం కాల పరిమితికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఈ పరిష్కార సమావేశాలన్నీ వివిధ వర్గాల మధ్య విభేదాలను తొలగిస్తాయి, పీపీపీ ప్రాజెక్టుల అమలు వేగాన్ని పెంచుతాయి. తద్వారా మెరుగైన, మరింత సమర్థవంతమైన నౌకాశ్రయ సేవలు అందుబాటులోకి వస్తాయి.
2022 అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు జరిగిన 'పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం' 2.0 మొత్తం గొప్ప స్ఫూర్తిని నింపింది. ఓడరేవులు, నౌక రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రధాన సచివాలయం, అన్ని ప్రధాన ఓడరేవులు, ఇతర అనుబంధ/కింది స్థాయి కార్యాలయాలు స్వచ్ఛత & పెండింగ్ అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాయి. ప్రత్యేక కార్యక్రమం 2.0లో భాగంగా, ఓడరేవులు అనేక 'ఉత్తమ విధానాలు' కూడా అమలు చేశాయి. కార్యాలయ ఆవరణ, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరచడం, అవగాహన కార్యక్రమాలు, దస్త్రాలు & రికార్డుల డిజిటలీకరణ, మొక్కల పెంపకం, ఈ-కార్లు మొదలైనవి మాత్రమేగాక, చాలా నిబంధనలను కూడా సరళీకరించాయి. |
pib-254048 | 933d17257f99bc7bc5d7e93210f5d683f5774c277f9aaeb322260bb091f6a613 | tel | మంత్రిమండలి
సముద్ర సంబంధిత అంశాల పై భారతదేశం మరియు డెన్మార్క్ ల మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
సముద్ర సంబంధిత అంశాల పై భారతదేశానికి, డెన్మార్క్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒప్పంద పత్రం పై 2019వ సంవత్సరం జనవరి లో డెన్మార్క్ నుండి డబ్ల్యుఐపి భారతదేశాన్ని సందర్శించే సందర్భం లో సంతకాలు జరగాలని ప్రతిపాదించడమైంది.
ప్రయోజనాలు
ఈ ఎంఒయు పై సంతకాల తో ద్వైపాక్షిక సహకారాని కి అనుకూలించే రంగాల ను రెండు దేశాలు అన్వేషించేందుకు మార్గం సుగమం కాగలదు :
ఆ రంగాల లో -
భారతదేశం, ఇంకా డెన్మార్క్ ల సముద్ర సంబంధ రంగాల లో పరస్పర సహకారాని కి, ఇంకా పెట్టుబడుల కు బాట వేయడం; శిప్పింగ్ లో ఉభయ దేశాల సామర్ధ్యాన్ని మెరుగు పరచడం కోసం ప్రావీణ్యం, ప్రచురణలు, సమాచారం, డాటా మరియు గణాంకాల ను ఉభయ దేశాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకొనేందుకు వీలు కల్పించడం; గ్రీన్ మారిటైమ్ టెక్నాలజీ రంగం లోను, నౌకా నిర్మాణం లోను సహకరించుకోవడం; ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ శిప్పింగ్ కు రికగ్నైజ్డ్ ఆర్గనైజేశన్ హోదా ను మంజూరు చేయడం, సముద్ర సంబంధిత శిక్షణ మరియ విద్య రంగం లో సహకారం; మర్చంట్ శిప్పింగ్ మరియు సముద్ర సంబంధ రవాణా వ్యవహారాల రంగం లో స్థిర ప్రాతిపదిక కలిగిన సహకారం కోసం పరిశోధన మరియు అభివృద్ధి కి నడుం కట్టడం లతో పాటు
ద్వైపాక్షిక స్థాయి లో, అంతర్జాతీయ స్థాయి లో ఇరు దేశాల కు పరస్పరం ప్రయోజనాలు చేకూరే అవకాశాల ను వినియోగించుకోవడం లో మరింత ఎక్కువ గా సహకరించుకోవడం -
వంటివి ఉంటాయి.
పూర్వరంగం
భారతదేశం తో వ్యాపారం చేస్తున్న భాగస్వామ్య దేశాల లో డెన్మార్క్ ఒక ముఖ్య భాగస్వామి గా ఉంది. డెన్మార్క్ నుండి భారతదేశాని కి ఎగుమతి అవుతున్న సరకుల లో ఔషధ సంబంధ వస్తువులు, విద్యుత్తు ఉత్పాదన యంత్రాంగం, పారిశ్రామిక యంత్ర సామగ్రి, లోహ ఖనిజాలు, సేంద్రియ రసాయనాలు వంటివి ఉన్నాయి. డెన్మార్క్ కు భారతదేశం ఎగుమతి చేస్తున్న సరకుల లో దుస్తులు, వస్త్రాలు/ దారాలు, , రహదారి పై రాకపోకలు జరిపే వాహనాలు మరియు విడి భాగాలు, లోహ వస్తువులు, ఇనుము మరియు ఉక్కు, పాదరక్షలు, యాత్రల లో వినియోగించే వస్తువులు ప్రధానమైనవి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం, అలాగే సముద్ర సంబంధిత రంగం లో సహకారాన్ని, సమన్వయాన్ని ప్రోత్సహించడం కోసం డెన్మార్క్ తో ఒక ద్వైపాక్షిక ఎంఒయు ను కుదుర్చుకోవాలని ప్రతిపాదించడమైంది.
( |
pib-156670 | fe614203c861d417d12d69bca50d9640f3470d8557bf3d9e2e9359fbb5ef0a47 | tel | భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
ఎల్ ఈడి దీపాలకు శక్తిని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రోడ్ ల మధ్య సముద్రపు నీటిని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగించే భారతదేశపు మొట్టమొదటి సెలైన్ వాటర్ లాంతర్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
డీప్ ఓషన్ మిషన్ ఆఫ్ ఇండియా అమలు పురోగతిని సమీక్షించడానికి చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నిర్వహించి, ఉపయోగించిన కోస్టల్ రీసెర్చ్ వెసల్ -సాగర్ అన్వేషిక- ను సందర్శించిన మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
సెలైన్ వాటర్ లాంతరు పేదలకు, , అవసరం లో ఉన్నవారికి, ముఖ్యంగా భారతదేశంలోని 7500 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ వెంబడి నివసిస్తున్న మత్స్యకార సమాజానికి "జీవన సౌలభ్యాన్ని" అందిస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్
ఉప్పునీటితో నడిచే రోషిణి ఎల్ఈడి దీపాలు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజాలా పథకానికి ఊతమిచ్చి, అనుబంధంగా ఉంటాయి.
నౌక పై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని 'హర్ జహాజ్ తిరంగా' వరకు విస్తరించిన డాక్టర్ జితేంద్ర సింగ్
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి , పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశపు మొట్టమొదటి సెలైన్ వాటర్ లాంతర్ ను ప్రారంభించారు, ఇది ఎల్ ఇడి దీపాలకు శక్తిని అందించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలక్ట్రోడ్ ల మధ్య ఎలక్ట్రోలైట్ గా సముద్రపు నీటిని ఉపయోగిస్తుంది.
చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని సాగర్ అన్వేషిక అనే కోస్టల్ రీసెర్చ్ నౌక ను సందర్శించిన సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ రోష్ని పేరుతో మొట్టమొదటి లాంతరును ఆవిష్కరించారు. సెలైన్ వాటర్ లాంతరు
భారత దేశం లోని 7500 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ వెంట నివసిస్తున్న పేదలకు,
అవసరమైన వారికి, ప్రత్యేకించి మత్స్యకార
కమ్యూనిటీకి జీవన సౌలభ్యాన్ని తీసుకు
వస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
దేశవ్యాప్తంగా ఎల్ఈడి బల్బుల పంపిణీ కోసం 2015 లో ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉజాలా పథకానికి సెలైన్ వాటర్ లాంతరు కూడా ఊతం ఇచ్చి అనుబంధం గా ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇంధన మంత్రిత్వ శాఖ సోలార్ స్టడీ ల్యాంప్స్ వంటి పథకాలతో పాటు రోషిణి ల్యాంప్స్ ఇంధన భద్రత, ఇంధన ప్రాప్యత , జాతీయ ఆర్థిక వ్యవస్థ కార్బన్ ఉనికిని తగ్గించే లక్ష్యంతో శక్తివంతమైన పునరుత్పాదక ఇంధన కార్యక్రమాన్ని నడుపుతుందని ఆయన అన్నారు.
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సముద్ర జలాలు అందుబాటులో లేని లోతట్టు ప్రాంతాలలో కూడా ఉపయోగించవచ్చని, ఎందుకంటే ఏదైనా ఉప్పు నీరు లేదా ఉప్పుతో కలిపిన సాధారణ నీటిని లాంతరు ను శక్తివంతం చేయడానికి ఉపయోగించవచ్చని , ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది మాత్రమే గాక, నిర్వహణ కూడా చాలా సులభం అని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు, రోషిణి దీపాన్ని కనుగొన్నందుకు ఎన్‌ఐఓటి బృందాన్ని మంత్రి అభినందించారు. గ్రామీణ ,మారుమూల ప్రాంతాల లోనూ, ఇంకా విపత్తుల సమయంలోనూ అపారమైన సహాయం చేయగల ఈ బహుళ ప్రయోజన దీపాల భారీ ఉత్పత్తి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమకు బదిలీ చేయాలని వారికి సూచించారు.
అనంతరం డాక్టర్ జితేంద్ర సింగ్, ఎంవోఈఎస్ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్ తో కలిసి ప్రయోగశాలలను సందర్శిచారు. ఈ సందర్భంగా 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని 'హర్ జహాజ్ తిరంగా' వరకు విస్తరిస్తూ మంత్రి నౌక పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. నౌకలో ఉన్న ఎన్‌ఐఓటీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలతో సమావేశమైన ఆయన డీప్ ఓషన్ మిషన్ ఆఫ్ ఇండియా అమలు పురోగతిని సమీక్షించారు.
లక్షద్వీప్ దీవుల్లో విజయవంతంగా ప్రదర్శించబడిన సముద్రపు నీటిని త్రాగునీరుగా మార్చడానికి ఎన్‌ఐఓటి అభివృద్ధి చేసిన లో టెంపరేచర్ థర్మల్ డీశాలినేషన్ సాంకేతిక పరిజ్ఞానం పురోగతిని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లోని కవరట్టి, అగటి, మినికాయ్ దీవుల్లో ఎల్ టిటిడి టెక్నాలజీ ఆధారంగా మూడు డీశాలినేషన్ ప్లాంట్లను అభివృద్ధి చేసి ప్రదర్శించినట్లు ఆయన తెలియజేశారు. ఈ ప్రతి ఎల్ టిటిడి ప్లాంట్ రోజుకు లక్ష లీటర్ల త్రాగునీటిని అందించే సామర్థ్యం కలిగి ఉంది.
ఈ ప్లాంట్ల విజయం ఆధారంగా కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమిని, ఆండ్రోత్, చెట్లెట్, కద్మత్, కల్పెని , కిల్టాన్ లలో రోజుకు 1.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో మరో ఆరు ఎల్‌టిటిడి ప్లాంట్లను ఏర్పాటు చేసే పనిని అప్పగించిందని ఎంఒఇఎస్ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్ డాక్టర్ జితేంద్ర సింగ్ కు వివరించారు. ఎల్ టిటిడి టెక్నాలజీ లక్షద్వీప్ దీవులకు అనువైనదిగా కనుగొన్నారు, సముద్ర ఉపరితల నీరు , లోతైన సముద్ర జలాల మధ్య 15⁰ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వ్యత్యాసం ఇప్పటి వరకు లక్షద్వీప్ తీరాల సమీపంలో మాత్రమే గుర్తించారు.
డీశాలినేషన్ ప్లాంట్ కయ్యే ఖర్చు- ఉపయోగించిన టెక్నాలజీ ,ప్లాంట్ లొకేషన్ తో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. లక్షద్వీప్ దీవుల్లోని ఆరు ఎల్ టి టి డి ప్లాంట్ల మొత్తం వ్యయం రూ. 187.75 కోట్లు.
<><><><><>
(Visitor Counter : 147 |
pib-34947 | 581e3e6e68a62163bd93d98d7300483cad9811c969b14c15c9c03e5eca1429bc | tel | ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి – ఇప్పటివరకు సాధించిన ప్రగతి
పిఎంజికెపి పథకం కింద 42 కోట్లకు పైగా పేద ప్రజలు
రూ. 68,820 కోట్ల మేరకు ఆర్థిక సాయం అందుకున్నారు
రూ. 1.70 లక్షల కోట్ల ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజిలో భాగంగా మహిళలు, పేద వృద్ధ పౌరులు, రైతులకు ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలు, నగదు సాయాన్ని ప్రకటించింది. ఈ ప్యాకేజీ త్వరితగతిన అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షించాయి. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద సుమారు 42 కోట్ల మంది పేద ప్రజలు రూ. 68,820 కోట్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందుకున్నారు.
- పిఎం- కిసాన్ పథకంలో 8.94 కోట్ల మంది లబ్దిదారులకు తొలి వాయిదా చెల్లింపుల కోసం రూ. 17,981 కోట్లు ముందుగానే విడుదలయ్యాయి.
- ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాదారుల్లో 20.65 కోట్ల మంది మహిళలకు తొలి వాయిదా కింద రూ. 10,325 కోట్లు ఖాతాలలో జమ అయ్యాయి. రెండో వాయిదా కింద 20.63 కోట్ల మంది మహిళా జన్ ధన్ ఖాతాదారులకు రూ. 10,315 కోట్లు జమ అయ్యాయి. మూడో వాయిదాలో 20.62 కోట్ల మంది కి రూ. 10,312 కోట్లు జమ అయ్యాయి.
- 2.81 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రెండు వాయిదాలలో రూ. 2,814.5 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 2.81 కోట్ల మంది లబ్దిదారులకూ రెండు వాయిదాలలో ప్రయోజనాలు బదిలీ అయ్యాయి.
- భవన & ఇతర నిర్మాణ కార్మికులు 1.82 కోట్ల మంది రూ. 4,987.18 కోట్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందుకున్నారు.
- ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 75.04 కోట్ల మంది లబ్దిదారులకు 2020 ఏప్రిల్ మాసంలో 37.52 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ అయ్యాయి. మే నెలలో 74.92 కోట్ల మందికి 37.46 లక్షల టన్నులు, జూన్ నెలలో 73.24 కోట్ల మంది లబ్దిదారులకు 36.62 లక్షల టన్నులు పంపిణీ అయ్యాయి. ఈ పథకాన్ని ప్రభుత్వం మరో 5 నెలల పాటు పొడిగించింది. అప్పటి నుంచి 98.31 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. జూలైలో 72.18 కోట్ల మంది లబ్దిదారులకు 36.09 లక్షల టన్నులు, ఆగస్టులో 60.44 కోట్ల మందికి 30.22 లక్షల టన్నులు చొప్పున పంపిణీ అయ్యాయి. సెప్టెంబర్ మాసంలో 7వ తేదీవరకు 3.84 కోట్ల మంది లబ్దిదారులకు 1.92 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ అయ్యాయి.
- దీనికి తోడు ప్రధాన మంత్ర గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కిందనే 18.8 కోట్ల మంది లబ్దిదారులకు 2020 ఏప్రిల్, జూన్ మధ్య 5.43 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు పంపిణీ అయ్యాయి. ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం మరో 5 నెలలు పొడిగించింది. ఆ తర్వాత ఇప్పటిదాకా 4.6 లక్షల మెట్రిక్ టన్నుల శెనగలను ప్రభుత్వం క్షేత్ర స్థాయికి పంపించింది. జూలై నెలలో అర్హత గల 10.3 కోట్ల కుటుంబాలకు 1.03 లక్షల మెట్రిక్ టన్నుల శెనగలు పంపిణీ అయ్యాయి. ఆగస్టు నెలలో లబ్దిదారులైన 2.3 కోట్ల కుటుంబాలకు 23,258 టన్నుల మేరకు శెనగలు పంపిణీ అయ్యాయి. సెప్టెంబర్ మాసంలో 7వ తేదీవరకు 15 లక్షల కుటుంబాలకు 1475 టన్నుల శెనగలు పంపిణీ అయ్యాయి. అక్టోబర్ మాసం కోసం 80 వేల కుటుంబాలకు 86 టన్నులు, నవంబర్ మాసం కోసం 40 వేల కుటుంబాలకు 40 టన్నుల మేరకు శెనగలు ఇప్పటికే పంపిణీ అయ్యాయి.
- ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద వలస శ్రామికులకు రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు, శెనగలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రాలు సమర్పించిన గణాంకాల ప్రకారం వలస శ్రామికుల సంఖ్య 2.8 కోట్లుగా అంచనా తేలింది. ఆగస్టు వరకు గడచిన పంపిణీ కాలంలో 5.32 కోట్ల మంది వలస ప్రజలకు 2.67 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఆహార ధాన్యాలు పంపిణీ అయ్యాయి. అంటే సగటున నెలకు 2.66 కోట్ల లబ్దిదారులకు ఆహార ధాన్యాలు అందాయి. ఈ సంఖ్య వలస జనాభా అంచనా మొత్తంలో సుమారు 95 శాతం. అలాగే, ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద 1.64 కోట్ల వలస కుటుంబాలకు 16,417 మెట్రిక్ టన్నుల శెనగలు పంపిణీ అయ్యాయి. సగటున నెలకు 82 లక్షల కుటుంబాలు ఈ సాయం అందుకున్నాయి.
- ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద లబ్దిదారులు మొత్తం 8.52 కోట్ల గ్యాస్ సిలిండర్లు కోరగా... 2020 ఏప్రిల్, మే మాసాల కోసం ఇప్పటికే ఆ మొత్తం పంపిణీ పూర్తయింది. జూన్ మాసంలో 3.27 కోట్ల పిఎంయువై ఉచిత సిలిండర్లు లబ్దిదారులకు పంపిణీ అయ్యాయి. జూలైలో 1.05 కోట్లు, ఆగస్టులో 89 లక్షల సిలిండర్లు పంపిణీ అయ్యాయి. సెప్టెంబర్ మాసంలో ఇప్పటిదాకా 15 లక్షల సిలిండర్లు పంపిణీ అయ్యాయి.
- 36.05 లక్షల మంది ఇపిఎఫ్ఒ సభ్యులు రూ. 9,543 కోట్ల మేరకు తమ ఇపిఎఫ్ఒ ఖాతాల నుంచి తిరిగి చెల్లించనవసరం లేని అడ్వాన్సులను ఆన్ లైన్ ద్వారా ఉపసంహరించుకొని లబ్ది పొందారు.
- 43 లక్షల మంది ఉద్యోగులకు 24 శాతం ఇపిఎఫ్ వాటా కింద రూ. 2476 కోట్లు బదిలీ అయ్యాయి. మార్చి నెలలో 34.19 లక్షల మంది ఉద్యోగులకు 514.6 కోట్ల మేరకు లబ్ది చేకూరింది. ఏప్రిల్ మాసంలో 32.87 లక్షల మంది ఉద్యోగులకు రూ. 500.8 కోట్లు, మే నెలలో 32.68 లక్షల ఉద్యోగులకు రూ. 482.6 కోట్లు, జూన్ నెలలో 32.21 లక్షల ఉద్యోగులకు రూ. 491.5 కోట్లు, జూలైలో 30.01 లక్షల మంది ఉద్యోగులకు రూ. 461.9 కోట్లు, ఆగస్టు నెలలో 1.77 లక్షల మంది ఉద్యోగులకు రూ. 24.74 కోట్లు అందాయి.
- ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎ: పెంచిన రేటు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా నోటిఫై అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 195.21 కోట్ల వ్యక్తి పని దినాల మేరకు పని జరిగింది. వేతనాలు, పరికరాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడానికి గాను రాష్ట్రాలకు రూ. 59,618 కోట్లు విడుదలయ్యాయి.
- జిల్లా ఖనిజ నిధి నుంచి 30 శాతం నిధులను వినియోగించాలని రాష్ట్రాలను కోరడం జరిగింది. ఆ మొత్తం రూ. 3,787 కోట్లు అవుతుంది. ఇప్పటిదాకా రూ. 343.66 కోట్లు ఖర్చు చేశారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ
07/09/2020 వరకు మొత్తం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ
|
|
పథకం
|
|
లబ్దిదారుల సంఖ్య
|
|
నగదు మొత్తం
|
|
పిఎంజెడివై
మహిళా ఖాతాదారులకు మద్ధతు
|
|
1వ వాయిదా - 20.65 కోట్లు
2వ వాయిదా - 20.63 కోట్లు
3వ వాయిదా - 20.62 కోట్లు
|
|
1వ వాయిదా - రూ. 10,325 కోట్లు
2వ వాయిదా - రూ. 10,315 కోట్లు
3వ వాయిదా - రూ. 10,312 కోట్లు
|
|
ఎన్.ఎస్.ఎ.పి కి సాయం
|
|
2.81 కోట్లు
|
|
రూ. 2,814 కోట్లు
|
|
పిఎం- కిసాన్ కింద రైతులకు
ముందస్తు చెల్లింపులు
|
|
8.94 కోట్లు
|
|
రూ. 17,891 కోట్లు
|
|
భవన & ఇతర
నిర్మాణ కార్మికులకు సాయం
|
|
1.82 కోట్లు
|
|
రూ. 4,987 కోట్లు
|
|
ఇపిఎఫ్ఒకి 24 శాతం వాటా
|
|
43 లక్షలు
|
|
రూ. 2,476 కోట్లు
|
|
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన
|
|
1వ వాయిదా - 7.43 కోట్లు
2వ వాయిదా - 4.43 కోట్లు
3వ వాయిదా - 1.82 కోట్లు
|
|
రూ. 9,700 కోట్లు
|
|
మొత్తం
|
|
42.08 కోట్లు
|
|
రూ. 68,820 కోట్లు |
pib-34449 | 9f74e89b44f89122f3475375157f6961ec34ff93f118613c41c432a4f78b5908 | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దాదాపు 12 కోట్లకు చేరిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ
గత 24 గంటలలో 30 లక్షలకు పైగా టీకాలు
79% కొత్త కరోనా కేసులు 10 రాష్ట్రాలనుంచే
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కరోనా టీకాల సంఖ్య దాదాపు 12 కోట్లకు చేరింది.ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 17,37,539 శిబిరాల ద్వారా 11,99,37,641 డొసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్యసిబ్బందికిచ్చిన 91,05,429 మొదటి డోసులు, 56,70,818 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,11,44,069 మొదటి డోసులు, 54,08,572 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడినవారికిచ్చిన 4,49,35,011 మొదటీ డోసులు, 34,88,257 రెండో డోసులు,
45-60 ఏళ్ళ మధ్య వయసున్న వారికిచ్చిన 3,92,23,975 మొదటి డోసులు, 9,61,510 రెండో డోసులు ఉన్నాయి.
|
|
ఆరోగ్య సిబ్బంది
|
|
కొవిడ్ యోధులు
|
|
45-60 ఏళ్ళ మధ్య వారు
|
|
60 ళ్ళు పైబడ్డవారు
|
|
మొత్తం
|
|
|
|
1వడోస్
|
|
2వ డోస్
|
|
1వడోస్
|
|
2వ డోస్
|
|
1వడోస్
|
|
2వ డోస్
|
|
1వడోస్
|
|
2వ డోస్
|
|
|
|
91,05,429
|
|
56,70,818
|
|
1,11,44,069
|
|
54,08,572
|
|
3,92,23,975
|
|
9,61,510
|
|
4,49,35,011
|
|
34,88,257
|
|
11,99,37,641
|
|
ఎనిమిది రాష్ట్రాలలోనే 59.56% వాటా టీకా డోసుల పంపిణీ జరిగింది. .
గడిచిన 24 గంటలలో 30 లక్షలకు పైగా టీకా డోసుల పంపినీ జరిగింది. టీకాల కార్యక్రమం మొదలైన 91 వ రోజైన ఏప్రిల్ 16న
మొత్తం 30,04,544 టీకా డోసులివ్వగా అందులో 22,96,008 మంది లబ్ధిదారులకు 37,817 శిబిరాల ద్వారా మొదటి డోస్,
7,08,536 మందికి రెండో డోస్ ఇచ్చారు.
|
|
తేదీ: ఏప్రిల్ 16, 2021
|
|
ఆరోగ్య సిబ్బంది
|
|
కోవిడ్ యోధులు
|
|
45- 60 ఏళ్ళ మధ్యవారు
|
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
|
మొత్తం
|
|
1వ డోస్
|
|
2వ డోస్
|
|
1వ డోస్
|
|
2వ డోస్
|
|
1వ డోస్
|
|
2వ డోస్
|
|
1వ డోస్
|
|
2వ డోస్
|
|
1వ డోస్
|
|
2వ డోస్
|
|
22,432
|
|
36,184
|
|
8,50,545
|
|
2,55,681
|
|
7,18,862
|
|
26,375
|
|
7,04,169
|
|
3,90,296
|
|
22,96,008
|
|
7,08,536
దేశంలో రోజువారీ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో కొత్తగా 2,34,692 కేసులు నమోదయ్యాయి. పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్ గఢ్, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, తమిళనాడు. రాజస్థాన్ లోనే మొత్తం కేసుల్లో 79.32% కేసులు వచ్చాయి. ఒక్క మహారాష్ట్రలోనే 63,729 కేసులు రాగా ఉత్తరప్రదేశ్ లో 27,360 ఢిల్లీలో 19,486 కేసులు వచ్చాయి.
ఈ క్రింద చూపిన విధంగా పదహారు రాష్ట్రాలలో కొత్త కరోనా కేసులు పెరుగుతోంది.
భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 16,79,740 కి చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 11.56%. దీనివలన
నికరంగా చికిత్సపొందుతున్నవారి సంఖ్య గత 24 గంటలలో 1,09,997 పెరిగింది. ఐదు రాష్టాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ కలిసి 65.02% కేసులవాటా పొందాయి. ఒక్క మహారాష్ట్రలోనే చికిత్సపొందుతున్న వారు దేశం
మొత్తం మీద చికిత్సలో ఉన్నవారిలో 38.09% మంది ఉన్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,26,71,220కాగా కోలుకున్నవారి శాతం 87.23%.
గత 24 గంటలలో 1,23,354 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటలలో 1,341 మంది కోవిడ్ తో చనిపోయారు. ఇందులో
85.83% మంది పది రాష్టాలవారు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 398 మంది, ఢిల్లీలో 141 మంది చనిపోయారు.
గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తొమ్మిది ఉన్నాయి. అవి: లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, సిక్కిం, మిజోరం, మణిపూర్, లక్షదీవులు, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్.
. |
pib-130742 | f76f6eedad8a60a276bc28e13324cfb71fdcfac9a5c87d81b876c216d0acbe1b | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ వారసత్వ పరిరక్షణకు సాగుతున్న కృషిపై ప్రధానమంత్రి ప్రశంసలు
దేశ వారసత్వ పరిరక్షణ కోసం ఎనలేని కృషి కొనసాగుతున్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. ఆ మేరకు భారత వారసత్వాన్ని కాపాడటమే కాకుండా అందంగా తీర్చిదిద్దడానికి తాము కట్టుబడి ఉన్నామని శ్రీ మోదీ అన్నారు. కాగా, ‘ఐజిఎన్‌ఎసిఎ’ ప్రాంగణంలో వేద వారసత్వ పోర్టల్, కళావైభవ్ ను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలియజేసిందని పేర్కొంటూ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ చేసిన ట్వీట్లపై శ్రీ మోదీ ఈ మేరకు స్పందించారు.
వేద వారసత్వ పోర్టల్‌ను హిందీ, ఇంగ్లీషు భాషల్లో రూపొందించినట్లు ఢిల్లీలోని ‘ఐజిఎన్‌సిఎ’ తన ట్వీట్లో తెలిపింది. ఇందులో 18 వేలకుపైగా వేద మంత్రాల దృశ్య-శ్రవణ సారాంశాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.
ఢిల్లీలోని తమ కేంద్రంలో చేపట్టిన తాజా కార్యక్రమాలపై ‘ఐజిఎన్‌సిఎ’ ట్వీట్‌పై ప్రధానమంత్రి స్పందిస్తూ:
“ఇదెంతో అసమాన ప్రయత్నం! దేశ వారసత్వ పరిరక్షణతోపాటు మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
( |
pib-38295 | 1ea685cb9fade5d87007768e766ce8d26b246bb589a6b2fa3154589200db59e7 | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
గత 24 గంటల్లో 81 లక్షలకుపైగా టీకాలను ప్రజలకు ఇచ్చారు.
జాతీయ టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 66.30 కోట్ల టీకాలను ప్రజలకు ఇచ్చారు.
గత 24 గంటల్లో 47,092 కొత్త కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.19%గా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,89,583.
రికవరీ రేటు 97.48%గా నమోదైంది.
గత 24 గంటల్లో కోలుకున్న 35,181 మందితో కలిపి, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,20,28,825కు చేరింది.
వారపు పాజిటివిటీ రేటు గత 69 రోజులుగా 3% కంటే తక్కువ నమోదవుతోంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.80%గా నమోదైంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52.48 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు. |
pib-152074 | 0138dba510251d8e72a2187fcdaec79e5a840414b4822695dbdcc3ca8f862f0e | tel | రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు, అక్షరాల రంగులను స్పష్టంగా తెలియపరిచేందుకు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ
‘వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాహన రిజిస్ట్రేషన్ సంబంధిత
మార్క్‌ల కేటాయింపునకు సంబంధించిన సంగ్రహవలోకనం’ అనే అధ్యాయంలో ఉన్న క్రమరాహిత్యాలను సరిదిద్దేందుకు గాను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, ఈ నెల 14న ఎస్ఓ 2339 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో పట్టిక రూపంలో వివిధ తరగతులు మరియు వాహన వర్గాలకు చెందిన బండ్లకు ఉండాల్సిన రిజిస్ట్రేషన్ ప్లేట్ల రంగు, అక్షరాల రంగులను స్పష్టంగా తెలియజేసింది. వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు, ఆంగ్ల అక్షరాలు సంఖ్యల రంగుల విషయమై మరింత స్పష్టతను ఇచ్చేందుకు మాత్రమే తాజాగా ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అంతేగాని రిజిస్ట్రేషన్ ప్లేట్ల విషయమై సరికొత్త నిబంధనలు ఏవీ ఇందులో సూచించబడలేదు. ఇంతకు ముందు, జూన్ 12వ తేదీ 1989లో
వెలువరించిన మోటారు వాహనాల చట్టం, 1988 లోని ఎస్.ఓ. 444 సెక్షన్ 41 లోని సబ్ సెక్షన్ కింద వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆయా వాహనాల రిజిస్ట్రేషన్‌కు వేర్వేరు గుర్తును మంత్రిత్వ శాఖ సూచించింది. ఆ తరువాత నవంబర్ 11, 1992న మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎస్ఓ 827 నోటిఫికేషన్ ద్వారా వాహన ప్లేట్లపై ఉండే
ఆంగ్ల అక్షరాలు, అంకెలు మరియు వివిధ తరగతులు మరియు వాహనాలను సూచించేలా రిజిస్ట్రేషన్ ప్లేట్లకు రంగులను ఖరారు చేస్తూ కేంద్రం ఎస్.ఓ. 444 నోటిఫికేషన్‌ను సవరించింది. దీనికి తోడు రవాణా మంత్రిత్వ శాఖ
13/12/2001 నాటి జీఎస్ఆర్ 901 ద్వారా రవాణా, రవాణేతర వాహనాల
రిజిస్ట్రేషన్ ప్లేట్ యొక్క రంగును సూచించింది. అయితే ‘వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాహనాలపై రిజిస్ట్రేషన్ గుర్తులు ఒక సంగ్రహావలోకనం’ అనే అధ్యాయంలో జూన్ 12, 1989న ఎస్.ఓ. 444 ద్వారా చేసిన పలు సవరణలు కొన్నింటిని ఆయా ప్రాంతాలలో పరిగణనలోకి తీసుకోకుండా వదలి వేసినట్టుగా మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. దీనివల్ల కొంత అస్పష్టతలు గుర్తించబడ్డాయి. దీంతో ఈ విషయమై మరింతగా స్పష్టతను ఇచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. |
mkb-16 | 75935558ab23d901d7e8654cbecbf0592480f0cd3532a333a67f64d12732d90d | tel | నా ప్రియమైన దేశ ప్రజలారా,
నమస్కారం,
మిత్రులారా, దేశంలోని ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారి గురించి కూడా ఇవాళ్టి మన్ కీ బాత్ లో నేను మాట్లాడబోతున్నాను. మన దేశప్రజలందరి మనసుల్లోనూ వారి పట్ల ఎంతో గౌరవము, అభిమానము ఉన్నాయి. మన దేశంలో ఆమె పట్ల ఆప్యాయత, గౌరవము లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరేమో. వయసులో ఆవిడ మనందరి కన్నా ఎంతో పెద్దావిడ. దేశ చరిత్రలోని ఎన్నో మైలురాళ్ళకు, రకరకాల కాలాలకు ఆవిడ సాక్షి. మనం ఆవిడని దీదీ(అక్కయ్య) అంటాము – ఆమె “లతా దీదీ”(లత అక్కయ్య). ఈ సెప్టెంబర్ 28 నాటికి ఆవిడకి తొంభై ఏళ్ళు నిండాయి. విదేశీ ప్రయాణానికి వెళ్ళే ముందర నాకు దీదీతో మాట్లాడే అవకాశం లభించింది. ఒక చిన్న తమ్ముడు తన అక్కయ్యతో గారంగా మాట్లాడినట్లే ఆ సంభాషణ నడిచింది. ఇలాంటి వ్యక్తిగత సంభాషణల గురించి నేనెప్పుడూ మాట్లాడను కానీ ఇవాళ మీరు కూడా లతా దీదీ మాటలను, మా సంభాషణనూ వినాలని నేను కోరుకుంటున్నాను. ఈ వయసులో కూడా లతా దీదీ దేశంతో ముడిపడి ఉన్న ఎన్నో విషయాల పట్ల ఎంత ఉత్సుకతతో ఉన్నారో, తయారుగా ఉన్నారో మీరూ వినండి. భారతదేశ ప్రగతిలో, మారుతున్న భారతదేశంలో, నూతన శిఖరాలను అందుకుంటున్న భారతదేశంలోనే జీవన సంతోషం దాగి ఉంది మరి!
మోదీగారు: లతాదీదీ, నమస్కారం! నేను నరేంద్ర మోదీ ని మాట్లాడుతున్నాను.
లత గారు: నమస్కారం.
మోదీగారు: నేను ఫోన్ ఎందుకు చేసానంటే, ఈసారి మీ పుట్టినరోజునాడు..
లత గారు: ఆ.. చెప్పండి..
మోదీగారు: నేను విమాన ప్రయాణంలో ఉంటాను.
లత గారు: అలానా !
మోదీగారు: అందుకని బయల్దేరే ముందరే –
లత గారు: ఆ.. చెప్పండి..
మోదీగారు: మీకు అనేకానేక ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాను. మీ ఆరోగ్యం బాగుండాలి. మా అందరికీ మీ ఆశీస్సులు అందాలి. ఇదే నా ప్రార్థన. మీకు ప్రణామాలు తెలపాలనే అమెరికా వెళ్ళే ముందరే నేను మీకు ఫోన్ చేశాను.
లత గారు: మీ ఫోన్ వస్తుందని తెలిసి నేనెంతో ఆశ్చర్యపోయాను. మీరు ఎప్పుడు తిరిగివస్తారు?
మోదీగారు: 28వ తేదీ అర్థరాత్రి దాటాకా 29వ తేదీ తెల్లవారుఝామున. అప్పటికి మీ పుట్టినరోజు అయిపోతుంది.
లత గారు: ఓహో, అలానా. పుట్టినరోజు జరిపుకునేదేమీ లేదు. ఏదో ఇంట్లోనే..
మోదీగారు: చూడండి దీదీ, నాకు మీ..
లత గారు: మీ ఆశీర్వాదం దొరికితే..
మోదీగారు: అయ్యో, మీరు నా కన్నా పెద్దవారు కాబట్టి మీ ఆశీర్వాదాన్నే మేము కోరుకుంటున్నాం.
లత గారు: వయసులో పెద్దవారు చాలామందే ఉంటారు. కానీ ఎవరైతే తన పనుల వల్ల పెద్దవారౌతారో, వారి ఆశీర్వాదం లభించడం ఎంతో గొప్ప విషయం.
మోదీగారు: దీదీ మీరు వయసులోనూ పెద్దవారే. మీరు చేసిన పనుల వల్లా పెద్దవారే. మీరు సాధించిన సాఫల్యాలు ఎంతో సాధన వల్ల, తపస్సు వల్ల లభిస్తాయి.
లత గారు: అవునండీ, ఇదంతా మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, శ్రోతల ఆశీర్వాదం వల్ల సాధ్యమైంది. నా వల్ల జరిగినదేమీ లేదు.
మోదీగారు: జీవితంలో మీరు ఇంత సాధించిన తర్వాత కూడా మీ తల్లిదండ్రులు అందించిన సంస్కారానికీ, వినమ్రతకీ ఎల్లప్పుడూ ప్రాముఖ్యతనివ్వడం మాకెంతో స్ఫూర్తిదాయకం. మీరు చూపే ఈ వినయమే మావంటి కొత్త తరాలవారికి, అందరికీ కూడా నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం. ఇది మా అందరికీ ఎంతో ప్రేరణాత్మకమైన సంగతి.
లత గారు: ఊ..
మోదీగారు: మీ తల్లిగారు గుజరాతీ అని మీరు గర్వంగా చెప్పినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది.
లత గారు: ఊ..
మోదీగారు: నేను ఎప్పుడు మీ వద్దకు వచ్చినా మీరు నాకు ఏదో ఒక గుజరాతీ వంటకాన్నే తినిపించారు.
లత గారు: ఔను. మీరేమిటనేది మీకు తెలీదు. కానీ నాకు తెలుసు. మీ రాక వల్ల భారతదేశం ముఖచిత్రమే మారిపోతోంది. అదే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది.
మోదీగారు: చాలు దీదీ. మీ ఆశీర్వాదం ఇలానే ఉండాలి. యావత్ దేశానికీ మీ ఆశీర్వాదం కావాలి. మాలాంటివారు ఏదో ఒక మంచి చేస్తూ ఉండాలి. మీరు నాకెప్పుడూ ప్రేరణని అందిస్తూనే ఉన్నారు. మీ ఉత్తరాలు నాకు అందుతూ ఉంటాయి. మీరు ఎప్పుడూ పంపించే ఏవో ఒక బహుమతులు నాకు అందుతూ ఉంటాయి. ఈ ఆత్మీయత, ఒక కుటుంబంలాంటి అనుబంధం నాకెంతో ఆనందాన్ని ఇస్తాయి.
లత గారు: నేను మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టకూడదనుకుంటాను. ఎందుకంటే, మీరెంత బిజీగా ఉంటున్నారో, మీకు ఎంత పని ఉంటోందో నేను గమనిస్తున్నాను. ఎంతగానో ఆలోచించాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి మీ అమ్మగారి పాదాలంటి ఆశీర్వాదం తీసుకుని వచ్చాకా, నేను కూడా ఆవిడ వద్దకు ఎవరినో పంపించి, ఆవిడ ఆశీర్వాదాలను అందుకున్నాను.
మోదీగారు: అవును అమ్మకు గుర్తు ఉంది. నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పింది.
లత గారు: టెలీఫోన్ లో ఆవిడ నాకు ఆశీస్సులు అందించినప్పుడూ నాకు చాలా ఆనందం కలిగింది.
మోదీగారు: మీరు చూపిన ఈ అభిమానానికి అమ్మ చాలా ఆనందించింది.
లత గారు: అవును.
మోదీగారు: నా గురించి మీరిలా ఎప్పుడూ ఆదుర్దాపడుతున్నందుకు కృతజ్ఞతలు. మరోసారి మీకు అనేకానేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
లత గారు: అలాగే.
మోదీగారు: ఇటీవల ముంబై వచ్చినప్పుడు మిమ్మల్ని ముఖాముఖి కలవాలని చాలా అనుకున్నాను.
లత గారు: తప్పకుండా.. మరి రాలేదు..
మోదీగారు: సమయం లేక నేను రాలేకపోయాను.
కానీ త్వరలో నేను తప్పకుండా వస్తాను.
లత గారు: అలాగే.
మోదీగారు: మీ ఇంటికి వచ్చి , మీ చేతులతో చేసిన కొన్ని గుజరాతీ వంటకాలు తింటాను.
లత గారు: అలాగే తప్పకుండా. తప్పకుండా. ఇది నా అదృష్టంగా భావిస్తాను.
మోదీగారు: నమస్కారం దీదీ.
లత గారు: నమస్కారం.
మోదీగారు: మీకు అనేకానేక శుభాకాంక్షలు
లత గారు: అనేకానేక ప్రణామాలు.
మోదీగారు: నమస్కారం.
నా ప్రియమైన దేశప్రజలారా, నవరాత్రి తో పాటుగా ఇవాళ్టి నుంచీ పండుగల వాతావరణం మరోసారి కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో, కొత్త సంకల్పాలతో నిండిపోతుంది. పండుగల కాలం కదా! రాబోయే కొన్ని వారాల వరకూ దేశవ్యాప్తంగా పండుగల వెలుగు ఉంటుంది. మనందరమూ కూడా నవరాత్రి ఉత్సవాలు,గర్బా, దుర్గా పూజ, దసరా, దీపావళి, భగినీ హస్త భోజనం, ఛత్ పూజ, వంటి ఎన్నో పండుగలను జరుపుకుంటాము. రాబోయే పండుగలన్నింటీకీ, మీ అందరికీ నా తరఫున అనేకానేక శుభాకాంక్షలు. పండుగ సమయానికి కుటుంబసభ్యులందరూ కలుస్తారు. ఇళ్ళన్నీ ఆనందంతో, కేరింతలతో నిండిపోయి ఉంటాయి. కానీ మీరు గమనించే ఉంటారు, మన చుట్టుపక్కల కూడా, ఈ పండుగల ఆనందాన్ని అందుకోలేనివారు చాలామంది ఉంటారు. దీనినే “దీపం క్రింద చీకటి” అంటారు. ఈ సామెత కేవలం అక్షరాలకే పరిమితం కాదు. ఇది మనందరికీ ఒక ఆదేశం. ఒక సాక్షాత్కారం. ఒక ప్రేరణ. ఆలోచించండి. ఒక పక్క కొన్ని ఇళ్ళు వెలుగులతో నిండి ఉంటే, మరో పక్క వారి ఎదురుగానే కొన్ని చుట్టుపక్కల ఇళ్ళల్లో చీకటి నిండి ఉంటుంది.
