id
int64
1.71k
92.9k
url
stringlengths
5
925
title
stringlengths
0
772
text
stringlengths
221
3.81k
summary
stringlengths
85
1.62k
33,268
https://www.prajasakti.com/WEBSECTION/International/page387/maro-rakesh-sharma-kos-isro-anveshan
పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతన జీవోను వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడ కృష్ణలంకలోని రంగా హైస్కూల్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు ) ఆధ్వర్యంలో బుధ వారం పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు తూర్పు జోన్ 1 కార్యదర్శి వి. గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు పెంచిన వేతనాలు మంజూరు చేయకుండా జాప్యం చేస్తోందన్నారు. సమ్మె కాలపు వేతనాన్ని కూడా ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు పెంచిన వేతనాలు మంజూరు చేయాలనీ విజ్ఞప్తి చేస్తూ ,విజయవాడ కృష్ణలంకలోని రంగా హైస్కూల్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు ) ఆధ్వర్యంలో బుధ వారం పారిశుధ్య కార్మికులు ధర్నా చేసారు .
33,383
https://www.prajasakti.com/WEBSECTION/International/page553/trunamul-abhyarthiga-aespi
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని విలీన మండలాల ప్రజలకు న్యాయం చేస్తామని, నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇప్పిస్తామని వైద్య, ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్పారు. విలీన మండలాల పర్యటనలో భాగంగా మండలంలోని రాజుపేటకాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి ముత్యాల కుసుమాంబ మాట్లాడుతూ స్థానిక పిహెచ్సిలో 108 అంబులెన్స్, ఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బంది, పెండింగ్ లో ఉన్న ఆశా వర్కర్ల వేతనాలను వెంటనే చెల్లించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
విలీన మండలాల పర్యటనలో భాగంగా మండలంలోని రాజుపేటకాలనీని వైద్య, ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాసరావు పర్యటిస్తూ,పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని విలీన మండలాల ప్రజలకు న్యాయం చేస్తామని, నిర్వాసితులకు మంచి ప్యాకేజీ ఇస్తామని అన్నారు .
33,816
https://www.prajasakti.com/WEBSECTION/International/page883/tokiolo-penu-tupan
మెర్క్ న్యూరోబియన్ ఫోర్ట్ దేశ వ్యాప్తంగా మైట్ రూహీరో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. తాము అభిమానించే వారి కలలలను నిజం చేసేందుకు కృషి చేసే అనునిత్యం హీరోల ప్రయత్నాలను గుర్తించి, ప్రశంసించే వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందని మెర్క్ ఇండియా ఎండి ఆనంద్ సంబియర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసలైన హీరోలు అనునిత్యం మనకు కన్పించే ప్రజలేనన్నారు. ప్రజల కళలను నిజం చేసేందుకు తమ త్యాగపూరిత చర్యల ద్వారా తోడ్పడిన నిజమైన హీరోలకు కృతజ్ఞతలు తెలియజేసే అవకాశం తాము కల్పిస్తున్నామన్నారు.
మెర్క్ న్యూరోబియన్ ఫోర్ట్ దేశ వ్యాప్తంగా 'ట్రూహీరో' కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల కళలను నిజం చేసేందుకు తమ త్యాగపూరిత చర్యల ద్వారా తోడ్పడిన నిజమైన హీరోలకు కృతజ్ఞతలు తెలియజేసే అవకాశం తాము కల్పిస్తున్నామన్నారు.
33,863
https://www.prajasakti.com/WEBSECTION/National/page980/americavanni-vakrabuddhule
ఈ నెల 20న ప్రముఖ నాట్య సంస్థ నృత్యప్రియ 26వ వార్షికోత్సవం రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు సంస్థ సరితా దిలిప్ తెలిపారు. ఈ సందర్భంగా తమ సంస్థ నిర్మించిన తానీషా కూచిపూడి అగ్రహార సందర్శన టెలిఫిలీం ప్రదర్శిస్తామని తెలిపారు. గతంలో ఈ ఫిలీం నంది అవార్డును పొందింది. చంద్రయ్య పాల్గొనగా, శాసనసభ్యుడు రసమయి బాలకిషన్, పద్మశాలి సంఘం అధ్యక్షులు కె. స్వామి, ఐఏఎస్ ఉన్నతాధికారి పార్థసారథి తదితరులు పాల్గొంటారు.
ఈ నెల 20న ప్రముఖ నాట్య సంస్థ నృత్యప్రియ 26 వ వార్షికోత్సవం రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు, తమ సంస్థ నిర్మించిన, నంది అవార్డును పొందిన తానీషా కూచిపూడి అగ్రహార సందర్శన టెలిఫిలీం ప్రదర్శిస్తామని సంస్థ సరితా దిలిప్ తెలిపారు.
33,972
https://www.prajasakti.com/WEBSECTION/National/page431/pachidito-mericin-telegu-teja-jyotika-shri
రాష్ట్ర అభివృద్ధిపై వైసిపి నేతలు విసిరిన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వర ప్రసాద్ చెప్పారు. గుంటూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, టిడిపి రెండున్నరేళ్ల పాలనలో అనూహ్యమైన అభివృద్ధి సాధించిందని, అభివృద్ధి ఓర్వలేకనే వైసిపి దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఎంపిలతో రాజీనామా చేయిస్తానని జగన్ అనడం గతంలో మాదిరిగా తన తలను తాను బలీయమైన శక్తులతో ఢీకొీని పగలగొట్టుకున్నట్లే అవుతుందని అన్నారు. సమావేశంలో ఎన్టిఆర్ నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్ గురజాల మాల్యాద్రితదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధిపై వైసిపి నేతలు విసిరిన బహిరంగ చర్చకు టిడిపి సిద్ధంగా ఉందని రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వర ప్రసాద్ చెప్పారు. టిడిపి రెండున్నరేళ్ల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెసిందనిచెప్పరు.