కొన్ని ఇళ్ళల్లో మిఠాయిలు పాడయిపోతూ ఉంటే, కొన్ని ఇళ్ళల్లో పిల్లలు మిఠాయిల కోసం తపిస్తారు. కొన్ని చోట్ల అలామారాల్లో బట్టలు పెట్టడానికి చోటే ఉండదు. కొన్నిచోట్ల శరీరాన్ని కప్పేందుకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్నే కదా “దీపం క్రింద చీకటి” అంటారు? ఇదే “దీపం క్రింద చీకటి” అంటే! ఇలాంటి చీకట్లు తొలగినప్పుడే ఈ పండుగల నిజమైన ఆనందాన్ని మనం ఆస్వాదించగలం. చీకటి తొలగి వెలుగు నిండాలి. ఆనందాలు లేని చోట మనం ఆనందాన్ని నింపాలి. ఇదే మన స్వభావం కావాలి. మన ఇళ్ళల్లోకి మిఠాయిలూ, బట్టలు , బహుమతులు వచ్చినప్పుడు ఒక్క క్షణం వాటిని బయటకు పంచే మార్గాన్ని కూడా ఆలోచించాలి. కనీసం మన ఇళ్ళల్లో అధికంగా ఉన్న వస్తువులు, మనకు అవసరం లేని వస్తువులు అయినా తప్పకుండా పంచిపెట్టే అలవాటు చేసుకోవాలి. ఎన్నో పట్టణాల్లో, ఎన్నో ఎన్.జీ.వోలు యువ మిత్రుల స్టార్ట్ అప్స్ ఇటువంటి పనులు చేస్తున్నాయి. వాళ్ళు ప్రజల వద్ద నుండి బట్టలు, స్వీట్లు, భోజనం లాంటివి సమీకరించి అవసరార్థులను వెతికి వెతికి, వారికి ఈ వస్తువులన్నీ చేరుస్తారు. ఈ పనులన్నీ గుప్తంగా కూడా చేస్తారు. ఈసారి ఈ పందుగ సమయంలో పూర్తి అవగాహనతో, సంకల్పంతో ఈ ” దీపం క్రింద చీకటిని ” తొలగించగలమా? ఎన్నో పేద కుటుంబీకుల మొహాలపై మీరు పూయించే చిరునవ్వులు పండుగల్లో మీ ఆనందాన్ని రెండింతలు చెయ్యగలదు. మీ మోము మరింతగా మెరవగలదు. మీ ప్రమిద మరింత ప్రకాశవంతంగా మారగలదు. మీ దీపావళి మరింత వెలుగులను నింపగలదు.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా, దీపావళికి అదృష్టము, సమృధ్ది రూపాలలో లక్ష్మి ఇంటింటికీ వస్తుంది. సంప్రదాయపరంగా లక్ష్మిని స్వాగతిస్తారు. ఈసారి మనం కొత్త రకంగా లక్ష్మిని స్వాగతిద్దామా? మన సంస్కృతిలో ఆడపడుచులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. ఎందుకంటే ఆడపిల్ల అదృష్టాన్నీ, సమృధ్ధినీ తెస్తుంది. ఈసారి మనం మన సమాజంలో , పల్లెల్లో, పట్టణాల్లో ఆడబిడ్డలను గౌరవించే కార్యకమం ఏర్పాటు చేద్దామా? ఇటువంటి ఒక సార్వజనిక కార్యక్రామం ఏర్పాటు చేద్దామా? తమ కష్టంతో, పట్టుదలతో, ప్రతిభతో కుటుంబానికీ, సమాజానికీ, దేశానికీ పేరుని తీసుకువస్తున్న ఎందరో ఆడబిడ్డలు మన మధ్య ఉండే ఉంటారు. ఈ దీపావళికి అటువంటి లక్ష్ములను గౌరవించే ఈ కార్యక్రమం మనం చేయగలమా? అసాధారణమైన పనులు చేస్తున్న ఎందరో ఆడపడుచులూ, కోడళ్ళూ మన చుట్టూ ఉండే ఉంటారు. కొందరు నిరు పేద విద్యార్థులకు చదువు చెప్పే బాధ్యతను చేపడతారు. పరిశుభ్రత, ఆరోగ్యాలపై దృష్టి పెట్టి జాగురుకతని పంచే దిశలో కొందరుంటే; డాక్టర్లు, ఇంజనీర్లు గా మారి సమాజానికి సేవ చేసేవారు కొందరు, వకీలుగా మారి ఎవరికో న్యాయం చేసేందుకు పాటుపడేవారు కొందరు. మన సమాజం ఇటువంటి ఆడబిడ్డలను గుర్తించి, గౌరవించి, గర్వపడాలి. దేశవ్యాప్తంగా ఈ గౌరవ కార్యక్రమాలు జరగాలి. మనం మరో పనిని కూడా చేయగలం – ఈ ఆడబిడ్డల విజయాలను గురించి సోషల్ మీడియాలో షేర్ చేయండి, హేష్ టాగ్ #(Hashtag) ఉపయోగించిండి, #bharatkilaxmi (భారత లక్ష్మి) అని రాయండి. మనందరమూ కలిసి “సెల్ఫీ విత్ డాటర్” అనే మహా ఉద్యమాన్ని నడిపాము గుర్తుందా? అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు కూడా అలానే మనం “భారత లక్ష్మి” ఉద్యమాన్ని చేపడదాం. భారత లక్ష్మి ని ప్రోత్సహించడం అంటే దేశమూ, దేశ ప్రజల శ్రేయస్సు మార్గాలని మరింత బలోపేతం చేయడమే.
నా ప్రియమైన దేశప్రజలారా, మన్ కీ బాత్ వల్ల ఎంతో గొప్ప ప్రయోజనం ఉందని నేనింతకు మునుపు కూడా చెప్పాను. దీని వల్లనే ఎందరో పరిచిత, అపరిచిత వ్యక్తులతో ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ మాట్లాడే అదృష్టం నాకు లభిస్తోంది. కొద్ది రోజుల క్రితం నాకు ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన అలీనా తాయంగ్ అనే విద్యార్థిని నుంచి చాలా ఆసక్తికరమైన ఉత్తరం వచ్చింది. అందులో ఏం ఉందో , ఉత్తరాన్ని మీకు కూడా చదివి వినిపిస్తాను ..
“గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారూ,
నా పేరు అలీనా తాయంగ్. అరుణాచల్ ప్రదేశ్ లోని రోయింగ్ నుంచి నేను రాస్తున్నాను. ఈసారి నా పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు ఎవరో నన్ను అడిగారు, నువ్వు Exam Warriors పుస్తకాన్ని చదివావా? అని. నేనా పుస్తకం చదవలేదని చెప్పాను కానీ వెళ్లి కొనుక్కుని , రెండు మూడుసార్లు చదివాను. ఆ తర్వాత నాకు చాలా మంచి జరిగింది. పరీక్షల ముందర గనుగ ఈ పుస్తకాన్ని చదివి ఉంటే ఇంకా ప్రయోజనం కలిగేది కదా అనుకున్నాను. ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు నాకు బాగా నచ్చాయి. కానీ ఇందులో విద్యార్థుల కోసం ఎన్నో చిట్కాలున్నాయి కానీ తల్లిదండ్రుల కు, ఉపాధ్యాయులకు ఎక్కువేమీ లేదు. ఈ పుస్తకాన్ని మరొకమారు ముద్రించే ఉద్దేశం ఉంటే గనుక కొత్త ఎడిషన్ లో తల్లిదండ్రుల కు, ఉపాధ్యాయులకు కూడా ఏవైనా చిట్కాలు, ఇంక వేరేమైనా విషయాలతో మొదలైనవి కలిపి ముద్రించండి” అని ఉందా ఉత్తరంలో.
చూడండి, దేశ ప్రధాన సేవకుడికి పని అప్పగిస్తే, తప్పకుండా జరుగుతుందని నా యువ మిత్రులకి కూడా నమ్మకం ఉంది. నా చిన్నారి విద్యార్థి నేస్తం, ముందుగా నాకు ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు. Exam Warriors రెండు,మూడుసార్లు చదివినందుకు ధన్యవాదాలు. చదివేటప్పుడు అందులో ఏమేమి పొరపాట్లు ఉన్నాయని అనిపించిందో చెప్పినందుకు కూడా అనేకానేక ధన్యవాదాలు. దీనితో పాటుగా నా చిన్నారి నేస్తం నాకు పని కూడా అప్పగించింది. నేను తప్పకుండా మీ ఆజ్ఞని పాటిస్తాను. కొత్త ముద్రణ జరిగే సమయానికి నాకు వీలైతే గనుక తప్పకుండా తల్లిదండ్రుల కు, ఉపాధ్యాయులకు కూడా ఏవైనా రాయడానికి ప్రయత్నిస్తాను. కానీ మీ అందరినీ నేనొకటి కోరతాను. నాకు మీరు సహాయం చేయగలరా? రోజువారీ జీవితంలో మీరు ఏమేమి భావాలను అనుభూతి చెందుతారో నాకు చెబుతారా? దేశంలోని విద్యార్థులందరినీ, తల్లిదండ్రులనీ , ఉపాధ్యాయులనూ నేను అభ్యర్థిస్తున్నాను – stress free exam తో ముడిపడి ఉన్న విషయాలను, మీ అనుభవాలనూ, మీ సూచనలను నాకు పంపించండి. నేను తప్పకుండా వాటిని చదువుతాను. చదివి, ఆలోచించి, వాటిల్లో ఏ సూచనలు నచ్చుతాయో వాటిని నా మాటల్లో, నా పధ్ధతిలో రాయడానికి ప్రయత్నిస్తాను.మీ సూచనలు ఎక్కువగా వస్తే గనుక నా కొత్త ఎడిషన్ విషయం ఖాయం అయిపోతుంది. మీ ఆలోచనల కోసం ఎదురుచూస్తాను. అరుణాచల్ కు చెందిన చిన్నారి నేస్తం, అలీనా తాయంగ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, దేశ ప్రధాన మంత్రి తాలుకూ విస్తృత కార్యక్రమాలను గురించి వార్తా పత్రికలు, టీ.వీ మాధ్యమాల ద్వారా మీకు తెలుస్తూనే ఉంటుంది. తీరిక లేకుండా ఉండడం గురించి చర్చించుకుంటారు కూడానూ. కానీ నేనూ మీలాగనే ఒక సాధారణ వ్యక్తినని మీక్కూడా తెలుసు . ఒక సాధారణ పౌరుడిని. అందువల్ల ఒక సాధారణ జీవితంపై ఏ ప్రభావాలు ఎక్కువగా పడతాయో అలాంటి ప్రభావమే నా జీవితంలో నాపై కూడా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మీ మధ్య నుంచి వచ్చిన వ్యక్తినేగా! చూడండి, ఈసారి యూ.ఎస్ ఓపెన్ లో విజయాన్ని గురించి ఎన్ని చర్చలు జరిగాయో, అన్నే చర్చలు రన్నర్ అప్ గా నిలిచిన Daniil Medvedev ప్రసంగం పై కూడా జరిగాయి. సోషల్ మీడియాలో బాగా తిరుగుతోందని నేను కూడా ఆ ప్రసంగాన్ని విన్నాను. మేచ్ కూడా చూశాను. ఇరవై మూడేళ్ళ Daniil Medvedev నిరాడంబరత , అతడి పరిపక్వత అందరినీ ఆకట్టుకుంది. నేను మాత్రం ఎంతో ఆకర్షితుడనయ్యాను. ఈ ప్రసంగానికి కొద్ది సమయం మునుపే 19 సార్లు Grand Slam విజేత, టెన్నిస్ లెజెండ్ అయిన Rafael Nadal చేతిలో పరాజయం పాలైయ్యాడు. ఈ స్థితిలో వేరెవరైనా ఉండి ఉంటే నిరాశగా, ఉదాసీనంగా మారిపోయి ఉండేవారు. కానీ Daniil Medvedev మొహం వాడిపోలేదు. పైగా తన మాటలతో అందరి మొహాలపై చిరునవ్వులు తెప్పించాడు. అతడి వినమ్రత, సరళత, అతడిలో కనబడిన నిజమైన sportsman spirit చూసి అందరూ ముగ్ధులైపోయారు. అతడి మాటలను అక్కడి ప్రేక్షకులందరూ ఉత్తేజకరంగా స్వీకరించారు. విజేత Rafael Nadal ని కూడా Daniil ప్రశంసించాడు. లక్షల కొద్దీ యువ ఆటగాళ్ళకు Rafael Nadal ఎలా ప్రేరణగా నిలిచాడో చెప్పాడు. అతడితో ఆడడం ఎంత కష్టమో కూడా చెప్పాడు Daniil . కఠినమైన పోటిలో ఓటమిని ఎదుర్కొని కూడా తన ప్రత్యర్థి నాడాల్ ని ప్రశంసించి నిజమైన sportsman spirit కి సజీవ ఉదాహరణగా నిలిచాడు Daniil . ఇంతేకాక, ఛాంపియన్ గా నిలిచిన నాడాల్ కూడా డేనీ ఆటని ఎంతో మెచ్చుకున్నాడు. ఒకే మేచ్ లో ఓటమినెదుర్కొన్న ఆటగాడి ఉత్సాహం, గెలుపొందిన ఆటగాడి వినమ్రత, రెండు చిత్రాలూ చూడతగ్గవి. ఒకవేళ మీరు Daniil Medvedev ప్రసంగాన్ని విననివారికీ, ముఖ్యంగా యువతని తప్పకుండా ఆ వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి వర్గం వారూ, ప్రతి వయసు వారూ తప్పక నేర్చుకోవాల్సినది ఉంది. గెలుపు – ఓటములకు విలువనివ్వకుండా, వాటిని అధిగమించిన క్షణాలు అవి. జీవితం గెలుస్తూనే ఉంటుంది. మన దగ్గర శాస్త్రాల్లో ఎంతో గొప్పగా ఈ విషయాన్ని చెప్పారు. మన పూర్వీకుల ఆలోచనవిధానం నిజంగా మెచ్చుకోదగినది. మన శాస్త్రాల్లో ఏమని ఉందంటే –
” విద్యయా వినయోపేతా హరతి
న చేతాంసీ కస్య మనుజస్య !
మణి కాంచన సంయోగ:
జన్యయతి లోకస్య లోచన ఆనందం ”
అంటే, ఏ వ్యక్తిలో అయినా యోగ్యత, వినమ్రత ఒకేసారి ప్రవేశించినప్పుడు, అతడు ఎవరి మనసునైనా గెలవగలడు. నిజానికి, ఈ యువ ఆటగాడు ప్రపంచ ప్రజలందరి మనసులూ గెలిచేసాడు.
నా ప్రియమైన దేశప్రజలారా, ముఖ్యంగా నా యువ మిత్రులారా, నేనిప్పుడు చెప్పబోయే విషయం, మీ మంచి కోరుతూ చెప్తున్నాను. వాగ్వివాదాలూ, పక్ష-విపక్షాలూ జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని విషయాలు ముందుకు వెళ్లకముందే ఆపేస్తే, చాలా మేలు జరుగుతుంది. బాగా చెయ్యి దాటిపోయిన విషయాలు, చాలా దూరం ప్రచారమైపోతాయి. అప్పటికి వాటిని ఆపడం కష్టమైపోతుంది. కానీ మొదట్లేనే మనం జాగ్రత్తపడి వాటిని ఆపేస్తే చాలా వరకూ కాపాడుకున్నట్లే అవుతుంది. అందువల్ల ఇవాళ ముఖ్యంగా నా యువ మిత్రులతో నేను కొన్ని విషయాలు తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను. తంబాకుని సేవించడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ దురలవాటుని మానుకోవడం కూడా చాలా కష్టం. తంబాకు సేవించేవారికి కేన్సర్, డయాబెటిస్, రక్తపోటు లాంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందరూ ఇదే మాట చెప్తారు. తంబాకులో ఉండే నికోటిన్ అనే పదార్థం మత్తుని కలిగిస్తుంది. చిన్న వయసులోనే ఈ అలవాటుకి బానిస అయితే మెదడు ఎదుగుదలపై కూడా దీని ప్రభావం పడుతుంది. కానీ ఇవాళ నేను మీతో మరో కొత్త సంగతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈమధ్య భారతదేశంలో ఈ-సిగరెట్టు పై నిషేధం విధించబడిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. మామూలు సిగరెట్టు కంటే భిన్నంగా ఉండే ఈ-సిగరెట్టు ఒక రకమైన ఎలక్ట్రానిక్ పరికరం. ఈ-సిగరెట్టు లో నికోటిన్ తో పాటూ ఒక ద్రవపదార్ధాన్ని వేడి చేయడం వల్ల ఒక రకమైన కెమికల్ పొగ ఉత్పన్నమౌతుంది. దాని ద్వారా నికోటిన్ ని సేవిస్తారు. మామూలు సిగరెట్టు వల్ల కలిగే నష్టాల గురించి మనందరికీ తెలుసు. కానీ ఈ-సిగరెట్టు గురించి ఒక తప్పుడు అభిప్రాయాన్ని పుట్టించారు. ఈ-సిగరెట్టు వల్ల ఏమీ ప్రమాదం లేదనే భ్రాంతి ప్రచారం చెయ్యబడింది. మిగతా సిగరెట్ల లాగ ఇందులోంచి దుర్గంధం వ్యాపించకుండా ఉండేందుకు ఇందులో సుగంధ రసాయనాలు కూడా కలిపేవారు. మనం చూస్తూ ఉంటాం, ఒక ఇంట్లో తండ్రి చైన్ స్మోకర్ అయితే కూడా, ఇంట్లోని మిగతా వ్యక్తులని సిగరెట్టు కాల్చకుండా ఆపుతూ ఉంటారు. పిల్లలకి సిగరెట్టు, బీడీ మొదలైన దురలవాట్లకు గురవ్వకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబంలోని మరే ఇతర సభ్యుడికీ ఈ ధూమపాన దురలవాటు అవ్వకూడదనే చూస్తారు. ధూమపానం వల్ల, తంబాకు వల్ల శరీరానికి భారీ నష్టం జరుగుతుందని వారికి తెలుసు. ధూమపానం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఎలాంటి అపోహలు లేవు. దాని వల్ల నష్టం జరుగుతుంది. ఇది అమ్మేవారికి కూడా తెలుసు. సిగరెట్టు తాగేవారికీ తెలుసు. చూసేవారికీ తెలుసు. కానీ ఈ-సిగరెట్టు సంగతి పూర్తిగా భిన్నమైనది. ఇ-సిగరెట్టు గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదు. దానివాల జరిగే ప్రమాదాల గురించి కూడా ప్రజలకి అసలేమీ తెలియదు. అందువల్ల అప్పుడప్పుడు కుతూహలం కారణంగా ఇంట్లోకి రహస్యంగా ఈ-సిగరెట్టు వచ్చి చేరుతోంది. అప్పుడప్పుడు, మేజిక్ చేస్తున్నాను అంటూ దీనిని పిల్లలు ఒకరికి ఒకరు చూపించుకుంటున్నారు కూడా.కుటుంబంలో తల్లిదండ్రుల ఎదురుగా కూడా కొందరు పిల్లలు ఇవాళ నేనొక మేజిక్ చూపిస్తున్నాను. నా నోట్లోంచి పొగ తెప్పిస్తున్నాను, నిప్పు లేకుండా పొగ తెప్పిస్తున్నాను, దీపం వెలిగించకుండానే పొగతెప్పిస్తాను చూడండి, అంటూ ఏదో మేజిక్ షో చేస్తున్నట్లు చూపిస్తుంటే, కుటుంబసభ్యులు చప్పట్లు కూడా కొడుతున్నారు. వారికేమీ తెలియనే తెలియదు. కానీ ఒక్కసారి గనుక పిల్లలు ఈ దురలవాటులో పడితే, నెమ్మది నెమ్మదిగా వారు ఆ మత్తుకి అలవాటు పడిపోతారు. ఈ దురలవాటుకి బానిసైపోతారు. మన యువత తమకి తెలియకుండానే డబ్బుని వ్యర్థం చేసే మార్గంలో నడవడం మొదలుపెడతారు. నిజానికి ఈ-సిగరెట్టు లో ఎన్నో హానికరమైన రసాయనాలు కలుపుతారు. దాని వల్ల ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం పడుతుంది. మీకు తెలుసు , ఎవరైనా పొగ తాగుతుంటే వచ్చే వాసన వల్ల వారు సిగరెట్టు కాలుస్తున్నట్లు మనకు తెలిసిపోతుంది. వారి జేబులో సిగరెట్టు పేకెట్ లేకపోయినా వాసన వాల్ల తెలిసిపోతుంది. కానీ ఇ-సిగరెట్టు తో అలా కాదు. అందువల్ల, ఎందరో పిల్లలు, యువత, తెలిసీ తెలియక, ఫ్యాషన్ అనుకుంటూ చాలా గర్వంగా పుస్తకాల మధ్యన, ఆఫీసుల్లో, తమ జేబుల్లో, అప్పుడప్పుడూ చేతుల్లో కూడా ఈ-సిగరెట్టు తో తిరుగుతూ కనిపిస్తున్నారు. దానికి అలవాటు పడిపోతున్నారు. యువత అంటే మన దేశ భవిష్యత్తు. ఈ కొత్త రకం మత్తులో యువత చెడుదోవలో పడకుండా, దేశము, వారి జీవితాలూ నాశనమవకుండా ఉండాలని, కుటుంబాలలోని కలలు తుడిచిపెట్టుకుపోకూడదని, ఈ మత్తు రోగం, ఈ దురలవాటు సమాజంలో వేళ్లతో పాతుకుపోకూడదని ఈ-సిగరెట్టు పై నిషేధం విధించబడింది.
నేను మీ అందరినీ కోరేదేమిటంటే తంబాకు వ్యసనాన్ని వదిలిపెట్టండి, ఈ-సిగరెట్టు గురించిన ప్రలోభాలకి గురికాకండి. రండి, మనందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మిద్దాం.
అవునూ, మీకు ఫిట్ ఇండియా గుర్తుందా? ఫిట్ ఇండియా అంటే పగలూ, సాయంత్రం రెండేసి గంటలు జిమ్ లోకి వెళ్ళి చేతులూ కాళ్ళూ ఆడించడం కాదు. పైన చెప్పిన దురలవాట్ల నుండి దూరంగా ఉండటమే ఫిట్ ఇండియా అంటే. నా మాటలు మీకు తప్పుగా అనిపించవు. మీరు నా మాటలని తప్పకుండా మంచిగానే తీసుకుంటారని నా నమ్మకం.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా, తమ కోసం కాకుండా ఇతరుల కోసం తమ జీవితాలని త్యాగం చేసిన అసాధారణ వ్యక్తులను కన్న జన్మ భూమి, కర్మ భూమి మన భారతదేశం. ఇటువంటి దేశంలో పుట్టడం మనందరి అదృష్టం.
మన భారతదేశం, మన భారత మాత, ఎందరో రత్నాలను కన్న వసుంధర. ఎందరో రత్నాల్లాంటి అసాధారణ వ్యక్తులకు మన భారతదేశం జన్మ భూమి అయ్యింది. కర్మ భూమి అయ్యింది. వారంతా కూడా తమ తమ కోసం కాకుండా ఇతరుల కోసం జీవించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఒకరిని అక్టోబర్ 13వ తేదీన వాటికన్ సిటీ లో సన్మానించబోతున్నారు. ఇది భారతీయులందరూ ఎంతో గర్వించదగ్గ విషయం. పోప్ ఫ్రాంసిస్ రాబోయే అక్టోబర్ 13వ తేదీన మరియం ట్రేసియా ని సన్యాసినిగా గౌరవంగా ప్రకటించబోతున్నారు. సిస్టర్ మరియం ట్రేసియా తన ఏభై ఏళ్ల పరిమిత జీవనకాలంలో మానవత్వం కోసం, మానవుల మేలు కోరి చేసిన మంచి పనులు యావత్ ప్రపంచానికే ఒక ఉదాహరణ. సమాజ సేవ, విద్యారంగాలలో ఆవిడకి అద్భుతమైన ఆసక్తి ఉంది. ఆవిడ ఎన్నో పాఠశాలలూ, హాస్టళ్ళూ, అనాథశరణాలయాలూ నిర్మించారు. తన జీవిత పర్యంతం ఆవిడ ఇదే ఉద్యమం మీద దృష్టి నిలిపారు. సిస్టర్ ట్రేసియా ఏ పని చేసినా శ్రధ్ధతో, పట్టుదలతో, పూర్తి సమర్పణాభావంతో పూర్తి చేశారు. ఆవిడ Congregation of the Sisters of the Holy Family ని స్థాపించారు. అది ఇవాళ కూడా ఆవిడ జీవితాదర్శాలను, మిషన్ నీ ముందుకు నడిపిస్తోంది. నేను మరొక సారి సిస్టర్ మరియం ట్రేసియాకు శ్రధ్ధాంజలిని సమర్పిస్తున్నాను. భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా మన క్రైస్తవ సోదర సోదరిమణులకు, ఈ గుర్తింపు సందర్భంగా అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు మనం గాంధీజీ 150 వ జన్మదినం జరుపుకోవడం భారతదేశమే కాక యావత్ ప్రపంచం గర్వించదగ్గ విషయం. 130కోట్ల దేశప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందాలని సంకల్పించారు. పర్యావరణని సంరక్షించే మార్గంలో, యావత్ ప్రపంచంలో భారతదేశం తీసుకున్న మార్గదర్శకత్వాన్ని చూసి ఎన్నో దేశాలు భారతదేశం పై తమ దృష్టిని సారించాయి. అక్టొబర్ రెండు నుంచీ జరగబోయే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందే ఉద్యమంలో మీరంతా పాలుపంచుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. పలుచోట్ల ప్రజలు తమ తమ పధ్ధతులలో ఈ ఉద్యమానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. మన దేశానికి చెందిన ఒక యువకుడు ఒక చిత్రమైన పెద్ద ఉద్యమాన్ని నడిపించాడు. అతడి పని నా దృష్టికి వచ్చింది. అతడు చేసే ఈ కొత్త ప్రయోగం గురించి నేను అతనితో ఫోన్ లో మాట్లాడి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అతడి మాటలు దేశంలోని మిగతా ప్రజలకి కూడా పనికి వస్తాయేమో!
శ్రీ రిపుదమన్ బెవ్లి గారు ఒక చిత్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన Plogging చేస్తారు. Plogging అన్న పదం వినడం నాకూ మొదటిసారి. విదేశాలలో ఈ పదం ఉపయోగిస్తారేమో కానీ భారతదేశంలో రిపుదమన్ బెవ్లి గారు దీనిని ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. రండి, ఆయనతో కాసేపు మాట్లాడదాం –
మోదీ గారు: హలో రిపుదమన్ గారూ, నమస్కారం! నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నాను.
రిపుదమన్: ధన్యవాదాలు సార్.
మోదీ గారు: రిపుదమన్ గారూ, మీరు Plogging పేరుతో అంకిత భావంతో పని చేస్తున్నారు.
రిపుదమన్: అవును సార్.
మోదీ గారు:అందువల్ల , నేను స్వయంగా ఫోన్ చేసి మిమ్మల్ని వివరాలు అడుగుదామని నా మనసులో కుతూహలం కలిగింది.
రిపుదమన్: చెప్పండి సర్
మోదీ గారు: మీ మనసులోకి ఈ ఆలోచన ఎలా వచ్చింది?
రిపుదమన్: అవును సర్
మోదీ గారు: ఈ పదం, ఈ పధ్ధతి మీ మనసులోకి ఎలా వచ్చింది?
రిపుదమన్: సర్, ఇవాళ యువతకు అంతా కూల్ గా కావాలి. వారికి ఏదైనా ఆసక్తికరంగా ఉండాలి. నేను మోటివేట్ అయ్యాను కానీ యువతని మోటివేట్ చెయ్యడానికి ఏదైనా ఆసక్తికరంగా ఉండాలి. 130కోట్ల భారతీయులని ఈ ఉద్యమంలో జోడించాలంటే ఏదైనా కూల్ గా, ఆసక్తికరంగా చెయ్యాలనుకున్నాను. నేను స్వయంగా ఒక రన్నర్ ని. పొద్దుటే మేము పరిగెడుతుంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. జనం తక్కువగా ఉంటారు. రోడ్లపై చెత్తాచెదారం, ప్లాస్టిక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదంతా చూసి ఫిర్యాదు చెయ్యడం, తిట్టుకోవడం కాకుండా ఏదైనా చెయ్యాలని నేను అనుకున్నాను. మా రన్నింగ్ గ్రూప్ సాయంతో ఢిల్లీలో ఇది మొదలుపెట్టాను. తర్వాత యావత్ భారతాదేశానికీ దీనిని పరిచయం చేసాను. ప్రతి చోట నుంచీ ఎన్నో ప్రశంసలు లభించాయి.
మోదీ గారు: మీరు ఎగ్జాక్ట్ గా ఏం చేసేవారు? కాస్త నాకు అర్థం అయ్యేలా , మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా దేశప్రజలకు కూడా తెలిసేలా వివరించండి.
రిపుదమన్: సర్, మేము ‘Run & Clean-up Movement’ ని మొదలుపెట్టాము. మా రన్నింగ్ గ్రూప్స్ కి, వారి వర్క్ అవుట్ అయిపోయాకా, కూల్ డౌన్ ఏక్టివిటీ సమయంలో చెత్తను ఎత్తే పనిని చేపట్టాలని కోరాము. మీఅంతట మీరే ప్లాస్టిక్ ఏరడం మొదలుపెట్టండి. రన్నింగ్ తో పాటూ క్లీనింగ్ కూడా అయిపోతుంది. దీనివల్ల తెలియకుండానే ఎంతో వ్యాయామం కలిసివస్తోంది. దీని వల్ల మీరు కేవలం రన్నింగే కాకుండా, squats చేస్తున్నారు, deep squats చేస్తున్నారు, lunges చేస్తున్నారు , forward bent చేస్తున్నారు, దీనివల్ల ఇది ఒక holistic work out అయిపోయింది | గత ఏడాది ఎన్నో fitness పత్రికలలో భారతదేశంలో Top fitness trend అంటూ మా పనిని nominate చేశారు.
మోదీ గారు: ఇందుకు గానీ మీకు నా అభినందనలు
రిపుదమన్: ధన్యవాదాలు సర్
మోదీ గారు: ఇప్పుడు సెప్టెంబర్ 5 నుండీ మీరు కొచ్చిన్ నుండి ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారా?
రిపుదమన్: అవును సర్. ఈ మిషన్ పేరు ” ‘R|Elan Run to make India Litter Free’ . ఎలాగైతే మీరు అక్టోబర్ 2న ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఇవ్వాలన్నారో, అలానే చెత్త నుంచి విముక్తి లభిస్తే ప్లాస్తిక్ నుంచి కూడా విముక్తి లభిస్తుందని నాకు నమ్మకం ఉంది . ఇది ఒక వ్యక్తిగత బాధ్యతగా మారుతుందని నేను నమ్ముతున్నాను. నేను ఏభై పట్టణాలలో , వెయ్యి కిలోమీటర్ల దూరం పరిగెడుతూ క్లీనింగ్ చేస్తున్నాను. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్లీనప్ డ్రైవ్ అవుతుందని అందరూ అంటున్నారు. దీనితో పాటుగా మేము సోషల్ మీడియాలో #(Hashtag) ని ఉపయోగించాము. #PlasticUpvaas అని పెట్టి, అక్కడ ప్రజలు తమ జీవితంలో ప్లాస్టిక్ నే కాకుండా సింగిల్ యూజ్ చేసే ఏ వస్తువునైనా తమ జీవితాలలోంచి తీసేస్తాము అని చెప్పవలసిందిగా ప్రజలని కోరుతున్నాము.
మోదీ గారు: అద్భుతం! అయితే సెప్టెంబర్ 5న మీరు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టినప్పటి నుంచీ మీ అనుభవాలేమిటి?
రిపుదమన్: ఇప్పటివరకూ అయితే చక్కని అనుభవాలు ఎదురైయ్యాయి. గత రెండేళ్ళలో కూడా యావత్ భారతదేశంలో మేము 300 Plogging drives చేశాము. మేము కొచ్చిన్ లో మొదలుపెట్టాకా రన్నింగ్ గ్రూప్స్ జాయిన్ అయ్యాయి. అక్కడ ఉన్న స్థానిక క్లీనప్ గ్రూప్స్ ని నేను మాతో కలుపుకున్నాను. కొచ్చిన్ తర్వాత మధురై, కోయంబత్తూర్, సేలం లలో తిరిగాము. ఇప్పుడే మేము ఉడుపీ లో పూర్తిచేసాము. అక్కడ ఒక పాఠశాల వారు మమ్మల్ని ఆహ్వానించారు. మూడు నుంచీ ఆరవ తరగతి వరకూ చదివే చిన్న చిన్న పిల్లలకు ఒక వర్క్ షాప్ ఇవ్వమని ఒక ఆరగంట సేపు ఉండమని ఆహ్వానించారు. అరగంట వర్క్ షాప్ మూడు గంటల Plogging drive అయ్యింది. పిల్లలు ఎంత enthusiastic గా ఉన్నారంటే that they wanted to do this and they wanted to take it back . తల్లిదండ్రులకూ, చుట్టుపక్కలవారికీ, తోటివారి కి చెప్పాలని పిల్లలకి అనిపించడమే అతి పెద్ద motivation. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
మోదీ గారు: రిపూ గారూ, ఇది పరిశ్రమ కాదు ఒక సాధన. మీరు నిజంగా ఒక సాధన్ చేస్తున్నారు.
రిపుదమన్: అవును సర్
మోదీ గారు: నా తరఫున అనేక అధన్యవాదాలు. మీరు దేశప్రజలతో మూడు మాటలు చెప్పాలి అని అడిగితే, ఏం చెప్తారు?
రిపుదమన్: చెత్త రహిత భారతదేశం కోసం నేను మూడు స్టెప్స్ చెప్పాలనుకుంటున్నాను.
1 . చెత్తను చెత్త కుండీలో మాత్రమే వెయ్యండి.
2 .ఎదైనా సరే బయట చెత్త కనిపిస్తే దానిని తీసి చెత్త కుండీలో వెయ్యండి.
3. చెత్త కుండీ కనిపించకపోతే మీ బండిలో, మీతో మీ ఇంటికి తీసుకువెళ్ళి,
తడి చెత్త, పొడి చెత్తలను విడదీసి, మీ ఇంట్లోని చెత్తడబ్బాలో వెయ్యండి. పొద్దుట మున్సిపాలిటి చెత్తబండి వచ్చినప్పుడు వారికి ఇచ్చివేయండి.
ఈ మూడు స్టెప్స్ అందరూ పాటిస్తే మనం చెత్త రహిత భారతదేశాన్ని చూడగలము.
మోదీ గారు: చూడండి రిపూ గారూ, ఎంతో సరళమైన పదాలలో, సాధారణ పౌరుడు కూడా అర్థమయ్యే భాషలో వారు పాటించే విధంగా, గాంధీ గారి కలలనే మీతో పాటుగా నడిపిస్తున్నారు. ఇంతేకాక గాంధీగారిలాగనే, విషయాన్ని సరళమైన పదాలతో చెప్పే పధ్ధతిని కూడా మీరు అలవరుచుకున్నారు.
రిపుదమన్: ధన్యవాదాలు.
మోదీ గారు: అందుకనే మీరు ప్రశంసనీయులు. మీతో మాట్లాడితే నాకు చాలా బాగుంది. మీరు ఎంతో వినూత్న పధ్ధతిలో , ముఖ్యంగా యువతకు నచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. నేను మీకు అనేక అభినందనలు తెలుపుతున్నాను.
మిత్రులారా, ఈసారి గాంధీ జయంతి సందర్భంగా క్రీడా మంత్రాలయం కూడా ‘Fit India Plogging Run’ ప్రారంభించబోతోంది.అక్టోబర్ 2న యావత్ భారతదేశంలో రెండు కిలోమీటర్ల ప్లాగింగ్ జరగబోతోంది. ఈ కార్యక్రమం ఎలా జరగాలి, ఈ కార్యక్రమంలో ఏం చేస్తాము అనేది రిపుదమన్ గారి అనుభవాల నుండి మనం తెలుసుకున్నాము.అక్టోబర్ 2 నుండి మొదలవబోయే ఈ ఉద్యమంలో మనందరం రెందు కిలోమీటర్ల జాగింగ్ తో పాటూ, దారిలో ఎదురయ్యే ప్లాస్టిక్ ని కూడా జమ చెయ్యాలి. దీనివల్ల మనం మన ఆరోగ్యంతో పాటూ, పుడమితల్లి ఆరోగ్యాన్ని కూడా రక్షించినవాళ్లం అవుతాము. ఈ ఉద్యమం వల్ల ప్రజలలో ఫిట్నెస్ తో పాటూ పరిశుభ్రత పై కూడా అవగాహన పెరుగుతోంది. 130 కోట్ల దేశప్రజలందరూ ఈ ఉద్యమం దిశగా తలో అడుగూ వేస్తే , సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందే దిశగా మన భారతదేశం 130 కోట్ల అడుగులు ముందుకు వెళ్తుంది.
రిపుదమన్ గారూ, మరోసారి మీకు అనేకానేక ధన్యవాదాలు. మీకూ, మీ జట్టు కీ, ఈ సృజనాత్మక ప్రయోగానికీ, నా తరఫున అనేకానేక అభినందనలు. ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా, అక్టోబర్ 2 కోసం యావత్ భారతదేశంలో, ప్రపంచంలో సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ మేము గాంధీ 150 ని కర్తవ్యపథం వైపు నడిపించాలని అనుకుంటున్నాము. దేశహితం కోసం మన జీవితాలలో మార్పులు చేసుకుంటూ ముందుకి నడుద్దాం. ఒకసారి ముందుగా గుర్తుచెయ్యాలనుకుంటున్నాను. రాబోయే మన్ కీ బాత్ లో దీని గురించి విస్తారంగా వివరిస్తాను కానీ ఈసారి నేను కొంచెం ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు తయారుగా ఉంటారని.
మీకు గుర్తుందా? అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి అని మీకు గుర్తుండే ఉంటుంది. “ఏక్ భారత్, స్రేష్ఠ భారత్” అనేది మనందరి కల. ఇందుకోసమే ప్రతి ఏడాదీ అక్టోబర్ 31 న మనం యావత్ దేశంలో “రన్ ఫర్ యూనిటీ” పేరుతో దేశ సమైక్యత కోసం పరుగు ని నిర్వహిస్తున్నాం. ప్రజలు అందరూ , వృధ్ధులు, స్కూల్ ,కాలేజీలలో అందరూ, భారతదేశంలోని లక్షల పల్లెల్లో ప్రజలు కూడా ఆరోజున దేశ సమైక్యత కోసం పరుగుపెట్టాలి. మీరు ఇప్పటి నుందే తయారీ మొదలుపెట్టండి. ఇంకా సమయం ఉంది. దీని గురించి వివరంగా తర్వాత చెప్తాను. కొందరు ప్రాక్టీస్ మొదలుపెట్టచ్చు, ప్రణాళికలు తయారుచేసుకోవచ్చు.
మీకు గుర్తుందే ఉంటుంది, ఆగస్టు 15న ఎర్ర కోట బురుజు నుండి నేను చెప్పాను, 2022 వరకూ మీరు భారతదేశంలోని ఏవైనా పదిహేను యాత్రా ప్రదేశాలకు వెళ్లమని చెప్పాను. వీలైతే ఒకటి, రెందు రాత్రులు ఉండేలాగ ప్రయత్నించమని చెప్పాను. భారతదేశాన్ని మీరు చూడండి. అర్థం చేసుకోండి. అనుభూతి చెందండి. మన వద్ద ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయో, దీపావళి పండుగ సమయంలో సెలవులు వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా వెకేషన్ కి వెళ్తారని నేను మళ్ళీ చెప్తున్నాను. భారతదేశంలోని ఏవైనా పదిహేను యాత్రా ప్రదేశాలకు తప్పక వెళ్లమని చెప్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, మొన్ననే సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకున్నాం. ప్రపంచంలోని కొన్ని సంస్థలు పర్యాటక రంగంలో రేంకింగ్ లు కూడా ఇస్తాయి. మన భారతదేశం ట్రావెల్ అండ్ టూరిజమ్ కాంపిటీటివ్ ఇండెక్స్ లో ఎంతో ప్రగతి సాధించిందని తెలుసుకుంటే మీరంతా సంతోషపడతారు. ఇదంతా మీ అందరి సహకారం వల్లనే జరిగింది. ముఖ్యంగా మీరు పర్యటన ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నందు వల్లే ఇది జరిగింది. ఇందులో పరిశుభ్రత ఉద్యమం సహకారం కూడా ఎంతో ఉంది. ఈ మార్పు ఎమ్త ఉందో చెప్పనా మీకు? మీకు తప్పకుండా సంతోషం కలుగుతుంది. ఇవాళ మన ర్యాంకు 34. ఐదేళ్లక్రితం మన ర్యాంక్ 65. అంటే మనం చాలా పెద్ద జంప్ నే చేశాము. మనం గనుక ఇంక ప్రయత్నం చేస్తే, స్వాతంత్రం వచ్చిన 75 వసంతాల లోపే మనం టూరిజంలో ప్రపంచంలోని ప్రముఖ స్థానాల్లో మనకంటూ స్థానాన్ని సంపాదించుకోగలము.
నా ప్రియమైన దేశ ప్రజలారా, మీ అందరికీ మరోసారి వైవిధ్యాలతో నిండిన భారతదేశంలోని వేరు వేరు పండుగల సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. దీపావళి సంబరాలలో టపాసులు కాల్చేప్పుడు , అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఎవరికీ నష్టం కలగకుండా, వ్యక్తులకు హాని జరగకుండా జాగ్రత్త పడండి. ఇందుకోసం మీరు వ్యక్తపరచవలసిన అభ్యంతరాలను నిశ్చితంగా వ్యక్తపరచండి. ఆనందమూ ఉండాలి. సంతోషమూ ఉండాలి. ఉత్సాహమూ ఉండాలి. మన పండుగలు సామూహిక సంస్కారాన్ని , పరిమళాలను కూడా పంచుతాయి. సామూహిక జీవితమే ఒక కొత్త సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆ కొత్త శక్తే సాధనకు స్థానం. అదే పండుగ. రండి, కలసిమెలసి ఉత్సాహంతో, ఆశలతో, కొత్త కలలతో, కొత్త సంకల్పాలతో మనం పండుగలను జరుపుకుందాం.
మరోసారి అనేకానేక శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
*** |
pib-191053 | 01ba4e89aae3967193d5e7cdaffb9b4736174ca8770a1eef588264e3fb165d3a | tel | యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మన పారా అథ్లెట్లు మన బలం - శ్రీ కిరెన్ రిజిజు
పారా స్నేహపూర్వక క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు - దేవేంద్ర ఝఝారియా
29 వ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా, గురువారం దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో - భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు దీపా మాలిక్; ప్రముఖ భారతీయ పారా అథ్లెట్లు దేవేంద్ర ఝఝాారియా, పరుల్ పర్మార్, శతాబ్ది అవస్థీ; పి.సి.ఐ. సెక్రటరీ జనరల్ శ్రీ గురు శరణ్ సింగ్ తో పాటు పి.సి.ఐ. ప్రధాన పోషకులు శ్రీ అవినాష్ రాయ్ ఖన్నా కూడా పాల్గొన్నారు.
పారా అథ్లెట్లు దేశంలోని ప్రతి ఒక్కరికీ బలం మరియు స్ఫూర్తిదాయకమైన వనరుల వంటి వారని శ్రీ రిజిజు పేర్కొన్నారు. వారికి మద్దతు ఇవ్వడానికి క్రీడా మంత్రిత్వ శాఖ అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలియజేశారు. “మన పారా అథ్లెట్లు మరియు‘ దివ్యంగ్ ’యోధులు మన బలం. వారు మనకు స్ఫూర్తినిస్తారు. మన క్రీడా మంత్రిత్వ శాఖలో, సమర్థులైన క్రీడాకారులకు, భిన్నమైన సామర్థ్యం గల క్రీడాకారులకు మధ్య తేడా లేదు. మనం ఇరువురినీ ఒకే రకమైన గుర్తింపు, నగదు పురస్కారాలు, మొదలైనవాటితో సత్కరిస్తున్నాము.”అని కేంద్ర క్రీడల శాఖ మంత్రి చెప్పారు.
తమ తమ ప్రాంతాల్లోని పారాలింపియన్లకు సాధ్యమైనంత ఉన్నతంగా సహకరించాలని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థిస్తామని కూడా శ్రీ రిజిజు తెలిపారు. "పారాలింపియన్లకు కేంద్రప్రభుత్వం అందిస్తున్న విధంగా ఆర్థిక సహాయం నుండి శిక్షణ వరకు అదేవిధంగా శిక్షణా సౌకర్యాల నుండి సరైన జీవనోపాధి వరకు, సాధ్యమైనంత ఉత్తమంగా మద్దతు ఇవ్వడానికి వీలుగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, "దివ్యాంగ" యోధుల కోసం ఒక విధానాన్ని కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. ప్రభుత్వం, పి.సి.ఐ. తో పాటు ప్రతి ఒక్కరూ సమిష్టిగా మన పారా అథ్లెట్లకు మద్దతు ఇచ్చే పనిని కొనసాగించాలి.” అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, పద్మశ్రీ, ఖేల్ రత్న, అర్జున అవార్డు గ్రహీత దేవేంద్ర ఝఝారియా మాట్లాడుతూ, పారా అథ్లెట్లకు సత్వర సహాయం అందించడంలో ప్రభుత్వం చేసిన కృషికి, కృతజ్ఞతలు తెలిపారు. "మా సమస్యలను లేదా మాకు అవసరమైన విషయాలను తెలియజేస్తూ, మేము ప్రభుత్వానికి మెయిల్ పంపినప్పుడల్లా, మాకు గంటలోపు సమాధానం వస్తుంది. నేను భారతదేశం అంతటా చాలా శిక్షణా కేంద్రాలను చూస్తున్నాను, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు ఇప్పటికే ఉన్నందున తరువాతి తరం పారా అథ్లెట్లకు ఎటువంటి సమస్య ఉండదు. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మమ్మల్ని ‘వికలాంగులు ’ అని పిలవవద్దని, కానీ ‘దివ్యంగులు’ అని అందరినీ కోరిన ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికీ మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఇది మనందరికీ ఎంతో ప్రేరణ కలిగించే విషయం.”అని ఝఝారియా అన్నారు. |
pib-3389 | 1e19cbe54d7991fdb756a74f21d6b4773d306719c18c8ac6331c638cc50f6fa4 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని మోధేరాలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన , అంకితం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
ఈరోజు మొధేరా, మెహసానా మరియు ఉత్తర గుజరాత్ మొత్తానికి అభివృద్ధిలో కొత్త శక్తి నింపబడింది. విద్యుత్, నీరు, రోడ్లు, పట్టాలు, పాడిపరిశ్రమ, నైపుణ్యాభివృద్ధి మరియు ఆరోగ్యం వంటి అనేక ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభించబడ్డాయి లేదా వాటి పునాది రాయి వేయబడ్డాయి. వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఈ ప్రాజెక్టులు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి, రైతులు మరియు పశువుల పెంపకందారుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడతాయి మరియు మొత్తం ప్రాంతంలో హెరిటేజ్ టూరిజంకు సంబంధించిన సౌకర్యాలను కూడా విస్తరిస్తాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మీ అందరికీ అభినందనలు. మెహసానా ప్రజలకు నమస్కారాలు!