34,118
https://www.prajasakti.com/WEBSECTION/National/page491/shwet-jatiyul-nudi-bhoomul-swadhina
చాగంటి సోమయాజులు ( చాసో ) 101 జయంతి వేడుకల సందర్భంగా జనవరి 17న చాసో 21వ పురస్కారాన్ని ప్రముఖ రచయిత కెవి రమణరావుకు అందజేయనున్నట్లు చాసో స్ఫూర్తి సాహిత్య ట్రస్ట్ సభ్యులు చాగంటి తులసి తెలిపారు. విజయనగరంలోని గురజాడ అప్పారావు స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా పని చేస్తున్న రమణరావు రచించిన పుట్టిల్లు కథా సంపుటిని దృష్టిలో ఉంచుకొని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని తెలిపారు. శ్రీనివాసరావు, ప్రఖ్యాత హిందీ నవలా కథా రచయిత్రి, సాహిత్య అకాడమీ గ్రహీత మృదులాగర్గ్, హిందీ రచయిత్రి కమల కుమారి, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ ఎ. కృష్ణారావు, ప్రసిద్ధి కవి, విమర్శకులు, గజల్ రచయిత రెంటాల శ్రీవెంకటేశ్వరరావు ప్రసంగిస్తారని తెలిపారు. విలేకరుల సమావేశంలో సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ చీకటి దివాకర్ పాల్గొన్నారు.
విజయనగరంలోని గురజాడ అప్పారావు స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రముఖ రచయిత కెవి రమణరావుకు ఆయన రచించిన పుట్టిల్లు కథా సంపుటిని దృష్టిలో ఉంచుకొని చాగంటి సోమయాజులు ( చాసో ) 101 జయంతి వేడుకల సందర్భంగా జనవరి 17న చాసో 21వ పురస్కారాన్ని అందచేస్తున్నటు చాగంటి తులసి తెలిపారు. కేతు విశ్వనాథరెడ్డి అధ్యక్షతన జరగనున్న జయంతుత్సవ సభలో కేంద్ర సాహిత్య ముఖ్య అతిధిలు ప్రసందిగ్తరు అని తెలిపారు.
9,799
https://www.prajasakti.com/WEBSECTION/International/page3609/bharat-chirakal-swapna-neraverabotondi-–-pradhani-modi
భారత్ చిరకాల స్వప్నం నెరవేరబోతోంది – ప్రధాని మోడీ
అహ్మదాబాద్: భారత్ చిరకాల స్వప్నం నెరబోతోందని ప్రధాని మోడీ అన్నారు. అహ్మదాబాద్లో బుల్లెట్ రైలు మార్గం శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ బుల్లెట్ ట్రైన్ వేగవంతంతో పాటు సురక్షితమైనదన్నారు. ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం గొప్ప విషయమన్నారు. జపాన్ భారత్కు నమ్మకమైన మిత్రదేశ మన్నారు.
అహ్మదాబాద్లో బుల్లెట్ రైలు మార్గం శంకుస్థాపన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ బుల్లెట్ ట్రైన్ వేగవంతం, సురక్షితమని కొనియాడారు.
9,960
https://www.prajasakti.com/WEBSECTION/International/page519/kriyashilak-karyakartalato-samaveshal
ముగిసిన మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరారు. చైనాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొని అక్కడి నుంచి నేరుగా మయన్మార్ వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ మయన్మార్ లో మూడు రోజుల పర్యటనను ముగించుకుని ప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా భారత్-మయన్మార్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సూకీతో చర్చించారు. అలాగే ఇరు దేశాల మధ్య 11 అంశాల్లో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరారు. మొదట చైనాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొని, మయన్మార్ వెళ్లి, అక్కడ ద్వైపాక్షిక సంబంధాలపై సూకీతో చర్చించారు.
9,964
https://www.prajasakti.com/WEBSECTION/National/page431/indonesia-kott-cabinet
పాకిస్థాన్ పడవలు సీజ్
పాకిస్థాన్కు చెందిన మూడు చేపలు పట్టే పడవలను బీఎస్ఎఫ్ సిబ్బంది సీజ్ చేసింది. ఈ ఘటన గుజరాత్లోని కుచ్ తీర ప్రాంతం హరమినాలా వద్ద చోటుచేసుకుంది. బోట్ల సీజ్తో పాటు ఇద్దరు మత్య్సకారులను అరెస్టు చేసింది. అంతర్జాతీయ సరిహద్దు తీరజలాలు దాటి చేపల వేటను కొనసాగిస్తుండటంతో భద్రతా సిబ్బంది పాక్ మత్య్సకారులను అదుపులోకి తీసుకుంది.
అంతర్జాతీయ సరిహద్దు తీరజలాలు దాటడంతో గుజరాత్లోని కుచ్ తీరంలో చేపలు పట్టే మూడు పాకిస్థాన్ పడవలను బీఎస్ఎఫ్ సిబ్బంది సీజ్ చేసి, ఇద్దరిని అరెస్టు చేసింది.
10,127
https://www.prajasakti.com/WEBSECTION/International/page39/meghalaya-governorpai-sibbandi-firyad
పంజాబ్లో చెలరేగిన అల్లర్లు.
డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ కు శిక్ష, అరెస్టు అనంతరం హర్యానా, పంజాబ్ లలో జరిగిన అల్లర్లపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రెండు రాష్ట్రాలలోనూ పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నదని వ్యాఖ్యానించింది. ఈ అల్లర్లపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. శాంతి భద్రతల పరిరక్షణలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఘోరంగా విఫలమయ్యాయని వ్యాఖ్యానించింది.
పంజాబ్ లలో జరిగిన అల్లర్లపై హైకోర్టు సిట్ దర్యాప్తునకు ఆదేశించగా డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ ను అరెస్టు చేసి హర్యానాకు తరలించారు.
10,799
https://www.prajasakti.com/WEBSECTION/National/page803/april-7-nuchi-jei-rendo-vient-parikshal
రాజకీయాల లో తీవ్ర సంక్షోభ ప రిస్ధితులు
తమిళనాడు రాజకీయాలలో తీవ్ర సంక్షోభ పరిస్ధితులు నెలకొన్న విషయం విధితమే. ఈమేరకు సీఎం పళని స్వామిని అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి పదవి నుంచి టీటీవి దినకరన్ తొలగించారు. ఈమేరకు పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం పళనిని తొలగిస్తున్నట్లు ఇవాళ ఆయన ప్రకటించారు. కాగా దినకరన్కు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న విషయం తెలిసినదే.
తమిళనాడు రాజకీయాలలో తీవ్ర సంక్షోభానికి పార్టీ కార్యదర్శి దినకరన్ను పదవి నుంచి సీఎం పళనిని తొలగించగా ఆయనకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలిసింది.
10,903
https://www.prajasakti.com/WEBSECTION/National/page979/jiesty-vall-rend-vel-kots-nashta-yanmal
దోషి ముస్తఫా దొస్సా మృతి
ముంబైలో 1993లో జరిగిన పేలుళ్లలో దోషి ముస్తఫా దొస్సా ఆకస్మికంగా మృతి చెందాడు. బుధవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని దొస్సా చెప్పడంతో అతడిని ఇక్కడి జెజె ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ముస్తఫా దొస్సాకు ఉరిశిక్ష విధించాలంటూ ప్రాసిక్యూషన్ మంగళవారం టాడా కోర్టులో వాదించింది.
టాడా కోర్టులో ప్రాసిక్యూషన్ ముస్తఫా దొస్సాకు ఉరిశిక్ష విధించాలంటూ వాదించింది మరుసటి రోజూ ఛాతీ నొప్పితో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
11,675
https://www.prajasakti.com/WEBSECTION/National/page141/ammelyelato-shashikal-bheti
గాంధీ మార్గంలో నడవాలి -సీఎం.
ప్రతిరోజూ రాష్ట్రంలోని పాఠశాలల్లోని విద్యార్థులందరికీ జాతిపిత మహాత్మాగాంధీ బోధించిన విషయాలను తెలియజెప్పాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ సూచించారు. చంపారన్ను మహాత్ముడు మొదటిసారి దర్శించి శనివారం నాటికి వందేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నితీశ్ పాల్గొన్నారు. గాంధీజీ అనే పదంలోనే అపారమైన శక్తి కలిగి ఉందని, పౌరులందరూ ఆయన బోధించిన మార్గంలో నడవాలని సీఎం సూచించారు. బాపూ భావజాలం గురించి ప్రతిరోజూ పదినిమిషాలపాటు విద్యార్థులకు బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
చంపారన్ను దర్శించి శనివారంకి వందేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నితీశ్ పాల్గొని గాంధీ బోధనలు పాఠశాలలో చెప్పాలని, గాంధీజీ పదంలోనే గొప్ప శక్తి ఉందని, పౌరులందరూ ఆయన మార్గంలో నడవాలని చెప్పారు.
14,095
https://www.prajasakti.com/WEBSECTION/International/page95/vietna-panello-jayram-otami
షాహబుద్దీన్ కు బెయిల్ రాకుండా ప్రయతించాం : నీటి వనరుల శాఖా మంత్రి
రాజకీయ నాయకుడిగా మారిన డాన్ మహమ్మద్ షాహబుద్దీన్కు బెయిల్ రాకుండా తమ ప్రయత్నం తాము చేశామని బీహార్ ప్రభుత్వం తెలిపింది. షాహబుద్దీన్కు బెయిల్ వచ్చేలా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చట్టపరంగా మెతక వైఖరి ప్రదర్శించిందంటూ వచ్చిన విమర్శలను రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి రాజీవ్ రాజన్ తప్పుపట్టారు. షాహబుద్దీన్కు బెయిల్ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంచి లాయర్లను కూడా పెట్టిందని, దురదృష్టవశాత్తూ ఆర్జేడీ ఎంపీ బయటకు రాగలిగాడని అన్నారు. కాగా, బెయిల్ రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి.
డాన్ మహమ్మద్ షాహబుద్దీన్కు బెయిల్ వచ్చేలా బీహార్ ప్రభుత్వం పరోక్షంగా సహాయం చేసిందని వచ్చిన విమర్శలను రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి రాజీవ్ రాజన్ ఖండించారు. మహమ్మద్ బెయిల్ ను రాకుండా వాదించడానికి ప్రభుత్వం మంచి లాయర్లను కుడా పెట్టిందని అన్నారు.
15,123
https://www.prajasakti.com/WEBSECTION/National/page92/amith-sha-vachalat
భారతదేశం నా మాతృభూమి
భారత్ ఎంతో సహనశీల దేశమని, కొందరు మాత్రమే ద్వేష భావాలను వ్యాపింపజేస్తున్నారని, వారిని అదుపులో ఉంచాలంటూ ప్రధాని మోడీకి బాలీవుడ్ నటుడు ఆమీర్ఖాన్ విజ్ఞప్తి చేశారు. భారత్ తనకు తల్లిలాంటిదని ఖాన్ అన్నారు. ఎంతో పెద్ద దేశమైన భారత్లో విభేదాలు తెచ్చేవారు ప్రతి మతంలోనూ ఉన్నారు, ప్రధానిగా మోడీ మాత్రమే వారందరినీ అదుపులో ఉంచగలరని ఆమీర్ పేర్కొన్నారు. గతంలో తన మాటల్ని తప్పుగా అన్వయించారని ఆయన వివరణ ఇచ్చారు.
తన తల్లిలాంటి భారతదేశంలో విభేదాలు తెచ్చేవారు ప్రతి మతంలోనూ ఉన్నారని, వారిని అదుపు చేయాలంటూ ప్రధాని మోడీకి బాలీవుడ్ నటుడు ఆమీర్ఖాన్ విజ్ఞప్తి చేశారు. గతంలో తన మాటల్ని తప్పుగా అన్వయించారని వివరించారు.