స్నేహితులారా,
ఈ రోజు మనం సూర్య భగవానుడి నివాసమైన మోధేరాలో ఉన్నప్పుడు, ఈ రోజు శరద్ పూర్ణిమ కూడా కావడం సంతోషకరమైన యాదృచ్ఛికం. ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి కూడా ఒక శుభ సందర్భం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మూడు యాదృచ్ఛికాల సంగమం. వాల్మీకి మహర్షి శ్రీరాముని సామరస్య జీవితాన్ని మనకు పరిచయం చేసి సమానత్వ సందేశాన్ని అందించారు. మీకు మరియు యావత్ జాతికి శరద్ పూర్ణిమ మరియు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు!
సోదర సోదరీమణులారా,
గత కొన్ని రోజులుగా, దేశవ్యాప్తంగా టీవీ, వార్తాపత్రికలు మరియు సోషల్ మీడియాలో మోధేరాలోని సూర్యగ్రామం గురించి జరుగుతున్న చర్చలను మీరు గమనించాలి. తమ జీవితకాలంలో ఈ కల నెరవేరుతుందని అనుకోలేదని, నేడు ఆ కలను సాకారం చేసుకుంటున్నామని చెప్పుకునేవారు ఎందరో. మరికొందరు దీనిని మన పురాతన విశ్వాసం మరియు ఆధునిక సాంకేతికత యొక్క కొత్త సంగమం అని పిలుస్తారు, మరికొందరు దీనిని భవిష్యత్ స్మార్ట్ గుజరాత్ మరియు స్మార్ట్ ఇండియా యొక్క సంగ్రహావలోకనం అని అభివర్ణిస్తున్నారు. ఇది మనందరికీ, మెహసానా మరియు గుజరాత్‌లకు గర్వకారణం. మోధేరా, చనాస్మా మరియు మెహసానా ప్రజలను ఇది గర్వించేలా చేసిందా లేదా అని అడగనివ్వండి. వారు తమ జీవితంలో ఈ విలువైన క్షణాన్ని ఆస్వాదించలేదా? ఇంతకుముందు మోధేరా సూర్య దేవాలయం కారణంగా ప్రపంచానికి తెలుసు, కానీ ఇప్పుడు అది సూర్యగ్రామంగా కూడా గుర్తించబడుతుంది. మోధేరా సూర్య దేవాలయం నుండి ప్రేరణ పొందడం. పర్యావరణవేత్తలు, స్నేహితుల కోసం మోధేరా ప్రపంచ పటంలో తన ముద్రను వదిలివేస్తుంది.
స్నేహితులారా,
ఈ రోజు మొధేరాలో కనిపిస్తున్న గుజరాత్ యొక్క ఈ సంభావ్యత గుజరాత్ యొక్క ప్రతి మూల మరియు మూలలో ఉంది. మోధేరాలోని సూర్య దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి, దానిని నేలకూల్చడానికి ఆక్రమణదారులు చేసిన ప్రయత్నాలను ఎవరు మర్చిపోగలరు? ఎన్నో అకృత్యాలకు గురైన మోధేరా ఇప్పుడు పురాణాలతోపాటు ఆధునికతకు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది.
ప్రపంచంలో సోలార్ పవర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా, మోధేరా ప్రత్యేకంగా నిలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇళ్ల వద్ద విద్యుత్ నుండి వ్యవసాయం వరకు ప్రతిదీ సౌరశక్తితో నడుస్తుంది. అన్ని వాహనాలను సోలార్ పవర్‌తో నడిపేందుకు కూడా కృషి చేస్తామన్నారు. 21వ శతాబ్దపు స్వావలంబన భారతదేశాన్ని తయారు చేయడానికి మన శక్తి అవసరాలను తీర్చుకోవడానికి మనం అలాంటి ప్రయత్నాలను వేగవంతం చేయాలి.
స్నేహితులారా,
గుజరాత్‌కు, మన భవిష్యత్ తరాలకు, మీ పిల్లలకు భద్రత కల్పించే దిశగా దేశాన్ని తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాను. మా మోధేరా సోదరులు ఇప్పుడు తమ ఇళ్లపై విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, ప్రభుత్వం నుండి డబ్బు కూడా పొందుతున్నారని నేను టీవీలో చూసినట్లుగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇలాంటి వాదనలు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. కరెంటు ఉచితం కావడమే కాకుండా కరెంటు ఉత్పత్తి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ యజమాని అయినా, ఇంటిలోని వ్యక్తి అయినా, రైతు మరియు దానిని ఉపయోగించే వినియోగదారుడు అందరూ సమానమే. మీకు అవసరమైన శక్తిని ఉపయోగించుకోండి మరియు అదనపు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించండి. దీని వల్ల కరెంటు బిల్లులు రాకుండా ఉండడమే కాకుండా కరెంటు అమ్మకం ద్వారా కూడా ప్రజలు సంపాదిస్తారు.
నాకు చెప్పండి, ఇది విన్-విన్ పరిస్థితి కాదా? ప్రజలు మరియు సమాజంపై ఎటువంటి భారం లేదు మరియు మనపై భారం పడకుండా ప్రజలకు సహాయం చేయవచ్చు. ఎటువంటి సందేహం లేదు, ఇది కష్టపడి పని చేస్తుంది, కానీ మనం కష్టపడి పని చేయడానికి పుట్టాము. మన మెహసానా జిల్లా చాలా సమస్యాత్మకమైన జిల్లా, కానీ ఇక్కడి ప్రజలు కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.
స్నేహితులారా,
ప్రభుత్వం కరెంటు ఉత్పత్తి చేస్తే జనం కొనే పరిస్థితి ఇప్పటి వరకు ఉండేది. కానీ నేను మార్గాన్ని అనుసరించడానికి కట్టుబడి ఉన్నాను, దానితో దేశాన్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది నేను ముందుకు వెళ్లే మార్గంగా భావిస్తున్నాను. అందువల్ల, ప్రజలు తమ ఇళ్లలో సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడానికి మరియు రైతులు తమ పొలాల్లో సోలార్ పంపుల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. గతంలో హార్స్ పవర్ కోసం ఉద్యమించాల్సి వచ్చేది. సుమారు రెండు మీటర్ల భూమి వృథాగా ఉండే పొలానికి పక్కగా ఉన్న వైర్ల స్థానంలో ఇప్పుడు సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సోలార్ ప్యానెల్స్‌తో, మీ పంపులు పని చేస్తాయి, మీ పొలాలకు నీరు అందుతుంది మరియు దాని పైన, ప్రభుత్వం అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. మనం మొత్తం చక్రాన్ని మార్చలేదా లేదా? సౌరశక్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోంది మరియు లక్షలాది సోలార్ పంపులను పంపిణీ చేస్తోంది.
20-22 సంవత్సరాల వయస్సు గల చాలా మంది యువకులు ఇక్కడ కూర్చోవడం నేను చూస్తున్నాను మరియు మన రైతులు తమ పొలాలకు నీరు పెట్టడంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా తెలుసుకోలేరు. మెహసానాలో పరిస్థితి ఏమిటి? కరెంటు దొరకడం లేదు. వార్తాపత్రికలు విద్యుత్ అందుబాటులో లేకపోవడం గురించి నివేదికలను తీసుకువెళ్లేవి. మా అక్కా చెల్లెళ్లు నీళ్ల కోసం తలపై కుండలు పెట్టుకుని 3-3 కిలోమీటర్లు తిరిగేవారు. ఉత్తర గుజరాత్‌లోని నా తల్లులు మరియు సోదరీమణులు అలాంటి కష్ట సమయాలను ఎదుర్కొన్నారు. ఈరోజు 20-22 ఏళ్ల వయసున్న మన కొడుకులు, కూతుళ్లకు అప్పుడు పడుతున్న కష్టాలు కూడా తెలియవు. నేడు పాఠశాలలు మరియు కళాశాలలకు వెళ్లే చాలా మంది యువతకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
స్నేహితులారా,
మీ పూర్వీకులను అడిగితే మనం జీవించిన పరిస్థితులు చెబుతారు. ఒకప్పుడు చాలా సమస్యలు ఉండేవి. కరెంటు లేకపోవడంతో పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ రోజుల్లో టీవీలు, ఫ్యాన్లు లేవు. నీటిపారుదల, చదువుల నుంచి మందుల వరకు సమస్యలు ఉండేవి. ఇది మా ఆడపిల్లల చదువుపై తీవ్ర ప్రభావం చూపింది. మెహసానా జిల్లా ప్రజలు పుట్టుకతో గణితం మరియు సైన్స్‌లో చాలా మంచివారు. మీరు యుఎస్ సందర్శిస్తే, మీరు గణితం మరియు సైన్స్ రంగంలో ఉత్తర గుజరాత్ యొక్క అద్భుతాన్ని కనుగొంటారు. మీరు కచ్ మొత్తం బెల్ట్‌లో మెహ్సానా నుండి చాలా మంది ఉపాధ్యాయులను కనుగొంటారు. మాకు సామర్థ్యం ఉంది కానీ కరెంటు, నీటి సమస్యల వల్ల ఆ తరం వారు అందుకోవలసిన ఎత్తులను చేరుకోలేకపోయారు.
ఈ రోజు నేను ప్రస్తుత తరానికి అపరిమిత అవకాశాలు ఉన్నాయని మరియు వారి సామర్థ్యాన్ని కలిగి ఉండాలని చెప్పాలనుకుంటున్నాను. మిత్రులారా, ఆ సమయంలో శాంతిభద్రతల పరిస్థితి గురించి మీకు తెలియదు. తన కూతురి పెళ్లి కొనుగోళ్ల కోసం ఎవరైనా అహ్మదాబాద్ వెళ్లాల్సి వస్తే, అహ్మదాబాద్‌లో శాంతి ఉందా లేదా అని అక్కడి బంధువులను అడిగేవాడు. ఆ రోజులు ఉన్నాయా, లేవా మిత్రులారా? ప్రాక్టికల్‌గా ప్రతిరోజూ రచ్చ జరిగేది. పసిపాపల మొదటి పదాలు 'కాకా లేదా మామా' అని కాకుండా పోలీసుల పేర్లతో ఉండే పరిస్థితి, ఎందుకంటే వారు తమ ఇళ్ల వెలుపల ఉంచారు. పిల్లలు పుట్టినప్పటి నుండి 'కర్ఫ్యూ'లకు అలవాటు పడ్డారు. ఈ రోజు 20-22 ఏళ్ల యువత 'కర్ఫ్యూ' అనే పదాన్ని వినలేదు ఎందుకంటే గుజరాత్లో శాంతిభద్రతల పరిస్థితిలో మేము చేసిన కృషి కారణంగా. అభివృద్ధి పట్ల వ్యతిరేక వాతావరణం ఉన్నప్పటికీ, గత రెండు దశాబ్దాలుగా మీరు మాపై ఉంచిన విశ్వాసం వల్ల గుజరాత్ దేశంలోనే ప్రముఖ రాష్ట్రంగా అవతరించింది. గుజరాత్ పట్ల పెరుగుతున్న ఈ గౌరవానికి కోట్లాది మంది గుజరాతీలకు నమస్కరిస్తున్నాను.
సోదరులారా,
ప్రభుత్వం, ప్రజల ఉమ్మడి కృషి వల్లే కొత్త చరిత్ర సృష్టించి, నాపై మీకున్న అచంచల విశ్వాసం వల్లే ఇది సాధ్యమైంది. మీరు నా కులాన్ని, నా రాజకీయ ఒరవడిని ఎప్పుడూ చూడలేదు, కానీ మీరు నన్ను ఆశీర్వదించారు మరియు నాపై ప్రేమను కురిపించారు. మీకు ఒకే ఒక ప్రమాణం ఉంది. మీరు నా పనిని చూసి మీ ఆమోద ముద్ర వేశారు. మీరు నన్ను మాత్రమే కాదు, నా సహోద్యోగులను కూడా ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదాలు పెరిగేకొద్దీ, మీ కోసం మరిన్ని చేయాలనే నా కోరిక కూడా పుంజుకుంటుంది.
స్నేహితులారా,
మార్చు దానికదే రాదు; దానికి చాలా విస్తృతమైన విధానం అవసరం. గుజరాత్ సర్వతోముఖాభివృద్ధికి మేం ఐదు స్తంభాలను సృష్టించామని మెహసానా ప్రజలు సాక్షులు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీటి అవసరాలను తీర్చడానికి మేము మా బడ్జెట్లో భారీ మొత్తాన్ని వెచ్చించామని ఇతర రాష్ట్రాల నా సహచరులతో చెప్పాను. మనకు పెద్ద నీటి ఎద్దడి ఉంది మరియు పదేళ్లలో ఏడేళ్లలో కరువు ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలు మన బడ్జెట్లో ఇంత భారీ మొత్తాన్ని నీటి కోసం ఖర్చు చేస్తున్నాయని ఊహించలేకపోయాయి. అందువల్ల, మేము పంచామృత్ యోజనను ప్రారంభించినప్పుడు గుజరాత్‌పై ఎక్కువ దృష్టి పెట్టాము. నీళ్లు, కరెంటు లేకపోతే గుజరాత్ నాశనమైపోతుంది. రెండవది, నేను భవిష్యత్ తరాల గురించి ఆందోళన చెందాను, అందువల్ల, నేను వారి విద్య కోసం, వృద్ధుల ఆరోగ్యం మరియు ఆరోగ్యం కోసం నా మొత్తం శక్తిని వెచ్చించాను. మూడవదిగా, మన రైతుల శ్రేయస్సు కోసం పనిచేశాను. వ్యవసాయానికి సంబంధించి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ చాలా వెనుకబడి ఉంది. రైతులు అభివృద్ధి చెందితే మన గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి, మన గ్రామాలు అభివృద్ధి చెందితే నా గుజరాత్ వెనుకబడదు. అందుకే వ్యవసాయంపై దృష్టి పెట్టాం. అభివృద్ధి వేగంగా అభివృద్ధి చెందాలంటే మెరుగైన రోడ్లు, రైల్వే నెట్‌వర్క్‌లు, విమానాశ్రయాలు మరియు కనెక్టివిటీ ఉండాలి మరియు అప్పుడే అభివృద్ధి విజయాన్ని రుచి చూసే అవకాశాలు ఉంటాయి. కనికరంలేని అభివృద్ధి కోసం కొత్త పరిశ్రమలు మరియు పర్యాటకానికి కొత్త మార్గాలు ఉండాలి. మరి నేడు ఈ విషయాలన్నీ గుజరాత్లో కనిపిస్తున్నాయి. రైతులు అభివృద్ధి చెందితే మన గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి, మన గ్రామాలు అభివృద్ధి చెందితే నా గుజరాత్ వెనుకబడదు. అందుకే వ్యవసాయంపై దృష్టి పెట్టాం. అభివృద్ధి వేగంగా అభివృద్ధి చెందాలంటే మెరుగైన రోడ్లు, రైల్వే నెట్‌వర్క్‌లు, విమానాశ్రయాలు మరియు కనెక్టివిటీ ఉండాలి మరియు అప్పుడే అభివృద్ధి విజయాన్ని రుచి చూసే అవకాశాలు ఉంటాయి. కనికరంలేని అభివృద్ధి కోసం కొత్త పరిశ్రమలు మరియు పర్యాటకానికి కొత్త మార్గాలు ఉండాలి. మరి నేడు ఈ విషయాలన్నీ గుజరాత్లో కనిపిస్తున్నాయి.
స్టాట్యూ ఆఫ్ యూనిటీని చూడండి. ఈరోజు అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎక్కువ మంది ప్రజలు మన సర్దార్ సాహెబ్ పాదాలకు నివాళులు అర్పించేందుకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించడానికి వస్తున్నారు. కొద్ది కాలంలోనే మోధేరా పర్యాటక కేంద్రంగా మారుతుంది మిత్రులారా. పర్యాటకులెవరూ నిరాశ చెందకుండా మీరు సన్నద్ధం కావాలి. గ్రామం దీనిని నిర్ణయించిన తర్వాత మోధేరాను సందర్శించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు.
స్నేహితులారా,
ఉంఝాలోని అన్ని గ్రామాలకు 24 గంటల కరెంటు అందించాలని నేను మొదట ప్రస్తావించాను. మేము ఉంఝా నుండి జ్యోతిగ్రామ్ యోజనను ప్రారంభించాము. మా నారాయణ్ కాకా ఇక్కడ కూర్చున్నాడు, అతనికి బాగా తెలుసు. అన్ని గ్రామాలకు 24 గంటల కరెంటు ఇస్తామని చేసిన ప్రతిజ్ఞకు గుజరాతీలందరూ సాక్షి. ఉద్యమాన్ని ప్రారంభించి 1000 రోజుల్లో విజయవంతం చేశాం. నేను ఢిల్లీకి వెళ్లినప్పుడు 18,000 గ్రామాలు కరెంటు రాలేదని గుర్తించాను. అక్కడ కూడా నేను ఆ గ్రామాలన్నింటికీ 1000 రోజుల్లో విద్యుత్ కావాలని నొక్కి చెప్పాను మరియు గుజరాత్ కొడుకు మీరు ఆ 18,000 గ్రామాలలో విద్యుత్తును అందించారని గమనించడం మీకు సంతోషంగా ఉంటుంది.
2007లో నీటి ప్రాజెక్టును ప్రారంభించేందుకు నేను దేడియాసన్కు వచ్చినప్పుడు నాకు గుర్తుంది. ఆ సమయంలో, నేను నీటి ప్రాముఖ్యతను నొక్కి, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని ప్రజలను కోరాను. మా 15 ఏళ్ల ప్రయత్నాలు ఫలించాయని, మా పొలాలను సస్యశ్యామలం చేసి, మా అమ్మానాన్నల ముఖాల్లో చిరునవ్వులు పూయించాయని టీవీలో వార్తలు చూసినప్పుడు 15 ఏళ్ల తర్వాత మాత్రమే వారికి అర్థమైంది. ఇది నీటి శక్తి. కాల్వల నిర్మాణానికి సుజలాం సుఫలాం పథకాన్ని ప్రారంభించాను. కోసిలో కోర్టు కేసుల గురించి పట్టించుకోకుండా సుజలాం సుఫలాం కాలువకు భూమిని నాకు ఇచ్చారు కాబట్టి గుజరాత్ రైతులకు నేను ఎక్కువ రుణపడి ఉన్నాను. అనతికాలంలోనే సుజలాం సుఫలాం కాలువ సిద్ధమై సముద్రాల్లో పారుతున్న జలాలు ఉత్తర గుజరాత్‌లోని పొలాలకు చేరుకోవడంతో ఉత్తర గుజరాత్‌లోని ప్రజలు మూడు పూటలా వంట చేయడం ప్రారంభించారు.
ఈ రోజు నేను నీటి సంబంధిత పథకాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయడం విశేషం. విస్నగర్, మా గ్రామం వడ్నగర్ మరియు మా ఖేరాలు తాలూకా ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. సులభంగా నీటి లభ్యత ఉన్నప్పుడు, అది కుటుంబాల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది మరియు మన తల్లులు మరియు సోదరీమణుల సామర్థ్యాన్ని బాగా ఉపయోగించుకుంటుంది. ఇది పశుపోషణ మరియు వ్యవసాయానికి కూడా సహాయపడుతుంది. మెహసానా జిల్లా పశుపోషణకు ప్రసిద్ధి. 1960 తర్వాత మన డెయిరీలు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించాయని అశోక్‌భాయ్ నాకు చెప్పారు. అక్రమార్జన ఆపి మిమ్మల్ని లాభాల్లో భాగస్వాములను చేసిన వారికి డెయిరీ పనులను అప్పగించిన ఉత్తర గుజరాత్‌లోని పశుపోషణలో నిమగ్నమైన వ్యక్తులను నేను అభినందిస్తున్నాను.
సోదరులారా,
నీరు, పశుగ్రాసం లేని కరువు రోజులను మీరు చూశారు మరియు దేశం నలుమూలల నుండి రైళ్లలోడు మేత తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీరు లేకపోవడంతో జంతువులు చితికిపోయాయి మరియు వార్తాపత్రికలు అలాంటి నివేదికలతో నిండిపోయాయి. ఈరోజు మనం ఆ సమస్యలన్నింటి నుండి విముక్తి పొందాము. అందుకే, గుజరాత్‌ను ఆ సమస్యల నుంచి ఎలా గట్టెక్కించామో నేడు 20-22 ఏళ్ల మధ్య వయసున్న యువతకు తెలియదు. ఇప్పుడు మనకు క్వాంటం జంప్ అవసరం. మన సన్మానాలపై మనం విశ్రమించకూడదు. ఇప్పటి వరకు సాధించిన దానికి నాలుగు రెట్లు పెరుగుదల అవసరమని నేను నమ్ముతున్నాను.
విద్యుత్ మరియు నీరు ఉంటే, అది పారిశ్రామిక అభివృద్ధికి దారితీస్తుంది మరియు వ్యవసాయ మరియు పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇప్పుడు ఫుడ్ పార్క్‌లకు గొప్ప అవకాశం ఉంది. ఎఫ్పీఓలు స్థాపించబడుతున్నాయి. విపరీతమైన డిమాండ్ ఉన్నందున మా మెహసానా ఔషధాలు, సిమెంట్, ప్లాస్టిక్ మరియు ఇంజనీరింగ్ ఉత్పత్తులలో ప్రధాన శక్తిగా ఎదుగుతోంది. మండలం బేచరాజీ ప్రత్యేక పెట్టుబడి ప్రాంతంలో మన ఆటోమొబైల్ పరిశ్రమ గురించి చెప్పండి! జపాన్ ప్రజలు ఇక్కడ కార్లను తయారు చేసి జపాన్‌కు ఎగుమతి చేస్తారు. ఇంతకంటే ఏం ఆశించవచ్చు! జపాన్ ప్రజలు ఇక్కడికి వచ్చి తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి ఇక్కడ కార్లను తయారు చేస్తారు. జపాన్ ఇక్కడి నుంచి కార్లను దిగుమతి చేసుకుంటుందనేది గుజరాత్ యువత తెలివి, చెమట. ఇక్కడ మూడు ప్లాంట్లు ఉండగా లక్షల కార్లు తయారవుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ సైకిళ్లను తయారు చేయడం చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు కార్లు తయారవుతున్నాయి. నా మాటలు గుర్తు పెట్టుకో, స్నేహితులు. గుజరాత్లో సైకిళ్లను తయారు చేయలేకపోగా, నేడు ఇక్కడ కార్లు, మెట్రో కోచ్‌లు తయారవుతున్నాయి. ఆకాశంలో కనిపించే విమానాలు గుజరాత్ గడ్డపై కూడా తయారయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.
సుజుకి కోసం చిన్న చిన్న విడిభాగాలను తయారు చేసే 100 కంటే ఎక్కువ మంది సరఫరాదారులు ఉన్నారు. ప్రపంచం మారుతోంది మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు మించిన మార్గం లేదు. మా అమ్మ బాచారాజీ పాదాల చెంతనే అలాంటి పెద్ద ప్రాజెక్టు ఒకటి. మా హంసల్పూర్లో లిథియం ఐరన్ ప్లాంట్ ఉంది మరియు హంసాల్పూర్ రైతులకు నేను మళ్ళీ ధన్యవాదాలు చెప్పాలి. నేను మీతో ఒక ఉదంతాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి ప్రాజెక్టులన్నీ వృధాగా ఉన్నాయని అనేక నివేదికలు వచ్చాయి మరియు ప్రజలు ఆందోళనలకు ప్రేరేపించబడ్డారు. మేము సుజుకీ ప్రాజెక్టును ఇక్కడికి తీసుకురావాలని కోరినప్పుడు హన్సల్పూర్ రైతులందరూ తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఇక్కడి భూములు ఇక్కడ మినుము పండించడం కష్టం. మాకు అప్పుడు కరువు వచ్చింది మరియు పెద్ద ఆందోళన జరిగింది. నేను అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిని. గాంధీనగర్‌కు వచ్చి నాకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నా దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నేను వారిని చర్చలకు ఆహ్వానించి వారి ఫిర్యాదులను విన్నాను. తమ భూమిని విడిచిపెట్టబోమని చెప్పారు. వారి ఇష్టమైతే గుజరాత్‌లోని మరో చోటికి మొక్కను తరలిస్తానని చెప్పాను. ఐదు-ఏడు మంది తెలివైన వారు ఉన్నారు మరియు ప్లాంట్‌ను ఎక్కడికీ మార్చవద్దని మరియు అక్కడే ప్రారంభించమని నన్ను వేడుకున్నారు. రైతులు పెద్దరికం ప్రదర్శించి ఆందోళన విరమించారు. మీరు చూడండి, మొత్తం పారిశ్రామిక బెల్ట్ నేడు అద్భుతాలు చేస్తోంది మరియు మెహ్సానా యొక్క మొత్తం అభివృద్ధికి దారితీస్తోంది.
సోదరులారా,
వెస్ట్రన్ ఫ్రైట్ కారిడార్ మరియు ఢిల్లీ-ముంబై ఫ్రైట్ కారిడార్ దృష్ట్యా, ఇది ఒక ముఖ్యమైన తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాకుండా, లాజిస్టిక్స్ మరియు స్టోరేజీ రంగాలలో అనేక కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి మరియు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడుతున్నాయి.
స్నేహితులారా,
మేము గత రెండు దశాబ్దాలలో కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చాము. నరేంద్ర , భూపేంద్ర ల రూపంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి పనుల్లో అపూర్వ వేగం పుంజుకుంది. 1930లలో బ్రిటీష్ వారు 90-95 సంవత్సరాల క్రితం ఒక బ్లూప్రింట్ సిద్ధం చేశారని తెలిస్తే మీరు బాధ పడతారు. ఒక ఫైల్ ఉంది మరియు దానిలో మెహసానా-అంబాజీ-తరంగ-అబు రోడ్ రైలు మార్గాన్ని పేర్కొనే మ్యాప్ ఉంది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పక్కనపెట్టాయి. మేము ఆ ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించాము మరియు తాజా ప్రణాళికలను రూపొందించాము. మా అంబాకు నివాళులు అర్పించేందుకు పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేశాను. ఆ రైల్వే లైన్ సిద్ధమైతే మీరు మార్పును ఊహించవచ్చు. ఇది ఈ ప్రాంతంలో గొప్ప శ్రేయస్సును తీసుకురానుంది.
స్నేహితులారా,
బహుచరాజీ, మోధేరా, చనాస్మా రహదారిని నాలుగు లేన్లుగా మార్చకముందే సింగిల్‌లేన్ వల్ల పెద్దఎత్తున ఇబ్బందులు ఎదురయ్యాయి. మేము బహుచారాజీకి వచ్చేప్పుడు, ఒక బస్సు మాత్రమే వెళ్ళేది. ఎదురుగా మరో బస్సు వస్తే పెద్ద సమస్య అవుతుంది. ఆ రోజులు గుర్తున్నాయా లేక మరచిపోయావా? నేడు ఇది నాలుగు లైన్ల రహదారి. విద్య, నైపుణ్యం, ఆరోగ్యం లేకుండా అభివృద్ధి అసంపూర్తి. అందువల్ల, నేను మెహసానాలో మరియు గుజరాత్లో ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాను. సర్దార్ సాహెబ్ స్మారకార్థం ప్రభుత్వోద్యోగుల శిక్షణ కోసం ఒక సంస్థ ఏర్పాటు చేయబడుతోంది, ఇది ప్రభుత్వ యువకులు అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది.
వాద్నగర్లో మెడికల్ కాలేజీని నిర్మించాలనే ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. ఇంతకు ముందు, ప్రజలు తమ 11 వ చదువులు పూర్తి చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లాలని ఆలోచించేవారు. ఇప్పుడు ఆ గ్రామంలో మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నారు మరియు ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వం గుజరాత్‌లోని అన్ని జిల్లాలకు ఆధునిక ఆరోగ్య సదుపాయాలను అందించడానికి కృషి చేస్తుంది.
స్నేహితులారా,
ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాలు తక్కువ ధరకే మందులను అందిస్తున్నందుకు నేను సంతృప్తి చెందాను. ఒక వృద్ధుడు ఏదైనా వ్యాధితో బాధపడుతున్న కుటుంబానికి వైద్య బిల్లుల కోసం ప్రతి నెలా కనీసం 1,000 రూపాయలు ఖర్చు అవుతోంది. మీరందరూ ఈ జన్ ఔషధి కేంద్రాల నుండి మందులు కొనవలసిందిగా కోరుతున్నాను. ఇవి ప్రామాణికమైన మరియు సాధారణ మందులు. గతంలో 1000 రూపాయలు ఉన్న మెడికల్ బిల్లులు 100-200 రూపాయలకు పడిపోయాయి. మీరు ప్రతి నెలా 800 రూపాయలు ఆదా చేసేలా మీ కొడుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ జన్ ఔషధి కేంద్రాలను ఉపయోగించుకోండి.
పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పించే టూరిజం గురించి ప్రస్తావించాను. ఇటీవల వాద్నగర్లో తవ్వకాలు జరిపి వేల సంవత్సరాల నాటి వస్తువులు లభించాయి. కాశీ నాశనమైనట్లే, ఇది భారతదేశంలోని రెండవ నగరం, మన వాద్నగర్. త్రవ్వకాల్లో ఇది గత 3000 సంవత్సరాలలో ఎన్నడూ నశించలేదని మరియు ఎల్లప్పుడూ కొంత మానవ నివాసం ఉందని చూపిస్తుంది. సూర్య దేవాలయం, బహుచారాజీ తీర్థయాత్ర, ఉమియా మాత, సత్రెలింగ్ చెరువు, రాణి కి వావ్, తరంగ కొండ, రుద్ర మహాలయ, వాద్‌నగర్‌లోని తోరణాలు మొదలైన వాటిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒక పర్యాటకుడు కనీసం రెండు రోజులు. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి.
స్నేహితులారా,
గత రెండు దశాబ్దాలుగా దేవాలయాలు, శక్తిపీఠాల పునరుద్ధరణకు కృషి చేశాం. సోమనాథ్, చోటిలా, పావగఢ్ల పరిస్థితి మెరుగుపడింది. పావగడ్డపై ఎప్పుడూ జెండా ఎగరలేదు. ఇటీవల, నేను ఇక్కడ ఉన్నాను మరియు 500 సంవత్సరాల తర్వాత జెండాను ఎగురవేశారు. అంబాజీ మునుపెన్నడూ లేని విధంగా మెరుస్తున్నాడు. సాయంత్రం అంబాజీలో ప్రార్థనలు జరుగుతాయని మరియు శరద్ పూర్ణిమ నాడు వేలాది మంది ప్రజలు అక్కడ ప్రార్థనలు చేయబోతున్నారని నాకు చెప్పారు.
సోదరులారా,
గిర్నార్, పలితానా లేదా బహుచారాజీ అయినా, అటువంటి అన్ని తీర్థయాత్ర కేంద్రాల వద్ద పర్యాటకులను ఆకర్షించడానికి భారీ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. మరి టూరిస్టులు వస్తే అందరికీ మంచిది మిత్రులారా. మా మంత్రం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్. ఇదీ డబుల్ ఇంజన్ ప్రభుత్వ మంత్రం. తారతమ్యం లేని సూర్యకాంతిలా, చేరినంత వరకు తన కాంతిని పంచి, ప్రతి ఇంటికి అభివృద్ధి వెలుగులు చేరాలి. మాకు మీ ఆశీస్సులు కావాలి. మా బృందానికి మీ ఆశీస్సులు కావాలి, తద్వారా మేము గుజరాత్ అభివృద్ధిని పెంపొందించడం కొనసాగించగలము. మరోసారి, మీ అందరికీ చాలా అభినందనలు మరియు ధన్యవాదాలు.
భారత్ మాతా కీ - జై!
భారత్ మాతా కీ - జై!
పూర్తి శక్తితో నాతో మాట్లాడండి. మన మెహసానా అభివృద్ది లో వెనుకబడిపోకూడదు.
మీ చేతులు పైకెత్తి నాతో పాటు మాట్లాడండి: భారత్ మాతా కీ – జై! భారత్ మాతా కీ - జై! భారత్ మాతా కీ - జై!
ధన్యవాదాలు.
( |
pib-271897 | f5e3a7f179e9c3f4d079b1fd0e26768622415d0ea7390e328862e70bac2edf8f | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకాశ్మీర్, లద్దాక్ లలో కోవిడ్ -19 నియంత్రణ,సన్నద్ధత ,నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈరోజు జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ గిరీష్ చంద్ర ముర్ము, లద్దాక్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్.కె.మాథూర్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్, హిమాచల్ ప్రదేశ్ శ్రీ జైరామ్ ఠాకూర్లతో కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.వివిధ రాష్ట్రాల ఆరోగ్యమంత్రులు ,రెడ్ జోన్ జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించడంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోవిడ్ -19 కట్టడి, కేసుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు.
(ఈ సందర్భంగా డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, 2020 మే 12 నాటికి దేశం మొత్తం 70,756 కేసులు నమోదయ్యాయని, ఇందులో 22,455 మంది కి వ్యాధినయమైందని, 2,293 మంది మరణించారని చెప్పారు. గత 24 గంటల్లో, కొత్తగా 3,604 కేసులు నమోదయ్యాయని, 1538 మంది రోగులకు నయమైందని చెప్పారు. కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం గత 14 రోజులలో 10.9 గా ఉండగా గత మూడు రోజులలో ఇది 12.2 కు పెరిగిందని ఆయన చెప్పారు. మరణాల రేటు 3.2 శాతం గా ఉండగా, కోలుకుంటున్న వారి శాతం 31.74 శాతం. నిన్నటివరకూ గమనించినట్టయితే ఐసియులో 2.37 శాతం కోవిడ్ -19 యాక్టివ్ కేసులు ఉన్నట్టు చెప్పారు0.41 శాతం వెంటిలేటర్ పై ఉన్నారని 1.82 శాతం ఆక్సిజన్ మద్దతుతో ఉన్నారన్నారు. దేశంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం పెరిగిందని, ఇది రోజుకు 1,00,000 టెస్టులుగా ఉందన్నారు. 347 ప్రభుత్వ లేబరెటరీలు, 137 ప్రైవేటు లేబరెటరీలు, కలిపి మొత్తం 17,62,840 కోవిడ్ -19 పరీక్షలను ఇప్పటి వరకూ నిర్వహించినట్టు మంత్రి చెప్పారు. నిన్న ఒక్కరోజే 86,191 శాంపిళ్ళు పరీక్షించారు.
, “కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి కేంద్రప్రభుత్వం రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో, ముమ్మర చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాలు , ఐసియు పడకలు , క్వారంటైన్ కేంద్రాలుప తగినన్ని గుర్తించడం జరిగింది. కోవిడ్ -19 కు సంబంధించి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి దేశం సంసిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు తగిన సంఖ్యలో మాస్క్ లు , వ్యక్తిగత రక్షణ పరికరాలు మొదలైనవి అందించడం ద్వారా కేంద్రం సహకరిస్తోందని కూడా ఆయన అన్నారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని కోవిడ్ -19 కేసుల స్థితి , వాటి నిర్వహణపై ప్రదర్శన ఇచ్చిన తరువాత, డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ “ స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు మరింత నిఘా, పర్యవేక్షణపై దృష్టి పెట్టాలి. వివిధ ప్రాంతాలనుంచి తిరిగి వచ్చిన వారందరికీ ట్రేసింగ్, తగిన పరీక్ష , సకాలంలో చికిత్స అందించాలన్నారు.విదేశాల నుండి తిరిగి వచ్చేవారు కూడా ఇందులో ఉన్నారు ”. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరుకున్న వారికి పరీక్షలు నిర్వహించడం, వారిని క్వారంటైన్‌కు పంపడం, వారికి తగిన పరీక్షలు నిర్వహించడం, తదుపరి చికిత్స కోసం చేపడుతున్న సన్నాహాలను రాష్ట్రాలు, యుటిలు వివరించాయి.. మెరుగైన నిఘా , తగిన వైద్య పరీక్షల కోసం తిరిగి వచ్చిన వారందరికీ ఆరోగ్య సేతును డౌన్లోడ్ చేసుకోవడం తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు.
కోవిడ్ బాధిత జిల్లాలు లేదా దీని ప్రభావం లేని జిల్లాల్లో తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ,ఇన్ఫ్లుఎంజా వంటి అనారొగ్యాల విషయంలో నిఘా పెంచాల్సిన అవసరంపై డాక్టర్ హర్ష్ వర్ధన్ నొక్కి చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు అక్కడ ఉంటే మెడికల్ కాలేజీల సహాయం తీసుకోవాలని సూచించారు. "ఇటువంటి చర్యలు ప్రారంభ దశలో బయటకు కనిపించని లక్షణాలుగల కేసులను ప్రారంభదశలోనే గుర్తించడానికి సహాయపడతాయి, తద్వారా దానిని అప్పటికప్పడు దానిని అరికట్టడానికి సహాయపడుతుంది" అని ఆయన చెప్పారు
ఉత్తరాఖండ్ లో SARI, ILI నిఘా కోసం చేపట్టిన చర్యలు, కాంటాక్ట్ ట్రేసింగ్ , పర్యవేక్షణ కోసం IDSP చేపట్టిన కృషిని డాక్టర్ హర్షవర్దన్ ప్రశంసించారు. కోవిడ్ తో సంబంధం లేని ముఖ్యమైన వైద్య సేవలను అందించడానికి, సుదూర ప్రాంతాలలోని వారిని చేరుకోవడానికి మొబైల్ మెడికల్ వ్యాన్లను ప్రారంభించినట్లు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం పేర్కొంది. కొంతమంది వైద్యులను పోలీసు సిబ్బందిని రిజర్వులో ఉంచుతున్నామని, తద్వారా లద్దాక్‌లో కోవిడ్ -19 పై పూర్తి సమయం కేటాయించడం కోసం వారిని రొటేషన్ ప్రాతిపదికన నియమించడానికి వీలు కలుగుతుందని శ్రీ ఆర్.కె. మాథూర్ తెలిపారు. కోవిడ్ పై ప్రజలలో అవగాహన కల్పించడం, వారిలో విశ్వాసం పెంపొందించడానికి పంచాయతీలు , సమాజ పెద్దలతో కలిసి పని చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సాంకేతిక , ఇతర సహకారానికి అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు కృతజ్ఞతలు తెలిపాయి. హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లా లో కోవిడ్ -19 అనంతర పరిస్థితులలో సురక్షిత కార్యకలాపాల నిర్వహణకు బార్బర్లు ,సెలూన్ ఆపరేటర్లను సిద్ధం చేయడానికి శిక్షణ ఇస్తున్నారు. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బంది, పారా మిలటరీ దళాలకు ఆయుర్వేద రోగనిరోధక శక్తి పెంచే బూస్టర్లను అందించినట్లు శ్రీ జై రామ్ ఠాకూర్ తెలిపారు.
లద్దాక్‌లో పొగాకు వినియోగం ఎక్కువగా ఉన్నందున అక్కడ బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయడాన్ని ఇంతకు ముందు విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిషేధించాల్సి ఉందన్నారు.
రోగనిరోధకత చర్యలు, టిబి కేస్ లను కనుగోనడం , చికిత్స, డయాలసిస్ రోగులకు రక్త మార్పిడి అందించడం, క్యాన్సర్ రోగులకు చికిత్స, గర్భిణీ స్త్రీలకు ఎ.ఎన్.సి మొదలైన వాటికి సంబంధించి కోవిడ్ తో సంబంధం లేని ముఖ్యమైన ఆరోగ్య సేవలను అందించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్రాలకు పునరుద్ఘాటించారు. రక్తపోటు, డయాబెటిస్ వంటి మూడు రకాల క్యాన్సర్ల కోసం ఆయుష్మాన్ భారత్-హెల్త్ , వెల్నెస్ సెంటర్లను స్క్రీనింగ్ కోసం ఉపయోగించవచ్చని కూడా పేర్కొన్నారు.
ఇలాంటి కేసులను సకాలంలో పరీక్షించడంతో పాటు నివారణ, మందులు , రోగనిరోధక శక్తిని పెంచేందుకు చర్యలను రాష్ట్రాలు చేపట్టాలని ఆయన రాష్ట్రాలకు గుర్తు చేశారు. అవసరమైన ఔషధాల నిల్వను తగినంతగా ఉంచాలని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. కోవిడ్ కాని ముఖ్యమైన సేవలకు సంబందంచి ఫిర్యాదుల పరిష్కారం కోసం 1075 తో పాటు హెల్ప్‌లైన్ నంబర్ 104 ను ఉపయోగించవచ్చని, ఈ సేవల అందుబాటు గురించి తెలియజేయాల్సిందిగా రాష్ట్రాలకు సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పారు. వెక్టర్ వ్యాధుల నివారణకు తగిన చర్యలు కూడా తీసుకోవలసిన అవసరం ఉందని మంత్రి సూచించారు. సకాలంలో జీతాలు, ప్రోత్సాహకాలు చెల్లించడం ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచుతుందని , రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు వీటిని సకాలంలో విడుదల చేయాలని కోరారు
హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా, చంబా, హమీర్పూర్, సిర్మౌర్, సోలన్ , కాంగ్రా వంటి వివిధ జిల్లాల కలెక్టర్లతో డాక్టర్ హర్ష్ వర్ధన్ సుదీర్ఘంగా మాట్లాడారు; జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్, శ్రీనగర్, బండిపోరా , అనంతనాగ్; ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్; లడఖ్ లో లే , కార్గిల్ జిల్లాల్లో కోవిడ్ -19 నియంత్రణ పరిస్థితులు, నిర్వహణ గురించి సవివరంగా చర్చించారు. ఇటువంటి సమావేశాలు మరింత బాగా పనిచేయడానికి సహాయపడతాయని ,ఏదైనా గ్యాప్‌లు ఉంటే వాటిని పూరించడానికి, సమస్యలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ,పరిష్కరించడానికి సహాయపడతాయని ఆయన అన్నారు.
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి ప్రీతిసుడాన్, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ సంజీవ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ.ఎస్.డి శ్రీ రాజేష్ భూషణ్, అలాగే ఎన్.హెచ్.ఎం. ఎఎస్, ఎండి శ్రీమతి వందన గుర్నాని, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వికాస్ శీల్, ఎన్సిడిసి డైరక్టర్ డాక్టర్ ఎస్.కె.సింగ్, ఆరోగ్య శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ, ఇతర సీనియర్ రాష్ట్ర స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. |
pib-226526 | 8e271584554d4ecec6f1f7efa466c3659fde6b116332d0f890f2425e0ed822a5 | tel | విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఎన్‌హెచ్‌పిసి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఉత్తమ్ లాల్
భారతదేశ అగ్రగామి జలవిద్యుత్ కంపెనీ అయిన ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ డైరెక్టర్ గా శ్రీ ఉత్తమ్ లాల్ బాధ్యతలు స్వీకరించారు.
ఎన్‌హెచ్‌పిసిలో నియామకానికి ముందు, శ్రీ లాల్ ఎన్టిపిసి లిమిటెడ్‌లో చీఫ్ జనరల్ మేనేజర్ గా విధులను నిర్వహించారు. సుదీర్ఘమైన 35 ఏళ్ళ వృత్తి జీవితంలో ఆయనకు పర్సనల్ మేనేజ్మెంట్, పారిశ్రామిక సంబంధాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత వంటి అంశాలలో ఆయనకు సుసంపన్నమైన, విస్త్రత అనుభవం ఉంది. విద్యుత్ రంగంలో ఆయనకు గల నైపుణ్యం, దీర్ఘ అనుభవం కారణంగా ప్రాచుర్యం పొందిన ఆయన, సంస్థ లక్ష్యం, దృక్పథ సేవలో మానవ వనరుల సామర్ధ్యాన్ని సమ్మిళితం చేయాలని యత్నిస్తున్న ఒక ప్రముఖ హెచ్ఆర్ ప్రొఫెషనల్.
పర్సనల్ మేనేజ్మెంట్ & పారిశ్రామిక సంబంధాలలో గ్జేవియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి శ్రీ లాల్ పిజి డొప్లొమాను పొందారు. ఆయన రాంచీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టాను కూడా ఆయన పొందారు. |
pib-272103 | ae2c540f5c0ec74fd99d7460b7357fb405f029eae0192ab42ba6b1054027ee2b | tel | రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వాహన తుక్కు విధానం
ప్రోత్సాహకాలు/నిరుత్సాహకాల శ్రేణితో; పాత, కాలం చెల్లిన కాలుష్య వాహనాలను తొలగించడానికి తుక్కు విధానం రూపొందించారు. వాహన, అనుబంధ పరిశ్రమల్లో అధిక అభివృద్ధికి ఇది కారణమయ్యే అవకాశం ఉంది. అరుదైన లోహాలు, ఉక్కు పరిశ్రమకు ముడి పదార్థాలను లభ్యతపైనా భరోసానిస్తుంది. ఈ విధానం కారణంగా, తుక్కు వ్యవస్థ అభివృద్ధితో అధిక ఉపాధి అవకాశాలకు, రవాణా రంగంలో అధిక వృద్ధికి అవకాశం ఉంది.
కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ లోక్‌సభకు సమర్పించారు. |
pib-89001 | a69c74e9be5c3a8f7cc47035892e1da05e901a86f6ac1ed90b8e7cdc7fdc0a8e | tel | జల శక్తి మంత్రిత్వ శాఖ
గ్రామీణ నీటిసరఫరా వ్యవస్థలపై ఐ.ఒ.టి. సెన్సార్ల పర్యవేక్షణ!
జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో కసరత్తు. సరఫరాలో సవాళ్లకు డిజిటల్ పరిజ్ఞానంతో పరిష్కారం
గ్రామాల్లో ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా వ్యవస్థలపై పర్యవేక్షణకు, దేశంలోని 6లక్షలకు పైగా గ్రామాల్లో జల జీవన్ మిషన్ పథకం అమలును సమర్థవంతంగా పరిశీలించడానికి డిజిటల్ మార్గాన్ని ఆశ్రయించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. నీటి సరఫరా వ్యవస్థలపై పర్యవేక్షణకు సెన్సార్ ఆధారంగా పనిచేసే అధునాతనమైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను తొలిసారిగా వినియోగించాలని జలశక్తి మంత్రిత్వ శాఖ సంకల్పించింది. ఇందుకోసం టాటా కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ట్రస్ట్ , టాటా ట్రస్టుల సహకారంతో ఐదు రాష్ట్రాల మారుమూల గ్రామాలలో ప్రయోగాత్మక ప్రాజెక్టులను జాతీయ జల జీవన్ మిషన్ ఇటీవలే పూర్తి చేసింది. ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ప్రయోగాత్మక పథకాలు ఇటీవలే పూర్తయ్యాయి. ఖర్చులో పొదుపైన, నిర్మాణంలో ధృడమైన సెన్సార్లను వాడటం, వాటి వినియోగం ద్వారా నీటి సరఫరా సమస్యలకు సుస్థిరమైన పరిష్కారం సాధించడం ఈ ప్రయోగాత్మక పథకాల కీలక లక్షణం. నాణ్యతపై, లేదా పనితీరుపై ఏ మాత్రం రాజీ పడకుండా నీటిసరఫరా మౌలిక సదుపాయాల వ్యయాలలో తక్కువ శాతం ఖర్చుతో బలమైన పరిష్కారాన్ని రూపొందించడం,. ఈ ప్రయత్నంలో ఎదురయ్యే ముఖ్య సవాళ్లలో ఒకటిగా చెప్పవచ్చు. అయితే, భారీస్థాయిలో పనులు చేపట్టినపుడు ఈ ఖర్చులు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు. తయారీదారులతో సహా ఎక్కువ విక్రయ సంస్థలు స్వదేశీ సంస్థలే కావడంతో, ప్రభుత్వం ప్రబోధించే ఆత్మ నిర్భర్ భారత్ నినాదానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వైరస్ మహమ్మారి ఎన్ని సవాళ్లు విసిరినా ఈ ప్రయోగాత్మక పథకాలన్నీ గత ఏడాది సెప్టెంబర్‌లో పనిచేయడం ప్రారంభించాయి.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత రిమోట్ సెన్సార్లను వినియోగం ద్వారా ఎటువంటి మానవ జోక్యం లేకుండా నీటిసరఫరా పథకాలపై వాస్తవ సమయ సమాచారం మనకు అందుబాటులోకి వస్తుంది. ఇది క్షేత్రస్థాయిలో సమర్థమైన పర్యవేక్షణకు నిర్వహణకు దోహదపడటమేకాక, ప్రభుత్వ నీటి సరఫరా శాఖ అధికారులకు, ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ అధికారులకు, పౌరులకు వాస్తవ సమయ సమాచారాన్ని అందిస్తుంది. ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా నీటి సరఫరా జరిగేలా చూడాలంటే, గ్రామీణ నీటి సరఫరా పథకాలపై ముందుచూపుతో కూడిన పర్యవేక్షణ చాలా అవసరం. పటిష్టమైన నిర్వహణా సామర్థ్యం, వ్యయం తగ్గింపు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ ఈ పర్యవేక్షణ జరపాల్సి ఉంటుంది. పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అందే వాస్తవసమాచారం సేవల బట్వాడాను మెరుగుపరిచేందుకు, నీరు వంటి విలువైన ప్రకృతి సంపద సరఫరాకు సంబంధించి పారదర్శక విధానానికి దోహదపడుతుంది.
దేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి ఆయా ప్రాంతాల గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నమూనాలు పలురకాలుగా, పరస్పరం విభిన్నంగా ఉంటాయి. ఇటీవల మొదలైన ప్రయోగాత్మక నీటి సరఫరా పథకాలను విభిన్నమైన వ్యసాయక, వాతావరణ పరిస్థితులున్న ప్రాంతాల్లో చేపట్టారు. పశ్చిమ హిమాలయాలు, ఎడారి ప్రాంతాలనుంచి గంగానదీ మైదాన ప్రాంతాల్లో ఈ ప్రయోగాత్మక పథకాలు చేపట్టారు. భూగర్భ జలాల ఆధారంగా చేపట్టిన బోరుబావులు, కొండల్లోని చెలిమలు, ఊటలు, భూమి ఉపరితలంపై ప్రవహించే నదులు, ఆనకట్టలు వనరులుగా ఈ పథకాలను చేపట్టారు. కొన్ని వందలమంది జనాభాతో కూడిన గ్రామాలతోపాటు, వేల సంఖ్యలో ఉన్న గ్రామాలు కూడా ఈ ప్రయోగాత్మక నీటి పథకాల పరిధిలో ఉన్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమగ్రమైన పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థను కూడా ఈ పథకాలకోసం రూపొందించారు. రాజస్థాన్ రాష్ట్రం, సిరోహి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవస్థలకోసం విద్యుత్ గ్రిడ్.తో సంబంధంలేకుండా సౌరశక్తి, బ్యాటరీ విద్యుత్ ను మాత్రమే వినియోగించారు.
ఈ ప్రయోగాత్మక నీటి పథకాల్లో నీటి సరఫరాకు సంబంధించిన అన్ని అంశాలను మదింపు చేసేందుకు ప్రవాహ మీటర్లు, భూగర్భ జలమట్టం సెన్సార్లు, క్లోరిన్ విశ్లేషణ పరికరాలు, నీటి ఒత్తిడి లెక్కించే సెన్సార్లు, పంపు కంటోలర్లు తదితర పరికరాలను తెప్పించారు. సరఫరా జరిగే నీటి పరిమాణం, నాణ్యత తదితర అంశాలను పరిశీలించేందుకు, నిర్వహణా సామర్థ్యాన్ని పెంచేందుకు వీటిని వినియోగించారు. క్లౌడ్, అనలిటిక్స్ ప్రాతిపదికతో కూడిన ఐ.ఒ.టి. ప్లాట్ ఫాంను భౌగోళిక సమాచార వ్యవస్థతో మేళవించి పటిష్టమైన వ్యవస్థకు రూపకల్పన చేశారు.
నీటి సరఫరాలో ఎదురయ్యే అనేక సమస్యలను గుర్తించేందుకు ఈ ప్రయోగాత్మక పథకాలు ఎంతగానో దోహదపడ్డాయి. నీటి లీకేజీ, తక్కువ ఒత్తిడి తదితర సమస్యలను వెంటనే తెలుసుకుని సదరు సమస్యలను క్షేత్రస్థాయిలో అక్కడిక్కడే పరిష్కరించేందుకు వీలు కలిగించాయి. వేగంగా క్షీణిస్తున్న భూగర్భ జలమట్టాలపై ఇటీవల ఈ పథకాలు అధికారులను, గ్రామీణ సంఘాలను అప్రమత్తం చేశాయి. దీనితో గ్రామాల్లోని వారు బోరుబావులను రీచార్జి చేసుకునేలా తమ వనరులను బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ప్రజలు బాధ్యతాయుతంగా, సమర్థంగా నీటిని వినియోగించుకోవడం, లీకేజీలను పసిగట్టే డాటా ఆధారిత వ్యవస్థల సహాయంతో నిర్వహణా వ్యయాన్ని తగ్గించుకోవడం తదితర ప్రయోజనాలు కూడా ఈ ప్రయోగాత్మక పథకాల ద్వారా లభించాయి.
|
|
నీటి సరఫరాపై గ్రామాల్లో స్థానిక భాషలో సమాచారాన్ని తెలిపే ఒక డ్యాష్ బోర్డుతో టెలివిజన్ ఏర్పాటు చేస్తారు. నీటి సరఫరాలో తలెత్తే లోపాలను సరిదిద్దేందుకు గ్రామ నీటి సరఫరా పారిశుద్ధ్య కమిటీ లేదా స్థానిక పానీ సమితి తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ ఏర్పాటు అనేక సానుకూల ఫలితాలకు దారితీసింది. ఇదివరకైతే నీటిలో క్రిమిసంహారక మందులు చల్లే ప్రక్రియ కొన్నిగ్రామాల్లో క్రమంతప్పకుండా జరిగేది కాదు. ఇపుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఐ.ఒ.టి. ఆధారిత టెలివిజన్ తెరపై పరిస్థితి తెలుసుకుంటున్న గ్రామ నీటిసరఫరా పారిశుద్ధ్య కమిటీ లేదా, పానీ సమితి పాత్ర క్రియాశీలకంగా మారింది. నీటిలో క్లోరిన్ స్థాయిలను బట్టి సదరు నీటిని ఎప్పుడు శుద్ది చేయాలన్నది కమిటీ ఎప్పటికప్పుడు నిర్దేశిస్తూవస్తోంది.
|
|
వైఫై బ్రాడ్ బ్యాడ్ ఇంటర్నెట్ సదుపాయం, సెల్యులార్ ఫోన్ల అనుసంధానం వంటి అంశాల దష్ట్యా చూసినపుడు గ్రామీణ ప్రాంతాల్లో నీటిసరఫరా వ్యవస్థకోసం ఐ.ఒ.టి. సెన్సార్లను వినియోగించడం క్లిష్టతరమైనదే. వాస్తవానికి, గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ పరిధి కిందకు వచ్చే చాలావరకు ప్రాంతాల్లో గ్రిడ్ అనుసంధానం ఐ.ఒ.టి. పరికరాలకు తగిన విద్యుత్తును అందించే స్థాయిలో లేదు. ఐ.ఒ.టి. ఆధారిత స్మార్ట్ వాటర్ మేనేజిమెంట్ ప్రాజెక్టు సారథి సిద్ధాంత్ మాస్సన్ మాటల్లో చెప్పాలంటే, “ఇలా గ్రిడ్ అనుసంధానం లోపించిన ప్రాంతాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ , సెల్యులార్ కమ్యూనికేషన్ల కలయికను, సౌరశక్తి లేదా బ్యాటరీ ఆధారిత విద్యుత్ వ్యవస్థలను వినియోగించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచాలన్నా, నీటిసరఫరా వ్యవస్థల నిర్వహణా వ్యయం తక్కువస్థాయిలో ఉండేలా చూడాలన్నా డాటా ప్రసరణ ధరలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి.”,
|
|
ఈ ప్రయోగాత్మక నీటిసరఫరా పథకాల విజయానికి తగిన గుర్తింపు లభించింది. ఐ.ఒ.టి. ఆధారిత రిమోట్ పర్యవేక్షక నీటి సరఫరా వ్యవస్థలకోసం గుజరాత్, బీహార్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను చేపట్టాయి. 500 గ్రామాలనుంచి మొదలుకొని పలు జిల్లాల్లో ఈ ప్రక్రియను చేపట్టడానికి ఆ రాష్ట్రాలు సంకల్పించాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెప్పించుకునే ప్రక్రియను సిక్కిం, మణిపూర్, గోవా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రారంభించాయి. ఇలాంటి సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానం అమలుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర భారత్, డిజిటల్ ఇండియా, స్మార్ట్ విలేజ్ వంటి పథకాలకు నేరుగా ప్రోత్సాహం లభిస్తుంది. ఐ.ఒ.టి. ఆధారిత వ్యవస్థ దేశంలో మరింతగా పెంపొందడం స్మార్ట్ నగరాల ప్రాజెక్టులకు కూడా ఎంతగానో దొహదపడుతుంది. అలాగే, తాగునీటి సరఫరా రంగంలో ఆశించిన పెనుమార్పులు కూడా చోటుచేసుకుంటాయి.
|
|
ముందున్న మార్గం..
భారతదేశంలో తాగునీటి సరఫరా వ్యవస్థలు ప్రస్తుతం పలు రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం, నీటి పంపుల వైఫల్యం, క్రమ పద్ధతిలేని అరాకొర నీటి సరఫరా వంటి సవాళ్లు మనకు ఎదురవుతున్నాయి. దీనితో సామాజిక, ఆర్థికపరమైన అనేక వైరుధ్యాలు, వ్యత్యాసాలు మరింత విషమంగా తయారవుతున్నాయి. మహిళలు సుదూర ప్రాంతాలనుంచి కిలోమీటర్ల తరబడి కాలినడకన నీటిని మోసుకురావాల్సి రావడం, నీటి కాలుష్యం కారణంగా వారికి పలు వ్యాధులు సంక్రమించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల వైద్యంకోసం వారి వేతనాన్ని ఖర్చుచేయాల్సి రావడం వంటి సమస్యలూ తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో, గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా పర్యవేక్షించడం ఇపుడు తక్షణ అవసరంగా మారింది.
ఈ నేపథ్యంలో జలజీవన్ మిషన్ పేరిట ఒక ప్రధాన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2024 సంవత్సరానికల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో కేంద్రం ఈ పథకాన్ని చేపట్టింది. తగినంత నిర్దిష్ట పరిమాణంలో నాణ్యమైన నీటిని సరఫరా చేసేందుకు డిజిటల్ వాల్, రిమోట్ కమాండ్, కంట్రోల్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ పథకం చేపట్టారు. ఒక్కొక్కరికి రోజుకు 55లీటర్ల చొప్పున నీటిని గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకు సరఫరా చేయాలన్న సంకల్పంతో జలజీవన్ మిషన్ పథకాన్ని చేపట్టారు. |
pib-53792 | 28a56602dc46699c3cd7beeacf5d15c8ec4bd190e53be78942f9265c3261b0b2 | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
ప్రతి లక్ష జనాభాలో కోవిడ్ మరణాలు ప్రపంచంలో భారత్ లోనే అత్యల్పం
జూన్ 22న ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి లక్షమంది జనాభాకూ నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య బాగా తక్కువగా ఉంది. ప్రతి లక్ష మంది జనాభాలో భారత్ లో మరణాలు1.00 గా నమోదు కాగా ప్రపంచ సగటు దానికి ఆరు రెట్లు ఎక్కువగా 6.04 గా నమోదైంది. యుకె లో లక్ష జనాభాకు 63.13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ లో 60.60, ఇటలీలో 57.19, అమెరికాలో 36.30 చొప్పున నమోదయ్యాయి.
ఇలా భారత్ లో కోవిడ్ మరణాలు తక్కువగా ఉండటానికి కారణం ఇక్కడ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, గుర్తించటానికి పరీక్షలు జరపటం, చికిత్స చేయటం, నివారించటంలో కేంద్ర ప్రభుత్వంతోబాటు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన సానుకూల విధానమే కారణం.
కోవిడ్-19 నుంచి కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. బాధితులలో కోలుకున్నవారి శాతం 56.38% % కు చేరింది. ఇప్పటివరకు 2,48,189 మంది పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 10,994 మంది కోవిడ్-19 బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,78,014. వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
ప్రభుత్వ లేబరేటరీల సంఖ్య ఇప్పుడు 726 కి చేరుకోగా ప్రైవేట్ లాబ్స్ సంఖ్య 266 కి పెరిగింది. దీంతో మొత్తం లాబ్స్ సంఖ్య 992 అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 553
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 361
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 78
గడిచిన 24 గంటల్లో 1,87,223 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 71,37,716 కు చేరింది
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి |
pib-140932 | f994affcbea90a55841c3b2a33e79fc5456f0ff5d9fc5728859529b3cbd47470 | tel | రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ , ఏప్రిల్ 2020 అమ్మకాలు 71% పెరుగుదల
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని పిఎస్‌యు అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 2020 ఏప్రిల్ నెలలో ఎరువుల అమ్మకంలో 71 శాతం వృద్ధిని నమోదు చేసింది. కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా ఏప్రిల్‌లో దేశంలో కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ కంపెనీ ఎరువుల అమ్మకాన్ని 3.62 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో 2.12 లక్షల మెట్రిక్ టన్నులఅమ్మకాలు జరిగాయి.
లాక్డౌన్ కారణంగా కంపెనీ చాలా లాజిస్టిక్స్ అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చింది, అయినప్పటికీ ఈ కీలకమైన కాలంలో ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచడానికి ఏ అవకాశాన్ని జారవిడుచుకోకుండా 2020 ఏప్రిల్ నెలలో అమ్మకాలలో అత్యధిక వృద్ధిని సాధించినందుకు సిఎండి, ఎన్ఎఫ్ఎల్, షి మనోజ్ మిశ్రా మార్కెటింగ్ బృందం చేసిన కృషిని ప్రశంసించారు.
ఎన్ఎఫ్ఎల్ పంజాబ్ లోని నంగల్, బతిండా, హర్యానాలోని పానిపట్ లో ఉన్న ఐదు ప్లాంట్లలో, ఎం.పి.లోని విజయపూర్ వద్ద రెండు ప్లాంట్లలో యూరియాను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 35.68 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా. ఈ అన్ని ఉత్పత్తులతో, కంపెనీ 2019-20లో అత్యధికంగా 57 లక్షల మెట్రిక్ టన్నుల అమ్మకాన్ని నమోదు చేసింది, ఇది వరుసగా ఐదవసారి. క్లిష్ట సమయాల్లో ఈ ప్లాంటులు గరిష్ఠ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించడం పెద్ద విజయం. ముఖ్యంగా దేశంలోని వ్యవసాయదారులకు దీని ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది.
కోవిడ్-19తో పోరాడటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఎన్ఎఫ్ఎల్ ఉద్యోగులు ఒక రోజు జీతం పీఎం కేర్స్ ఫండ్ కి రూ.88 లక్షలు మాత్రమే కాకుండా సిఎస్ఆర్ కింద రూ.63.94 లక్షలు కలిపి మొత్తం రూ.1.52 కోట్లు విరాళాలుగా అందించారు. |
pib-284804 | 483d4655c452ac1cf9e2f69d9581d00d87dc5751d74d539cbe8cde768b15baa2 | tel | ఆయుష్
యోగ, ప్రకృతిచికిత్సలో కేంద్ర పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయడానికి భూములను కేటాయించడానికి ముందుకొచ్చిన రాష్ట్రాలు.
ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు యోగ, ప్రకృతిచికిత్సలో కేంద్ర పరిశోదన సంస్థల ను ఏర్పాటు చేయడానికి స్థలాలను ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద స్వయంప్రతిపత్తి గల యోగా ప్రకృతిచికిత్స ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు అవుతాయి. ఇప్పటివరకు, హర్యానా, కర్ణాటక, ఒడిశాలో మూడు సిఆర్ఐలను స్థాపించడానికి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ రాష్ట్రాలలో ప్రభుత్వం అందించిన నిధుల వివరాలు, దాని వినియోగం ఇలా ఉన్నాయి: -
|
|
రాష్ట్రం
|
|
ఇచ్చిన నిధులు
|
|
వినియోగించిన నిధులు
|
|
హర్యానా
|
|
రూ. 59.21 కోట్లు
|
|
రూ. 56.55 కోట్లు
|
|
కర్ణాటక
|
|
రూ. 59.67 కోట్లు
|
|
రూ. 56.35 కోట్లు
|
|
ఒడిశా
|
|
రూ. 1.58 కోట్లు
|
|
రూ. 0.09 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రకృతిచికిత్సని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కింద విధంగా ఉన్నాయి: -
- అంతర్జాతీయ ప్రోత్సాహం కింద కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచవ్యాప్తంగా యోగా, ప్రకృతిచికిత్సతో సహా ఆయుష్ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి, ప్రచారం చేయడానికి వివిధ చర్యలు తీసుకుంటుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ నిపుణులను అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లలో పాల్గొనడానికి ఆయుష్ ప్రక్రియల ప్రమోషన్ ప్రచారం కోసం కేంద్రం ప్రత్యేకంగా విదేశాలలో నియమిస్తుంది. అంతర్జాతీయ సమావేశాలు, వర్క్‌షాపులు, సెమినార్ మొదలైన వాటిలో ఆయుష్ సంబంధిత శాస్త్రీయ పరిశోధనా పత్రాలను ప్రదర్శించడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది.
- ప్రతి జూన్ 21వ తేదీని ఏకగ్రీవంగా అంతర్జాతీయ యోగ దినోత్సవంగా 2015లో ప్రకటించిన దరిమిలా అయుష్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగ సదస్సును నిర్వహిస్తోంది. గుండె సంరక్షణకు యోగ అంతర్జాతీయ సదస్సును 2019 నవంబర్ 15-16 తేదీన మైసూరు లో నిర్వహించారు. సుమారు 17 దేశాల నుండి 35 మంది యోగా నిపుణులు / ఔత్సాహికులతో సహా దాదాపు 1000 మంది భారతీయ, విదేశీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విదేశాల నుండి వచ్చి పాల్గొన్నవారికి యోగా వివిధ కోణాలను సంగ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, ఆయా దేశాలలో మరింత ప్రచారం చేయడానికి వారికి అవకాశం కల్పించింది.
- ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినంగా జూన్ 21 వేడుకలు జరుపుకునేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం విదేశాలలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలకు సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. 2019 లో భారతదేశంతో పాటు 820 గ్లోబల్ ప్రదేశాలలో 189 దేశాలలో ఐడివై జరుపుకున్నారు.
- సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ చేసిన సమిష్టి కృషి ఫలితంగా, యోగాను యునెస్కో ప్రతినిధి జాబితాలో 2016 డిసెంబర్ 1 న మానవజాతితో విడదీయలేని సాంస్కృతికవారసత్వంగా పొందుపరిచారు, ఇతర దేశాలతో శాంతి, సహనం అనే ఆలోచనలను మరింత ప్రచారం చేస్తుంది.
- ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ద్వారా భారతదేశంలోని ప్రీమియర్ యోగా ఇన్స్టిట్యూట్స్లో అండర్ గ్రాడ్యుయేట్ , పిహెచ్ డి కోర్సులను అభ్యసించడానికి 98 దేశాల నుండి అర్హత కలిగిన విదేశీ పౌరులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లను అందిస్తుంది. యోగా, ప్రకృతిచికిత్సతో సహా ఆయుష్ మెడిసిన్ వ్యవస్థల గురించి ప్రామాణికమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి 30 దేశాలలో 33 ఆయుష్ సమాచార కేంద్రాలను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
ఈ సమాచారాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు. |
pib-146841 | c4e42cab8e84a1f56456a51ca5b48f71e7becfbac34f732fce14dc50d24bd301 | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ టీకాల లభ్యతపై తాజా సమాచారం
రాష్ట్రాలు, యూటీలకు అందిన 92.57 కోట్లకు పైగా డోసులు
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో 6.93 కోట్లకుపైగా నిల్వలు
దేశవ్యాప్తంగా కొవిడ్-19 టీకాల వేగాన్ని మరింత పెంచడానికి పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొవిడ్ టీకాల సార్వత్రికీకరణ కొత్త దశ ఈ ఏడాది జూన్ 21 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాల లభ్యత, టీకాల లభ్యతపై దూరదృష్టిని పెట్టడం ద్వారా టీకా కార్యక్రమం వేగవంతమైంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చక్కటి ప్రణాళికతో పని చేయడానికి, టీకా సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడానికి దీనిని ప్రారంభించారు.
సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా కొవిడ్ టీకాలను అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోంది. టీకా సార్వత్రీకరణ కొత్త దశలో, దేశంలో తయారవుతున్న టీకాల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించి, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది.
|
|
టీకా డోసులు
|
|
|
|
పంపిణీ చేసినవి
|
|
92,57,51,325
|
|
అందుబాటులోని నిల్వలు
|
|
6,93,46,080
92.57 కోట్లకుపైగా టీకా డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా , ప్రత్యక్ష సేకరణ పద్ధతిలో ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందాయి.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 6.93 కోట్లకుపైగా నిల్వలు, ఉపయోగించని డోసులు అందుబాటులో ఉన్నాయి. |
pib-289031 | fa70ea13b6242ed40f7c2a38be95afc560165e1006390ae48495d63c5d01fb25 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
రష్యా అధ్యక్షుడు శ్రీ పుతిన్ తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి
రష్యా అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
కోవిడ్-19 మహమ్మారి తో తలెత్తిన స్థితి పై ఇరువురు నేత లు చర్చించారు. అధ్యక్షుడు శ్రీ పుతిన్ భారత ప్రజల కు, ప్రభుత్వాని కి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ, రష్యా ఈ మహమ్మారి కాలం లో సాధ్యమైన అన్ని విధాలుగాను సహకరిస్తుందని తెలిపారు. అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు పలుకుతూ, భారతదేశాని కి రష్యా తక్షణ సహకారాన్ని అందించడం చాలా కాలం గా ఉన్న మన భాగస్వామ్యాని కి ఒక సంకేతం గా ఉందన్నారు.
విశ్వమారి తో పోరాడడానికి రెండు దేశాల మధ్య నెలకొన్న సహకారాన్ని గురించి ఇరువురు నేత లు చర్చించారు. స్పుత్నిక్-వి టీకా మందు ను భారతదేశం లో అత్యవసరం గా ఉపయోగించడానికి ఆమోదం తెలిపినందుకు అధ్యక్షుడు శ్రీ పుతిన్ ప్రశంస ను వ్యక్తం చేశారు. భారతదేశం, రష్యాల తో పాటు ఇతర దేశాల లో ఉపయోగించడానికి రష్యా కు చెందిన ఈ టీకా మందు ను భారతదేశం లో తయారు చేయడం జరుగుతుంది అనే అంశం సైతం చర్చ లో ప్రస్తావన కు వచ్చింది.
ఉభయ దేశాల మధ్య గల ప్రత్యేకమైనటువంటి, విశేషమైనటువంటి భాగస్వామ్యం లో భాగం గా, వివిధ రంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత గా పెంచుకోవడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసి ఉందని ఇద్దరు నేత లు నొక్కిచెప్పారు. భారతదేశం గగన్ యాన్ కార్యక్రమం కోసం రష్యా నుంచి సహకారం లభించడంతో పాటు, నలుగురు గగన్ యాన్ అంతరిక్ష యాత్రికుల కు రష్యా లో శిక్షణ పూర్తి కావడం పట్ల లకూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసను వ్యక్తం చేశారు.
హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థ సహా నవీకరణయోగ్య శక్తి రంగం లో సహకారాన్ని పెంపొందించుకోవడం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ లు చర్చించారు.
రెండు దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి పాలుపంచుకొనే 2+2 మంత్రుల స్థాయి సంభాషణ ను ఏర్పాటు చేయాలని నేత లు నిర్ణయించారు.
వ్లాడివోస్తోక్ లో 2019వ సంవత్సరం సెప్టెంబరు లో వారి ఆఖరి శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో తీసుకొన్న ముఖ్య నిర్ణయాల ను ఇరువురు నేత లు గుర్తు కు తెచ్చుకొన్నారు. వారి వ్యక్తిగత సంభాషణ ను, విశ్వసనీయమైన సంభాషణ ను ముందుకు తీసుకుపోయేందుకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఈ సంవత్సరం చివర లో ఏర్పాటయ్యే ద్వైపాక్షిక సమ్మేళనం కోసం అధ్యక్షుడు శ్రీ పుతిన్ భారతదేశానికి విచ్చేసే అంశం లో తాను ఉత్సుకత తో ఉన్నానని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. 2021వ సంవత్సరం లో బ్రిక్స్ తాలూకు సఫలతపూర్వకమైన అధ్యక్షత కోసం భారతదేశానికి రష్యా పూర్తి గా సహకరిస్తుంది అంటూ అధ్యక్షుడు శ్రీ పుతిన్ హామీ ని ఇచ్చారు. ద్వైపాక్షిక అంశాల పైన, అంతర్జాతీయ అంశాల పైన నిరంతరం సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలని నేత లు ఇద్దరూ అంగీకరించారు. |
pib-118194 | 5f13462710625a7703d8b4a78938c800d30cbf90e45c027d68179c47c2e6a242 | tel | |
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
|
178.83 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్-19 టీకా కార్యక్రమం
గత 24 గంటల్లో 26.19 లక్షలకు పైగా డోసులు నిర్వహణ
ప్రస్తుత రికవరీ రేటు 98.66%
గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 5,476
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 59,442
వారపు పాజిటివిటీ రేటు 0.77%
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 26.19 లక్షలకు పైగా డోసులతో కలిపి, 178.83 కోట్ల డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,07,34,782 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:
|
|
మొత్తం టీకా డోసులు
|
|
ఆరోగ్య సిబ్బంది
|
|
మొదటి డోసు
|
|
1,04,02,100
|
|
రెండో డోసు
|
|
99,75,499
|
|
ముందు జాగ్రత్త డోసు
|
|
42,43,775
|
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
|
మొదటి డోసు
|
|
1,84,10,450
|
|
రెండో డోసు
|
|
1,74,59,170
|
|
ముందు జాగ్రత్త డోసు
|
|
63,80,333
|
|
15-18 ఏళ్ల వారు
|
|
మొదటి డోసు
|
|
5,53,77,120
|
|
రెండో డోసు
|
|
3,08,21,856
|
|
18-44 ఏళ్ల వారు
|
|
మొదటి డోసు
|
|
55,25,51,826
|
|
రెండో డోసు
|
|
44,95,32,588
|
|
45-59 ఏళ్ల వారు
|
|
మొదటి డోసు
|
|
20,23,99,294
|
|
రెండో డోసు
|
|
18,13,70,583
|
|
60 ఏళ్లు పైబడినవారు
|
|
మొదటి డోసు
|
|
12,65,07,775
|
|
రెండో డోసు
|
|
11,29,50,259
|
|
ముందు జాగ్రత్త డోసు
|
|
99,96,621
|
|
ముందు జాగ్రత్త డోసులు
|
|
2,06,20,729
|
|
మొత్తం డోసులు
|
|
1,78,83,79,249
గత 24 గంటల్లో 9,754 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య 4,23,88,475 కు పెరిగింది.
దేశవ్యాప్త రికవరీ రేటు 98.66 శాతానికి చేరింది.
గత 24 గంటల్లో 5,476 కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 59,442. ఇది మొత్తం కేసుల్లో 0.14 శాతం.
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 9,09,985 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77.28 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించారు.
వారపు పాజిటివిటీ రేటు 0.77 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా నమోదైంది. |
pib-118518 | f54a5b0ff2dd7094a30bd827bc190ad2a5b87b514b92be73229ebe494f8fe102 | tel | వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
FY 2021-22లోపు 1 లక్ష కోట్ల రూపాయల వార్షిక సేకరణను తాకిన ప్రభుత్వ ఇ-మార్కెట్ పోర్టల్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22% వృద్ధి రేటుతో ఆర్డర్ల సంఖ్య 31.5 లక్షలను అధిగమించింది
5 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఇ-ప్రొక్యూర్మెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా మారిన GeM.
మహిళా పారిశ్రామికవేత్తలు మరియు MSMEలను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ సేకరణను మరింత కలుపుకొని పోవడానికి ప్రయత్నిస్తున్న GeM
స్థూల వాణిజ్య విలువ కి 30% సహకారంతో రాష్ట్రాలు ముఖ్యమైన వాటాదారుగా కొనసాగుతున్నాయి.
చేర్చడం, వినియోగం, పారదర్శకత, సామర్థ్యం మరియు వ్యయాన్ని ఆదా చేయడం ద్వారా భారతదేశంలో ప్రజా సేకరణను విజయవంతంగా మారుస్తున్న పోర్టల్.
ప్రభుత్వ e మార్కెట్‌ప్లేస్ FY 2021-22లోపు INR 1 లక్ష కోట్ల వార్షిక సేకరణను సాధించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 160% వృద్ధిని సూచిస్తుంది. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి, GeM CEO శ్రీ ప్రశాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ప్రారంభం నుండి 2021 మార్చి 23 నాటికి సంచిత స్థూల మర్చండైజ్ విలువ 1 లక్ష కోట్ల రూపాయలకు చేరుకుందని, అయితే ప్రస్తుత GMV యొక్క GMV ఆర్థిక సంవత్సరం ఒక సంవత్సరం లోపు రూ. 1 లక్ష కోట్లు . గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 160% వృద్ధిని సూచిస్తుంది. అంతకుముందు రోజు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఘనత గురించి ట్వీట్ చేశారు.
పోర్టల్ తన మూడు మూలాలను నడపడం ద్వారా భారతదేశంలో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ను మార్చిందని శ్రీ సింగ్ తెలిపారు. చేర్చడం, వినియోగం మరియు పారదర్శకత మరియు సామర్థ్యం మరియు ఖర్చు, ఆదా వంటి వాటిని కలుపుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22% వృద్ధితో ఆర్డర్ల సంఖ్య కూడా 31.5 లక్షలను అధిగమించింది. 5 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో, GeM ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఇ-ప్రొక్యూర్మెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా మారింది.
సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వాటాను ప్రస్తావిస్తూ, శ్రీ సింగ్ మాట్లాడుతూ, దాదాపు రూ. 43,000 కోట్ల విలువైన సేకరణను CPSEలు GeMలో చేశాయి, గత FYతో పోల్చితే సుమారుగా 508% వృద్ధిని చూపుతోంది. రాష్ట్రాలు సుమారుగా ముఖ్యమైన వాటాదారుగా కొనసాగుతున్నాయని కూడా ఆయన నొక్కి చెప్పారు. మొత్తం GMVకి 30% సహకారం అందించామన్నారు.
ప్రభుత్వ సేకరణలో చేర్చడంలో GeM పోషించిన పాత్రను ఎత్తిచూపిన శ్రీ సింగ్, స్వయం-సహాయక బృందాలు , గిరిజన సంఘాలు, కళాకారులు, నేత కార్మికులు మరియు MSMEల ఉత్పత్తులను ఆన్‌బోర్డ్ చేయడానికి GeM అనేక చర్యలు తీసుకుందని శ్రీ సింగ్ చెప్పారు. GeMలో మొత్తం వ్యాపారంలో 57% MSME యూనిట్ల ద్వారా వచ్చింది మరియు 6% పైగా మహిళా పారిశ్రామికవేత్తల ద్వారా అందించారు. GeMలో మహిళా విక్రేతలు మరియు వ్యాపారవేత్తల సంఖ్య సంవత్సరంలో 6 రెట్లు పెరిగిందని గమనించవచ్చు.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం 143% వృద్ధితో మొత్తం GMVలో MSEల నుండి సేకరణ 57% వద్ద ఉందని గమనించవచ్చు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కొనుగోలుదారు ఆన్‌బోర్డింగ్‌లో 15% పెరుగుదల ఉంది మరియు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సెల్లర్ ఆన్‌బోర్డింగ్‌లో 187% పెరుగుదల ఉంది. మొత్తం GMV లో 25% సహకారంతో గత FYతో పోలిస్తే సేవల సంఖ్యలో 44% పెరుగుదల కూడా ఉంది.
GeM అనేది భారతదేశంలో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కోసం ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్. దీనిని గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సంకల్పించారు. ప్రభుత్వ కొనుగోలుదారుల కోసం బహిరంగ మరియు పారదర్శక సేకరణ వేదికను రూపొందించే లక్ష్యంతో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, GoI ద్వారా ఆగస్టు 9, 2016న ఇది ప్రారంభించబడింది. 5 నెలల రికార్డు సమయంలో సృష్టించబడింది. సాధారణ వినియోగ వస్తువులు మరియు సేవల ఆన్లైన్ సేకరణను GeM సులభతరం చేస్తుంది.
ప్రపంచ బ్యాంకు చేసిన స్వతంత్ర అంచనా ప్రకారం, ప్రభుత్వ ఇ మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌లో కొనుగోలుదారుల సగటు పొదుపు సగటు ధరపై 9.75%. ప్రారంభం నుండి GeM మెరుగైన ధరలతో సంవత్సరానికి ఆకట్టుకునే వృద్ధిని చూపుతోంది. తద్వారా రాష్ట్ర ఖజానాకు గణనీయమైన డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఎకనామిక్ సర్వే 2021-22లోని విశ్లేషణలో, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో GeMలోని వివిధ వస్తువుల ధరను పోల్చి చూస్తే GeM ధరలు 9.5% తక్కువగా ఉన్నాయని తేలింది. నమూనాలోని 22 వస్తువులలో 10 ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే GeM పోర్టల్‌లో చౌకగా ఉన్నాయి.
GeM కోవిడ్ 19 ఆక్సిజన్ డ్రైవ్‌లో ప్రారంభించబడిన కొత్త ఫీచర్లు మరియు కార్యక్రమాలు కోవిడ్ సంక్షోభ సమయంలో GeMలో కంప్రెస్డ్ మెడికల్ ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ల ఆన్‌బోర్డ్ సరఫరాదారులకు అందించబడ్డాయి. GeMలో మొత్తం 250 కోవిడ్-19 వైద్య వర్గాలు అందుబాటులో ఉన్నాయి; మార్చి 2020 నుండి దీని ద్వారా 4.73 లక్షల ఆర్డర్లు చేయబడ్డాయి.
GEM పంచాయితీ రాజ్ సంస్థలతో అనుసంధానించబడి, అట్టడుగు స్థాయిలో పంచాయితీలు ఆన్లైన్లో కొనుగోలు మరియు అమ్మకాలను అనుమతిస్తుంది. గుర్గావ్ జిల్లా పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా పూర్తయింది. Gem అట్టడుగు స్థాయిలో లాజిస్టిక్స్ సేవలను విస్తరించడం కోసం IndiaPostతో అనుసంధానం యొక్క అధునాతన దశలో ఉంది.
GeM SAHAY అనేది చిన్న విక్రేతలు GeM పోర్టల్‌లో స్వీకరించిన ఆర్డర్ల కోసం వివిధ ఇంటిగ్రేటెడ్ రుణదాతల నుండి క్రెడిట్ ఫైనాన్సింగ్‌ను పొందేందుకు వీలు కల్పించే ఒక చొరవ. ప్రభుత్వ వేలంపాట మాడ్యూల్ బహుళ వేలం మోడ్‌లను ఉపయోగించి వారి ఆస్తులను వేలం వేయడానికి మరియు పూర్తి అమ్మకాల చక్రాన్ని పర్యవేక్షించడానికి ప్రభుత్వ వేలం పాటలను సులభతరం చేయడానికి ప్రారంభించారు.
క్రమరహిత ప్రవర్తన మరియు లావాదేవీలు, మార్కెట్ ఇంటెలిజెన్స్, డిమాండ్/ధరల అంచనా మరియు సేకరణ ప్రణాళిక/పర్యవేక్షణను గుర్తించడానికి GeM ప్లాట్‌ఫారమ్ అధునాతన విశ్లేషణల ఫ్రేమ్‌వర్క్‌కు మద్దతు ఇస్తుంది. GeM ఇప్పుడు పోస్ట్ ఆర్డర్ సమాచార మార్పిడి కోసం 24 CPSEల ERP వ్యవస్థలతో ఏకీకరణను కలిగి ఉంది. మొత్తంగా 3 లక్షలకు పైగా ఆర్డర్లు ఏకీకరణ ద్వారా రూ. 42,000 కోట్ల మార్పిడి జరిగింది.
GeM వినియోగదారుల ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి సహజ భాషా ప్రాసెసింగ్ ఆధారిత శోధనను అమలు చేసింది. తద్వారా వారు GeMలో ఉత్పత్తులు లేదా సేవల కోసం శోధించినప్పుడు సంబంధిత మరియు మరింత ఖచ్చితమైన శోధన ఫలితాలను ప్రదర్శించడానికి అనుమతిస్తుంది.
GeM బైబ్యాక్ మెకానిజమ్ని ప్రారంభించింది. దీని ద్వారా కొనుగోలుదారు పాత ఉత్పత్తులను కొత్త వాటితో భర్తీ చేయడానికి మరియు పాత ఉత్పత్తులపై కొంత అదనపు తగ్గింపు/బైబ్యాక్‌ను పొందేందుకు బిడ్‌ని తేలేందుకు వీలు కల్పిస్తుంది. BoQ బిడ్ల కోసం షెడ్యూల్ వారీగా మూల్యాంకనాన్ని GeM ప్రారంభించింది. కొనుగోలుదారులు ఇప్పుడు BoQ బిడ్ల కోసం వస్తువుల వారీగా, గ్రూప్ వారీగా, సరుకుల వారీగా ప్రచురించవచ్చు మరియు మూల్యాంకనం చేయవచ్చు.
విశ్వసనీయత మరియు పనితీరుతో వ్యాపార వృద్ధికి ప్లాట్‌ఫారమ్ మద్దతునిస్తుందని నిర్ధారించడానికి, సమర్థవంతమైన కాషింగ్, యాక్టివ్ స్టోరేజ్‌లను ఆప్టిమైజ్ చేయడం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ల ద్వారా డేటాబేస్లకు సాంకేతికత కరెన్సీని మెరుగుపరచడం మరియు మెరుగైన భద్రతా చర్యలను అమలు చేయడం వంటి అనేక మెరుగుదలలను GeM అమలు చేసింది. ప్లాట్‌ఫారమ్ ~35K QPS కి చేరుకునే కొన్ని DB లోడ్లతో ~13,500 ఏకకాల వినియోగదారులకు మద్దతు ఇస్తోంది.
సమగ్ర ఆడిట్ల కోసం GeM బాహ్య భద్రతా సలహాదారులను కూడా నిమగ్నం చేసింది మరియు ~75 అదనపు భద్రతా ఆదేశాలను అమలు చేసింది. ఇది మార్చి 2022 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక చేయబడిన STQC సర్టిఫికేషన్ ఆడిట్ ద్వారా కూడా జరుగుతోంది. ప్లాట్‌ఫారమ్‌పై లోడ్ 70% పెరిగింది, పేజీ ప్రతిస్పందన సమయం 40% మెరుగుపడింది. సగటున, రోజుకు వేలంపాటల సంఖ్య ఏప్రిల్ 2021లో 1,100 నుండి మార్చి 2022లో 2,800కి పెరిగింది. అదే కాలంలో రోజుకు సంబంధిత విక్రేత భాగస్వామ్యం 10,000 నుండి 15,000కి పెరిగింది.
లండన్‌లో జరిగిన CIPS ఎక్సలెన్స్ ఇన్ ప్రొక్యూర్మెంట్ అవార్డ్స్ 2021లో "బెస్ట్ యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ" విభాగంలో GeM విజేతగా ఎంపికైంది. GEP, జాగ్వార్ ల్యాండ్ రోవర్, రాయల్ డచ్ షెల్, వెన్డిజిటల్ మరియు షెల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లోని కొనుగోళ్లలో కొన్ని అతిపెద్ద మరియు ఉత్తమ పేర్లతో పోటీపడిన తర్వాత GeM ఈ విభాగంలో విజేతగా నిలిచింది.