15,520
https://www.prajasakti.com/WEBSECTION/National/page931/dormyatpai-devull-chitras
జల్లికట్టు చట్ట సవరణ కోసం ప్రధానికి అమ్మ లేఖ
తమిళనాడులో సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టు నిర్వహణకు చట్టాన్ని సవరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని నరేంద్రమోడీకి బుధవారం లేఖ రాశారు. ఈ చట్ట సవరణకు అనుమతి లభించేవిధంగా బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల మనో భావాలను అర్థం చేసుకొని జల్లికట్టు నిర్వహణకు అనుమతించాలని ఆమె ఆ లేఖలో కోరారు.
ప్రజల మనో భావాలను అర్థం చేసుకొని తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు నిర్వహణకు చట్టాన్ని సవరించడానికి బిల్లు ఆమోదం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత బుధవారం ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.
15,832
https://www.prajasakti.com/WEBSECTION/National/page364/brajillo-ockkarojulo-800-marnas
బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కేసులో పలువురుకు సమన్లు జారీ చేయాలన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి.
బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణం సమయంలో బొగ్గు శాఖ బాధ్యతలను నిర్వహించిన అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్కు కూడా సమన్లు జారీ చేసి ఆయన పాత్రపై కూడా విచారణ జరిపించాలని ఈ కుంభకోణంలో నిందితుడైన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. మన్మోహన్సింగ్తో పాటు ఈ కేసులో నిందితులైన అప్పటి విద్యుత్శాఖ కార్యదర్శి ఆనంద్ స్వరూప్, గనులు, భూగర్భ వనరుల శాఖ కార్యదర్శి జైశంకర్ తివారీలకు కూడా సమన్లు జారీ చేయాలని ఆయన కోరారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసిన కోర్టు సిబిఐ ఛార్జిషీట్తో పాటు నిందితులు అందచేసిన పత్రాలను పరిశీలించనున్నట్లు తెలిపింది. జార్ఖండ్లోని అమర్కొండ ముర్గందంగల్ బొగ్గు క్షేత్రాన్ని జిందాల్ గ్రూపు కంపెనీలకు కేటాయించిన ఈ కుంభకోణంలో జిందాల్, మధుకోడాతో పాటు బొగ్గుశాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్సి గుప్తా ఐదు సంస్థలతో సహా మరో 11 మంది ఈ కేసులో నిందితులుగా వున్న విషయం తెలిసిందే.
అమర్కొండ ముర్గందంగల్ బొగ్గు క్షేత్రాన్ని జిందాల్ గ్రూపు కంపెనీలకు కేటాయించిన కుంభకోణం కేసులో నాడు బొగ్గు శాఖ బాధ్యతలను చేప్పట్టిన నాటి ప్రధాని మన్మోహన్సింగ్ తో పాటు మరికొందరికి సమన్లు జారీ చేయాలనీ తోటి నిందితుడైన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. అయితే కేసుకు సంబంధించిన సిబిఐ ఛార్జిషీట్తో పాటు నిందితులు అందచేసిన పత్రాలను పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది.
15,833
https://www.prajasakti.com/WEBSECTION/International/page61/nedu-rajkotlo-grinfild-airportku-shankusthapan-cheyanunn-modi
ఇళయరాజా ఆరోగ్యానికి ఏ ముప్పు లేదు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆగస్టు 15న స్వల్పంగా కడుపునొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. గ్యాస్ట్రిక్ సంబంధిత పరీక్షలు జరిపారని, ఆయన ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని రాజా సన్నిహితుల సమాచారం. ప్రస్తుతం ఇళయరాజాకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిసినప్పటికి ఈ అనారోగ్యం వార్త తెలిసి ఆయన అభిమానులు కలవరపాటుకు లోనయ్యారు.
సంగీత దర్శకుడు ఇళయరాజాకు స్వల్పంగా కడుపునొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ పరీక్షలు చేసి తన ఆరోగ్యానికి ముప్పేమీ లేదని తెలపడంతో త్వరలోనే ఆయన్ని డిశ్చార్జ్ చేస్తారని అతని సన్నిహితుల తెలిపారు.
15,837
https://www.prajasakti.com/WEBSECTION/International/page659/aparada-vidhinchinanduku-agraha-vyakta-chacin-bigepy-net
టిఎంసి గూండాలదాడి అంతా ప్రణాళిక ప్రకారమే జరిగింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్షనేత, సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు సూర్యకాంత్ మిశ్రా, ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) జాయింట్ సెక్రటరీ బిప్లాబ్ మజుందార్పై తృణ మూల్ కాంగ్రెస్ గుండాల దాడికి దిగడాన్ని ఆల్ ఇండియా కిసాన్ సభ ఖండించింది. టిఎంసి గూండాలదాడి అంతా ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఎఐకెఎస్ వ్యాఖ్యానించింది. ఇటీవల హౌరా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్న సూర్యకాంత మిశ్రా కాన్వారుపై తృణమూల్ గుండాలు దాడిచేసి వాహనాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వరద బాధితుల పరామర్శకు వెళ్తున్న నేతలపై దాడులకు పాల్పడుతోందని ఎఐకెఎస్ విమర్శించింది.
హౌరా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్షనేత సూర్యకాంత మిశ్రా మరియు ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) జాయింట్ సెక్రటరీ బిప్లాబ్ మజుందార్పై తృణమూల్ గుండాల దాడి అంతా ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఎఐకెఎస్ పేర్కొంది.
15,882
https://www.prajasakti.com/WEBSECTION/International/page990/trap-ghatng-sandhu-jaitrayatra
తీహార్ జైలులో ఒక ఖైదీని హత్య చేసిన తోటి ఖైదీలు
రాజధానిలోని తీహార్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీ ఒకరిని నలుగురు సహఖైదీలు మంగళవారం రాత్రి హత్య చేశారు. 29 ఏళ్ల దీపక్ అనే ఈ ఖైదీని హత్య చేసేందుకు హంతకులు కిటికీల రేకులు, ఊచలనే ఆయుధాలుగా మలుచుకున్నారని తీహార్ జైలు పిఆర్ఓ ముకేష్ ప్రసాద్ చెప్పారు. దోపిడీల నుండి హత్యాయత్నాల వరకూ పలు కేసుల్లో నిందితుడైన దీపక్ 2008 నుండి తీహార్ జైలులోనే వుంటున్నాడని, అతడితో పాటు నలుగురు హంతకులు కూడా 8 వ నెంబర్ జైలు గదిలో వారు వున్నారని ఆయన వివరించారు. హంతకులు మంగళవారం రాత్రి పది గంటల సమయంలో దీపక్ పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని, అతడిని ఆస్పత్రికి తరలించే సమయానికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని ఆయన చెప్పారు.
రాజధానిలోని తీహార్ జైలులో 29 ఏళ్ల దీపక్ అనే ఖైదీని సహఖైదీలు నలుగురు కలిసి మంగళవారం రాత్రి హత్య చేశారు. కిటికీల రేకులు, ఊచలను వాడుకొని దీపక్ ను తీవ్రంగా గాయపరిచారని, ఆసుపత్రికి తరలించినప్పటికీ అతనిని కాపాడలేకపోయామని తీహార్ జైలు పిఆర్ఓ ముకేష్ ప్రసాద్ చెప్పారు.
16,087
https://www.prajasakti.com/WEBSECTION/National/page747/adi-manvuni-mukhanni-tirigi-srustincharu
జంషెడ్ పూర్ లో మత ఉద్రిక్తత
ఉక్కు నగరమైన జంషెడ్పూర్లో తలెత్తిన మత ఉద్రిక్తతలపై సిపిఎం జార్ఖండ్ రాష్ట్ర కార్యదర్శివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని మాంగో ఏరియాలో శాంతి భద్రతలకు సంబంధించిన ఒక సంఘటన వల్ల మత ఉద్రిక్తత నెలకొందని పేర్కొంది. బిజెపికి చెందిన మతోన్మాద సంస్థలు నగరమంతటా మత సామరస్యతను దెబ్బ తీస్తున్నాయని, ఆ సంస్థల నేరపూరితమైన, రెచ్చ గొట్టే కార్యకలాపాల వల్ల పరిస్థితి చాలా తీవ్రంగా మారుతోందని పేర్కొంది. దీనిపై మౌనంగా ఉండడం ద్వారా ప్రభుత్వం ఆ శక్తులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు వుందని పేర్కొంది.
జంషెడ్పూర్లోని మాంగో ఏరియాలో తలెత్తిన మత ఉద్రిక్తతలపై సిపిఎం జార్ఖండ్ రాష్ట్ర కార్యదర్శివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బిజెపికి చెందిన మతోన్మాద సంస్థలు ప్రజలను రెచ్చగొట్టి పరిస్థితిని క్లిష్టం చేస్తున్నాయని, దీన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని సిపిఎం పేర్కొంది.
17,687
https://www.prajasakti.com/WEBSECTION/National/page708/fipha-aggyutive-kaunsil-sabhyudiga-praful-patel
బెలూచిస్తాన్ లో చెలరేగిన హింస
బెలూచిస్తాన్లో తాజాగా హింస చెలరేగింది. నలుగురు షియా ముస్లింలను పాకిస్థాన్కు చెందిన ఓ గన్మెన్ కాల్చి చంపాడు. అధికారులు దీన్ని జాతి ఘర్షణగా పేర్కొన్నారు. ఈ ఘటనతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా గాద్వార్ పోర్టును అనుసంధానిస్తూ చైనా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్పై ఆందోళన వ్యక్తమైంది. రూ. 3.6 లక్షల కోట్లతో చైనా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
బెలూచిస్తాన్ అధికారులు జాతి ఘర్షణగా పేర్కొన్న షియా ముస్లింలపై పాకిస్థాన్ గన్మెన్ కాల్పుల ఘటనతో రూ. 3.6 లక్షల కోట్లతో చైనా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్పై ఆందోళన వ్యక్తమైంది.
17,767
https://www.prajasakti.com/WEBSECTION/International/page446/asi-targati-gadul-kos-sabsidi-penchandi
సిరియాలో రక్కా నగరంపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల యుద్ధ విమానాలు దాడి
సోమవారం జరిపిన దాడుల్లో కనీసం 84 మంది పౌరులు మరణించారని, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని బ్రిటన్కు చెందిన హ్యూమన్రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది. ఈ వైమానిక దాడులు రెండు ప్రాంతాల్లో జరిగాయని, ఇందులో ఒకటి మన్సూరా పట్టణంలో నిర్వాసిత కుటుంబాలు తలదాచుకుంటున్న స్కూల్ భవనం కాగా, మరొకటి తబ్కా పట్టణంలోని ఒక మార్కెట్, బేకరీ భవనం అని వివరించింది. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఐఎస్ మిలిటెంట్లు వున్నారని, అయితే భారీ సంఖ్యలో సాధారణ పౌరులు కూడా అక్కడ వున్నారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ ఆ సంస్థ వెల్లడించింది. స్కూల్ భవనంలో తలదాచుకుంటున్న, బేకరీవద్ద బ్రెడ్ కొనుగోలు కోసం నిల్చున్న వారిపై ఈ దాడులు జరగటంతో పలువురు చిన్నారులతో సహా అనేక మంది మరణించారని హ్యూమన్ రైట్స్ వాచ్ డిప్యూటీ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ ఒలె సోల్వాంగ్ వివరించారు.
సిరియాలో రక్కా నగరంపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల యుద్ధ విమానాలు సోమవారం జరిపిన దాడుల్లో కనీసం 84 మంది పౌరులు మరణించారని, చాల మంది తీవ్రంగా గాయపడ్డారని బ్రిటన్కు చెందిన హ్యూమన్రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది. బేకరీవద్ద బ్రెడ్ కొనుగోలు కోసం నిల్చున్న వారిపై ఈ దాడులు జరగటంతో పలువురు చిన్నారులతో సహా అనేక మంది మరణించారు.