GeM కూడా రెండు అదనపు కేటగిరీలలో ఫైనలిస్ట్‌గా షార్ట్‌లిస్ట్ చేయబడింది, అంటే 'పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్' మరియు 'బెస్ట్ ఇనిషియేటివ్ టు బిల్డ్ ఎ డైవర్స్ సప్లై బేస్' ఇక్కడ ఇది కొన్ని పాత్ బ్రేకింగ్ ఆర్గనైజేషన్ల ఆగస్టు కంపెనీలో గొప్ప కార్యక్రమాలతో ఉంది. |
pib-5367 | d54c303e6a83c7776a6b3784ab43423dc29ee4a8a78d8796b7b53896d041ec72 | tel | విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ముంబయికి పయనమైన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సీఈఏ నేతృత్వంలోని కేంద్ర అధికారుల బృందం
-ముంబయి నగరంలో విద్యుత్ సరఫరా స్తంభించిన విషయమై అధ్యయనం, పరిస్థితులకు పరిష్కారాలను కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సహాయం చేయనున్న బృందం
- నేషనల్ గ్రిడ్ ప్రభావితం కానప్పటికీ స్టేట్ గ్రిడ్‌లో అంతరాయం ఏర్పడటంపై అధ్యయనం జరపనున్న బృందం
- విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సహాయం అందిస్తున్న కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు: శ్రీ ఆర్.కె. సింగ్
ముంబయిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిన విషయమై ఈ రోజు తెల్లవారు జామున కేంద్ర విద్యుత్, ఎంఎన్ఆర్ఈ మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి ఆర్.ఆర్.కె. సింగ్ మాట్లాడుతూ “విద్యుత్ సరఫరా గణనీయంగా పునరుద్ధరించబడింది. 2000 మెగావాట్లలో మొత్తం 1900 మెగావాట్ల మేర సరఫరా పునరుద్ధరించబడింది. మిగతా ప్రాంతాల్లోనూ
త్వరలో సరఫరా పునరుద్ధరించబడుతంది. నేషనల్ గ్రిడ్‌కు ఏలాంటి ప్రమాదం వాటిల్ల లేదు, స్టేట్ గ్రిడ్‌లోని కొన్నిప్రాంతాల్లో మాత్రం సమస్యలు ఏర్పడ్డాయి.”
సరఫరాలో అంతరాయపు సమస్యను గుర్తించడానికి గాను, ఇలాంటి పరిస్థితులకు ఎదుర్కొనేందుకు సాధ్యమైన పరిష్కారాలను తెలుసుకోవడానికి కేంద్ర బృందం ముంబయిని సందర్శిస్తుందని శ్రీ సింగ్ అన్నారు. |
pib-167126 | 331b5f22c3e88583ed7dcb102a9bf734780ae094179b4d04184340d2b4f8e665 | tel | హోం మంత్రిత్వ శాఖ
వీర్ బాల్ దివస్ సందర్భంగా గురు గోబింద్ సింగ్, సాహిబ్జాదాలు, మాతా గుజ్రిలకు నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా
మాతృభూమిని, మతాన్ని కాపాడేందుకు చిన్న వయసులోనే అత్యంత సాహసంతో శత్రువులను ఎదుర్కొన్న గురు గోబింద్ సింగ్‌కు చెందిన సాహిబ్జాదాలు
వారి వీరత్వం, ధైర్యసాహసాలు మన వారసత్వం, దీనిని మనసులో ఉంచుకునే మోదీ ప్రభుత్వం వీర్ బాల్ దివస్‌ను జరుపుతోంది
సాహిబ్జాదాలు, మాతా గుజిరి, గురు గోబింద్ సింగ్ వీరత్వానికి, త్యాగాలకు నివాళులు
వీర్ బాల్ దివస్ సందర్భంగా గురు గోబింద్ సింగ్‌కు, సాహిబ్జాదాస్, మాతా గుజిరికి కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్‌షా నివాళులు అర్పించారు.
మాతృభూమిని, మతాన్ని పరిరక్షించేందుకు చిన్న వయసులోనే గురు గోబింద్ సింగ్‌కు చెందిన సాహిబ్జాదాలు అత్యంత సాహసంతో శత్రువులను ఎదుర్కొన్నారని శ్రీ అమిత్ షా తన ట్వీట్లో పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలు, వీరత్వం మన వారసత్వం అన్న విషయాన్ని సంస్మరించుకుంటూ మోదీ ప్రభుత్వం వీర్ బాల్ దివస్‌ను జరుపుతోంది. సాహిబ్జాదాలు, మాతా గుజిరి, గురు గోబింద్ సింగ్ లు ప్రదర్శించిన సాహసానికి, త్యాగాలకు నేను నివాళులర్పిస్తున్నాను అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. |
pib-226328 | 52fee0fcd88ec26d15cc508d99c200fbc711c20311a405dbec841376ee44219f | tel | రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఐకానిక్ వారోత్సవాలను ప్రారంభించిన శ్రీ మన్సుఖ్ మాండవీయ
' ప్రపంచంలో జనరిక్ ఔషధ ఉత్పత్తి రంగంలో దేశం అగ్రగామి.. ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్ కు గుర్తింపు'.. శ్రీ మాండవీయ
పరిశ్రమలతో నైపర్ సమన్వయంతో పనిచేసి ఎంఎస్ఎంఈ ల సమస్యలను పరిష్కరించాలి
ఫార్మా రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి రానున్న 25 సంవత్సరాలకు ప్రణాళిక రూపొందాలి... కేంద్ర మంత్రి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఐకానిక్ వారోత్సవాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు ప్రారంభించారు. పంజాబ్ ఎస్ఎఎస్ నగర్ లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు సెమినార్లు, ప్రదర్శనలు, ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ఐకానిక్ వారోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటైన సమావేశంలో ప్రసంగించిన శ్రీ మాండవీయ ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువగా జనరిక్ మందులు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. ప్రపంచ ఫార్మసీగా భారత్ గుర్తింపు పొందిందని అన్నారు. ఫార్మా పరిశ్రమల అభివృద్ధిలో నైపర్ కీలక పాత్ర పోషించిందని మంత్రి అన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపర్ బోధనా అంశాలను, పరిశోధనలను రూపొందించాలని ఆయన సూచించారు. ఎంఎస్ఎంఈ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన అన్నారు. దేశంలో వైద్య పరికరాల ఉత్పత్తి కోసం ఏర్పాటైన పార్కులతో నైపర్ కలసి పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు.
75 వ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో రానున్న 25 ఔషధ రంగంలో అమలు చేయాల్సి ఉన్న కార్యాచరణ కార్యక్రమంపై ఫార్మాస్యూటికల్స్ శాఖ, నైపర్ దృష్టి సారించాలని ఆయన సలహా ఇచ్చారు. ఔషధ తయారీలో వినియోగించే ముఖ్య పదార్దాలను ఇప్పటికీ దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పేటెంట్ హక్కు కలిగిన ఔషధాల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. ఔషధ రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధి చేయడానికి చర్యలు అమలు జరగాలని శ్రీ మాండవీయ స్పష్టం చేశారు. దీనికోసం 25 సంవత్సరాల ప్రణాళిక రూపొందాలని మంత్రి అన్నారు.
కోవిడ్-19 చికిత్స కు అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేసి భారతదేశం తన ప్రతిభను చాటి దేశంలో మానవ వనరులకు కొరత లేదని ప్రపంచానికి తెలిపిందని శ్రీ మాండవీయ న్నారు. దేశ శాస్త్రవేత్తలు, పరిశోధకుల ప్రతిభపై నమ్మకం ఉంచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద 9000 కోట్ల రూపాయలను కేటాయించారని మంత్రి తెలిపారు. కోవాక్సిన్ అభివృద్ధిలో దేశానికి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ఐసీఎంఆర్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఇదే తరహాలో, ఇతర పరిశోధన, విద్యా సంస్థలు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు.
ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి శ్రీమతి ఎస్. అపర్ణ, నైపర్ డైరెక్టర్ ప్రొఫెసర్ దూలాల్ పాండా, రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని https://www.youtube.com/watch?v=OKzn4daXoXM ద్వారా వెబ్‌కాస్ట్ చేశారు. |
pib-60866 | 57464410b8078b25e167fbfab9df87e840e311aeb52b4ef990db40f23a9f9008 | tel | విద్యుత్తు మంత్రిత్వ శాఖ
దేశంలో తొలిసారిగా పిఎన్ జి వ్యవస్థలో గ్రీన్ హైడ్రోజన్ మిళితం చేసి ఇంధన సరఫరా ప్రారంభించిన ఎన్టీపీసీపైప్ లైన్ ద్వారా సూరత్ ఆదిత్య నగర్ కావాస్ టౌన్షిప్ లో నివాస గృహాలకు హెచ్ 2-ఎన్ జి ఇంధన సరఫరాప్రపంచ హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని కేంద్ర బిందువుగా మార్చనున్న ప్రాజెక్టునూతన విధానంతో హైడ్రోకార్బన్ దిగుమతి కోసం చేస్తున్న ఖర్చు తగ్గుతుంది. విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. ప్రపంచ దేశాలకు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ రసాయనాలను భారతదేశం ఎగుమతి చేయగలుగుతుంది.
Kawas HoP Ram Prasad starting the green hydrogen injection into PNG network of NTPC Kawas Township
NTPC Kawas Green H2 Blending project having electrolyser, hydrogen storage and blending skid
దేశంలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్రాజెక్టును ఎన్టీపీసీ లిమిటెడ్ ప్రారంభించింది. సూరత్ లోని ఎన్టీపీసీ కవాస్ టౌన్షిప్ లోని పైపుల ద్వారా సరఫరా చేస్తున్న సహజవాయువు వ్యవస్థలో గ్రీన్ హైడ్రోజన్ మిళితం చేయడం ప్రారంభమైంది. ఎన్టీపీసీ, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి.
ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ మొదటి అణువును ఎన్టీపీసీ, జీజీఎల్ సీనియర్ అధికారుల సమక్షంలో కవాస్ ప్రాజెక్ట్ హెడ్ శ్రీ పి రామ్ ప్రసాద్ వ్యవస్థలో ప్రవేశపెట్టారు.
ప్రక్రియ ప్రారంభమైన తర్వాత జీజీఎల్ అధికారుల సహకారంతో టౌన్షిప్ లో నివసిస్తున్న ప్రజలకు ఎన్టీపీసీ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూలై 30న శంకుస్థాపన చేశారు. రికార్డు వ్యవధిలో లక్ష్యాన్ని సాధించడానికి ఎన్టీపీసీ, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ పనిచేసి విజయం సాధించారు. దీని ద్వారా సూరత్‌లోని ఆదిత్యనగర్‌లోని కవాస్ టౌన్షిప్ గృహాలకు హెచ్ 2-ఎన్ జి సరఫరా చేస్తారు. కవాస్‌లో నెలకొల్పిన 1 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ సౌరశక్తిని ఉపయోగించి నీటి విద్యుద్విశ్లేషణ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేస్తుంది.
పిఎన్జీ 5% వాల్యూమ్/వాల్యూమ్‌కు హైడ్రోజన్ ను మిళితం చేయడానికి పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు ప్రాధమికంగా ఆమోదం తెలిపింది. ఈ స్థాయి 20% చేరేలా దశల వారీగా అనుమతులు మంజూరు అవుతాయి. సహజ వాయువులో హైడ్రోజన్ ను మిళితం చేసినప్పుడు కర్బన ఉద్గారాల విడుదల తగ్గుతుంది. అయితే, వేడి తగ్గదు.
ఇంతవరకు ప్రపంచంలో యూకే, జర్మనీ మరియు ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాలు మాత్రమే ఈ రంగంలో విజయం సాధించాయి. ప్రపంచ దేశాల సరసన ఇప్పుడు భారతదేశం చేరింది. దీంతో ప్రపంచ హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని కేంద్ర బిందువుగా మారుతుంది. ప్రక్రియ వల్ల హైడ్రోకార్బన్ దిగుమతి కోసం చేస్తున్న ఖర్చు తగ్గుతుంది. విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. ప్రపంచ దేశాలకు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ రసాయనాలను భారతదేశం ఎగుమతి చేయగలుగుతుంది.
(Visitor Counter : 183 |
pib-59617 | 1fb4c5ec00ba4d9346436fe03584194d373da58396ed86543937912bc333dbb1 | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
చికిత్స పొందుతున్నవారి సంఖ్యను మించి కోలుకున్నవారి సంఖ్య
50 లక్షల శాంపిల్స్ కు మించి పరీక్షించిన ఐసిఎంఆర్
రాష్ట్రాలకు సహకరించేందుకు 6 నగరాల్లో కేంద్ర బృందాల నియామకం
గడిచిన 24 గంటల్లో 5,991 మంది కోవిడ్ - 19 బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,35,205 కు చేరుకుంది. ప్రస్తుతం చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య1,33,632 గా ఉంది. దీనివలన మొదటి సారిగా చికిత్స పొందుతున్నవారి సంఖ్య కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. కోలుకున్నవారి శాతం 48.88% చేరింది.
ఐసిఎంఆర్ జరిపిన పరీక్షలు కూడా ఈ రోజుకు 50,61,332 కు చేరటంతో 50 లక్షలు పైబడినట్టయింది. గడిచిన 24 గంటల్లో ఐసిఎంఆర్ జరిపిన పరీక్షలు 1,45,216 గా నమోదయ్యాయి. కరోనా వైరస్ సోకిన వారిని నిర్థారించటానికి పరీక్షల సంఖ్యను పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వ లేబరీటరీల సంఖ్య 590 కి పెంచగా ప్రైవేట్ లేబరేటరీల సంఖ్య 233 కి పెరిగింది. దీంతో మొత్తం 823 లేబరేటరీలు అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్ర ఆరోగ్య విభాగాలకు, మున్సిపల్ ఆరోగ్యాధికారులకు అండగా ఉంటూ సాంకేతిక సహాయం అందించేలా కేంద్రబృందాలను కూడా పంపటం జరిగింది. కోవిడ్ -19 విషయంలో అక్కడ తీసుకుంటున్న చర్యలను సమీక్షించి తగిన సూచనలివ్వటానికి ముంబయ్, అహమ్మదాబాద్, చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, బెంగళురు నగరాలను ఇప్పటివరకు ఎంచుకున్నారు.
ఈ బృందాలు తమకు కేటాయించిన నగరాలను వచ్చే వారంలోగా సందర్శిస్తాయి. కోవిడ్ -19 విషయంలో ప్రజారోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తాయి. ఈ బృందాలు రోజువారీ నివేదికలను రాష్ట్ర ఆరోగ్య విభాగానికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు అందజేస్తాయి. అత్యవసరమనిపించిన పక్షంలో తమ పర్యటన్మ పూర్తికాకముందే తమ అభిప్రాయాలను కూడా జోడించి ముందుగానే నివేదిక అందజేస్తాయి.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి. |
pib-134669 | 33dd3c7bc8b6bdbd4a747cabea40f9696d3fea8447319182de1f645b857fba9e | tel | రైల్వే మంత్రిత్వ శాఖ
15 జతల రైళ్ల కోసం టికెట్ల బుకింగ్ నియమ నిబంధనలు సవరించిన భారత రైల్వే శాఖ
ఈ రైళ్ల అడ్వాన్స్ రిజర్వేషన్ కాలం 7 నుంచి 30 రోజులు
2020 మే 24 తేదీ నుంచి బుకింగ్ లకు, మే 31 నుంచి ప్రయాణాలకు ఈ మార్పు అమలు
భారతీయ రైల్వే మే 12వ తేదీ నుంచి 15 జతల స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ 15 జతల రైళ్లకు సంబంధించిన నియమనిబంధనలు మార్చాలని నిర్ణయించింది. అవి ఇలా ఉన్నాయి...
- ఈ రైళ్ల అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి 7 రోజుల నుంచి 30 రోజులకు పెంచారు. వీటిలో తత్కాల్ బుకింగ్ కు అనుమతించరు.
(- నిబంధనలు అనుమతించిన మేరకు వాటిలో ఆర్ఏసి/ వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేస్తారు. కాని నిబంధనలకు అనుగుణంగా రైలు బయలుదేరే సమయానికి కూడా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్న ప్రయాణికులను మాత్రం రైలు ఎక్కేందుకు అనుమతించరు.
- రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు తొలి చార్టును, 2 గంటల ముందు రెండో చార్టు తయారుచేస్తారు. రెండు చార్టుల మధ్య సమయంలో కరెంట్ బుకింగ్ అనుమతిస్తారు.
- కంప్యూటరైజ్డ్ పిఆర్ఎస్ కౌంటర్లు, పోస్టాఫీసులు, లైసెన్సు గల యాత్రి టికెట్ సువిధ కేంద్రాలు , ఆన్ లైన్ బుకింగ్, ఐఆర్ సిటిసి అధీకృత ఏజెంట్లు, కామన్ సర్వీస్ సెంటర్ల నుంచి మాత్రమే బుకింగ్ అనుమతిస్తారు.
- 24వ తేదీ నుంచి బుకింగ్ లకు, 31 నుంచి ప్రయాణం చేసే రైళ్లకు దీన్ని అనుమతిస్తారు. |
pib-238062 | 4b4542356358bf040bd1e39286d3c1dc8dfb9e8c4c338408092844dd1d8e340e | tel | ఆర్థిక మంత్రిత్వ శాఖ
52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సిఫార్సులు
ప్రతిపాదిత జి ఎస్ టి అప్పిలేట్ ట్రిబ్యునళ్లలో అర్హత, వయసుకు సంబంధించి రాష్ట్రపతి, సభ్యుల నియామక నిబంధనల్లో సవరణలకు జి ఎస్ టి కౌన్సిల్ సిఫారసు
చిరుధాన్యాల పిండిని పౌడర్ రూపంలో, లూజ్ రూపంలో విక్రయించినప్పుడు కనీసం 70% చిరుధాన్యాలను కలిగి ఉన్న ఆహార తయారీకి జిఎస్ టి కౌన్సిల్ ఎటువంటి రేటును సిఫారసు చేయదు: ప్రీ-ప్యాకేజ్డ్ లేబుల్ రూపంలో విక్రయించినప్పుడు 5% జి ఎస్ టి ఉంటుంది.
మానవ వినియోగం కోసం ఆల్కహాల్ లిక్కర్ తయారీకి ఉపయోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ వెలుపల ఉంచాలని జి ఎస్ టి కౌన్సిల్ సిఫారసు
చెరకు రైతులకు త్వరితగతిన బకాయిలు చెల్లించడానికి , పశువుల దాణా తయారీ ఖర్చును తగ్గించడానికి మొలాసిస్ పై జిఎస్ టిని 28% నుండి 5% కు తగ్గించాలని జిఎస్ టి కౌన్సిల్ సిఫార్సు
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, విదేశీ జెండాతో విదేశాలకు వెళ్లే నౌక తీరప్రాంత ప్రయాణానికి మారినప్పుడు షరతులతో కూడిన , పరిమిత వ్యవధి గల ఐజిఎస్ టి మినహాయింపును సిఫారసు చేసిన జిఎస్ టి కౌన్సిల్
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 52వ జి ఎస్ టి కౌన్సిల్ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న గోవా, మేఘాలయ ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు , ఆర్థిక మంత్రిత్వ శాఖ , రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
జిఎస్ టి పన్ను రేట్లలో మార్పులు, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి చర్యలు, జిఎస్ టిలో సమ్మతిని క్రమబద్ధీకరించే చర్యలకు సంబంధించి జిఎస్ టి కౌన్సిల్ ఈ క్రింది సిఫార్సులు చేసింది.
ఎ. వస్తువులు, సేవలపై జి ఎస్ టి రేట్లకు సంబంధించిన సిఫార్సులు
I. వస్తువుల జీఎస్ టీ రేట్లలో మార్పులు
-
హెచ్ఎస్ 1901 కిందకు వచ్చే "పొడి రూపంలో చిరుధాన్యాల పిండి తో ఆహార తయారీ, బరువు ప్రకారం కనీసం 70% చిరుధాన్యాలను కలిగి ఉంటుంది", నోటిఫికేషన్ తేదీ నుండి జి ఎస్ టి రేట్లు ఈ క్రింది విధంగా సూచించబడ్డాయి:
-
ప్రీ-ప్యాకేజ్డ్, లేబుల్ చేయబడ్డ రూపంలో కాకుండా ఇతర రూపాల్లో విక్రయించినట్లయితే 0%.
-
ప్రీ-ప్యాకేజ్డ్ , లేబుల్ రూపంలో అమ్మితే 5%
-
హెచ్ ఎస్ 5605 కిందకు వచ్చే మెటలైజ్డ్ పాలిస్టర్ ఫిల్మ్/ప్లాస్టిక్ ఫిల్మ్‌తో చేసిన ఇమిటేషన్ జరీ థ్రెడ్ లేదా నూలు, 5% GST రేటును ఆకర్షిస్తున్న ఇమిటేషన్ జరీ థ్రెడ్ లేదా నూలు కోసం ఎంట్రీ ద్వారా కవర్ అవుతుంది. అయితే, ఇన్వర్షన్ కారణంగా పాలిస్టర్ ఫిల్మ్ / ప్లాస్టిక్ ఫిల్మ్ పై ఎటువంటి రిఫండ్ అనుమతించబడదు.
-
విదేశాలకు వెళ్లే నౌకలు కోస్టల్ రన్ లోకి మారితే దాని విలువపై 5 శాతం ఐ జి ఎస్ టి చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ జెండా విదేశీ నౌకను ఆరు నెలల్లో తిరిగి విదేశాలకు వెళ్లే నౌకగా మార్చడానికి లోబడి కోస్టల్ రన్ లోకి మారినప్పుడు షరతులతో కూడిన ఐజిఎస్ టి మినహాయింపును జిఎస్ టి కౌన్సిల్ సిఫార్సు చేసింది.
II. వస్తువులకు సంబంధించిన ఇతర మార్పులు
-
మానవ వినియోగానికి ఆల్కహాల్ లిక్కర్ తయారీకి ఉపయోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్ టి వెలుపల ఉంచాలని జీఎస్ టి కౌన్సిల్ సిఫారసు చేసింది. మానవ వినియోగం కోసం ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే ఇఎన్ఏను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించడానికి చట్టంలో తగిన సవరణను లా కమిటీ పరిశీలిస్తుంది.
-
మొలాసిస్ పై జీఎస్టీని 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలి. ఈ చర్య మిల్లులతో లిక్విడిటీని పెంచుతుంది చెరకు రైతులకు చెరకు బకాయిలను వేగంగా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. దీని తయారీలో మొలాసిస్ కూడా ఒక పదార్ధం కాబట్టి పశువుల దాణా తయారీకి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది.
-
కస్టమ్స్ టారిఫ్ చట్టంలో 8 అంకెల స్థాయిలో ప్రత్యేక టారిఫ్ హెచ్ఎస్ కోడ్ ను రూపొందించారు. 18% జి ఎస్ టి ని ఆకర్షించే పారిశ్రామిక ఉపయోగం కోసం ఇఎన్ఎకు ఎంట్రీని సృష్టించడానికి జిఎస్ టి రేటు నోటిఫికేషన్ ను సవరించనున్నారు.
III. సేవల జీఎస్ టీ రేట్లలో మార్పులు
-
28.06.2017 నాటి నోటిఫికేషన్ నెంబరు 12/2017-సిటిఆర్ లోని 3వ నెంబరు , 3ఎ లోని ఎంట్రీలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జి , 243W ప్రకారం పంచాయతీ/ మునిసిపాలిటీకి అప్పగించిన ఏదైనా బాధ్యతకు సంబంధించి కేంద్ర/ రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు , స్థానిక సంస్థలకు అందించే స్వచ్ఛమైన, సమ్మిళిత సేవలను మినహాయించాయి. ఎలాంటి మార్పులు లేకుండా ప్రస్తుతం ఉన్న మినహాయింపు ఎంట్రీలను కొనసాగించాలని జీఎస్ టి కౌన్సిల్ సిఫారసు చేసింది.
-
అలాగే నీటి సరఫరా, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య పరిరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, మురికివాడల అభివృద్ధి, అప్ గ్రేడేషన్ సేవలను మినహాయించాలని జీఎస్ టికౌన్సిల్ సిఫారసు చేసింది.
IV. సేవలకు సంబంధించిన ఇతర మార్పులు
-
బార్లీని మాల్ట్ లోకి ప్రాసెసింగ్ చేసే జాబ్ వర్క్ సర్వీసులు 18 శాతం కాకుండా ఆహార, ఆహార ఉత్పత్తులకు సంబంధించి జాబ్ వర్క్ కు వర్తించే విధంగా 5 శాతం జీఎస్టీని ఆకర్షిస్తాయి.
-
2022 జనవరి 1 నుంచి ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ల ద్వారా సరఫరా చేసే బస్సు రవాణా సేవలపై జీఎస్ టి చెల్లించాల్సిన బాధ్యతను సీజీఎస్టీ చట్టం, 2017లోని సెక్షన్ 9 కింద ఈసీవో పై ఉంచారు. ఎకో ద్వారా సేవలు అందించే బస్సు ఆపరేటర్లలో చాలా మందికి ఒకటి లేదా రెండు బస్సులు ఉన్నాయని, రిజిస్ట్రేషన్ తీసుకొని జిఎస్ టి షరతును తీర్చే స్థితిలో లేరని పరిశ్రమ సంఘం చేసిన ప్రాతినిధ్యం మేరకు ఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ చర్య తీసుకోబడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం చిన్న ఆపరేటర్ల అవసరం , ఐటిసి తీసుకోవడానికి పెద్ద వ్యవస్థీకృత సంస్థల అవసరానికి మధ్య సమతుల్యతను సాధించడానికి, కంపెనీలుగా నిర్వహించే బస్సు ఆపరేటర్లను సిజిఎస్ టి చట్టం, 2017 లోని సెక్షన్ 9 పరిధి నుండి మినహాయించాలని జిఎస్ టి కౌన్సిల్ సిఫార్సు చేసింది. దీంతో వారు తమ ఐటీసీని ఉపయోగించి తమ సరఫరాలపై జీఎస్ టి చెల్లించవచ్చు.
-
ఖనిజ మైనింగ్ ప్రాంతాలలో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ లు ప్రభుత్వ అథారిటీలు ,అందువల్ల అవి ఇతర ప్రభుత్వ అథారిటీ లకు ఉండే జిఎస్ టి మినహాయింపులకు అర్హులని స్పష్టం చేశారు. .
-
భారతీయ రైల్వేల ద్వారా సరఫరా అయ్యే అన్ని వస్తువులు , సేవలపై ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కింద పన్ను విధించబడుతుంది, తద్వారా వారు ఐటిసిని పొందడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల భారతీయ రైల్వేకు ఖర్చు తగ్గుతుంది.
బి.వాణిజ్య సౌలభ్యానికి చర్యలు:
i) అనుమతించిన కాలవ్యవధిలో అప్పీలు దాఖలు చేయలేని సందర్భాల్లో డిమాండ్ ఆర్డర్లకు వ్యతిరేకంగా అప్పీళ్లను దాఖలు చేయడానికి ఆమ్నెస్టీ పథకం:
మార్చి 31వ తేదీ లేదా అంతకు ముందు జారీ చేసిన సిజిఎస్ టి చట్టం, 2017 లోని సెక్షన్ 73 లేదా 74 కింద డిమాండ్ ఆర్డర్ కు వ్యతిరేకంగా, ఆ చట్టంలోని సెక్షన్ 107 కింద అప్పీల్ దాఖలు చేయలేని పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులకు ప్రత్యేక ప్రక్రియ ద్వారా క్షమాభిక్ష పథకాన్ని అందించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది. సెక్షన్ 107లోని సబ్ సెక్షన్ లో పేర్కొన్న కాలపరిమితిలోగా అప్పీలు దాఖలు చేయలేదనే కారణంతో 2023, లేదా ఆ ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీలును తిరస్కరించారు. అటువంటి అన్ని సందర్భాల్లో, పన్ను చెల్లింపుదారులు అటువంటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా 31 జనవరి 2024 వరకు అప్పీల్ దాఖలు చేయడానికి అనుమతించబడతారు, వివాదంలో ఉన్న పన్నులో 12.5% ప్రీ-డిపాజిట్ మొత్తాన్ని చెల్లించాలనే షరతుకు లోబడి, ఇందులో కనీసం 20% ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుండి డెబిట్ చేయాలి. నిర్ణీత కాలవ్యవధిలో గతంలో అప్పీల్ దాఖలు చేయలేని పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.
ii) కంపెనీకి మంజూరు చేయబడుతున్న క్రెడిట్ పరిమితులు/ రుణాలకు వ్యతిరేకంగా బ్యాంకుకు డైరెక్టర్లు అందించే వ్యక్తిగత గ్యారంటీ పన్ను విధింపుకు సంబంధించిన వివరణలు , దాని అనుబంధ కంపెనీకి హోల్డింగ్ కంపెనీ అందించే కార్పొరేట్ గ్యారంటీతో సహా సంబంధిత వ్యక్తులకు అందించే కార్పొరేట్ గ్యారంటీ పన్నుకు సంబంధించి వివరణలు: కౌన్సిల్ వీటికి సిఫార్సు చేసింది:
బ్యాంకు/ ఆర్థిక సంస్థలకు వారి తరఫున వ్యక్తిగత గ్యారంటీని అందించడానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంపెనీ డైరెక్టర్ కు ఏ రూపంలోనైనా పరిగణనలోకి తీసుకోనప్పుడు, ఆ లావాదేవీ/ సరఫరా బహిరంగ మార్కెట్ విలువను సున్నాగా పరిగణించవచ్చని, అందువల్ల అటువంటి సేవల సరఫరాకు సంబంధించి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది.
సిజిఎస్ టి రూల్స్, 2017 రూల్ 28 లో సబ్-రూల్ ను చేర్చడం, సంబంధిత పక్షాల మధ్య అందించబడే కార్పొరేట్ గ్యారంటీ సరఫరా పన్ను పరిధిలోకి వచ్చే విలువను అటువంటి హామీ మొత్తంలో ఒక శాతం లేదా వాస్తవ పరిగణనలో ఏది ఎక్కువైతే అది అందించడం.
సదరు సబ్ రూల్ ను చేర్చిన తరువాత, సంబంధిత పక్షాల మధ్య అందించబడే కార్పొరేట్ గ్యారంటీ సేవల సరఫరా విలువ సేవల గ్రహీతకు పూర్తి ఐటిసి అందుబాటులో ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, సిజిఎస్ టి రూల్స్, 2017 యొక్క రూల్ 28 యొక్క ప్రతిపాదిత సబ్-రూల్ ద్వారా నియంత్రించబడుతుందని సర్క్యులర్ ద్వారా స్పష్టం చేశారు.
iii) ఏడాది పూర్తయిన తర్వాత తాత్కాలికంగా అటాచ్ చేసిన ఆస్తులను ఆటోమేటిక్ గా పునరుద్ధరించే వెసులుబాటు: సీజీఎస్ టీ రూల్స్ 2017లోని రూల్ 159లోని సబ్ రూల్ , ఫామ్ జీఎస్ టి డీఆర్ సీ-22లో సవరణ చేయాలని, జీఎస్. టి డీఆర్ సీ-22 ఫారంలో తాత్కాలిక అటాచ్ మెంట్ ఆర్డర్ గడువు ముగిసిన తర్వాత చెల్లదని కౌన్సిల్ సిఫారసు చేసింది. దీంతో కమిషనర్ నుంచి ప్రత్యేక లిఖితపూర్వక ఉత్తర్వులు అవసరం లేకుండా ఏడాది కాలపరిమితి ముగిసిన తర్వాత తాత్కాలికంగా అటాచ్ చేసిన ఆస్తులను విడుదల చేయడానికి వీలవుతుంది.
iv) సరఫరా ప్రదేశానికి సంబంధించిన వివిధ అంశాలపై వివరణ: ఈ క్రింది సేవల సరఫరాకు సంబంధించి సరఫరా స్థలాన్ని స్పష్టం చేయడానికి సర్క్యులర్ జారీ చేయాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది:
సరఫరాదారు స్థానం లేదా సేవల గ్రహీత స్థానం భారతదేశం వెలుపల ఉన్న సందర్భాల్లో మెయిల్ లేదా కొరియర్ తో సహా సరుకుల రవాణా సేవల సరఫరా;
ప్రకటనల సేవల సరఫరా;
కో-లొకేషన్ సేవల సరఫరా.
v) సేవల ఎగుమతికి సంబంధించి వివరణ జారీ-: ఐజిఎస్ టి చట్టం 2017 లోని సెక్షన్ 2లోని క్లాజ్ లోని సబ్ క్లాజ్ నిబంధనల ప్రకారం సేవల ఎగుమతిగా అర్హత పొందడానికి సేవల సరఫరాను పరిగణనలోకి తీసుకునే ఉద్దేశ్యంతో ఆర్ బిఐ అనుమతించిన విధంగా ప్రత్యేక ఐఎన్ ఆర్ వోస్ట్రో ఖాతాకు వచ్చిన ఎగుమతి రెమిటెన్స్ ల ఆమోదయోగ్యతను స్పష్టం చేయడానికి ఒక సర్క్యులర్ జారీ చేయాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది.
vi) నోటిఫికేషన్ 01/2023-ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ తేది 31.07.2023 లో సవరణ ద్వారా ఐజిఎస్టి రీఫండ్ మార్గం కోసం అధీకృత కార్యకలాపాల కోసం సెజ్ యూనిట్లు / డెవలపర్‌కు సరఫరాలను అనుమతించడం: 01.10.2023 నుండి 31.07.2023 నాటి నోటిఫికేషన్ నంబర్ 1/2023-ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ను సవరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది, తద్వారా సరఫరాదారులు ప్రత్యేక ఆర్థిక జోన్ డెవలపర్ లేదా ప్రత్యేక ఆర్థిక జోన్ యూనిట్ కు సరుకులు లేదా సేవలను సరఫరా చేయడానికి అధీకృత కార్యకలాపాల కోసం ప్రత్యేక ఆర్థిక మండలి యూనిట్ కు అనుమతిస్తారు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ చెల్లింపుపై అధీకృత కార్యకలాపాలు , అలా చెల్లించిన పన్ను కు రిఫండ్ క్లెయిమ్ చేయడం.
సి. చట్టం , ప్రక్రియలకు సంబంధించిన ఇతర చర్యలు:
i) ప్రతిపాదిత జిఎస్ టి అప్పిలేట్ ట్రిబ్యునళ్లలో అధ్యక్షుడు , సభ్యుల నియామకానికి సంబంధించి ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం, 2021 నిబంధనలతో సిజిఎస్ టి చట్టం, 2017 లోని నిబంధనలను అనుసంధానం చేయడం: ఈ విధంగా అందించడానికి సిజిఎస్ టి చట్టం, 2017 లోని సెక్షన్ 110 లో సవరణలను కౌన్సిల్ సిఫార్సు చేసింది:
-
అప్పీలేట్ ట్రిబ్యునల్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ట్రిబ్యునల్, స్టేట్ వ్యాట్ ట్రిబ్యునల్స్, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులలో పరోక్ష పన్ను చట్టాల కింద వ్యాజ్యశాస్త్రంలో గణనీయమైన అనుభవం ఉన్న న్యాయవాది జ్యుడీషియల్ సభ్యుడిగా నియామకానికి అర్హులు;
-
అప్పీలేట్ ట్రిబ్యునల్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ట్రిబ్యునల్, స్టేట్ వ్యాట్ ట్రిబ్యునల్స్, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులలో పరోక్ష పన్ను చట్టాల కింద వ్యాజ్యశాస్త్రంలో గణనీయమైన అనుభవం ఉన్న న్యాయవాది జ్యుడీషియల్ సభ్యుడిగా నియామకానికి అర్హులు;
-
ప్రెసిడెంట్ , మెంబర్ గా నియమించడానికి అర్హత కోసం కనీస వయస్సు 50 సంవత్సరాలు;
-
అధ్యక్షుడు, సభ్యుల పదవీకాలం వరుసగా గరిష్టంగా 70 సంవత్సరాలు 67 సంవత్సరాలు ఉంటుంది.
ii) జిఎస్ టి కౌన్సిల్ తన 50వ సమావేశంలో సిఫారసు చేసిన విధంగా ఐఎస్ డికి సంబంధించి చట్ట సవరణ: ప్రధాన కార్యాలయం మూడవ పక్షం నుండి సేకరించిన ఇన్పుట్ సేవలకు సంబంధించి ఐటిసి పంపిణీకి సిజిఎస్ టి చట్టం, 2017 లోని సెక్షన్ 20 లో నిర్దేశించిన ఐఎస్ డి విధానాన్ని తప్పనిసరి చేయాలని జిఎస్ టి కౌన్సిల్ తన 50 వ సమావేశంలో సిఫార్సు చేసింది. మూడవ పక్షం కానీ హెచ్ ఒ బ్రాంచ్ ఆఫీస్ రెండింటికీ లేదా ప్రత్యేకంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బి ఒ లకు ఆపాదించబడుతుంది.సీజీఎస్ టి చట్టం 2017లోని సెక్షన్ 2, సెక్షన్ 20లో సవరణలతో పాటు సీజీఎస్ టి రూల్స్-2017లోని రూల్ 39లో సవరణలు చేయాలని కౌన్సిల్ సిఫారసు చేసింది.
గమనిక: జిఎస్ టి కౌన్సిల్ సిఫార్సులను వాటాదారుల సమాచారం కోసం సరళమైన భాషలో నిర్ణయాలతో కూడిన ఈ ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత సర్క్యులర్లు/ నోటిఫికేషన్లు/ చట్ట సవరణల ద్వారా ఇది అమల్లోకి వస్తుంది, వీటికి మాత్రమే చట్ట బద్ధత ఉంటుంది. |
pib-124820 | 4c487fb98f01e8e37a6ed16fcb37405e2fb7a9586590df83e6f433fead26df92 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
బిహార్ లో పిఎం మత్స్య సంపద యోజన, ఇ-గోపాల యాప్ లతో పాటు అనేక ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించిన ప్రధాన మంత్రి
ఈ పథకం చేపల ఉత్పత్తిదారుల కు సరికొత్త మౌలిక సదుపాయాలను, ఆధునిక పరికరాలను, కొత్త మార్కెట్ లను అందుబాటులోకి తీసుకువస్తుంది : ప్రధాన మంత్రి
రాబోయే మూడు నాలుగేళ్లలో చేపల ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యం: ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ లో ‘పిఎం మత్స్య సంపద యోజన’, ‘ఇ-గోపాల యాప్’ లతో పాటు చేపల ఉత్పత్తి కి సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్బం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు న ప్రారంభించిన ఈ పథకాలన్నింటి వెనుక ఉన్న ఉద్దేశం మన రైతులకు సాధికారత ను కల్పించి, భారతదేశాన్ని 21వ శతాబ్దం లో స్వావలంబన కలిగిన దేశం గా తీర్చిదిద్దడమేనని అన్నారు.
‘మత్స్య సంపద యోజన’ ను కూడా ఇదే ఉద్దేశం తో ప్రారంభిస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. దేశం లో 21 రాష్ట్రాల లో దీనిని ప్రారంభిస్తున్నట్లు, రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఆ రాష్ట్రాలలో ఈ పథకం కోసం 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి ని పెడుతున్నట్లు ఆయన వివరించారు. దీనిలో, 1700 కోట్ల రూపాయల విలువైన పథకాలకు ఈ రోజు న శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.
ఈ పథకం లో భాగం గా పాట్నా, పూర్ణియా, సీతామఢీ, మధేపురా, కిషన్ గంజ్, సమస్తీపుర్ లలో అనేక సదుపాయాలను ప్రారంభించడమైంది అని ఆయన తెలిపారు.
ఈ పథకం చేపల ఉత్పత్తిదారులకు సరికొత్త మౌలిక సదుపాయాలను, ఆధునిక పరికరాలను, కొత్త మార్కెట్ లను అందుబాటులోకి తీసుకువస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. వీటితో పాటు సాగు ద్వారా, ఇతర మార్గాల ద్వారా లభించే అవకాశాలు కూడా పెరుగుతాయి అని ఆయన చెప్పారు. స్వాతంత్యం వచ్చిన తరువాత, దేశం లో చేపల రంగం కోసం ఇంత భారీ పథకాన్ని ప్రారంభించడం ఇదే మొట్టమొదటి సారి అని ఆయన అన్నారు.
ఈ రంగానికి ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మత్స్య రంగానికి సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం లో విడిగా ఒక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ మోదీ చెప్పారు. ఇది మన మత్స్యకారులతో పాటు, చేపల సాగు తో, చేపల అమ్మకం తో సంబంధం ఉన్న వారి ఇబ్బందులను తీరుస్తుందని ఆయన అన్నారు.
రాబోయే మూడు, నాలుగేళ్ల లో చేపల ఎగుమతులను రెండింతలు చేయడం కూడా ఒక లక్ష్యమని ప్రధాన మంత్రి అన్నారు. ఇది ఒక్క చేపల రంగం లోనే లక్షల కొద్దీ కొత్త ఉద్యోగావకాశాల ను సృష్టిస్తుందని ఆయన చెప్పారు. ఈ రంగంలోని నా స్నేహితులతో ఈ రోజు మాట్లాడిన తరువాత, నా విశ్వాసం మరింతగా పెరిగిందని ప్రధాన మంత్రి అన్నారు.
చేపల సాగు అనేది చాలా వరకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండడం పై ఆధారపడి ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విషయం లో ‘మిషన్ క్లీన్ గంగా’ మరింత సహాయకారి అవుతుంది అని ఆయన చెప్పారు. గంగా నది చుట్టుపక్కల ప్రాంతాలలో నదీ మార్గ రవాణా ఏర్పాట్ల దిశ గా సాగుతున్న పనులు కూడా చేపల పెంపకం రంగానికి ప్రయోజనాన్ని అందించనున్నాయని ప్రధాన మంత్రి వివరించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ప్రకటించిన ‘మిషన్ డాల్ఫిన్’ కూడా మత్స్య రంగం పై తనదైన ప్రభావాన్ని చూపనుందని ఆయన అన్నారు.
ప్రతి కుటుంబానికి సురక్షితమైన తాగు నీటి ని సరఫరా చేయడానికి గాను బిహార్ ప్రభుత్వం చేసిన కృషి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. బిహార్ లో నాలుగైదు సంవత్సరాల లో కేవలం 2 శాతం ఇళ్లు నీటి సరఫరా కనెక్షన్ లతో ముడిపడ్డాయని, ప్రస్తుతం బిహార్ లో 70 శాతానికి పైగా కుటుంబాలు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా తో జతపడ్డాయని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన‘జల్ జీవన్ మిషన్’ తో బిహార్ ప్రభుత్వ ప్రయత్నాలు మరింత మద్దతును అందుకొంటున్నాయి అని ప్రధాన మంత్రి తెలిపారు.
కరోనా కాలం లో కూడా, బిహార్ లో దాదాపుగా 60 లక్షల ఇళ్లకు పంపుల నుంచి నీరు అందుతోందని, ఇది నిజంగానే ఒక పెద్ద సాఫల్యం అని ప్రధాన మంత్రి అన్నారు. సంక్షోభ కాలం లో దేశం లో ఇంచుమించు ప్రతి పనీ నిలిచిపోగా, మన గ్రామాలలో మాత్రం పనులు ఎలా సాగాయో తెలిపే ఒక ఉదాహరణ గా ఇది నిలిచిందని ఆయన చెప్పారు. మన పల్లెల శక్తి వల్లే కరోనా కాలం లో సైతంమార్కెట్ల కు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాడి కేంద్రాలకు పాలు తరలివస్తూనే ఉన్నాయని ఆయన తెలిపారు.
ఇదొక్కటే కాదు, పాడి పరిశ్రమ కూడా ఈ సంకట స్థితిలో రికార్డు కొనుగోళ్లను నమోదు చేసింది అని ఆయన అన్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సైతం దేశం లో 10 కోట్ల మంది కి పైగా రైతుల బ్యాంకు ఖాతాల లోకి డబ్బు ను నేరు గా బదిలీ చేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ 10 కోట్ల మంది రైతుల లో బిహార్ రైతులే దాదాపు 75 లక్షల మంది ఉన్నారని ఆయన చెప్పారు.