17,770
https://www.prajasakti.com/WEBSECTION/National/page368/prakruti-chacin-gayam
ఫసిఫిక్ సముద్రంపై హైడ్రోజన్ బాంబును ప్రయోగించనున్న ఉత్తర కొరియా
సియోల్ : ఫసిఫిక్ సముద్రంపై హైడ్రోజన్ బాంబును ప్రయోగిస్తామని ఉత్తర కొరియా ప్రకటించింది. తమ దేశాన్ని నాశనం చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడాన్ని ఖండించిన ఆ దేశం, ట్రంప్ కు గట్టి గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యోంగ్ హో మాట్లాడుతూ భారీ స్థాయిలో హైడ్రోజన్ బాంబును ప్రయోగాత్మకంగా ప్రయోగించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. న్యూయార్క్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూనే ఆయనీ ప్రకటన చేయడం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా దేశాన్ని నాశనం చేస్తానని ప్రకటించగా అతనికి గుణపాఠం చెప్పట్టం కోసం ఫసిఫిక్ మహాసముద్రంపై భారీ స్థాయిలో హైడ్రోజన్ బాంబును ప్రయోగించబోతున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.
17,872
https://www.prajasakti.com/WEBSECTION/National/page438/kott-anu-vidyut-plants-vaddu-karat
మనిలాలో మాదకద్రవ్యాల మాఫియాఫై నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత
మనిలా : తమ దేశంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న మాదకద్రవ్యాల దందాపై ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టె పోరును ఉధృతం చేసిన నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పోలీసు కాల్పుల్లో కనీసం 80 మందికి పైగా మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. వరుసగా మూడో రోజు శుక్రవారం నాడు మనిలా నగరంలో పోలీసులు కొనసాగించిన దాడుల్లో కనీసం 13 మంది డ్రగ్ స్మగ్లర్లు మరణించారని మీడియా తన వార్తాకథనాలలో పేర్కొంది. డ్రగ్స్ మాఫియాను, వీధి నేరాలను అడ్డుకునేందుకు వన్టైమ్ బిగ్టైమ్ పేరుతో మనిలా నగరం, పరిసర ప్రావిన్స్ల్లో పోలీసులు గత వారం రోజులుగా కొనసాగిస్తున్న దాడుల్లో 67 మంది మరణించగా మరో 200 మందికి పైగా అరెస్టయినట్లు తెలుస్తోంది. కాగా మాదకద్రవ్యాలపై పోరు పేరుతో పోలీసులు కొనసాగిస్తున్న హత్యాకాండను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రతిపక్షానికి చెందిన ఉపాధ్యక్షుడు లెని రోబెర్డో ప్రకటించారు.
మనిలాలో అవుతున్న మాదకద్రవ్యాల మాఫియాపై ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టె పోరును ఉధృతం చేయడంతో చాలా ప్రాంతాల్లో జరిగిన పోలీసు కాల్పుల్లో 80 మందికి పైగా మరణించారని స్థానిక మీడియా తెలిపింది. డ్రగ్స్ మాఫియాను ఆపేందుకు వన్టైమ్ బిగ్టైమ్ పేరుతో మనిలా నగరంల్లో పోలీసులు చేస్తున్న దాడుల్లో 67 మంది చనిపోగా మరో 200 మందికి పైగా అరెస్టయినట్లు సమాచారం.
18,571
https://www.prajasakti.com/WEBSECTION/International/page166/liverpullo-agnipramada-vandladi-vahanal-dagdha
బొగ్గు వినియోగం పెంచేందుకు ట్రంప్ ప్రణాళిక
కర్బన ఆధారిత విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను క్రమంగా మూసివేయాలన్న ఒబామా విధానాన్ని ట్రంప్ తిరగదోడనున్నారు. బొగ్గు వినియోగాన్ని తగ్గించుకోవడానికి బదులు పెంచాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఆయన రూపొందించిన కొత్త ప్రణాళిక వచ్చే దశాబ్దిలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు మరిన్ని పెరగడానికి వీలు కల్పిస్తుంది. ట్రంప్ ప్రతిపాదనలు అమలులోకి వస్తే ప్రస్తుత స్థాయి కన్నా 12 రెట్లు అధికంగా కర్బన ఉద్గారాలు గాలిలోకి విడుదల అవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే దశాబ్దిలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు మరిన్ని పెరగడానికి వీలుగా ట్రంప్ కొత్త ప్రణాళిక రూపొందించారు. కర్బన ఆధారిత విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను క్రమంగా మూసివేయాలన్న ఒబామా విధానానికి ఇది పూర్తి వ్యతిరేకం.
18,818
https://www.prajasakti.com/WEBSECTION/National/page495/upadhi-nidhul-chellimpullo-prabhuthwaniki-adeshalivvali-yalmanchili
ట్రంప్ అధ్యక్షుడిగా ఉండడం స్వాగతిస్తున్నామన్న బాన్ -కి-మూన్ .
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికను తాము స్వాగతిస్తున్నట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్-కి-మూన్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఎటువంటి వ్యాఖ్యలు చేసిన ఇప్పుడు దేశ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని అందరూ ఏకతాటిపై నడవాలని ఆయన ట్రంప్కు సూచించారు. ట్రంప్ విజయవార్త తెలుసుకున్న వెంటనే ఆయన ఫోన్లో అభినందనలు తెలియచేస్తూ సందేశం ఇచ్చినట్లు ఐరాస వర్గాలు వివరించాయి. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సుస్థిరతలకు, అభివృధ్ధికి, మానవ హక్కుల పరిరక్షణకు పరస్పరం సహకరించుకుంటాయన్న ఆశాభావాన్ని బాన్ వ్యక్తం చేసినట్లు ఈ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల ప్రచారంలో ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఇప్పుడు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన కార్యదర్శి బాన్-కి-మూన్ అధ్యక్షుడిగా ట్రంప్ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ గెలిచిన విషయం తెలియగానే ఆయన అభినందనలు తెలిపారు.
19,128
https://www.prajasakti.com/WEBSECTION/National/page667/chennailo-kungin-rahadaritappin-muppu
రొడోల్ఫో ఇలేన్స్ హత్య ఒక రాజకీయ కుట్ర.