ఈ పని కూడా ప్రశంసాపాత్రమైందేనంటూ, దీనికి కారణం బిహార్ కూడా కరోనా తో పాటు వరదలను ధైర్యంగా ఎదుర్కొంది అని ప్రధాన మంత్రి అన్నారు. సహాయక కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేయడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొన్నట్లు ఆయన చెప్పారు.
ఉచిత రేషన్ పథకం, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ ల ప్రయోజనాలు బిహార్ లో అవసరార్ధులకు ప్రతి ఒక్కరికే కాకుండా బయటి నుంచి తిరిగివచ్చిన ప్రతి ఒక్క వలస కుటుంబానికి అందాలని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. దీని కోసమే ఉచిత రేషన్ పథకాన్ని జూన్ తరువాత దీపావళి, ఛఠ్ పూజ ల వరకు పొడిగించడమైందని ఆయన అన్నారు.
కరోనా సంక్షోభం నేపథ్యం లో నగరాల నుంచి తిరిగి తమ గ్రామాలకు చేరుకున్న వలస కార్మికులు పశు సంవర్ధకం వైపు దృష్టి సారించారని, కేంద్ర ప్రభుత్వం, బిహార్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల ను వినియోగించుకుని ప్రయోజనం పొందుతున్నారని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం కొత్త ఉత్పత్తులు, కొత్త ఆవిష్కరణల తో పాడి రంగాన్ని విస్తృతపరచడం వల్ల పశువుల పెంపకందారులు, రైతులు ఆదాయాన్ని పెంచుకోగలిగారని చెప్పారు. దీనితో పాటు, దేశంలో పశు సంపద నాణ్యత ను మెరుగుపర్చడం, వాటి పరిశుభ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పోషకాహారం అందుబాటులో ఉంచడం వంటి వాటిపై దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి అన్నారు. ఈ లక్ష్యం తో, 50 కోట్ల కు పైగా పశువులకు గాలి కుంటు వ్యాధి నుంచి, బ్రూసెల్లోసిస్ నుంచి రక్షణ కోసం టీకాలు వేయడానికి ఉచిత టీకా ప్రచారాన్ని ఈ రోజు ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. పశువులకు శ్రేష్టమైన దాణా కోసం వివిధ పథకాల ద్వారా కేటాయింపులు జరపడమైందన్నారు.
దేశం లో మెరుగైన దేశీయ జాతులను అభివృద్ధి చేయడానికి ‘మిషన్ గోకుల్’ కు రూపకల్పన జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఒక సంవత్సరం క్రితం దేశవ్యాప్తంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో మొదటి దశ ఈ రోజు న పూర్తయిందన్నారు.
నాణ్యమైన స్వదేశీ జాతుల అభివృద్ధి కి బిహార్ ఇప్పుడు ప్రధాన కేంద్రం గా మారుతోందని ప్రధాన మంత్రి అన్నారు. జాతీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యం లో పూర్ణియా, పాట్నా, బరౌనిలలో నిర్మించిన ఆధునిక సౌకర్యాల తో బిహార్ పాడి రంగం లో బలోపేతం కానుంది. పూర్ణియా లో నిర్మించిన ఈ కేంద్రం భారతదేశం లో అతిపెద్ద కేంద్రాలలో ఒకటి. ఇది బిహార్ కు మాత్రమే కాకుండా తూర్పు భారతదేశం లో చాలా ప్రాంతాలకు ప్రయోజనాలను అందిస్తుంది. 'బచౌర్', 'రెడ్ పూర్ణియా' వంటి బిహార్ దేశీయ జాతుల అభివృద్ధి కి, పరిరక్షణ కు ఈ కేంద్రం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.
సాధారణం గా ఒక ఆవు సంవత్సరం లో ఒక దూడకు జన్మనిస్తుంది, కానీ ఐవిఎఫ్ టెక్నాలజీ సహాయం తో, సంవత్సరం లో చాలా దూడ ల పుట్టుక సాధ్యమే అని ప్రధాన మంత్రి వివరించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం తో ప్రతి గ్రామానికి చేరుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. జంతువుల మంచి జాతి తో పాటు, వాటి సంరక్షణ గురించి సరైన శాస్త్రీయ సమాచారం కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. ఈ రోజు న ప్రారంభించిన ఇ-గోపాల యాప్ ఆన్లైన్ డిజిటల్ మాధ్యమం గా ఉంటుంది, ఇది రైతులకు మెరుగైన నాణ్యమైన పశువులను ఎన్నుకోవటానికి, మధ్యవర్తుల నుంచి విముక్తి ని పొందటానికి సహాయపడుతుంది. ఈ యాప్ పశువుల సంరక్షణ కు, ఉత్పాదకత నుంచి, దాని ఆరోగ్యం, ఆహారం వరకు అన్ని విధాల సమాచారాన్ని ఇస్తుంది. ఈ పని పూర్తయ్యాక, పశువుల ఆధార్ నంబర్ ను ఇ-గోపాల యాప్‌లో చేర్చడం వల్ల ఆ పశువు కు సంబంధించిన మొత్తం సమాచారం సులభం గా లభిస్తుంది. ఇది పశువుల యజమానుల కు కొనుగోలు, అమ్మకం లను సులభతరంగా మార్చివేస్తుంది.
వ్యవసాయం, పశుపోషణ, మత్స్య పరిశ్రమ వంటి రంగాలను వేగంగా అభివృద్ధి చేయడానికి గ్రామం లో శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం, ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడం అవసరమని ప్రధాన మంత్రి అన్నారు. వ్యవసాయానికి సంబంధించిన విద్య కు, పరిశోధనలకు బిహార్ ఒక ముఖ్యమైన కేంద్రం గా ఉంది. ఢిల్లీ లోని పూసా ఇన్స్ టిట్యూట్ బిహార్ లోని సమస్తిపూర్ సమీపం లోని పూసా పట్టణాన్ని సూచిస్తుందని చాలా కొద్ది మందికి తెలుసు. వలసరాజ్య పాలన కాలం లోనే సమస్తిపూర్ లోని పూసా లో జాతీయ స్థాయి వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు అయింది. స్వాతంత్య్రానంతరం ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జన నాయక్ కర్పూరీ ఠాకూర్ వంటి దూరదృష్టి గల నాయకులను ఆయన ప్రశంసించారు.
ఈ ప్రయత్నాల నుంచి ప్రేరణ పొంది 2016 లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయం గా గుర్తించారని ప్రధాన మంత్రి తెలిపారు. దీని తరువాత విశ్వవిద్యాలయం లో, దానికి అనుబంధ కళాశాలల్లో కోర్సులను విస్తరించడం జరిగింది. దీనిని మరింత ముందుకు తీసుకుపోతూ, స్కూల్ ఆఫ్ అగ్రి-బిజినెస్ అండ్ రూరల్ మేనేజ్మెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించడమైంది. అదనం గా, కొత్త వసతి గృహాలు, స్టేడియాలు మరియు అతిథి గృహాలు కూడా నిర్మించడమైంది.
వ్యవసాయ రంగం ఆధునిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని, 5-6 సంవత్సరాల క్రితం ఒక కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రమే ఉన్న పరిస్థితులతో పోలిస్తే, దేశం లో ఇప్పుడు 3 కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడమైందని చెప్పారు. బిహార్ లో ప్రతి సంవత్సరం వచ్చే వరదల నుంచి వ్యవసాయాన్ని కాపాడటానికి ఇక్కడ మహాత్మా గాంధీ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధం గా, వ్యవసాయాన్ని విజ్ఞాన శాస్త్రంతో, సాంకేతిక విజ్ఞానం తో సంధానించడానికి మోతీపుర్ లోని చేపల ప్రాంతీయ పరిశోధన, శిక్షణ కేంద్రం, మోతీహరి లోని పశు సంవర్ధక, పాల అభివృద్ధి కేంద్రం.. ఇలా అనేక సంస్థలు ప్రారంభమయ్యాయి.
గ్రామాల సమీపంలో ఆహార శుద్ధి పరిశ్రమ లు, పరిశోధన కేంద్రాల సమూహాలను ఏర్పాటు చేయాలని, దానితో ‘జయ్ కిసాన్, జయ్ విజ్ఞాన్, జయ్ అనుసంధన్’ అనే నినాదాన్ని సాకారం చేయగలమని ప్రధాన మంత్రి అన్నారు. నిలవ వసతి, శీతల గిడ్డంగులు, ఇతర సౌకర్యాల ను అభివృద్ధి చేయడానికి ఎఫ్పిఓల కు, సహకార సమూహాలకు సహాయం చేసేందుకు, ,ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధిపరచేందుకు 1 లక్ష కోట్ల రూపాయల తో వ్యవసాయ నిధి ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రధాన మంత్రి వివరించారు.
మహిళా స్వయం సహాయక సమూహాలు సైతం మంచి మద్దతు ను అందుకొంటున్నాయని, ఈ సహాయం గత 6 సంవత్సరాల్లో 32 రెట్లు పెరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశాన్ని స్వయంసమృద్ధియుతంగా తీర్చిదిద్దడం లో భాగం గా దేశంలో అన్ని గ్రామాలను వృద్ధి ఇంజిన్ లుగా మలచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. |
pib-12205 | f958cda9dcb717160ad370591308a73467845d7ba58bb5540821e9145a86a1c5 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
బహరీన్ సామ్రాజ్య యువ రాజు మరియు ప్రధాని మాన్య శ్రీ ప్రిన్స్ సల్ మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి
బహరీన్ సామ్రాజ్య యువరాజు, ప్రధాని మాన్య శ్రీ ప్రిన్స్ సల్ మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు. మాన్య శ్రీ ప్రిన్స్ సల్ మాన్ భారతదేశం గణతంత్ర దినం సందర్భం లో ప్రధాన మంత్రి కి అభినందన లు తెలిపారు.
నేతలు ఇరువురు భారతదేశాని కి, బహరీన్ కు మధ్య ద్వైపాక్షిక సంబంధాల పై సమీక్ష ను నిర్వహించి, రాజకీయం, వ్యాపారం, పెట్టుబడి, శక్తి, ఆరోగ్యం, భద్రత, ఇంకా ప్రజల మధ్య పరస్పర సహకారం సహా వివిధ రంగాల లో నిరంతర పురోగతి చోటుచేసుకోవడం పట్ల సంతృప్తి ని వ్యక్తం చేశారు. భారతదేశం మరియు బహరీన్ లు ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన పరిణామం తాలూకు స్వర్ణ జయంతి ని 2021-22 లో జరుపుకొంటున్నాయి.
కోవిడ్ మహమ్మారి కాలం లో బహరీన్ లో భారతీయ సముదాయం యొక్క ఉత్కృష్ట సంరక్షణ తో పాటు వారి యొక్క సామాజిక అవసరాల ను, సాంస్కృతిక అవసరాల ను నెరవేర్చినందుకు బహరీన్ నాయకత్వాని కి ప్రధాన మంత్రి ధన్యవాదాలను తెలియజేశారు.
మాన్య శ్రీ రాజా హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలియజేశారు. యువరాజు, ప్రధాని ప్రిన్స్ సల్ మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ను వీలైనంత త్వరలో భారతదేశాన్ని సందర్శించడానికి తరలి రావాలంటూ తన ఆహ్వానాన్ని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. |
pib-248627 | bd8b18201e7705181937063115412e7239cebd576750d74fd2606b9a3ef51e46 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
లోసర్పర్వదినం సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
లోసర్ పర్వదినం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
“లోసర్ పర్వదినాన్ని లద్దాఖ్ లో నూతన సంవత్సరం రూపం లో పూర్తి ఉత్సాహం తో జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తున్నది. ఈ సందర్భం లో అందరికి ఇవే శుభకామన లు. ఈ రోజు న ఆరంభం అవుతున్న ఈ ఏడాది అందరి జీవనం లో సుఖ సంతోషాల ను కొనితెచ్చు గాక. ప్రతి ఒక్కరి మనోభీష్టాలు ఈ సంవత్సరం లో నెరవేరు గాక.’’ అని పేర్కొన్నారు.
Best wishes on “Happy Losar”, which has commenced and is marked with enthusiasm in Ladakh as new year. May this year, which has set in, bring happiness and well-being in everyone’s lives. May everyone’s wishes be fulfilled in this year.
— Narendra Modi December 25, 2022 |
pib-204590 | dd37d7ec89ab6af7966a4bb06ea21bcb13f33327c05981c3baba47b8a72a66d2 | tel | వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రైతులకు ఆదాయం పెంచడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వ్యవసాయ రంగంలో స్టార్ట్ అప్ లను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం : కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కంపోనెంట్ లో భాగంగా ఇన్నోవేషన్, ఔత్సాహిక వ్యవసాయ పరిశ్రమల కింద అంకుర సంస్థలకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిధుల సహాయం
మొదటి దశలో వ్యవసాయ శుద్ధి, ఫుడ్ టెక్నాలజీ, అదనపు విలువలను జోడించే 112 అంకుర సంస్థలకు రూ.1185.90 లక్షల ఆర్ధిక సహాయం
వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. రైతులకు అవకాశాలను కల్పించడం, యువతకు ఉపాధి కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడటానికి, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నొక్కిచెప్పినట్లుగా, వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం, అనుబంధ రంగాల ద్వారా స్టార్టప్, ఔత్సాహిక వ్యవసాయ పరిశ్రమలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టింది. అందువల్ల రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద, ఇన్నోవేషన్, అగ్రిప్రెనియర్‌షిప్ కంపోనెంట్ పై ప్రచారం జరిగింది. 2020-21 సంవత్సరానికి, మొదటి దశలో, వ్యవసాయ ప్రాసెసింగ్, ఫుడ్ టెక్నాలజీ, విలువ జోడించే రంగంలో మొత్తం 112 స్టార్టప్‌లకు రూ. 1185.90 లక్షలు ఆర్ధిక సహాయం అందించనున్నారు, ఇది రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. ఈ ఫండ్ వాయిదాలలో విడుదల చేస్తారు.
భారతదేశంలో వ్యవసాయ పరిశోధన, విస్తరణ, విద్య పురోగతిని సమీక్షిస్తున్నప్పుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ వెలువరించిన ఆలోచనలను మంత్రి శ్రీ తోమర్ గుర్తు చేశారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణ, వినియోగాన్ని నిర్ధారించడానికి స్టార్టప్‌లు, అగ్రి-ఎంటర్‌ప్రీనియర్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారని శ్రీ తోమర్ పేర్కొన్నారు. రైతులకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు సమాచారం అందించడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. గుర్తించిన సమస్యలను పరిష్కరించడానికి, వ్యవసాయ కార్యకలాపాల్లో వెట్టిని తగ్గించగల సాధనాలు, పరికరాల రూపకల్పన అవసరాలను తీర్చడానికి సంవత్సరానికి రెండుసార్లు హాకథాన్‌లను నిర్వహించవచ్చని ఆయన ఆదేశించారు.
వ్యవసాయంలో పోటీతత్వాన్ని పెంచడం, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలకు హ్యాండ్‌హోల్డింగ్ అందించడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తొందరగా అవలంబించాల్సిన అవసరాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి నొక్కి చెప్పారు. యువత వ్యవసాయం వైపు ఆకర్షించడం, ఈ రంగాన్ని చైతన్యం చేయడం ముఖ్యమని తెలిపారు. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలను పెంచడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలకు అనుగుణంగా, వ్యవసాయం, అనుబంధ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉన్న రాష్ట్ర కృషి వికాస్ యోజన ను పునరుద్ధరించారు.
పునరుద్దరణ పథకం కింద, ఇంక్యుబేషన్ పర్యావరణ వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఇన్నోవేషన్, అగ్రిప్రెనియర్‌షిప్, స్టార్టప్‌లను ప్రోత్సహించడం ఒక భాగం. డిఎసి, ఎఫ్డబ్ల్యూ 5 నాలెడ్జ్ పార్ట్నర్స్ లను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా, 24 ఆర్కెవివై-రాఫ్టార్ అగ్రిబిజినెస్ ఇంక్యుబేటర్స్ ను దేశవ్యాప్తంగా ప్రకటన ఇచ్చి కఠినమైన ఎంపిక ప్రక్రియ తర్వాత ఎంపిక చేసింది.
వ్యవసాయ-ప్రాసెసింగ్, ఫుడ్ టెక్నాలజీ, విలువ జోడించే రంగాల నుండి వివిధ నాలెడ్జ్ పార్టనర్లను అగ్రిబిజినెస్ ఇంక్యుబేటర్లచే ఎంపిక చేసిన 112 స్టార్టప్‌లకు మొదటి దశలో రూ. 1185.90 లక్షల నిధులను ఇస్తారు. ఈ ఫండ్ వాయిదాలలో విడుదల చేస్తారు. ఈ స్టార్టప్‌లకు రెండు నెలలు భారతదేశం అంతటా వ్యాపించిన 29 అగ్రిబిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్లలో శిక్షణ ఇచ్చారు. ఈ స్టార్టప్‌లు యువతకు ఉపాధి కల్పిస్తాయి. అంతేకాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా, వారికి అవకాశాలను కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదం చేస్తారు. అగ్రి-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మరిన్ని వివరాల కోసం, ఆర్కెవివై వెబ్సైట్: https://rkvy.nic.in ని సందర్శించవచ్చు |
pib-189927 | a55ff0e0aedb5e151521222e989ac9ab73010993caf4f18e08f762a61f37d05f | tel | వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆసక్తిగల దేశాలతో పరస్పర లబ్ధి పొందే సహకారానికి, ఒప్పందాలు చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఫారెన్ మిషన్ గురించి తెలియజేసిన శ్రీ పీయూష్ గోయల్
భారత ప్రధాని పోషించిన కీలకమైన పాత్ర కోవిడ్ సమస్యలను ఎదుర్కోవడంలో ఉత్తమ ఉద్దీపన. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రశసించబడింది.
భారతదేశం నుంచి ఏ దేశానికైనా ఔషదాల రూపంలో ఏవైనా సహకారం అవసరమైతే, భారతదేశం దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది.
ఒప్పందంలో పరస్పర సంబంధం ఉన్నంత వరకూ ఆసక్తి గల దేశాలతో పరస్పరం లబ్ధి పొందే సహకారానికి భారత్ సిద్ధంగా ఉందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. నూఢిల్లీలో ఫారెన్ మిషన్స్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన, భారత్ తో వ్యాపారం చేయాలకుంటున్న ఆసక్తిగల దేశాలను స్వాగతించారు. ఏదైనా బహుపాక్షిక ఒప్పందాలపై సంతకం చేసేటప్పుడు న్యాయమైన వ్యవహారం మరియు పరస్పర సహాకారాని భారత్ చాలా ప్రాముఖ్యతనిస్తుందన్న మంత్రి, రీజనల్ ఎకనామిక్ కాంప్రహెన్సివ్ పార్టనర్ షిఫ్ లో భారత్ పాల్గొనకపోవడానికి ఇదే కారణమని తెలిపారు. ద్వైపాక్షిక లేదా బహుపాక్షిక ఒప్పందాల కోసం రోడ్ మ్యాప్ ప్రణాళిక కోసం డిజిటల్ గా కనెక్ట్ అవ్వడానికి ఇది సరైన సమయమని ఆయన తెలిపారు.
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తికి వ్యతిరేకంగా సహకార ప్రయత్నాల కోసం మంత్రి ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న విదేశీ పౌరుల భద్రత, శ్రేయస్సును భారత్ చూసుకుంటోందని ఆయన అన్నారు. ఏప్రిల్ 5 న ప్రధాని కోరిన విధంగా 9 నిమిషాలు “లైట్ ఆఫ్”లో పాల్గొన్నందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
'సంక్షోభ సమయంలో భారత ప్రధాని పోషించిన కీలకమైన మరియు తగిన పాత్ర' సంక్షోభానికి వ్యతిరేకంగా ఉత్తమ ఉద్దీపన అని ఇటీవలి సర్వేలు మరియు అధ్యయనాలు రుజువు చేశాయని, ఇది దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడిందని శ్రీ గోయల్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రపంచ నాయకుల భారత్ నుంచి ఔషధాల ఎగుమతి కోరిన విషయాన్ని ప్రస్తావించిన శ్రీ గోయల్, భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఔషధాలను ఉత్పత్తి చేయడంలో మరియు పంపిణీ చేయడంలో భారతీయ ఔషధ పరిశ్రమ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. పోస్ట్-కోవిడ్ ప్రపంచంలో భారతదేశం నాయకత్వ పాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన, అవసరమైన మందులను, ముఖ్యంగా అభివృద్ధి చెందని దేశాలను ఏ దేశమూ కోల్పోకుండా ఉండటానికి భారత్ భరోసా ఇస్తోందని అన్నారు. భారతదేశం నుండి ఔషధ పరంగా ఏదైనా సహాయం అవసరమైతే, భారత్ దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తుందని ఆయన వారికి హామీ ఇచ్చారు. కానీ దీర్ఘకాలికంగా, ఫార్మసీ రంగం యొక్క స్థిరమైన వాణిజ్యం కోసం భారత్ త్వరితగతిన రోడ్‌మ్యాప్ తయారు చేయాల్సి ఉందని, ప్రధాని చెప్పినట్లు, ప్రపంచ పౌరుడిగా, అవసరమైన వారికి సేవ చేయడం మన బాధ్యత అని అన్నారు.
మహమ్మారి సమయంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం పాత్ర కీలకం కానుందని మంత్రి తెలిపారు. కేసుల సంఖ్య తగ్గింపు కోసం ప్రత్యేక సూచనలతో తక్షణ దేశవ్యాప్త లాక్ డౌన్ యొక్క ప్రభావాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ సంక్షోభ సమయంలో, సంక్షోభం నుండి దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందిస్తోందని శ్రీ గోయల్ అన్నారు. భవిష్యత్తులో సహకారం కోసం మన స్వంత దేశాలకు నిజమైన భాగస్వామ్య దేశాలను గుర్తించే సమయమిదని ఆయన తెలిపారు. |
pib-279697 | 6be76321f1656702e725fda82cc3680a172c3df962e5a5e8f2f1e65dbc76b518 | tel | రాష్ట్రపతి సచివాలయం
పత్రిక సమాచారం
శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి పదవికి చేసిన రాజీనామాను,
ప్రధాని సూచన మేరకు, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ ఆమోదం, రాజ్యాంగంలోని 75వ ఆర్టికల్, 2వ నిబంధన కింద తక్షణం అమల్లోకి వచ్చింది.
ప్రధాని సూచన మేరకు, కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌కు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ
అదనపు బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించారు. |
pib-273162 | ade9b86c84b44d4a853ba836813efb06f9542ff1e111dda56beb62914c7dfd9b | tel | వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఉల్లిపాయ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ప్రస్తుతం కొనసాగుతున్న ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతి చేయడంపై ఉన్న నిషేధాన్ని జనవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. |
pib-245249 | 1586a02d69ab1f69d73903c6e0109ed1542f4bdcadb181e11c815e1d811179aa | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
స్వాగత్ కార్యక్రమం 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు
"ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి సాంకేతికతను ఎలా సమర్ధవంతంగా ఉపయోగించవచ్చో, గుజరాత్ లో అమలౌతున్న స్వాగత్ కార్యక్రమం తెలియజేసింది"
"పదవి ద్వారా లభించిన పరిమితులకు నేను బానిసను కానని స్పష్టం చేస్తున్నాను. నేను ప్రజల మధ్యనే ఉంటూ, వారికి అండగా ఉంటాను”
"సులభమైన జీవనం, అందుబాటులో పరిపాలన అనే ఆలోచనతో స్వాగత్ ప్రారంభమయ్యింది"
"స్వాగత్ ద్వారా గుజరాత్ ప్రజలకు సేవ చేయడమే నాకు అతిపెద్ద ప్రతిఫలం"
"పరిపాలన అనేది పాత నియమాలు, చట్టాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలు, నూతన ఆలోచనల కారణంగా పాలన సాగుతుందని మేము నిరూపించాము"
“పరిపాలనలో అనేక పరిష్కారాలకు స్వాగత్ ప్రేరణగా మారింది. చాలా రాష్ట్రాలు ఈ తరహా వ్యవస్థపై పనిచేస్తున్నాయి”
“గత తొమ్మిదేళ్ళలో దేశం వేగంగా అభివృద్ధి చెందడంలో ప్రగతి పెద్ద పాత్ర పోషించింది. ఈ భావన కూడా స్వాగత్ ఆలోచన పైనే ఆధారపడి పనిచేస్తోంది”
సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులను పరిష్కరించే "స్వాగత్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలైన సందర్భంగా గుజరాత్ లో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం స్వాగత్ సప్తాహాన్ని జరుపుకుంటోంది.
ఈ పథకం ద్వారా గతంలో ప్రయోజనం పొందిన లబ్దిదారులతో కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా సంభాషించారు.
సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, "స్వాగత్" ప్రారంభించడం వెనుక ఉన్న లక్ష్యం విజయవంతంగా నెరవేరిందని పేర్కొన్నారు. అదేవిధంగా పౌరులు తమ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంతో పాటు, సమాజంలోని వందలాది మంది ప్రజల మొత్తం సమస్యలను లేవనెత్తడం పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. "ప్రభుత్వ వైఖరి స్నేహపూర్వకంగా ఉండాలి. అప్పుడే సామాన్య పౌరులు సైతం తమ సమస్యలను వారితో సులభంగా పంచుకోగలరు" అని ప్రధానమంత్రి సూచించారు. "స్వాగత్" కార్యక్రమం ప్రారంభించి ఇరవై ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, లబ్దిదారులతో సంభాషించిన అనంతరం తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పౌరుల కృషి, అంకితభావం వల్లే "స్వాగత్" కార్యక్రమం అద్భుతంగా విజయవంతమయ్యిందనీ, ఈ దిశగా సహకరించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.
ఏ పథకమైనా ఆ పథకాన్ని ప్రారంభించిన సమయంలో రూపొందించిన దాని ఉద్దేశం, దృక్పథం ద్వారా దాని భవితవ్యాన్ని నిర్ణయించడం జరుగుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 2003 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి గా తనకు పెద్దగా అనుభవం లేదని, అయితే, అధికారం అందరినీ మారుస్తుందనే సాధారణ వ్యాఖ్యలను తాను కూడా ఎదుర్కొన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. అధికార పీఠాన్ని అధిష్టించడం ద్వారా తన ప్రవర్తనలో మార్పు రాదని ఆయన స్పష్టం చేశారు. "పదవి ద్వారా లభించిన పరిమితులకు నేను బానిసను కానని స్పష్టం చేస్తున్నాను. నేను ప్రజల మధ్యనే ఉంటూ, వారికి అండగా ఉంటాను” అని అన్నారు. ఈ దృఢ సంకల్పమే సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులను పరిష్కరించే "స్వాగత్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రేరణనిచ్చింది. చట్టాలు లేదా పరిష్కారాల విషయంలో ప్రజాస్వామ్య సంస్థల పట్ల సాధారణ ప్రజల అభిప్రాయాలను స్వాగతించడమే "స్వాగత్" కార్యక్రమం వెనుక ఉన్న ఆలోచన అని ప్రధానమంత్రి వివరించారు. "సులభమైన జీవనం, అందుబాటులో పరిపాలన అనే ఆలోచనకు ఆలంబనగా నిలిచేదే స్వాగత్" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం పూర్తి నిజాయితీతో, అంకితభావంతో చేసిన కృషి వల్లే గుజరాత్ లోని సుపరిపాలన నమూనా ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఆయన నొక్కి చెప్పారు. ఇ-పారదర్శకత, ఇ-జవాబుదారీతనానికి ప్రతీకగా స్వాగత్ ద్వారా సుపరిపాలన ఒక ప్రధాన ఉదాహరణగా అంతర్జాతీయ టెలికాం సంస్థ ను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి నుంచి, "స్వాగత్" కార్యక్రమానికి అనేక ప్రశంసలు లభించాయి. ప్రజా సేవకు అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును కూడా పొందిందని ఆయన పేర్కొన్నారు. 2011 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో "స్వాగత్" కార్యక్రమం కారణంగా ఈ-గవర్నెన్స్ విభాగంలో గుజరాత్ రాష్ట్రం బంగారు పురస్కారాన్ని పొందిందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
"స్వాగత్ ద్వారా గుజరాత్ ప్రజలకు మనం సేవ చేయగలగడమే, నాకు అతిపెద్ద ప్రతిఫలంగా భావిస్తాను" అని ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. "స్వాగత్" కార్యక్రమంలో మేము ఒక ఆచరణాత్మక వ్యవస్థను సిద్ధం చేసాము. "స్వాగత్" కార్యక్రమం కింద బహిరంగ విచారణల మొదటి దశ బ్లాక్ మరియు తహసీల్ స్థాయిలలో జరుగుతాయి. ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా మేజిస్ట్రేట్ కు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక రాష్ట్ర స్థాయిలో బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. పథకాల ప్రభావం, వాటి అమలుతో పాటు, అమలు చేసే సంస్థలు, తుది లబ్ధిదారుల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం తనకు చాలా సహాయపడిందని, ఆయన చెప్పారు. "స్వాగత్" కార్యక్రమం పౌరులకు అధికారం ఇవ్వడంతో పాటు, వారి నుంచి విశ్వసనీయతను పొందింది.
"స్వాగత్" కార్యక్రమాన్ని వారానికి ఒక్కసారి నిర్వహించినప్పటికీ, వందల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో వాటి పరిష్కారానికి సంబంధించిన పనులు నెలంతా కొనసాగుతాయని ప్రధానమంత్రి వివరించారు. ఏదైనా నిర్దిష్ట విభాగాలు, అధికారులు లేదా ప్రాంతాల నుంచి తరచుగా ఇతరుల కంటే ఎక్కువగా ఫిర్యాదులు నమోదవుతున్నాయేమో గమనించడానికి తాను ఒక ప్రత్యేక విశ్లేషణ కూడా నిర్వహిస్తానని ప్రధానమంత్రి తెలియజేశారు. "అవసరమైతే విధానాలు కూడా సవరించడానికి వీలుగా లోతైన విశ్లేషణ కూడా జరిగింది", అని శ్రీ మోదీ తెలియజేస్తూ, "ఇది సాధారణ పౌరులలో నమ్మకాన్ని సృష్టించింది" అని పేర్కొన్నారు. సమాజంలో సుపరిపాలన కొలమానం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నాణ్యతపై ఆధారపడి ఉంటుందని, ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన పరీక్ష అని ఆయన వ్యాఖ్యానించారు.
స్వాగత్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మార్గాలను అనుసరించాలనే పాత భావనను మార్చిందని ప్రధాన మంత్రి అన్నారు. "పరిపాలన అనేది పాత నియమాలు, చట్టాలకే పరిమితం కాదని మేము నిరూపించాము, అయితే ఆవిష్కరణలు, కొత్త ఆలోచనల కారణంగా పాలన జరుగుతుంది" అని ఆయన చెప్పారు. 2003 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వాలు ఇ-గవర్నెన్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని శ్రీ మోదీ గుర్తు చేశారు. పేపర్ ట్రయల్స్, ఫిజికల్ ఫైల్స్ చాలా జాప్యాలకు, వేధింపులకు దారితీశాయి, వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది చాలావరకు తెలియదు. “ఇటువంటి పరిస్థితులలో, గుజరాత్ రాష్ట్రం భవిష్యత్తు ఆలోచనలతో పని చేసింది. కాగా, ఈ రోజు, పాలనలో ఎదురయ్యే అనేక పరిష్కారాలకు స్వాగత్ వంటి కార్యక్రమాలు ప్రేరణగా నిలిచాయి. చాలా రాష్ట్రాలు ఈ తరహా వ్యవస్థపై పనిచేస్తున్నాయి. ఇదేవిధంగా, కేంద్రంలో కూడా ప్రభుత్వ పనితీరును సమీక్షించేందుకు "ప్రగతి" అనే వ్యవస్థను రూపొందించాం. గత 9 ఏళ్లలో దేశం వేగంగా అభివృద్ధి చెందడంలో ఈ "ప్రగతి" కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. ఈ భావన కూడా "స్వాగత్" ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది. "ప్రగతి" కార్యక్రమం ద్వారా దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను తాను సమీక్షించాననీ, దీని వల్ల అనేక పథకాలు వేగవంతం అయ్యాయనీ ప్రధానమంత్రి తెలియజేశారు.
ఒక చిన్న మొక్కగా మొలకెత్తిన విత్తనం ఆ తర్వాత వందలాది కొమ్మలతో భారీ వృక్షం గా ఎదిగిన సారూప్యతను ప్రధానమంత్రి వివరిస్తూ, "స్వాగత్" కార్యక్రమం అమలు చేయాలనే ఆలోచన సుపరిపాలనలో వేలాది కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల్లో కొత్త జీవితాన్ని, శక్తిని నింపే విధంగా పాలనా కార్యక్రమాలు జరుపుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. "ప్రజా-ఆధారిత పాలన యొక్క నమూనా గా మారడం ద్వారా , ఈ కార్యక్రమం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుంది" అని ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించారు.
నేపథ్యం
సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులను పరిష్కరించే "స్వాగత్" అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి 2003 ఏప్రిల్ నెలలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమంత్రి ముందున్న అత్యంత ముఖ్యమైన బాధ్యత అనే భావనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సంకల్పంతో, జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రయోజనాన్ని ముందుగానే ఊహించి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ మొట్టమొదటిసారిగా సాంకేతిక ఆధారంగా పనిచేసే ఈ ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, సాంకేతికతను ఉపయోగించి ప్రజల రోజువారీ ఫిర్యాదులను త్వరగా, సమర్థవంతంగా, సమయానుకూలంగా పరిష్కరించడం ద్వారా పౌరులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేయడం. కాలక్రమేణా, "స్వాగత్ కార్యక్రమం" ప్రజల జీవితాలపై పరివర్తనాత్మక ప్రభావాన్ని తీసుకువచ్చింది. కాగితంతో పనిలేకుండా, పారదర్శకంగా, ఎటువంటి అవాంతరాలకు తావులేకుండా ప్రజల కష్టాలను పరిష్కరించడానికి ఇది ఒక సమర్థవంతమైన సాధనంగా మారింది.
ఈ "స్వాగత్" కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే, సాధారణ పౌరుడు సైతం తన ఫిర్యాదులను నేరుగా ముఖ్యమంత్రి కి తెలియజేయడానికి ఇది సహాయపడుతుంది. ప్రతి నెల నాలుగో గురువారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఫిర్యాదుల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నేరుగా పౌరులతో సంభాషిస్తారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడం ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అంతరాన్ని తగ్గించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. కార్యక్రమం కింద, ప్రతి దరఖాస్తుదారునికి, వారి ఫిర్యాదుపై తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేయడం జరుగుతుంది. పరష్కార దిశగా ఆయా దరఖాస్తులు ఏ ఏయే దశల్లో ఉన్నదీ వివరాలు ఆన్-లైన్ లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇప్పటి వరకు సమర్పించిన ఫిర్యాదుల్లో 99 శాతానికి పైగా దరఖాస్తులను పరిష్కరించడం జరిగింది.
"స్వాగత్" ఆన్-లైన్ కార్యక్రమంలో నాలుగు భాగాలు ఉన్నాయి: అవి రాష్ట్ర స్వాగత్, జిల్లా స్వాగత్, తాలూకా స్వాగత్, గ్రామ స్వాగత్. "రాష్ట్ర స్వాగత్" కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తారు. "జిల్లా స్వాగత్" కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు, కాగా, మమలత్దార్ మరియు క్లాస్-1 అధికారి "తాలూకా స్వాగత్" కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు. "గ్రామ స్వాగత్" కార్యక్రమంలో పౌరులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తలతి/మంత్రి కి తమ దరఖాస్తు దాఖలు చేస్తారు. పరిష్కారం కోసం వీటిని "తాలూకా స్వాగత్" కార్యక్రమానికి తీసుకువస్తారు. వీటికి అదనంగా, ప్రజల కోసం "లోక్-ఫరియాద్" కార్యక్రమం కూడా అమలులో ఉంది, దీనిలో వారు తమ ఫిర్యాదులను స్వాగత్ యూనిట్ లో దాఖలు చేస్తారు.
ప్రజా సేవలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు ప్రతిస్పందనను మెరుగుపరిచినందుకు 2010 సంవత్సరంలో, "స్వాగత్" ఆన్-లైన్ కార్యక్రమానికి యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ అవార్డుతో సహా వివిధ అవార్డులు లభించాయి. |
pib-153989 | 71ab565dd268461a7ccf31d38abcb3d833e963973cbd148d38a551c133682d65 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
యుఎస్ఎఅధ్యక్షుని తో ప్రధాన మంత్రి సమావేశం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ఎ లో ఆధికారిక పర్యటన లో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఈ రోజు న ఉదయం పూట వైట్ హౌస్ ను సందర్శించారు. అక్కడ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ మరియు ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ గారు లు ఆయన కు సంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి కి స్వాగతం పలికేందుకు భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ లు వేల సంఖ్య లో తరలివచ్చారు.
ప్రధాన మంత్రి తదనంతరం, అధ్యక్షుడు శ్రీ బైడెన్ తో కలసి పరిమిత మరియు ప్రతినిధి వర్గం స్థాయి సమావేశాల లో ఉపయోగకరమైన చర్చ లో పాల్గొన్నారు. నేతలు ఇద్దరూ రెండు దేశాల మధ్య దీర్ఘకాలం గా కొనసాగుతూ వస్తున్న మైత్రి, వ్యాపారం మరియు పెట్టుబడి, రక్షణ, శక్తి, జలవాయు పరివర్తన మొదలుకొని ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి రంగాల వరకు విస్తరిస్తున్న సహకారాన్ని గురించి చర్చించారు.
ఇరువురు నేత లు సంబంధాల ను ఒక నూతన శిఖరానికి చేర్చడ కోసం ఒక బలమైనటువంటి ప్రాతిపదిక ను అందించేటటువంటి ఉభయ దేశాల మధ్య గల పరస్పర విశ్వాసం మరియు అవగాహనల తో పాటు ఉమ్మడి విలువల ను గురించి కూడా చర్చించారు. వారు క్రిటికల్ ఎండ్ ఇమర్జింగ్ టెక్నాలజీ స్ వంటి కార్యక్రమాల మాధ్యం ద్వారా శ్రీఘ్ర పురోగతి చోటుచేసుకొంటూ ఉండడాన్ని మరియు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే వాటి ని తట్టుకొని నిలబడగలిగేటటువంటి సరఫరా వ్యవస్థల ను నిర్మించడం కోసం వ్యూహాత్మకమైన సాంకేతిక విజ్ఞాన సంబంధి సహకారాన్ని పెంపొందించుకోవాలన్న ప్రగాఢమైన అభిలాష పట్ల ప్రశంస ను వ్యక్తపరచారు. వారు మహత్వపూర్ణ ఖనిజాలు మరియు అంతరిక్ష రంగం లలో సహకారం పెంపొందుతూ ఉండడాన్ని స్వాగతించారు.
జలవాయు పరివర్తన ను ఎదుర్కోవాలన్న మరియు ఒక స్థిరమైనటువంటి భవిష్యత్తు సాధన సంబంధి లక్ష్యాన్ని దక్కించుకోవడం కోసం తమ వచనబద్ధత ను ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు. వారు స్వచ్ఛమైనటువంటి మరియు అక్షయమైనటువంటి శక్తి ని పెంపొందింప చేయగల మార్గాల ను గురించి మరియు జలవాయు కార్యక్రమం లో సహకరించుకోగల మార్గాల ను గురించి చర్చించారు.
నేతలు ఇద్దరు వారి వారి ప్రజానీకాని కి మరియు ప్రపంచ సముదాయాని కి కూడా హితకరం అయ్యేలా భారతదేశం, ఇంకా యుఎస్ఎ ల మధ్య బహుముఖీన మైన విస్తృత ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గాఢం గా మలచాలన్న దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ చర్చల లో పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ అంశాలు మరియు ప్రపంచ అంశాలు కూడా ప్రస్తావన కు వచ్చాయి.
అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ మరియు ప్రథమ మహిళ గారు లు తనకు అందించినటువంటి స్నేహపూర్ణ స్వాగతాని కి గాను ప్రధాన మంత్రి వారిని ప్రశంసించారు. 2023 వ సంవత్సరం సెప్టెంబరు లో జి20 దేశాల నేతల శిఖర సమ్మేళనం జరిగే సందర్భం లో న్యూఢిల్లీ లో అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు స్వాగతం పలకాలని ఉంది అంటూ ప్రధాన మంత్రి తన ఉత్సుకత ను వ్యక్తం చేశారు. |
pib-247349 | eaeb63acbe6f2600548395eefb0324c42c10a96bdbe84aaa8057696314a5f1a4 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
త్రిపుర లో పదవీప్రమాణాన్ని స్వీకరించినందుకు డాక్టర్ మాణిక్ సాహా కు మరియుమంత్రుల కు అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి
త్రిపుర ముఖ్యమంత్రి గా డాక్టర్ మాణిక్ సాహా మరియు రాష్ట్ర మంత్రులు గా ఆయన యొక్క జట్టు సభ్యులు పదవీప్రమాణాన్ని స్వీకరించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినందనల ను తెలియ జేశారు. పదవీప్రమాణ స్వీకార కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న పదవీప్రమాణాన్ని స్వీకరించిన డాక్టర్ శ్రీ మాణిక్ సాహా గారి కి మరియు బృందం లోని సభ్యులు అందరి కి ఇవే అభినందన లు. ప్రజలు ఇచ్చిన తీర్పున కు అనుగుణం గా ఈ జట్టు మరోమారు సేవల ను అందించడం తో పాటు గా త్రిపుర అభివృద్ధి యాత్ర కు జోరు ను జతచేసితీరుతుంది. వారి ప్రయాసల కు గాను వారి కి ఇవే నా శుభాకాంక్షలు. @DrManikSaha2’’ అని పేర్కొన్నారు. |
pib-196360 | ad376dfb8a9a52f28ece2ed9e78aba628ada9a1de0db1cd32f6594858b4244fd | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
హెచ్ ఎమ్ఐఎస్/ఎల్ ఎం ఐఎస్ వంటి ఎబిడిఎమ్ కంప్లైంట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ను అక్రిడేట్ చేసేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తో చేతులు కలిపిన నేషనల్ హెల్త్ అథారిటీ
వివిధ పరామీటర్లపై ఏ బి డి ఎం ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ సొల్యూషన్ లను అక్రిడేట్, రేట్ చేయనున్న ఎన్ ఎ బి హెచ్ , క్యు సి ఐ : సంభావ్య కొనుగోలుదారుడు సమాచారాంతర నిర్ణయం/ఎంపిక చేసుకోవడానికి దోహదం
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తో అనుసంధానమైన హెచ్ఎంఐఎస్ / ఎల్ఎంఐఎస్ పరిష్కారాలకు గుర్తింపు ఇవ్వడానికి నేషనల్ హెల్త్ అథారిటీ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ని ఆరు నెలల పాటు ఆన్ బోర్డ్ చేసింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ , క్యూసిఐ కి భాగస్వామ్య బోర్డు ఆరోగ్య సంరక్షణ రంగంలో జాతీయ అక్రిడిటేషన్ కు బాధ్యత వహిస్తుంది. వినియోగ సౌలభ్యం, యూజర్ ఇంటర్ ఫేస్, ధర, మాడ్యూల్స్/ఫీచర్ల సంఖ్య ,డబ్బు/ధరతో సహా వివిధ పరామీటర్లపై ఏ బి డి ఎం కంప్లైంట్ సొల్యూషన్ లను అక్రిడిటేషన్ చేయడం , రేటింగ్ చేసే బాధ్యతను ఎన్ ఎ బి హెచ్ చేపడుతుంది, తద్వారా సంభావ్య కొనుగోలుదారులు విశ్వసనీయమైన సమాచారాన్ని పొందవచ్చు.
ఈ చొరవ యొక్క ఉద్దేశ్యం గురించి డాక్టర్ ఆర్.ఎస్. శర్మ, సి ఇ ఓ, ఎన్ హెచ్ ఎ మాట్లాడుతూ, "ఏ బి డి ఎం తో, ఆరోగ్య సాంకేతిక సేవల డెలివరీని గణనీయమైన రీతిలో క్రమబద్ధీకరించడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. హెల్త్ కేర్ సొల్యూషన్ లు అక్రిడిటేషన్, రేట్ చేయబడ్డాయని , ఒక పరిష్కారాన్ని మరోదానిపై ఎంచు కోవడానికి వినియోగదారులకు తగినంత సమాచారం లభ్యం అయ్యేలా ధృవీకరించడం కోసం మేం ఒక ఫ్రేమ్ వర్క్ ని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దీని కోసం, మేము ఒక సమీక్షా ప్రణాళికను అభివృద్ధి చేయడానికి , రాబోయే ఆరు నెలల్లో ఏ బి డి ఎం తో విజయవంతంగా ఇంటిగ్రేట్ చేయబడిన కనీసం 10 హెచ్ ఎం ఐ ఎస్ పరిష్కారాల అక్రిడిటేషన్ , సమీక్షను పూర్తి చేయడానికి క్యు సి ఐ తో భాగస్వామ్యం నెరపుతున్నాము.‘‘
అన్నారు.
ఓ సి ఐ ఛైర్మన్ శ్రీ ఆదిల్ జైనుల్ భాయ్ ఈ చొరవ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, " ఎన్ హెచ్ ఎ తన డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాల ద్వారా భారతదేశంలో ప్రజా ఆరోగ్య సంరక్షణ ప్రాప్యతను విప్లవాత్మకంగా మారుస్తున్న విధానం ఎంతో అసాధారణమైనది. ఆసుపత్రులు, ల్యాబ్ లు ,క్లినిక్ ల నిర్వహణ కోసం ఏ బి డి ఎం కింద సాఫ్ట్ వేర్ సొల్యూషన్ ల అక్రిడిటేషన్ కు ఈ కార్యక్రమం భారతదేశంలో హెల్త్ టెక్ కు ఒక పెద్ద అడుగు.
ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో క్యు సి ఐ, ఎన్ ఎ బి హెచ్ లు ఎన్ హెచ్ ఎతో చేతులు కలపడం సంతోషాన్ని కలిగిస్తోంది. అక్రిడేటెడ్ హెల్త్ టెక్ సొల్యూషన్స్ ఆరోగ్య సంరక్షణ సంస్థలు తమ రోగి ప్రయాణాలు, కార్యకలాపాలను ఏ బి డి ఎం ప్రమాణాలకు అనుగుణంగా మరింత క్రమబద్ధంగా నిర్వహించడానికి సహాయపడతాయి. అంతిమంగా, ఈ చొరవ భారతదేశ పౌరులు మరింత మెరుగ్గా ,సకాలంలో ఆరోగ్య సంరక్షణ పొందడానికి సహాయపడుతుంది. ఇంకా ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణను డిజిటలైజేషన్ చేయడంలో భారతదేశం అగ్రగామిగా ఎదగడానికి సహాయపడుతుంది.
ఈ అక్రిడిటేషన్ ప్రక్రియ దశలవారీగా నిర్వహించబడుతుంది. ఫేజ్ I,
ఏ బి డి ఎం టి విజయవంతంగా ఇంటిగ్రేట్ చేయబడ్డ హెచ్ ఎం ఐ ఎస్ సొల్యూషన్ ల అక్రిడిటేషన్ , రేటింగ్ పై దృష్టి సారిస్తుంది. తదుపరి దశల్లో ఎల్ ఎం ఐ ఎస్, హెల్త్ లాకర్ లు, హెల్త్ టెక్, పి హెచ్ ఆర్ యాప్ లు మొదలైన ఇతర సబ్జెక్టివ్ పరామీటర్ లు ,ఇతర కేటగిరీల హెల్త్ కేర్ సొల్యూషన్ లు చేర్చబడతాయి.
ఈ చొరవలో భాగంగా, ఎన్ ఎ బి హెచ్, ఓ సి ఐ తమ ఏ బి డి ఎం ఇంటిగ్రేషన్ ని విజయవంతంగా పూర్తి చేసిన వివిధ కేటగిరీల ప్రొడక్ట్ ల అంతటా డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ల కోసం ఒక అక్రిడిటేషన్ స్టాండర్డ్ ని అభివృద్ధి చేయడానికి డిజిటల్ హెల్త్ ఎక్స్ పర్ట్ లను ఆన్ బోర్డ్ చేస్తుంది.సమీక్షా పరామీటర్ల కోసం టెస్ట్ ఎన్విరాన్ మెంట్ ఎన్ హెచ్ ఎ ద్వారా అందించబడుతుంది. పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ లు, సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ లు, ఆసుపత్రులు, ల్యాబ్ లు, హెల్త్ కేర్ అగ్రిగేటర్లు మొదలైన దరఖాస్తుదారులు ఈ అక్రిడిటేషన్ పొందాలనుకునేవారు అక్రిడిటేషన్ ప్రమాణాలు ,ఎబిడిఎమ్ ఆవశ్యకతలకు అనుగుణంగా తమ 'అక్రిడిటేషన్ అప్లికేషన్'ని ఎన్ ఎ బి హెచ్ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఖరారు అయిన అక్రిడిటేషన్ ప్రమాణాలపై పరిష్కారాలు సమీక్షించబడతాయి క్యు సి ఐ ద్వారా భాగస్వామ్య నిపుణుల స్వతంత్ర బృందం తరువాత గుర్తింపు పొందిన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలకు రేటింగ్ ఇస్తుంది ఇంకా వారి నిర్వహణ పరమైన పనితీరు, మార్గదర్శకాలకు అనుగుణంగా కనీస ఆచరణీయ ఆవశ్యకతలను పాటించడం, ప్రమాణాల నిర్వహణ ,వినియోగదారు అనుభవం కోసం వాటిని నియతానుసారంగా పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు తమ ఫీడ్ బ్యాక్ ని కూడా సబ్మిట్ చేయగలరు, ఇది రేటింగ్ మెకానిజంకు జోడించబడుతుంది. వినియోగదారులు తమ ఫీడ్ బ్యాక్ ని కూడా సబ్మిట్ చేయగలరు, ఇది రేటింగ్ మెకానిజంకు జోడించబడుతుంది. పరిష్కారాల కోసం రేటింగ్ లు ,రివ్యూ లను క్యు సి ఐ ద్వారా సిఫారసు చేయబడ్డ ప్లాట్ ఫారంతో పాటుగా ఏ బి డి ఎం వెబ్ సైట్ పై పబ్లిష్ చేస్తారు.
ఈ చొరవతో, అదే కేటగిరీ కిందకు .వచ్చే ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను పోల్చడం ద్వారా సంభావ్య కొనుగోలుదారుడు ఒక వివేచనాత్మక నిర్ణయం తీసుకో గలగడం ఎన్ హెచ్ ఎ లక్ష్యంగా పెట్టుకుంది. క్యు సి ఐ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడ్డ ,గుర్తింపు పొందిన ఉత్పత్తులు, సేవలు ,ప్రక్రియల తృతీయపక్ష మదింపు కోసం విశ్వసనీయమైన, నమ్మకమైన యంత్రాంగాన్ని అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ వాణిజ్య ,పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటయిన ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.
ఏ బి ది ఎం కంప్లైంట్ డిజిటల్ హెల్త్ కేర్ పరిష్కారాలపై మరిన్ని వివరాలు ఇక్కడ లభ్యం అవుతాయి: https://abdm.gov.in/our-partners |
pib-273375 | 692f9349adfff7fe0c8f10b787dd1fef43688d8e95226ccaa841b9d5254a1017 | tel | రక్షణ మంత్రిత్వ శాఖ
సీషెల్స్‌లో అడుగుపెట్టిన ఐఎన్ఎస్ సునయన
సంయుక్త నౌకాదళ విన్యాసాలలో తొలిసారిగా భాగస్వామైన భారత నౌకాదళం
ఆపరేషన్ సదరన్ రెడినెస్ ఆఫ్ కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ లో వార్శిక శిక్షణా విన్యాసాలలో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ సునయన 24 సెప్టెంబరు 2022న పోర్ట్ విక్టోరియా ద్వారా సీషెల్స్‌లోకి అడుగుపెట్టింది. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సముద్ర భద్రతలో భారత నావికాదళం యొక్క నిబద్ధతను బలపరచడమే కాకుండా.. సీఎంఎఫ్ విన్యాసాలలో భారత నౌకాదళ నౌక తొలిసారిగా పాల్గొనడానికి ప్రతీకగా నిలుస్తుంది. సీఎంఎఫ్ నిర్వహిస్తున్న సామర్థ్య పెంపు శిక్షణా విన్యాసాలకు భారత దళం
భాగస్వామిగా పాల్గొనాల్సి ఉంది. సంయుక్త శిక్షణా విన్యాసాలలో అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలనుండి సిబ్బంది ప్రతినిధి బృందాలుగాను మరియు బ్రిటన్, స్పెయిన్ మరియు భారతదేశం షిప్ భాగస్వాములుగా పాల్గొంటున్నాయి. సునయన పోర్ట్ కాల్ సమయంలో ఈ విన్యాసాలలో పాల్గొనే దేశాలతో వృత్తిపరమైన పరస్పర చర్యలు రూపకల్పన చేయబడ్డాయి. |
pib-121254 | a9e7903c13bf9e63db288e415ff865bd62600b1dcebf16558ed70e846dbbd8eb | tel | జల శక్తి మంత్రిత్వ శాఖ
‘స్వచ్ఛత క్రానికల్స్: ట్రాన్స్ఫార్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా’ సంకలనాన్ని ఆవిష్కరించిన కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
వివిధ రాష్ట్రాల్లో అమలువుతున్న 75 ఓడీఎఫ్ ప్లస్ ఉత్తమ విధానాల సంకలనం ఈ క్రానికల్; ఇది ఆవిష్కరణలను చాటి చెబుతుంది, ఆచరణలను ప్రోత్సహిస్తుంది
'రూరల్ వాష్ పార్టనర్స్ ఫోరమ్' రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా, ఇవాళ, కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ 75 ODF ప్లస్ ఉత్తమ విధానాల సంకలనాన్ని ఆవిష్కరించారు. 'స్వచ్ఛత క్రానికల్స్: ట్రాన్స్ఫార్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా' పేరుతో ఈ సంకలనాన్ని రూపొందించారు. ఎస్బీఎం-జి రెండో దశ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ ODF ప్లస్ కార్యకలాపాల కోసం రాష్ట్రాలు/యూటీలు చేసిన ప్రయత్నాలు, అడ్డంకులను అధిగమించడానికి & ప్రజల్లో అవగాహన పెంచడానికి తీసుకొచ్చిన ఆవిష్కరణలు, ప్రత్యేక ప్రచారాలను ఈ సంకలనం వివరిస్తుంది.
"ODF ప్లస్‌ను సాధించడానికి కృషి చేస్తున్న రాష్ట్రాలు, వర్గాలకు ఈ సంకలనం విలువైన వనరు"గా కేంద్ర మంత్రి శ్రీ షెకావత్ అభివర్ణించారు. "దేశవ్యాప్తంగా అమలైన ఉత్తమ విధానాలను ఇది వివరిస్తుంది, ఆ విజయాలను అనుసరించేలా ఇతరులకు స్ఫూర్తిని అందిస్తుంది" అన్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ఐఈసీ బృందం ఈ సంకలనాన్ని రూపొందించింది. ఎస్బీఎంజీ రెండో దశ నేపథ్యాంశాల అమలుకు సంబంధించిన కథనాలు ఇందులో ఉంటాయి. ఈ కింది కీలక ప్రమాణాల ఆధారారంగా కథనాలను ఎంపిక చేశారు:
ఆవిష్కరణలు: ODF ప్లస్‌ను సాధించడానికి అనుసరించిన వినూత్న విధానాలను ఈ విభాగం వివరిస్తుంది. ఉదాహరణకు, ఒడిశా రాష్ట్రంలో, బ్లాక్ స్థాయిలో సామాజిక భాగస్వామ్యం & నాయకత్వం వల్ల ఖోర్ధా జిల్లాలోని జితికర్ సువాన్‌లో గ్రామం ఎలా ODF ప్లస్ నమూనా గ్రామం హోదాను సాధించిందో ఈ సంకలనం వివరిస్తుంది. ODF ప్లస్ ఆస్తుల ప్రత్యక్ష నమూనాలను ప్రదర్శించడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లా ODF ప్లస్ స్థితిని ఎలా సాధించిందో వెల్లడిస్తుంది.
అడ్డంకులను అధిగమించడం: ODF ప్లస్‌ను సాధించడంలో ఎదురైన సవాళ్లు, వాటిని ఎలా అధిగమించింది అనే విషయాలను ఈ విభాగం చర్చిస్తుంది. ఉదాహరణకు, తమిళనాడు రాష్ట్రంలో నమ్మ ఊరు సూపరు ప్రచారంలో భాగంగా, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం వల్ల మదురై జిల్లాలోని పెరి-అర్బన్ పంచాయతీల్లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి.
అవగాహన పెంచడం: పారిశుద్ధ్యం గురించి అవగాహన పెంచడానికి తీసుకున్న చర్యలను ఈ విభాగం చాటి చెబుతుంది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలు, 'వాష్ వాణి' అనే పత్రిక నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రత అలవాట్లను ప్రోత్సహించేలా తమ సృజనాత్మక శక్తిని ఉపయోగిస్తున్నారు.
ప్రత్యేక ప్రచారాలు: ODF ప్లస్ సాధించడానికి ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమాలను ఈ విభాగం వివరిస్తుంది. ఉదాహరణకు, 'స్వచ్ఛ్ సాగర్', 'సురక్షిత్ సాగర్' కార్యక్రమాలు తీసుకొచ్చిన గుజరాత్ ప్రభుత్వం, రాష్ట్రంలోని సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచడానికి, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టింది.
‘స్వచ్ఛత క్రానికల్స్: ట్రాన్స్ఫార్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా’ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి |
pib-178009 | 5909c0cba12009abd3e35c687f552f9e6203ff8128fafc66706d0838b4b75694 | tel | సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో కేవీఐసీ చైర్మన్ ఆధ్వర్యంలో గ్రామ వికాస్ యోజన పంపిణీ కార్యక్రమం
ఖాదీ & గ్రామ పరిశ్రమల కమిషన్ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో, గ్రామ వికాస్ యోజన పంపిణీ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ హాపూర్‌లోని నాన్పూర్ గ్రామంలో నిర్వహించారు. మీరట్ కేవీఐసీ ప్రాంతీయ కార్యాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
హనీ మిషన్‌లో భాగంగా, 30 మంది తేనెటీగల పెంపకందార్లకు 300 తేనెటీగల పెట్టెలు, తేనెటీగలను ఈ కార్యక్రమంలో అందించారు. కుమ్హార్ సశక్తికరణ్ పథకం కింద 100 మంది కుమ్మరులకు విద్యుత్ కుండల చక్రాలు, 75 మంది తోలు కళాకారులకు పాదరక్షల మరమ్మతు పనిముట్ల పెట్టెలను అందించారు. గర్ ముక్తేశ్వర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ హరేంద్ర సింగ్ తెవాటియా ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రతి ఒక్కరు యంత్రాలు, పనిముట్ల పెట్టెలను సద్వినియోగం చేసుకుని వీలైనంత ఎక్కువ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని స్వావలంబన భారత్ నిర్మాణానికి సహకరించాలని శ్రీ మనోజ్‌కుమార్ మాట్లాడారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత్వంలో భారతదేశం తనను తాను పటిష్టమైన, స్వయంసమృద్ధి దేశంగా ప్రపంచానికి చాటుతోందని చెప్పారు. ప్రధాని నినాదమైన 'లోకల్ టు గ్లోబల్ ఇండియా' దార్శనికతను సాకారం చేసేందుకు 'భారత్‌లో తయారీ'తో పాటు 'ప్రపంచం కోసం తయారీ' మంత్రంతో మనమంతా ముందుకు సాగాలని సూచించారు.
మీరట్‌లోని కేవీఐసీ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోకి ఉత్తరప్రదేశ్‌లోని 6 డివిజన్లు, 25 జిల్లాలు వస్తాయి. ఈ కార్యాలయం కింద 415 నమోదిత ఖాదీ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా 1,03,787 మంది చేనేత కార్మికులు, స్పిన్నర్లు, ఇతర చేతివృత్తి కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. 2022-23లో, ఖాదీ సంస్థలు సుమారు రూ.29,996 లక్షల విలువైన ఖాదీని ఉత్పత్తి చేశాయి, రూ.47,385 లక్షల విలువైన అమ్మకాలను సాధించాయి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద గత మూడేళ్లలో 10,960 యూనిట్లను స్థాపించారు. వీటి ద్వారా 87,680 మందికి ఉపాధి లభిస్తోంది. గ్రామ వికాస్ యోజన పంపిణీ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేవీఐసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. |
pib-2337 | d7402a4f953ae4b05230321d00b9a56ac36e24b2b6f5257a0313a2c7c66c9d45 | tel | ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చౌరీ చౌరా శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
శివుని అవతారమైన గోరక్షనాథ్ కు మొదటగా నమస్కరిస్తున్నాను. దేవరాహా బాబా ఆశీస్సులతో ఈ జిల్లా బాగా అభివృద్ధి చెందుతున్నది. ఇవాళ, నేను దేవరాహా బాబా కు చెందిన చౌరీ చౌరా యొక్క గొప్ప ప్రజల ముందు స్వాగతం మరియు నమస్కరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు, ప్రముఖ, ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, యుపి ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమం లో పాల్గొంటున్న నా సోదర, సోదరీమణులు . చౌరీ చౌరా పవిత్ర భూమిలో దేశం కోసం త్యాగం చేసిన, దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి కొత్త దిశానిర్దేశం చేసిన వారికి నేను నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల్లోని అమరవీరుల, స్వాతంత్ర్య సమరయోధుల బంధువులు హాజరవుతున్నారు. అనేకమంది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు కూడా ఈ రోజు ఆన్లైన్ ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను, నా గౌరవ వందనాలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
చౌరీ-చౌరాలో వందేళ్ల క్రితం జరిగిన సంఘటన కేవలం పోలీస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం మాత్రమే కాదు. చౌరీ-చౌరా సందేశం చాలా పెద్దది, చాలా విస్తృతమైనది. వివిధ కారణాల వల్ల చౌరి-చౌరా గురించి మాట్లాడినప్పుడల్లా, ఇది ఒక చిన్న కాల్పుల సందర్భంలో కనిపించింది. అయితే, ఆ సమయంలో జరిగిన పరిస్థితులూ, కారణాలూ అంతే ముఖ్యం. పోలీస్ స్టేషన్ లో మంటలు లేవని, ప్రజల గుండెల్లో మంటలు రగిలాయి . చౌరి-చౌరా చరిత్రలో ప్రతి ప్రయత్నానికి దేశ చరిత్రలో స్థానం ఇవ్వబడుతోంది, ఇది ఎంతో ప్రశంసించబడింది. యోగి గారికి, ఆయన బృందం మొత్తం ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. చౌరీ-చౌరా శతజయంతి సందర్భంగా నేడు ఒక తపాలా బిళ్ళ కూడా జారీ చేయబడింది . ఈ రోజు నుంచి ఏడాది పొడవునా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ లోగా, చౌరీ-చౌరాతో పాటు ప్రతి గ్రామం, ప్రతి ప్రాంత ధైర్యసాహసాలు కూడా గుర్తుంచబడతాయి. ఈ ఏడాది, దేశం తన స్వాతంత్ర్యం యొక్క 75 వ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు, అలాంటి వేడుకను కలిగి ఉండటం మరింత సందర్భోచితంగా ఉంటుంది.
మిత్రులారా,
చౌరీ చౌరా దేశ సామాన్యుల యాదృచ్ఛిక పోరాటం. దురదృష్టవశాత్తు చౌరీ చౌరా అమరవీరుల గురించి వివరంగా చర్చించబడలేదు. ఈ పోరాటంలో అమరులైన, విప్లవకారులు చరిత్ర పుటల్లో ప్రముఖ స్థానం కల్పించక పోయి ఉండవచ్చు, కానీ వారి రక్తం దేశ గడ్డపై ఖచ్చితంగా ఉంది, ఇది మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుంది. వీరు వివిధ గ్రామాలకు చెందిన వారు, వివిధ వయస్సులు, విభిన్న సామాజిక నేపథ్యాలు కలిగి ఉన్న వారు , కానీ వీరందరూ భారత మాత ధైర్యవంతులైన పిల్లలు. ఒక్క సంఘటనకు 19 మంది స్వాతంత్ర్య సమరయోధులను ఉరితీసిన సందర్భాలు స్వాతంత్య్రోద్యమంలో తక్కువ. బ్రిటిష్ సామ్రాజ్యం వందలమంది స్వాతంత్ర్య సమరయోధులను ఉరితీయటం జరిగింది. కానీ బాబా రాఘవదాస్, మహామాన మాలవీయ ల కృషి వల్ల సుమారు 150 మంది ఉరినుండి కాపాడబడ్డారు. అందువల్ల, ఈ రోజు కూడా బాబా రాఘవదాస్ తో పాటు మహామాన మదన్ మోహన్ మాలవీయ గారిని స్మరించుకోవాల్సిన రోజు.
మిత్రులారా,
ఈ మొత్తం ప్రచారంతో మా విద్యార్థులు, యువత కూడా పోటీల ద్వారా కనెక్ట్ కావడం నాకు సంతోషంగా ఉంది. మన యువకులు చేసే అధ్యయనం చరిత్రలో చెప్పలేని అనేక అంశాలను వెల్లడిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధులపై ఒక పుస్తకం రాయడానికి, సంఘటనలపై పుస్తకం రాయడానికి, పరిశోధనా పత్రం రాయడానికి 75 సంవత్సరాల స్వాతంత్ర్య సందర్భంగా యువ ప్రభుత్వ రచయితలను విద్యా మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. చౌరి-చౌరా సంగ్రామ్ యొక్క చాలా మంది వీరోచిత యోధులు ఉన్నారు, వారి జీవితాలను మీరు దేశం ముందు తీసుకురావచ్చు. చౌరి-చౌరా శాతాబ్ది యొక్క ఈ కార్యక్రమాలను స్థానిక కళా సంస్కృతి మరియు స్వావలంబనతో అనుసంధానించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నం మన స్వాతంత్ర్య సమరయోధులకు మా నివాళి కూడా అవుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు యుపి ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
బానిసత్వం యొక్క సంకెళ్ళను విచ్ఛిన్నం చేసిన సామూహికత యొక్క అదే శక్తి భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా చేస్తుంది. సామూహికత యొక్క ఈ శక్తి స్వావలంబన భారత్ ప్రచారానికి ప్రాథమిక ఆధారం. మేము దేశాన్ని 130 మిలియన్ల మందికి, మరియు మొత్తం ప్రపంచ కుటుంబానికి స్వయం సమృద్ధిగా చేస్తున్నాము.
ఈ కరోనా కాలంలో, 150 కి పైగా దేశాల పౌరులకు సహాయం చేయడానికి భారతదేశం అవసరమైన ఔషధాలను పంపినప్పుడు, భారతదేశం ప్రపంచంలోని వివిధ దేశాలతో కలిసి 5 మిలియన్లకు పైగా పౌరులను స్వదేశానికి రప్పించడానికి పనిచేసినప్పుడు, భారతదేశం వేలాది మంది పౌరులను పంపినప్పుడు దేశాలు తమ స్వదేశాలకు సురక్షితంగా, నేడు భారతదేశం మానవ జీవిత రక్షణ విషయంలో భారతదేశం ఆందోళన చెందుతున్నప్పుడు, ప్రపంచంలోని ఇతర దేశాల కంటే వేగంగా టీకాలు వేసే కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రపంచానికి టీకాలు వేస్తూ, మన స్వాతంత్ర్య సమరయోధులు ఎక్కడైనా గర్వపడాలి వారి ఆత్మలు.
మిత్రులారా,
ఈ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి అపూర్వమైన ప్రయత్నాలు కూడా అవసరం. ఈ భాగీరత్ ప్రయత్నాల సంగ్రహావలోకనం, ఈ సమయం బడ్జెట్లో కూడా మనం చూడవచ్చు. ఈ బడ్జెట్ కరోనా కాలంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతోంది. స్వదేశీయులు, మొదటి బడ్జెట్ దిగ్గజాలలో చాలా మంది దేశం అటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్ల ప్రభుత్వం పన్నులు పెంచాలి, సామాన్యులపై భారం మోపాలి, కొత్త పన్నులు విధించాలి. అయితే ఈ బడ్జెట్‌పై ఎటువంటి భారం పెరగలేదు దేశస్థులు.
బదులుగా, దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి ఎక్కువ ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యయం దేశంలో విస్తృత రహదారులను నిర్మించటానికి ఉంటుంది, ఈ ఖర్చు మీ గ్రామాన్ని నగరాలు, మార్కెట్లు, మండీలతో అనుసంధానించడానికి ఉంటుంది, ఈ వ్యయ వంతెనలు నిర్మించబడతాయి, రైల్వే ట్రాక్‌లు వేయబడతాయి, కొత్త రైళ్లు నడుస్తాయి, కొత్త బస్సులు కూడా ఉంటాయి రన్.
మెరుగైన విద్య, అక్షరాస్యత మరియు మన యువతకు మంచి అవకాశాల కోసం బడ్జెట్లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మరియు కామ్రేడ్స్, ఈ విషయాలన్నింటికీ పనిచేసే వారు కూడా అవసరం. ప్రభుత్వం నిర్మాణానికి ఎక్కువ ఖర్చు చేసినప్పుడు, అది దేశంలోని లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
మిత్రులారా,
దశాబ్దాలుగా, మన దేశంలో బడ్జెట్ అంటే ఎవరి పేరిట ప్రకటించబడిందో అర్థం! బడ్జెట్‌ను ఓటు బ్యాంకు యొక్క లెడ్జర్ ఖాతాలోకి రూపొందించారు. మీరు మీ ప్రస్తుత మరియు భవిష్యత్తు బాధ్యతల ప్రకారం మీ ఇంట్లో ఖర్చులను కూడా లెక్కిస్తారు. కానీ గత ప్రభుత్వాలు బడ్జెట్‌ను నెరవేర్చలేని ప్రకటనలు చేయడానికి ఒక మాధ్యమంగా ఉపయోగించాయి. ఇప్పుడు దేశం ఆ ఆలోచనను మార్చింది, విధానాన్ని మార్చింది.
మిత్రులారా,
కరోనా యుగంలో భారతదేశం మహమ్మారిపై పోరాడిన విధానం నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడింది. ప్రపంచంలోని చాలా దేశాలు కూడా మా టీకా ప్రచారంతో నేర్చుకుంటున్నాయి. ఇప్పుడు ప్రతి చిన్న రోగం కోసం నగరానికి పరుగెత్తాల్సిన అవసరం లేకుండా ప్రతి గ్రామంలో మరియు పట్టణంలో ఇటువంటి చికిత్సా వ్యవస్థను కలిగి ఉండటానికి దేశం ప్రయత్నిస్తోంది. ఇదొక్కటే కాదు, ఆసుపత్రులలో చికిత్స పొందడంలో ఇబ్బంది ఉండకుండా నగరాల్లో కూడా పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు మీరు ఏదైనా పెద్ద పరీక్ష లేదా చెక్-అప్ చేయవలసి వస్తే, మీరు మీ గ్రామాన్ని వదిలి గోరఖ్‌పూర్ వెళ్ళాలి. లేదా కొన్నిసార్లు మీరు లక్నో లేదా బనారస్ వెళ్ళండి. ఈ సమస్యల నుండి మిమ్మల్ని కాపాడటానికి, ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఆధునిక పరీక్షా ప్రయోగశాలలు ఏర్పాటు చేయబడతాయి, జిల్లాలోనే చెకప్‌లు లభిస్తాయి మరియు అందువల్ల, దేశం ఆరోగ్య రంగంలో మునుపటి కంటే బడ్జెట్లో ఎక్కువ కేటాయించింది.
మిత్రులారా,
మన దేశం యొక్క పురోగతికి మన రైతు కూడా ప్రధానమైనది. దొంగతనానికి వ్యతిరేకంగా పోరాటంలో రైతులకు భారీ పాత్ర ఉంది. గత 6 సంవత్సరాల్లో, రైతులు ముందుకు సాగడానికి మరియు స్వావలంబన కోసం నిరంతర ప్రయత్నాలు జరిగాయి. కరోనా కాలంలో దేశం ఫలితాన్ని చూసింది. అంటువ్యాధి యొక్క సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా, మన వ్యవసాయ రంగం క్రమంగా వృద్ధి చెందింది మరియు రైతులు రికార్డు స్థాయిలో ఉత్పత్తిని చూపించారు.
మన రైతు బలోపేతం అయితే వ్యవసాయ రంగంలో ఈ పురోగతి వేగంగా ఉంటుంది. కాబట్టి, ఈ బడ్జెట్లో అనేక చర్యలు తీసుకున్నారు. రైతుల ప్రయోజనాల కోసం మండిస్ మార్కెట్ అవుతుంది, ఇందుకోసం మరో 1000 మండీలు ఇ-నామ్‌తో అనుసంధానించబడతాయి. అంటే, రైతు తన పంటను అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్ళినప్పుడు అతనికి అది తేలిక అవుతుంది. అతను తన పంటను ఎక్కడైనా అమ్మగలడు.
అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సదుపాయాల నిధిని రూ .40,000 కోట్లకు పెంచారు. ఇది రైతుకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నిర్ణయాలన్నీ మన రైతులను స్వావలంబన చేస్తాయి, వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మారుస్తాయి. యూపీలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన్ మంత్రి స్వామిత్వ యోజన దేశ గ్రామాల అభివృద్ధిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఈ పథకం కింద గ్రామ భూములు, గ్రామ గృహ పత్రాలు గ్రామస్తులకు ఇస్తున్నారు. మీ భూమికి సరైన పేపర్లు ఉన్నప్పుడు, మీ ఇంటికి సరైన పేపర్లు ఉన్నాయి, అప్పుడు వాటి విలువ పెరుగుతుంది మరియు మీరు బ్యాంకుల నుండి చాలా సులభంగా రుణాలు పొందగలుగుతారు. గ్రామస్తుల ఇళ్ళు, భూమిపై ఎవరూ చెడు దృష్టి పెట్టలేరు. ఇది దేశంలోని చిన్న రైతులకు, గ్రామంలోని పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
మిత్రులారా,
ఈ ప్రయత్నాలు నేడు దేశ ముఖ చిత్రం ఎలా మారుస్తున్నాయో చెప్పడానికి గోరఖ్‌పూర్ కూడా ఒక గొప్ప ఉదాహరణ. ఈ విప్లవకారుల భూమి, ఈ ప్రాంతం చాలా త్యాగాలకు సాక్ష్యమిచ్చింది, అయితే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న చిత్రం ఏమిటి? ఇక్కడ కర్మాగారాలు మూసుకుపోతున్నాయి, రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి, ఆసుపత్రులు అనారోగ్యానికి గురయ్యాయి. కానీ ఇప్పుడు గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారం తిరిగి తెరవబడుతోంది. ఇది రైతులకు కూడా మేలు చేస్తుంది, యువతకు ఉపాధి కల్పిస్తుంది.
ఈ రోజు గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేయబడుతోంది, ఇక్కడి వైద్య కళాశాల మరియు ఆసుపత్రి వేలాది మంది పిల్లల ప్రాణాలను కాపాడుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా, యోగి జీ చెప్పినట్లుగా ఎన్సెఫాలిటిస్ ఇక్కడి పిల్లల జీవితాలను ముంచెత్తుతోంది. కానీ యోగి జీ నాయకత్వంలో గోరఖ్‌పూర్ ప్రజలు చేసిన కృషిని ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు, డియోరియా, కుషినగర్, బస్తీ, మహారాజ్‌గంజ్ మరియు సిద్ధార్థనగర్లలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబడుతున్నాయి.
మిత్రులారా,
ఇంతకు ముందు పూర్వాంచల్ కు మరో పెద్ద సమస్య ఉండేది. మీరు గుర్తుకు తెచ్చుకోవచ్చు, ఎవరైనా 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వస్తే, అతను మూడు, నాలుగు గంటల ముందు బయలుదేరాల్సి వచ్చింది. కానీ, నేడు, ఇక్కడ నాలుగు మరియు ఆరు లేన్ల రోడ్లు నిర్మిస్తున్నారు. అంతే కాదు, గోరఖ్‌పూర్ నుండి ఎనిమిది నగరాలకు విమాన సౌకర్యం ఉంది. కుషినగర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం పర్యాటక రంగాన్ని కూడా పెంచుతుంది.
మిత్రులారా,
ఈ అభివృద్ధి, స్వావలంబన కోసం ఈ మార్పు ఈ రోజు దేశంలోని ప్రతి స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళి. ఈ రోజు, మేము శతాబ్ది సంవత్సరాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఈ మార్పును సమిష్టి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని మనం నిశ్చయించుకోవాలి. దేశ ఐక్యత మనకు మొదట, దేశ గౌరవం మనకు గొప్పది అనే తీర్మానాన్ని కూడా మనం తీసుకోవాలి. ఈ ఆత్మతోనే మనం ప్రతి దేశస్థుడితో ముందుకు సాగాలి. నవ భారతదేశం నిర్మించడంతో మనం ప్రారంభించిన ప్రయాణం పూర్తవుతుందని నాకు నమ్మకం ఉంది.
అమరవీరుల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, దేశం కోసం త్యాగం చేసిన వారిని మరచిపోవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ అమరవీరుల కారణంగా, ఈ రోజు మనం స్వేచ్ఛగా ఉన్నాము, వారు దేశం కోసం చనిపోవచ్చు, తమ కలలను సాకారం చేసుకున్నారు. కనీసం, మనం చనిపోయేలా చేయలేదు, కాని దేశం కోసం జీవించాలనే సంకల్పం తీసుకోవాలి. వారు దేశం కోసం చనిపోయే అదృష్టం కలిగి ఉన్నారు. దేశం కోసం జీవించే భాగ్యం మనకు దక్కింది. చౌరీ చౌరా అమరవీరులను స్మరించుకుంటూ, ఈ శతాబ్ది సంవత్సరం మనకు, మన కలలను సాకారం చేయడానికి, ప్రజల బాగుకోసం ఒక సంవత్సరంగా ఉండాలి.
దేశం కోసం జీవించే హక్కు మనకు లభించింది.. ఈ శతాబ్ది సంవత్సరం చౌరి-చౌరా అమరవీరులను జ్ఞాపకం చేసుకుని మనకు సంకల్ప సంవత్సరంగా ఉండాలి. కలలు నెరవేర్చడానికి ఈ సంవత్సరం ఉండాలి. ప్రజల మంచి కోసం మనం కష్టపడాలి. అప్పుడు ఈ వంద సంవత్సరాల అమరవీరుడు మనలను కొత్త శిఖరాలకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశంగా మారి, వారి అమరత్యాగం మన ప్రేరణకు కారణం అవుతుంది.
ఈ స్ఫూర్తితో మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. |
pib-135204 | e5ce0240bafe3e502dfda6207b1701c196a1c739a476d8b746382c1981fcc0c6 | tel | విద్యుత్తు మంత్రిత్వ శాఖ
పెరుగుతున్న భూతాపం, వాతావరణంలో వస్తున్న మార్పులపై జీ-20 సభ్య దేశాల ఉమ్మడి కృషి అవసరం.. కేంద్ర మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్
బెంగళూరులో ప్రారంభమైన ఇంధన పరివర్తనపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశం
కర్బన సేకరణ, వినియోగం,నిల్వ అంశంపై విడిగా చర్చించిన సమావేశం
పెరుగుతున్న భూతాపం, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కోడానికి జీ-20 సభ్య దేశాలు కలిసి కృషి చేయడానికి ముందుకు రావాలని కేంద్ర ఇంధన, నూతన పునరుత్పాదక శాఖ మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్ పిలుపు ఇచ్చారు. బెంగళూరులో ఈరోజు ప్రారంభమైన ఇంధన పరివర్తనపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశంలో మంత్రి ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు.దేశ దేశ స్థూల ఉత్పత్తిలో కర్బన ఉద్గారాల స్థాయిని 2005 నాటి స్థాయితో పోల్చి చూస్తే 2030 నాటికీ 45 శాతానికి తగ్గించాలని నిర్ణయించిన భారతదేశం, లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని మంత్రి వివరించారు. 2030 శిలాజేతర ఇంధన ఆధారిత ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూసేందుకు దేశంలో చర్యలు అమలు జరుగుతున్నాయన్నారు. వాతావరణ మార్పుల పనితీరు సూచికలో భారతదేశం ప్రపంచంలో మొదటి 5 దేశాల జాబితాలో ఉందని శ్రీ సింగ్ వెల్లడించారు. దేశంలో తలసరి గ్రీన్ హౌస్ వాయువు విడుదల తక్కువగా ఉందన్నారు. ప్రపంచ సగటు 6.3 టిసిఓ2తో పోల్చి చూస్తే 2020లో దేశంలో తలసరి గ్రీన్ హౌస్ వాయువు విడుదల తక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఇంధన పొదుపు పథకాల వల్ల దేశంలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల 267.9 మిలియన్ టన్నుల వరకు తగ్గిందని శ్రీ సింగ్ అన్నారు. దీనివల్ల $ 18.5 బిలియన్ డాలర్ల వరకు వ్యయం తగ్గుతుందని అన్నారు.
సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఇంధన రంగంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇంధన భద్రత లక్ష్యం సాధించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ఇంధన పరివర్తనపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశం సహకరిస్తుందని మంత్రి అన్నారు.
సమావేశంలో ప్రసంగించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి పరిశుద్ధ ఇంధనాన్ని అందించేందుకు ప్రపంచ దేశాలు కలిసి కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. ' పర్యావరణ దోపిడీకి కాకుండా పర్యావరణ పరిరక్షణ,పర్యావరణహిత జీవన శైలికి భారతదేశం ప్రాధాన్యత ఇస్తోంది. వనరుల వినియోగం తగ్గించడం, పునర్వినియోగం, రీ సైకిల్ విధానాలు భారతీయ జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్నాయి.దేశం సంస్కృతి, జీవన విధానంలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ భాగంగా ఉంది' అని శ్రీ జోషి వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ జోషి గ్లాస్గో లో జరిగిన కాప్ 26 సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. అనవసరంగా కాకుండా అవసరాల మేరకు మాత్రమే వనరులను ఉపయోగిస్తూ పర్యావరణ పరిరస్ఖన కోసం భారతదేశం పర్యావరణహిత జీవన విధానం కోసం ప్రజల సహకారంతో కృషి చేస్తుందని శ్రీ మోడీ చేసిన ప్రకటనను శ్రీ జోషి గుర్తు చేశారు.
జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారతదేశం చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి ఇటిడబ్ల్యుజి సమావేశం సాంకేతిక అంతరాలను పరిష్కరించడం ద్వారా శక్తి పరివర్తన వంటి ఆరు ప్రధాన ప్రాధాన్యత రంగాలపై దృష్టి పెడుతుంది. ఇంధన సరఫరా కోసం తక్కువ ఖర్చుతో నిధులు సమకూర్చడం, ఇంధన భద్రత, విభిన్న సరఫరా వ్యవస్థలు, శక్తి సామర్థ్యం, పారిశ్రామిక రంగం ద్వారా తక్కువ పరిమాణంలో కార్బన ఉద్గారాల విడుదల, బాధ్యతాయుతమైన వినియోగం, భవిష్యత్తు కోసం ఇంధన వనరులు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన సమ్మిళిత ఇంధన శక్తి సరఫరా అంశాలపై సమావేశం దృష్టి సారిస్తుంది. 'ఒక భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే ఇతివృత్తం ఆధారంగా సదస్సు జరుగుతుంది.
బ్రెజిల్ విదేశీ సంబంధాల మంత్రిత్వ శాఖ పునరుత్పాదక ఇంధన విభాగాధిపతి రెనాటో డొమిత్ గోడిన్హో, కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్, భారతదేశానికి చెందిన జీ-20 సౌస్ షెర్పా శ్రీ అభయ్ ఠాకూర్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ వి.కె.సరస్వత్ సమావేశంలో ప్రసంగించారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం , పలు అంతర్జాతీయ సంస్థలతో పాటు జీ20 దేశాలు, తొమ్మిది ప్రత్యేక ఆహ్వానిత దేశాలు సహా 150 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ' కర్బన సేకరణ, వినియోగం,నిల్వ ; అనే అంశంపై విడిగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. శూన్య విడుదల లక్ష్యాలను సాధించడానికి కర్బన సేకరణ, వినియోగం,నిల్వ అంశం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కీలకమైన అంశం సదస్సులో చర్చకు వచ్చింది. |
pib-262336 | ce2d29538e154c86860fe021a1d5658704878ab2e9f0d69f43d3bcf3e65cdbb0 | tel | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
కర్ణాటక రాష్ట్రం యొక్క ఐటీ ఆధారిత సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు ఇంటింటి సర్వేను ప్రశంసించిన కేంద్రం
కోవిడ్ -19 నిర్వహణ విషయంలో కర్ణాటక వినియోగించుకున్న ఉత్తమ విధానాన్ని కేంద్ర ప్రశంసించింది. కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు 1.5 కోట్ల గృహాల్లో భౌతిక లేదా ఫోన్ ఆధారిత సర్వేలు ఇందులో భాగంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలు బహుళ రంగ సంస్థల ప్రమేయంలో హోల్ ఆఫ్ గవర్నమెంట్ విధానంలో భాగంగా అభివృద్ధి అయ్యాయి. అదే విధంగా సాంకేతిక ఆధారిత పరిష్కారాలు దీనికి మద్దతును అందిస్తాయి. దీని ద్వారా వారు ప్రతి కేసును సమర్థవంతగా కనుగొని ట్రాక్ చేస్తారు. తద్వారా ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేస్తారు.
ఈ ఉత్తమ పద్ధతులను తమ తమ వెసులుబాటు ప్రకారం ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ -19 మెరుగైన నిర్వహణ కోసం అందరూ పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం ఇతర రాష్ట్రాలకు సూచించింది.
వ్యాధి బారిన పడేవారి సంఖ్యను తగ్గించేందుకు, అదే విధంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ ఓ కీలకమైన అంశం. భారత ప్రభుత్వం నిర్వచించిన విధంగా అధిక రిస్క్ మరియు తక్కువ రిస్క్ కాంటాక్ట్స్ రెండింటినీ చేర్చటం ద్వారా కాంటాక్ట్ నిర్వచనాన్ని విస్తృతం చేసింది. కర్ణాటకలో ప్రాథమిక మరియు ద్వితీయ పరిచయాల సంఖ్యను కచ్చితంగా గుర్తించి, కఠినమైన నిర్బంధంలో ఉంచారు.
ప్రత్యేకంగా నియమితులైన వ్యక్తుల ద్వారా దశవారీ చర్యలను సూచించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ రూపొందించిన ఎస్.ఓ.పి. వివరాల ప్రకారం 10 వేల మందికి పైగా బాగా శిక్షణ పొందిన క్షేత్ర సిబ్బంది కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం నిర్దిష్ట బాధ్యతలను నిర్వహిస్తారు. కాంటాక్ట్ ట్రేసింగ్ మొబైల్ అనువర్తనం మరియు వెబ్ అప్లికేషన్ భారీ మొత్తంలో పనిని అధిగమించేందుకు, పాజిటివ్ నిర్థారించిన వ్యక్తులు మరచిపోయిన అంశాలు, అదే విధంగా వారు దాచేందుకు ప్రయత్నిస్తున్న వాస్తవాలను బయటకు తీసుకునేందుకు బాగా ఉపయోగపడుతున్నాయి.
ముకిరి వాడలు లేదా ఇతర ప్రాంతాల్లో నివసించే పరిచయాల తప్పనిసరి సంస్థాగత నిర్బంధం ద్వారా పెద్ద కార్పొరేషన్ ప్రాంతాల మురికి వాడల్లో సంక్రమణ వ్యాప్తిని తగ్గించగలిగారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటకకు వస్తున్న వారంతా సేవా సింధు పోర్టల్ లో నమోదు చేసుకోవడం తప్పనిసరి చేయడం జరిగింది. ఇది వారంతా వ్యక్తిగత లేదా సంస్థాగత నిర్బంధంలో ఉన్నప్పుడు వారి పరిస్థితిని తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది. స్వీయ నిర్బంధం అమలు చేయటంలో క్షేత్రస్థాయి కార్మికులకు సహాయపడేందుకు క్వారంటైన్ వాచ్ యాప్ ఉపయోగపడుతుంది. సమాజ భాగస్వామ్యం ద్వారా గృహ నిర్బంధాన్ని అమలు చేసేందుకు రాష్ట్రం మొబైల్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసింది. ఎవరైనా స్వీయ గృహ నిర్బంధాన్ని ఉల్లంఘించినట్లైతే, పొరుగు వారి ద్వారా ఆ సమాచారం తెలుసుకుని, సదరు వ్యక్తులను సంస్థాగత నిర్బంధానికి తరలించటం జరుగుతుంది.
కర్ణాటక చేసిన భౌతిక మరియు ఫోన్ ఆధారిత గృహ సర్వే ద్వారా వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు ఇన్ ఫ్లూయంజా లాంటి అనారోగ్యాలు , తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ అనారోగ్యం వంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి సమగ్రమైన చికిత్సను అందించటం జరిగింది.
మే 2020లో జరిగిన ఈ సర్వే ద్వారా 168 లక్షల గృహాలకు గాను 153 లక్షల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవటం జరిగింది. పోలింగ్ బూత్ స్థాయి అధికారులు హెల్త్ సర్వే యాప్ తో పాటు వెబ్ అప్లికేషన్ ను ఉపయోగించటం ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించటంలో నిమగ్నం అయ్యారు. గర్భిణీలు మరియు టిబి, హెచ్.ఐ.వి, డయాలసిస్, క్యాన్సర్ రోగులకు సంబంధించి ఆరోగ్య శాఖ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా, సర్వే ద్వారా సేకరించిన సంపూర్ణ డేటా అందుబాటులో ఉంది. నాస్కామ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఆప్త మిత్ర టెలి – కన్సల్టేషన్ హెల్ప్ లైన్ ద్వారా కాంపైన్ ట్రీచ్ ప్రచారం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ మరియు అవుట్ బౌండ్ కాల్స్ ద్వారా ప్రమాదంలో ఉన్న గృహాలను చేరుకోవడానికి వినియోగించబడుతోంది. కోవిడ్ -19 లక్షణాలతో ఎవరైనా ఉంటే, వారిని టెలిమెడిసిన్ వైద్యులు పరీక్షించి, సలహాలు అందిస్తారు. అదే విధంగా క్షేత్ర స్థాయి ఆరోగ్య కార్యకర్తలు లు కూడా ఆ గృహాలను సందర్శించి అవసరమైన ఆరోగ్య సేవలను అందిస్తారు. |
pib-104962 | 87b35598eeb512f5d71322c6ce93dcea85e95633e0701afc3263949d53f99bd6 | tel | జౌళి మంత్రిత్వ శాఖ
సౌరాష్ట్ర తమిళ సంగమం సందర్భంగా రాజ్‌కోట్‌లోని చింతన్ శివిర్-టెక్స్టైల్స్ కాన్క్లేవ్కు హాజరుకానున్న శ్రీ పీయూష్ గోయల్
టెక్నికల్ టెక్స్‌టైల్స్‌పై చింతన్ శివిర్ ఆలోచనలు: హోమ్‌టెక్ మరియు క్లాత్‌టెక్‌లలో వృద్ధి అవకాశాలను అన్వేషించడం
పత్తిపై టెక్స్టైల్ అడ్వైజరీ గ్రూప్ మరియు మ్యాన్ మేడ్ ఫైబర్స్‌పై టెక్స్టైల్ అడ్వైజరీ గ్రూప్‌ల వాటాదారుల సమావేశాలకు అధ్యక్షత వహించనున్న శ్రీ గోయల్
సోమనాథ్‌ను సందర్శించడంతో పాటు సౌరాష్ట్ర తమిళ సంగమం సందర్భంగా నిర్వహిస్తున్న హస్తకళ మరియు హ్యాండ్లూమ్ ఎక్స్పోను సందర్శించనున్న శ్రీ గోయల్
గౌరవనీయులైన కేంద్ర వాణిజ్యం & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు జౌళి మరియు రైల్వే శాఖల సహాయమంత్రి శ్రీమతి దర్శన విక్రమ్ జర్దోష్ ఈ చింతన్ శివిర్ మేధోమథన సమావేశానికి హాజరవుతారు.ఇది టెక్నికల్ టెక్స్టైల్స్, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్‌కు చెందిన ప్రధాన పథకం. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శుక్రవారం, 21 ఏప్రిల్ 2023న జరిగే సౌరాష్ట్ర తమిళ సంగమం సందర్భంగా ఏర్పటు చేసిన ఈ సదస్సు హోమ్‌టెక్ మరియు క్లాత్‌టెక్‌లలో వృద్ధి అవకాశాలను అన్వేషిస్తుంది.
సింథటిక్ & రేయాన్ టెక్స్టైల్స్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ మరియు ఇండియన్ టెక్నికల్ టెక్స్టైల్స్ అసోసియేషన్ తో కలిసి ఈ సెషన్ నిర్వహించబడుతోంది. ఇందులో గృహ వస్త్రాలు మరియు పారిశ్రామిక కుట్టు దారాలు, అంటుకునే టేప్‌లు, లేబుల్లు మరియు బ్యాచ్‌లు, ఫర్నిచర్ మరియు కోటెడ్ ఫ్యాబ్రిక్స్, దోమల వలలు, ఫైబర్ఫిల్, ఫిల్టర్ ఫ్యాబ్రిక్స్, హౌస్‌హోల్డ్ వైప్స్, స్టఫ్డ్ టాయ్‌లు వంటి 50 కంటే ఎక్కువ ప్రధాన పరిశ్రమల భాగస్వామ్యంతో కార్యక్రమంలో నిర్వహించబడుతోంది.
ఈ సదస్సులో పరిశ్రమల ప్రముఖులు, తయారీదారులు, పరిశోధకులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన లైన్ మినిస్ట్రీలు మరియు వినియోగదారుల విభాగాలను ఒకే వేదికపైకి తీసుకుని ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవడానికి మరియు రంగం యొక్క భవిష్యత్తు అభివృద్ధి చర్చిస్తారు.
ఈ సెషన్లో భారత్‌తో పాటు ప్రపంచంలో హోమ్‌టెక్ మరియు క్లాత్‌టెక్ పెట్టుబడులు మరియు ఎగుమతి అవకాశాలు, ప్రముఖ హోమ్‌టెక్ మరియు క్లాత్‌టెక్ ఇండస్ట్రీ మాగ్నెట్లతో నిపుణుల సంభాషణలు, గుజరాత్ రాష్ట్రం యొక్క ప్రదర్శన మరియు నాయకత్వంతో ఇంటరాక్టివ్ ప్రశ్నోత్తరాల సెషన్‌పై చర్చ జరుగుతుంది. అలాగే సెషన్ చర్చలు హోమ్‌టెక్ మరియు క్లాత్‌టెక్ పరిశ్రమల వృద్ధికి మరియు భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచడానికి బలమైన మార్గాన్ని సుగమం చేయడానికి ఉద్దేశించబడ్డాయి.
పర్యటన సందర్భంగా ఎంఎంఎఫ్ విలువ గొలుసు వాటాదారులతో మానవ నిర్మిత ఫైబర్స్‌పై టెక్స్టైల్ అడ్వైజరీ గ్రూప్‌పై జరిగే 2వ సమావేశానికి శ్రీ గోయల్ అధ్యక్షత వహిస్తారు.
గౌరవనీయమైన జౌళి మంత్రి శ్రీ గోయల్ పత్తిపై టెక్స్టైల్ అడ్వైజరీ గ్రూప్ 6వ సమావేశానికి కూడా అధ్యక్షత వహిస్తారు. టిఏజి-సి 25 మే, 2022న స్థాపించబడింది. మొత్తం కాటన్ వాల్యూ చైన్‌లోని వాటాదారులైన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ , కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ , కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా , ది కాటన్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ , ఇండియా కాటన్ అసోసియేషన్ లిమిటెడ్ , ది క్లాతింగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా , అపెరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ , ఆల్ ఇండియా కాటన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఇండియన్ కాటన్ ఫెడరేషన్ , సదరన్ ఇండియా మిల్స్ అసోసియేషన్ తో పాటు దేశీయంగా ప్రముఖులు తయారీదారులు/ఎగుమతిదారులు & వినియోగదారులు మరియు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాల ప్రతినిధులు ఉంటారు.
టెక్స్‌టైల్స్‌లో సస్టైనబిలిటీ అండ్ సర్క్యులారిటీ - ఫ్యూచర్ రోడ్‌మ్యాప్‌పై కూడా మంత్రి ప్రసంగిస్తారు.ఏటియూఎఫ్ఎస్ మరియు పిఎం మిత్ర వంటి మంత్రిత్వ శాఖ ప్రధాన పథకాలలో సుస్థిరత కేంద్ర బిందువు - రీసైక్లింగ్ సౌకర్యాల కార్యక్రమం ఏటియుఎఫ్ఎస్ మరియు పిఎం మిత్రా పార్కుల క్రింద ఊపందుకుంది.
స్థిరమైన మరియు వృత్తాకార ఉత్పత్తుల కోసం పెరుగుతున్న అంతర్గత మరియు గ్లోబల్ డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశం కూడా తనను తాను బ్రేస్ చేస్తోంది మరియు అనేక మంది భారతీయ ఆవిష్కర్తలు టెక్స్టైల్ విలువ గొలుసు యొక్క వివిధ ప్రక్రియలను సమర్థవంతంగా మరియు పర్యావరణ అనుకూలమైనదిగా చేయడానికి అవసరమైన సాంకేతికతలపై ప్రయోగాలు చేస్తున్నారు.
గుజరాత్ మరియు తమిళనాడులోని టెక్స్టైల్ క్లస్టర్లు సుస్థిరత దిశగా ముందున్నాయి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ఫైబర్-ఫైబర్ రీసైక్లింగ్, ప్రత్యామ్నాయ సేంద్రీయ రంగులు/రసాయనాలకు మారడం అలాగే పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం వంటి ప్రక్రియల ద్వారా ఉత్పాదక ప్రక్రియలను మరింత సమర్ధవంతంగా చేయడానికి ఈ రోజు వారు గొప్ప పని చేస్తున్నారు. దీనితో పాటు, మెరుగైన పని పరిస్థితులు మరియు ప్రయోజనాల ద్వారా కార్మికుల శ్రేయస్సును ప్రోత్సహించడానికి పని కూడా జరుగుతోంది. తద్వారా ఈఎస్జీ సూత్రాల యొక్క అన్ని అంశాలను లక్ష్యంగా చేసుకుంటుంది.
ఈ పర్యటనలో శ్రీ పీయూష్ గోయల్ కూడా సోమనాథ్‌ను సందర్శిస్తారు మరియు సౌరాష్ట్ర తమిళ సంగమం సందర్భంగా నిర్వహిస్తున్న హస్తకళ మరియు చేనేత ఎక్స్పోను తిలకిస్తారు.
'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమం కింద గుజరాత్ మరియు తమిళనాడు మధ్య సాంస్కృతిక సంబంధాలను జరుపుకోవడానికి సౌరాష్ట్ర తమిళ సంగమం 2023 ఏప్రిల్ 17 నుండి 30 వరకు నిర్వహించబడుతోంది. ఐక్యతను జరుపుకోవడానికి మరియు భాగస్వామ్య చరిత్రతో రెండు ప్రాంతాల ఏకత్వాన్ని హైలైట్ చేయడానికి ఈ కార్యక్రమం నాలుగు వేర్వేరు ప్రదేశాలైన సోమనాథ్, ద్వారక, రాజ్‌కోట్ మరియు కెవాడియాలోని ఐక్యతా విగ్రహ వద్ద నిర్వహించబడుతోంది. |
pib-168515 | c87449c11cf040cf40148b1f9487584ffbf4ea97c647f3f6710d6ffe4cc2e1cf | tel | ఆయుష్
కరోనా ఇబ్బందులను తగ్గించేందుకు యోగా
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2021 సందర్భంగా; ఆయుష్ మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త ప్రచారం
చక్కటి ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగంగా చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవం స్ఫూర్తిని చాటుతున్నాయి. ఐడీవై-2021కి 50 రోజుల కౌంట్‌డౌన్‌గా ఈ నెల 2వ తేదీన వర్చువల్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. మరో రెండు నెలల లోపులో ఐడీవై రాబోతోంది.
క్రీడాకారులు యోగా సాధన చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, శ్రీ పుల్లెల గోపీచంద్‌తో కేంద్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు జరిపిన సంభాషణ దృశ్యాలను ఈ కార్యక్రమంలో ప్రసారం చేశారు. యోగాపై, ప్రముఖ అథ్లెట్ శ్రీమతి అంజు బాబీ జార్జ్ ఇచ్చిన సందేశాన్ని కూడా ప్రసారం చేశారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖల సామాజిక మాధ్యమ వేదికల్లో కార్యక్రమం ప్రసారంకాగా, 5 వేలకు పైగా వీక్షకులు వీక్షించారు. కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా, ఐడీవై ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకుండా చూడడం అవసరం. అందుకే, ప్రజలు ఇళ్లలో ఉండే పాల్గొనేలా డిజిటల్, వర్చువల్, ఎలక్ట్రానిక్ వేదికల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. "యోగా చేయండి, ఇంట్లోనే ఉండండి" నినాదాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తోంది.
ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాలపై రెండో దశ కరోనా విస్తృత ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో, బహుముఖ ప్రయోజనకారి అయిన యోగా, ప్రజలకు అమితంగా సాయం చేస్తుందని రుజువైంది. యోగాను నిరంతరం సాధన చేసేవారికి శారీరక వ్యాయామాన్ని మించిన ఆరోగ్య ప్రయోజనాలతోపాటు, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. యోగా ఇచ్చే పునఃభరోసా, ఉపశమన లక్షణాలతో కరోనా నుంచి రక్షణతోపాటు రోజువారీ సమతౌల్య జీవనానికి బాటలు వేసుకోవచ్చు. యోగాను స్థిరంగా సాధన చేయడం వల్ల ఆరోగ్యంతోపాటు సహజ రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. జీవక్రియ, మెరుగుదల, సరైన రక్త ప్రసరణకు తోడ్పడడంతోపాటు, శ్వాసకోశ, హృదయ సంబంధ, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించడానికి యోగా రోజువారీ అభ్యాసం సాయపడుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుదల, భావోద్వేగాల నియంత్రణకు కూడా యోగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో సాధారణంగా కనిపిస్తున్న భయం, ఆందోళన, ఒత్తిడి, విసుగు, నిరాశ, నిస్పృహలను ఎదుర్కొనేలా యోగా తోడ్పడుతుంది. ప్రజల ఆలోచనలు, దినచర్యలోకి ఐడీవై-2021ను తీసుకురావడానికి ఇది తగిన సందర్భం.
ఈ నెల 2న నిర్వహించిన కార్యక్రమం ఐడీవైకి విస్తృత ప్రచారంతోపాటు, ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా గత సంవత్సరాల కంటే ఎక్కువగా స్ఫూర్తిని నింపి, అంతర్జాతీయ ఆరోగ్య ఉద్యమంగా మారింది. కొత్త వాళ్లు యోగా నేర్చుకునేందుకు ఉత్తమ పరిచయ కార్యక్రమాల్లో ఒకటైన "కామన్ యోగా ప్రొటోకాల్"పై, ఆరోగ్యం కోసం గరిష్ఠ సంఖ్యలో ప్రజలు దీనిలో భాగస్వాములు కావలసిన అవసరంపై ఈ కార్యక్రమంలో ప్రధాన చర్చ జరిగింది.
45 నిమిషాల నిడివిలో, ప్రత్యేక క్రమానుగత యోగాసనాలను కలిగిన కార్యక్రమం సీవైపీ. యోగాను పరిపూర్ణత సాధించిన మన దేశ యోగా గురువులు 2015లో దీనిని రూపొందించారు. లింగ, వయోభేదంతో సంబంధం లేకుండా, సాధారణ శిక్షణ లేదా ఆన్లైన్ తరగతుల ద్వారా ప్రజలంతా సులభం నేర్చుకునేలా దీనిని రూపొందించారు.
"డిఫర్డ్ స్ట్రీమింగ్" పద్ధతిలో, ఆన్లైన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగా నిపుణుల బృందం పాల్గొంది. బెంగళూరులోని ఎస్-వ్యాస విశ్వవిద్యాలయం కులపతి డా.హెచ్.ఆర్.నాగేంద్ర, లోనావాలోని కైవల్యధామ సెక్రటరీ జనరల్ శ్రీ ఒ.పి.తివారీ, చెన్నైలోని కృష్ణమాచార్య యోగా మందిరం యోగాచార్యుడు శ్రీ ఎస్.శ్రీధరన్, ఫిజియాలజీ విశ్రాంత ఆచార్యుడు, పుదుచ్చేరిలోని సెంటర్ ఆఫ్ యోగిక్ సైన్స్ ఏవీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ డైరెక్టర్ డా.మదన్మోహన్, బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సమన్వయకర్త శ్రీమతి కమలేష్ బర్వాల్ ఈ బృందంలో ఉన్నారు. |
pib-23306 | 8e99465aedb09287111088feb391dbe1b67a644b3684e9080ba6b7867174c463 | tel | పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
‘75@75 రామ్సర్ సైట్లు’పై పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశం
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కి అనుబంధంగా ఉన్న పార్లమెంటు సభ్యుల సంప్రదింపుల కమిటీ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహించారు.
శ్రీ అశ్విని కుమార్ చౌబే, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి, కుమారి అగాథ సంగ్మా, పార్లమెంటు సభ్యురాలు , శ్రీ గణేష్ సింగ్, పార్లమెంటు సభ్యుడు , శ్రీ సునీల్ కుమార్ సోనీ, పార్లమెంటు సభ్యుడు , శ్రీ అయోధ్యరామి రెడ్డి, పార్లమెంటు సభ్యుడు , శ్రీరాములు పోతుగంటి, పార్లమెంటు సభ్యుడు , డాక్టర్ కిరోడి లాల్, పార్లమెంటు సభ్యుడు , శ్రీ జనార్దన్ మిశ్రా, పార్లమెంటు సభ్యుడు , శ్రీ కోటగిరి శ్రీధర్, పార్లమెంటు సభ్యుడు , శ్రీ మహేష్ సాహూ, పార్లమెంటు సభ్యుడు , శ్రీ అమర్ పట్నాయక్, పార్లమెంటు సభ్యుడు , శ్రీ బినోయ్ విశ్వం, పార్లమెంటు సభ్యుడు మరియు పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రామ్సర్ కన్వెన్షన్ యొక్క అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల జాబితాకు 75 చిత్తడి నేలలను ప్రకటించడం ద్వారా 75వ స్వాతంత్ర్య సంవత్సరంలో భారతదేశం యొక్క ముఖ్యమైన మైలురాయిని హైలైట్ చేశారు. భారతీయ రామ్సర్ సైట్ల నెట్వర్క్ సుమారుగా 1.33 మిలియన్ హెక్టార్లను కవర్ చేస్తుంది. దేశంలోని తెలిసిన చిత్తడి నేల విస్తీర్ణంలో 8% పైగా ఆసియాలో రెండవ అతిపెద్దది మరియు మొత్తం నియమించబడిన రామ్సర్ సైట్ల సంఖ్య ప్రకారం ప్రపంచంలో ఐదవది. 75 చిత్తడి నేలలను రామ్సర్ సైట్లుగా గుర్తించేందుకు ఎంఒఈఎఫ్&సిసి చేస్తున్న కృషిని కమిటీ సభ్యులు అభినందించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎంఒఈఎఫ్&సిసి ద్వారా 2023 జూన్ 5న ఇటీవల ప్రకటించిన అమృత్ ధరోహర్ కార్యక్రమం గురించి కూడా కమిటీ సభ్యులు అంచనా వేశారు. అమృత్ ధరోహర్ అనేది జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర చిత్తడి నేలలపై ప్రదర్శన, ప్రతిరూపం మరియు ఉన్నత స్థాయి ప్రభావాన్ని సృష్టించేందుకు రామ్సార్ సైట్ల పరిరక్షణ విలువలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక కార్యక్రమం. జీవ వైవిధ్యం, సాంస్కృతిక వారసత్వం, ఆహారం, నీరు మరియు వాతావరణ భద్రత, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు మరియు సామాజిక శ్రేయస్సును పరిరక్షించడం మరియు పెంపొందించడం కోసం రామ్సర్ సైట్లను పరిరక్షించడం మరియు తెలివిగా ఉపయోగించడం అనే లక్ష్యంతో ఈ పథకాన్ని రాబోయే మూడేళ్లలో అమలు చేయనున్నారు. మిషన్ లైఫ్ మరియు సహభగీత విధానం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన, అమృత్ ధరోహర్ యొక్క అమలు వ్యూహంలో జాతులు మరియు నివాస సంరక్షణ, ప్రకృతి పర్యాటకం, చిత్తడి నేలలు జీవనోపాధి, చిత్తడి నేలలు కార్బన్ వంటి నాలుగు కీలక భాగాలు ఉన్నాయి. అమృత్ ధరోహర్ అమలు వ్యూహం యొక్క సమగ్ర విధానాన్ని కమిటీ ప్రశంసించింది.
చిత్తడి నేలల పరిరక్షణ సమస్యలను సమగ్ర పద్ధతిలో మరియు ఎన్జీఓలు, పంచాయతీలు మరియు స్థానిక సంఘాలతో కూడిన రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టాలని అంగీకరించారు.
శ్రీ భూపేందర్ యాదవ్ చిత్తడి నేలల ప్రాముఖ్యతను వివరిస్తూ చిత్తడి నేలల రక్షణ మరియు పరిరక్షణ కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రం తీసుకున్న చర్యలను వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలలో 75 ప్రదేశాలను రామ్సర్ సైట్లుగా గుర్తించడం ద్వారా భారతదేశం సాధించిన ఘనత గురించి కూడా ఆయన చర్చించారు మరియు చిత్తడి నేలలను తెలివిగా ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
శ్రీ అశ్విని కుమార్ చౌబే చిత్తడి నేలల సంరక్షణ మరియు నిర్వహణలో పంచాయితీలు మరియు యువతను భాగస్వామ్యం చేయడం యొక్క ప్రాముఖ్యతపై హైలైట్ చేశారు. |
pib-212448 | c1d41d793e71522079ca93efc53f97b051593bc1b56cd8b292ed875c2642d14c | tel | యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
నూతన జాతీయ విద్యావిధానం , భారత దేశ యువతను భవిష్యత్‌కు సిద్ధమయ్యేలా చేస్తుంది. ఇండియాను ప్రపంచంలోనే అత్యంత ఎక్కువమంది నైపుణ్యంగల పనివారుగల దేశంగా పరివర్తన చెందేలా చేససస్తుంది. : శ్రీ అనురాగ్ ఠాకూర్
కీలక ముఖ్యాంశాలు...
--నూతన విద్యా విధానం 2020 మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని,కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ , యువజన సాధికారత, క్రీడల అభివృద్ధిపై జాతీయ విద్యా విధానం -2020 ప్రభావం అంశంపై ఒక వెబినార్‌ను నిర్వహించింది.
--కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ నిశిత్ ప్రమాణిక్, కూడాఈ వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు.
నూతన విద్యా విధానం 2020 తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని , యువజన సాధికారత, క్రీడల అభివృద్ధిపై నూతన విద్యావిధానం 2020 ప్రభావం అనే అంశంపై ఈరోజు వెబినార్నిర్వహించారు.కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. కేంద్ర యువజన, క్రీడల వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ నిశిత్ ప్రమాణాక్ ఈ వెబినార్‌లో ప్రత్యేక ప్రసంగం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ప్రముఖులలో యుజిసి ఛైర్మన్ ప్రొఫెసర్ డి.పి.సింగ్, స్వామి వివేకానంద యూత్ మూవ్మెంట్ , మెంబర్, కెపాసిటి బిల్డింగ్ కమిషన్ డాక్టర్ ఆర్. బాలసుబ్రమణియం, ఐఐఎం రోహతక్ డైరక్టర్ ప్రొఫెసర్ ధీరజ్ శర్మ, తమిళనాడు, శ్రీపెరుంబుదూరు ఆర్జిఎన్ఐవైడి డైరక్టర్ ప్రొఫెసర్ శిబ్నాథ్ దేవ్, నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్ వైస్ ఛాన్సలర్ శ్రీ ఆర్.సి.మిశ్రా, ఢిల్లీ యూనివర్సిటీ డిపార్టమెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ సంగిత్ రాగి, డిపార్టమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ శ్రీ రవిమిట్టల్, సెక్రటరీ డిపార్టమెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ శ్రీ మతి ఉషా శర్మా, జాయింట్ సెక్రటరీ ఆఫ్ డిపార్టమెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ శ్రీ అసిత్ సింగ్, సంయుక్త కార్యదర్శి క్రీడా విభాగం శ్రీ అతుల్ సింగ్ ఉన్నారు..
వెబినార్‌లో మాట్లాడుతూ శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, నూతన విద్యావిధానం 2020 భారతదేశ యువతను భవిష్యత్‌కు సిద్ధం చేస్తుందని, ప్రపంచంలోనే భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన పనివారు కలిగిన దేశంగా పరివర్తన చెందిస్తుందని అన్నారు. నూతన విద్యా విధానం భారత దేశ యువత అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుందని అన్నారు. ఇది నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తుందని అన్నారు. తద్వారా ఇది ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను నెరవేరుస్తుందని అన్నారు. మిడిల్ స్థాయి విద్యార్థులు కూడా వృత్తివిద్యా నైపుణ్యాలను సంతరించుకుని తగిన శిక్షణ పొందాలన్నారు. ఉదాహరణకు ప్లంబింగ్, ఎలక్ట్రికల్ రిపేరింగ్, హార్టికల్చర్, పాటరీ, ఎంబ్రాయిడరీ, వంటి నైపుణ్యాలు పొందాలన్నారు. 2025 నాటికి కనీసం 50 శాతం మంది విద్యార్థులకు ఒకేషనల్ నైపుణ్యాలు అందించాలన్నది లక్ష్యమని ఆయన అన్నారు. పాఠశాల స్థాయిలో నేర్చుకున్న వృత్తి విద్యను ఉన్నత విద్య స్థాయి వరకు తీసుకువెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. తాము, యువతకు సాధికారత కల్పిస్తున్నామని, వారు ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి వారిలో ఎంటర్‌ప్రెన్యూయర్ స్ఫూర్తిని కల్పించేలా వారికి సాధికారత కల్పిస్తున్నట్టు ఆయనతెలిపారు. మన విద్యార్థులకు సంపూర్ణ విద్యఅనుభవాన్ని ఇచ్చేందుకు క్రీడల శక్తిని వినియోగించుకుంటన్నట్టు చెప్పారు. ఇది బృంద స్ఫూర్తిని , మానసిక దృఢత్వాన్నికలిగిస్తుందని ఆయన అన్నారు.
కేంద్ర క్రీడల శాఖ సహాయమంత్రి శ్రీ నిశిత్ ప్రమాణిక్ మాట్లాడుతూ, ఈ దేశంలో యువత లో, 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వారు దేశ మొత్తం జనాభాలో ప్రస్తుతం 27.5 శాతానికి పైబడి ఉన్నారని, అంటే దేశ జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు యువతేనని ఆయన అన్నారు. యువజనులతో నిండిన దేశం భారత్ అని ఆయన అన్నారు. దేశం మార్పు ను చూస్తున్నదని ఆయన అన్నరాఉ. జాతీయ విద్యా విధానం 2020 యువతకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. ఎన్.ఇ.పి 2020 విద్యతోపాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. ఇది విద్యార్థులు శారీరక దారుఢ్యం కలిగి ఉండేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఇది వారి మానసిక, మేధోపరమైన, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.
వెబినార్ సందర్భంగా నిపుణుల ప్యానల్ కింది అంశాలపై చర్చించింది:
-- యువతకు సమగ్ర, బహుళ విభాగాలతో కూడిన విద్య
--యువతకు , ఆసక్తి, అభిరుచి కలిగించే విధంగా విద్య
--అణగారిన వర్గాల యువతను ఉన్నత విద్య పరిధిలోకి తీసుకువచ్చి సమానత్వం, సంపూర్ణ అవకాశాలు కల్పించడం.
ఉపాధి అవకాశాలు పొందేలా, వృత్తిలో ప్రగతి సాధించేందుకు ఆన్లైన్, డిజిటల్ విద్య
డ్రాపవుట్ రేటును యువతలో తగ్గించడం, యువతలోని అందరికీ సార్వత్రిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం, యువతకు వృత్తి విద్యను అందించడం |
pib-69198 | aea348ebcdef829febf5ad4b526d88ac1f95fd9f5d20eaa635e7c913f843319b | tel | ఆయుష్
రోగనిరోధక శక్తిపై ఆయుష్ నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి చక్కని స్పందన
రోగనిరోధకశక్తి ఆవశ్యకతపై మూడునెలల అవగాహనా కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రారంభించింది. వెబినార్ ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 50వేలమంది పాలుపంచుకున్నారు. ప్రముఖ ఆధ్వాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ చేసిన కీలక ప్రసంగం విశేషంగా నిలిచింది. ఆయుష్ అందించే పరిష్కార మార్గాలు ప్రపంచాన్నిమరింత ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా తీర్చిదిద్దగలవని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా, ఫిట్ నెస్ ఐకాన్, సెలెబ్రిటీ మిలింద్ సోమన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక వ్యవహారాల అధికారి డాక్టర్ గీతా కృష్ణన్, అఖిల భారత ఆయుర్వేద సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా నేసారీ ఈ వెబినార్ లో ప్రధానంగా ప్రసంగించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ వర్చువల్ కన్వెన్షన్ సెంటర్ అనే డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన వేదికపై ఈ వెబినార్ నిర్వహించారు. ఆయుష్ మంత్రిత్వ శాక అధికారిక ఫేస్ బుక్ హ్యాండిల్ పై ఈ వెబినార్ ప్రత్యక్షంగా ప్రసారమైంది. మొత్తం 60వేలమంది ఈ వెబినార్ ను ప్రత్యక్షంగా వీక్షించారు.
గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఈ వెబినార్ లో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి పెంపొందంచుకోవలసిన అవసరాన్ని, జీవన విధానాన్ని మార్చుకోవలసిన ఆవశ్యకతను వివరించారు. జీవిత కాలాన్ని పెంచడంలో ఆయుర్వేద, ఆయుష్ వైద్యవిధానాలకు ఉన్న శక్తి సామర్థ్యాలను కూడా ఆయన వివరించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ కొటేచా మాట్లాడుతూ, వెబినార్ ఇతివృత్తాన్ని, వివరించారు. ఆయుష్ పరిష్కార మార్గాల ద్వారా అందరికీ అందుబాటులో ఆరోగ్యం అనే అంశాన్ని ఆయన వివరించారు. రోగనిరోదక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రజలు తమ వ్యవహార శైలిని మార్చుకోవలసిన అవసరాన్ని గురించి పేర్కొన్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో సంప్రదాయ వైద్య విధానం నిర్వహించిన నిర్మాణాత్మక పాత్రను సోదాహరణంగా వివరించారు.
రోగనిరోధక శక్తికోసం ఆయుష్ వైద్య విధానాలు అన్న శీర్షికన మంత్రిత్వ శాఖ చేపట్టబోయే వివిధ కార్యక్రమాలను రాజేశ్ కొటేచా వివరించారు. ఆరోగ్యం, ఫిట్ నెస్ అనే అంశాలపై మిలింద్ సోమన్ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అఖిల భారత ఆయుర్వేద సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా నేసారీ మాట్లాడుతూ,..కోవిడ్-19 వైరస్ పై పోరాటంలో భాగంగా, తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించి ఎ.ఐ.ఐ.ఎ. అనుభవాలను వెబినార్ సభ్యులతో పంచుకున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక పరిజ్ఞాన వ్యవహారాల అధికారి డాక్టర్ గీతా కృష్ణన్ మాట్సాడుతూ, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య అంశాలకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. వ్యాధులు, అనారోగ్యం ప్రబలకుండా నివారించేలా వైద్యపరమైన మంచి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడమెలా? అన్న అంశాన్ని కూడా విపులంగా వివరించారు.
ప్రజలు విస్తృత స్థాయిలో పాలుపంచుకోవడం, వక్తల ప్రసంగాలకు మధ్య ప్రశ్నలు, జవాబుల రూపంలో అభిప్రాయాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ఈ వెబినార్ లో విశేషాలుగా నిలిచాయి. వెబినార్ లో సభికులనుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ప్యానెల్లో పలువురు నిపుణులు పాలుపంచుకున్నారు. కేంద్ర ఆయుర్వేద పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్,..ప్రొఫెసర్ వి.డి. కె.ఎస్. ధిమాన్, మురార్జీ దేశాయ్ జాతీయ యోగా అధ్యయన సంస్థ డైరెక్టర్,..డాక్టర్ ఈశ్వర్ వి. బసవరాద్ది, జాతీయ ప్రకృతివైద్యవిద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ సత్యలక్ష్మి కొమర్రాజు, సోవా-రిగ్పా జాతీయ పరశోధనా సంస్థ డైరెక్టర్ పద్మా గుర్మెత్, కేంద్రీయ యోగ, ప్రకృతివైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్ర ఎం. రావు, కేంద్ర యునానీ ఔషధ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అసిమ్ అలీఖాన్, కేంద్ర సిద్ధ వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె. కనకవల్లి, హోమియో పతి పరిశోధనా కేంద్రీయ మండలి ఇన్ చార్జి డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ ఖురానా ఈ ప్యానెల్ సభ్యులుగా ఉండి సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సరళమైన విధానాల ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చున్న కీలక అంశాలను తమ సమాధానాల ద్వారా చక్కగా వివరించారు. ఆరోగ్య రక్షణ రంగంలో తాము కనుగొన్న అంశాలను, తమ అనుభవాలను వారు ప్రజలతో పంచుకున్నారు.
రోగనిరోధక శక్తి పెంపుదలకు, వ్యాధుల నిరోధానికి ఆయుష్ ఆధారంగా రూపొందిన వివిధ పరిష్కార మార్గాలపై విలువైన సమాచారాన్ని ప్రజలకు తెలియజెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ వెబినార్ ను నిర్వహించారు. వెబినార్ ముగింపు సందర్భంగా రోగనిరోధక శక్తిపై ప్రజలకు ఇచ్చే సందేశాన్ని ప్రతి వైద్య నిపుణుడూ వినిపించారు. దైనందిన జీవితంలో అతి సరళమైన, సునాయాసమైన మార్గాలను అనుసరించడంద్వారా రోగాలనుంచి ఎలా దూరంగా ఉండవచ్చునే అంశాన్ని ఈ సందేశాలు తెలియజెప్పాయి. |
pib-290336 | 3db699a1a3ababbab19853619ed875f0925f65354fab13bf0f85c295b32672e2 | tel | శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సైన్స్ ప్రసారం ప్రచారం పై సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ మరియు కే ఏ ఎం పి ల సమిష్టి ఆధ్వర్యం లో వర్క్‌షాప్
సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ ఒక వారం ఒక ప్రయోగశాల ప్రోగ్రామ్ 3వ రోజు సైన్స్ కమ్యూనికేషన్‌పై వర్క్‌షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరై నిపుణులచే సైన్స్ కమ్యూనికేషన్లోని వివిధ కోణాల శిక్షణను పొందారు. వర్క్‌షాప్‌లో, సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ జిగ్యాసా, శిక్షణ మరియు హెచ్ఆర్ విభాగం అధిపతి శ్రీ సీ. బీ. సింగ్ స్వాగతోపన్యాసం చేశారు. వర్క్‌షాప్‌లో హైదరాబాదు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ శర్మిష్ఠ బెనర్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తూ విద్యార్థులకు బహుళ విజ్ఞాన శాఖల సైన్స్ బోధనపై ఉద్ఘాటించారు. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు గణితంతో సహా అన్ని శాఖలు పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయని, దీన్ని మన విద్యార్థులకు సమర్థవంతంగా చెప్పాలని ఆమె అన్నారు.
శ్రీమతి అరికా మాథుర్, హెడ్ - ఆపరేషన్స్ అండ్ అసెస్మెంట్స్, కే ఏ ఎం పి నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ మ్యాపింగ్ ప్లాట్‌ఫారమ్ సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ మరియు ఎన్ సి పి చొరవపై సవివరమైన ప్రదర్శనతో ఆకర్షించారు.మా విద్యార్థులలో సహజసిద్ధమైన ప్రతిభను మరియు నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో కే ఏ ఎం పి పనిచేస్తోంది తద్వారా ఉపాధ్యాయులు ఈ ప్రయత్నం పట్ల ఉత్సాహంగా కనిపించారు అని ఆమె అన్నారు.
సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ చీఫ్ సైంటిస్ట్ మరియు 'సైన్స్ రిపోర్టర్' మ్యాగజైన్ ఎడిటర్ శ్రీ హసన్ జవైద్ ఖాన్ సైన్స్ కమ్యూనికేషన్ మరియు పౌర బాధ్యతని వివరిస్తూ, “సైన్స్ గురించిన వార్తలలో తప్పుడు సమాచారం మరియు నకిలీల గురించి మరింత అవగాహన కల్పించడం దేశంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.
శ్రీమతి సోనాలి నగర్, అసోసియేట్ ఎడిటర్, సైన్స్ రిపోర్టర్ మ్యాగజైన్ ఉపాధ్యాయులకు పాపులర్ సైన్స్ రైటింగ్‌లోని సునిశిత నైపుణ్యాలపై శిక్షణనిచ్చారు. శ్రీ హసన్ జవైద్ ఖాన్ ఇచ్చిన పాపులర్ సైన్స్ రైటింగ్ అసైన్మెంట్తో వర్క్‌షాప్ ముగిసింది.
సీ ఎస్ ఐ ఆర్ - ఎన్ ఐ ఎస్సి పీ ఆర్ మరియు కే ఏ ఎం పి గురించి:
సీ ఎస్ ఐ ఆర్ -నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ప్రయోగశాలలలో ఒకటి. ఇది సైన్స్ కమ్యూనికేషన్, సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ రంగాలలో ప్రత్యేకత శ్రద్ధ తో పనిచేస్తుంది. సాక్ష్యం-ఆధారిత విధాన పరిశోధన మరియు అధ్యయనాలపై దృష్టి పెడుతుంది.
కే ఏ ఎం పి - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ మరియు పారిశ్రామిక భాగస్వామి నైసా కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ల సమిష్టి విజ్ఞాన కూటమి. ఇది విద్యార్థుల స్వాభావిక సామర్థ్యాలైన సృజనాత్మకత, అర్థవంతమైన అభ్యాసం, విమర్శనాత్మక పఠనం మరియు ఆలోచనా నైపుణ్యాలను వెలికితీసి అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది. |
pib-76245 | 1bcb0175593d1ebccda5ed0989907b93a822f197720c17045e8b5c0760a049fe_1 | tel | నీతి ఆయోగ్
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై మీడియాలో వస్తున్న వార్తల ఖండన
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై నీతీ ఆయోగ్ విడుదల చేసిన జాబితా అంటూ మీడియాలో తప్పుడు సందేశం ప్రచారమవుతోంది. ఈ క్రమంలో మీడియా ప్రస్తావిస్తున్న అటువంటి జాబితాను దేనినీ నీతీ ఆయోగ్ ఏ రూపంలోనూ విడుదల చేయలేదని స్పష్టం చేయడం జరుగుతోంది. |
pib-199739 | 6f2cd7b746071fd08ef0602f00aa5f82d4d7eb4b68413250dcf50a11e11b82e4 | tel | యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
‘బ్రిక్స్’ దేశాల మధ్య క్రీడలు, ఫిజికల్ కల్చర్ రంగంలో సహకారం అంశంపై అవగాహన పూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
బిఆర్ఐసిఎస్ సభ్యత్వ దేశాల తో క్రీడలు, ఫిజికల్ కల్చర్ రంగంలో సహకారానికి సంబంధించి సంతకాలైన ఓ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టికి తీసుకురావడమైంది.
బ్రిక్స్ లో సభ్యత్వం కలిగిన ఈ అయిదు దేశాల తో క్రీడల రంగంలో సహకారం కుదరడం క్రీడలకు సంబంధించిన విజ్ఞానం, క్రీడాసంబంధి చికిత్స, శిక్షణపరమైన మెలకువలు మొదలైన అంశాల జ్ఞానాన్ని, నైపుణ్యాలను విస్తరింప చేసుకోవడంలో సహాయకారి కానుంది. దీనితో అంతర్జాతీయ ఆటల పోటీల లో మన క్రీడాకారుల ప్రదర్శన మెరుగుపడడం ఒక్కటే కాకుండా ‘బ్రిక్స్’ సభ్యత్వ దేశాలతో మన ద్వైపాక్షిక సంబంధాలు కూడా బలపడగలవు.
ఈ దేశాలతో క్రీడల విషయం లో సహకారానికి సంబంధించిన లబ్ధి క్రీడాకారులకు వారి కులం, వర్గం, ప్రాంతం, మతం, వారు ఆడవారా లేక మగవారా అనే భేదభావాలకు అతీతంగా అందరికీ సమాన ప్రాతిపదిక న అందనుంది. |
pib-130803 | c4a4c1245c6973ddedc975573de89b91f1452ffe850a28f85ea084d5bf8431c6 | tel | నౌకారవాణా మంత్రిత్వ శాఖ
మే, 2022 నుంచి ప్రారంభం కానున్న పాండు షిప్ రిపేర్ ఫెసిలిటీ నిర్మాణం, రెండేళ్ళలో పూర్తిః శ్రీ సర్బానంద్ సోనోవాల్
గువాహతిలోని పాండు షిప్ రిపేర్ ఫెసిలిటీ పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర రేవులు, షిప్పింగ్ & జలమార్గాలు, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ సోవారం ఇన్ల్యండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా , కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, ఐఐటి మద్రాస్‌కు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సదుపాయ నిర్మాణ కార్యకలాపాలు మే, 2022 నుంచి ప్రారంభించవలసి ఉన్నందున దానికి సంబంధించిన సాంకేతిక పని పూర్తి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టును రెండేళ్ళలోపు, అంటే 2024కి పూర్తి చేయాలన్నది లక్ష్యం.
నూతన నౌకా మరమ్మత్తుల సదుపాయానికి సంబంధించిన ప్రకటన 26 ఆగస్టు, 2021న వెలువడింది. ఈ సదుపాయం ప్రాంత ఆర్థిక పునరుద్ధరణకు ప్రధానంగా దోహదం చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నమూనా, అమలును ఐడబ్ల్యుఎఏఐ, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ సంయుక్తంగా చేపడుతున్నాయి. దీనికి సాంకేతిక మద్దతును ఐఐటి, మద్రాస్ అందిస్తోంది. స్లిప్వేగా పేర్కొనే ఈ సదుపాయాన్ని అస్సాం ప్రభుత్వం అందించిన 3.67 ఎకరాల భూమిలో అభివృద్ధి చేయనున్నారు.
ఈశాన్య ప్రాంత భవిష్యత్ ప్రగతి జలమార్గాల అభివృద్ధిలోనే ఉందని మంత్రి వివరించారు.జాతీయ జలమార్గం-2- బ్రహ్మపుత్ర తో పాటుగా జాతీయ జలమార్గం 6 - బార్క్‌లో పని ప్రారంభమైందని, ఇవి సరుకు రవాణా, ప్రయాణీకుల రవాణాతో పాటుగా పర్యాటకుల పడవలతో సౌలభ్యంతో ఈ ప్రాంత ఆర్ధికాభివృద్ధికై తోడ్పడతాయని ఆయన వివరించారు. మోటారు సామర్ధ్యం గల జలమార్గాలను సాధించేందుకు, రెండు నదుల పూడికలను కీలక సమయాల్లో తీయవలసి ఉంటుందని, తద్వారా సరకు రవాణా ఓడల రాకపోకలకు తగినంత లోతును సాధించవచ్చు, అని ఆయన అన్నారు.
సరుకు, ప్రయాణీకులను సాఫీగా, వేగవంతంగా తరలించేందుకు నదులను జలమార్గాలుగా అభివృద్ధి చేయడం ద్వారా మన గొప్ప ఆర్థిక చరిత్రను పునరుద్ధరించవచ్చని శ్రీ సోనోవాల్ పేర్కొన్నారు. మొత్తం ఈశాన్య ప్రాంత ఎగుమతులను ప్రోత్సహించడమే కాక, ఈ ప్రాంతంలో ఉపాధి కల్పనా అవకాశాలను ప్రధానంగా ద్విగుణీకృతం చేస్తుందని ఆయన చెప్పారు. జలమార్గాల అభివృద్ధికి అన్ని ఈశాన్య ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలూ మద్దతునందించాయన్నారు. ప్రజలు ఫలాలను పొంది, అభివృద్ధి చెందేందుకు రాష్ట్రప్రభుత్వాలతో కలిసి మేం- అనగా కేంద్రం ఎటువంటి ఆటంకాలూ లేకుండా కలసి పని చేస్తామని ఆయన తెలిపారు. |