దేశ అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి రొడోల్ఫో ఇలేన్స్ గని కార్మికుల చేతుల్లో హత్యకు గురైన నేపథ్యంలో బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్ మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. మంత్రి హత్యను ఆయన తీవ్రంగా నిరసించారు. ఈ కుట్రలు, కుతంత్రాలు అనేవి తాత్కాలికమైనవి కావని, తమకు ఇవి శాశ్వతమైనవని వ్యాఖ్యానించారు. మొదట వికలాంగులను సమీకరించారు, తర్వాత భారీ రవాణా రంగ సభ్యులు, ఇప్పుడు గని కార్మికులు వీరందరినీ కూడా ఆ కుట్రల్లో పాములుగా వాడుకుంటున్నారని మొరేల్స్ ఇక్కడ పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.
బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి రొడోల్ఫో ఇలేన్స్ను రాజకీయ కుట్రలో భాగంగా గని కార్మికులను పాములుగా వాడుకొని చంపించారని,ఈ కుట్రలు, కుతంత్రాలు శాశ్వతమైనవని పేర్కొన్నారు.
19,262
https://www.prajasakti.com/WEBSECTION/International/page917/avinitiparula-vadilipettam
చైనా అమెరికా మధ్య యుద్ధం జరిగితే ఆమెరికాకే నష్టం
ప్రస్తుతం కొనసాగుతున్న దక్షిణ చైనా సముద్ర వివాదం నేపథ్యంలో చైనా అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు సంభవిస్తే అమెరికా భారీ స్థాయిలో నష్టాన్ని మూటకట్టుకునే అవకాశాలున్నాయని అమెరికాకు చెందిన రాండ్ కార్పొరేషన్ అనే కార్పొరేట్ సంస్థ అంచనా వేసింది. ఈ సంస్థ విడుదల చేసిన తాజా అధ్యయనం ప్రకారం 2015-2025 మధ్య కాలంలో చైనా తన సైనిక సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుకున్నదని, ఒకవేళ చైనాతో యుద్ధమే జరిగితే అమెరికా ఎక్కువ కాలం బరిలో నిలవలేకపోయే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయని వివరించింది. 2025 నాటికి చైనాను ఓడించాలన్న లక్ష్య సాధనలో అమెరికాకు మరిన్ని కష్టాలు ఎదురవుతాయని అంతమాత్రాన చైనా అమెరికాపై విజయం సాధిస్తుందని తాము చెప్పటం లేదని రాండ్ కార్పోరేషన్ తన అధ్యయన పత్రంలో వివరించింది. అయితే ఏ రకమైన యుద్ధంలో అమెరికా కన్నా చైనా ఎక్కువ నష్టపోతుందన్న విషయాన్ని ఈ అధ్యయన పత్రం ప్రస్తావించలేదు.
అమెరికాలోని రాండ్ కార్పొరేషన్ అనే కార్పొరేట్ సంస్థ విడుదల చేసిన తాజా అధ్యయనంలో 2015-2025 మధ్య కాలంలో చైనా సైనిక సామర్ధ్యం పెరిగిందని, ఒకవేళ అమెరికా దక్షిణ చైనా సముద్ర వివాదం నేపథ్యంలో చైనాపై యుద్ధం జరిపితే అమెరికా భారీ స్థాయిలో నష్టపోయే అవకాశాలున్నాయని పేర్కొంది. అయితే అంతమాత్రాన చైనా అమెరికాపై విజయం సాధిస్తుందని తాము చెప్పట్లేదాని వివరించింది.
19,314
https://www.prajasakti.com/WEBSECTION/International/page40/party-karyakartalapai-hinsakandan-apandi
చీలి లో భారీ నిరసన
మాజీ సైనిక నియంత అగస్టో పినోచెట్ ప్రభుత్వం అమలు లోకి తెచ్చిన నిర్బంధ ప్రైవేటు రంగ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చిలీ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో దాదాపు 2 లక్షల మందికి పైగా కార్మికులు భారీ యెత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాజధాని శాంటి యాగోలో జరిగిన ప్రధాన ప్రదర్శనలో దాదాపు 1.5 లక్షల మందికి పైగా కార్మికులు పాల్గొని కొత్త పెన్షన్ విధానంపై నిరసన తెలియచేశారని కార్మిక సంఘ నేతలు చెప్పారు. అదే విధంగా వల్పరయిసో తదితర నగరాల్లో కార్మికులు భారీ సంఖ్యలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వల్పరియసోలో జరిగిన నిరసన ప్రదర్శనను చెదర గొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారని టెలివిజన్ ఛానళ్లు తమ వార్తా కథనాలలో పేర్కొన్నాయి.
నియంత అగస్టో పినోచెట్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టం ప్రైవేట్ రంగ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చిలీ దేశం లో 1.5 లక్షల మంది కార్మికులు రాజధాని శాంటి యాగోలో భారీ నిరసన తెలియజేశారు. వల్పరియసోలో జరిగిన నిరసనను చెదరగొట్టడానికి వాటర్ క్యాన్లు, బాష్పవాయు గోళాలను పోలీసులు ఉపయోగించినట్లు టెలివిజన్ ఛానళ్లు పేర్కొన్నాయి
19,363
https://www.prajasakti.com/WEBSECTION/International/page337/jeenyu-vidyarthul-nirsan
టర్కీలో ఇటీవల విఫలమైన సైనిక కుట్రకు సూత్రధారిని అప్పగించాలని టర్కీ అమెరికాకు విజ్ఞప్తి
టర్కీలో ఇటీవల విఫలమైన సైనిక కుట్రకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మత బోధకుడు ఫతుల్లా గులెన్ను తమకు అప్పగించాలని టర్కీ మంగళవారం అధికారికంగా అమెరికాకు విజ్ఞప్తి చేసింది. అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతున్న గులెన్ సైనిక కుట్రకు సూత్రదారుడని, అతడిని తమకు అప్పగించాలని అమెరికాకు అధికారికంగా విజ్ఞప్తిని పంపామని టర్కీ ప్రధాని బినాలి యిల్దిరిమ్ చెప్పారు. ఈ కుట్రకు సూత్రధారులెవరన్న అంశంపై తమకు ఎటువంటి సందేహం లేదని, గులెన్, ఆయన అనుచరులే ఈ కుట్రకు బాధ్యులని టర్కీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ కుట్రలో గులెన్ ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను అందచేస్తే తాము టర్కీ విజ్ఞప్తి ప్రకారం గులెన్ను అప్పగించే ప్రక్రియను ప్రారంభిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించిన విషయం తెలిసిందే.
అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతున్న గులెన్ సైనిక కుట్రకు సూత్రదారుడని, అతడిని తమకు అప్పగించాలని టర్కీ మంగళవారం అధికారికంగా అమెరికాకు విజ్ఞప్తి చేసింది. ఈ కుట్రలో గులెన్ కు వున్న భాగానికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే అతన్ని అప్పగించడానికి తమకేం అభ్యంతరం లేదని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు.
19,415
https://www.prajasakti.com/WEBSECTION/International/page405/amenpai-america-military-dadulu
ఉగ్రవాదులు హతం
గత ఏడాది పాకిస్తాన్లోని పెషావర్లో వున్న బచాఖాన్ యూనివర్శిటీపై దాడిలో సూత్రధారిగా వ్యవహరించిన పాక్ తాలిబన్ అగ్రనేత ఉమర్ ఖలీఫా తమ విమాన దాడిలో మరణించినట్లు అమెరికా రక్షణశాఖ ప్రకటించింది. బచాఖాన్ యూనివర్శిటీతో పాటు పెషావర్ స్కూల్పై దాడి చేసి 150 మందిని తాలిబన్లు ఊచకోత కోసిన విషయం తెలిసిందే. గత వారం నన్గార్హర్ ప్రావిన్స్లో జరిగిన విమాన దాడిలో తారిక్ గిదర్ గ్రూప్కు నేతృత్వం వహిస్తున్న ఉగ్రవాది ఉమర్ఖలీఫా మరణించాడని అమెరికా రక్షణశాఖ మీడియా కార్యదర్శి పీటర్ కుక్ ప్రకటించారు. ఈ నెల 9న అమెరికా-ఆఫ్ఘన్ సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడిలో ఉమర్ఖలీద్తో పాటు ఇస్లామిక్స్టేట్కు చెందిన నలుగురు మిలిటెంట్లు మరణించారని ఆయన వివరించారు.
పాకిస్తాన్లోని బచాఖాన్ యూనివర్శిటీపై దాడిచేసి 150 మందిని బలిగొన్న తాలిబన్ అగ్రనేత ఉమర్ ఖలీఫాను అమెరికా హతమార్చింది. ఈ నెల 9న అమెరికా-ఆఫ్ఘన్ సేనలు నన్గార్హర్ ప్రావిన్స్లో విమాన దాడి చేసి, ఉమర్ఖలీఫాతో పాటు మరో నలుగురు ఉగ్రవాదుల్ని చంపారని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి పీటర్ కుక్ ప్రకటించారు.
19,905
https://www.prajasakti.com/WEBSECTION/National/page443/iranto-oppanda-raddu-chesukondi-america
మహ్మద్ జహీర్ అల్ షేర్కత్ అనే జర్నలిస్టుపై కాల్పులు
టర్కీ దక్షిణ ప్రాంతంలో సిరియాకు చెందిన ఒక పాత్రికేయుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారని స్థానిక దినపత్రిక హురియత్ వెల్లడించింది. గాజియాంటెప్ ప్రావిన్స్లో దుండగులు జరిపినీ దాడిలో మహ్మద్ జహీర్ అల్ షేర్కత్ (36) అనే ఈ జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డాడని ఈ పత్రిక వివరించింది. కాల్పులుజరిపిన అనంతరం దుండగుడు దగ్గరకువస్తుండగా షేర్కత్ పరుగెత్తాడని, అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని వెల్లడించింది. సిరియా సరిహద్దుకు దగ్గరలో వున్న గజియాంటెప్ ప్రావిన్స్లో ఇదే తరహా ఘటనలు తరచు చోటు చేసుకుంటుండటంతో మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
టర్కీ దక్షిణ ప్రాంతంలో గాజియాంటెప్ ప్రావిన్స్లో కొందరు దుండగులు మహ్మద్ జహీర్ అల్ షేర్కత్ అనే జర్నలిస్టుపై కాల్పులు జరపగా ఆయన ఆసుపత్రిలో మరణించారు. ఇదే మాదిరిగా ఘటనలు చోటు చేసుకోవటంతో మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
20,193
https://www.prajasakti.com/WEBSECTION/National/page277/rajauri-punch-sectare-palk-kalpulu
ఆకలిచావుల అంచున దక్షిణ సూడానీయులు
కొత్తగా ఏర్పడిన దక్షిణ సూడాన్లో నానాటికీ పెరుగుతున్న ఆహార అభద్రతతో దాదాపు 40 వేల మందికి పైగా ప్రజలు ఆకలిచావుల ప్రమాదపుటంచుల్లో వున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ద. సూడాన్ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నదని దేశంలో దాదాపు 28 లక్షల మంది ప్రజలు అత్యవసర ఆహార సాయం కోసం ఎదురు చూస్తున్నారని, మరో 40 వేల మందికి పైగా ప్రజలు ఆకలిచావుల ప్రమాదపుటంచుల్లో వున్నారని ఐరాసకు చెందిన ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ), బాలల సహాయనిధి (యునిసెఫ్), ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ (డబ్ల్యుఎఫ్పి) ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఇప్పుడు ప్రారంభమవుతున్న కరువు పరిస్థితులు ప్రజలెదుర్కొంటున్న ఆహార అభద్రతకు మరింత ఆజ్యం పోస్తున్నాయని ఈ సంస్థలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. గత ఏడాది సంతకాలు జరిగిన శాంతి ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయటంతో పాటు కల్లోలిత ప్రాంతాలకు ఆహార సరఫరాలను బేషరతుగా అనుమతించాల్సిన అవసరం వుందని ఈ సంస్థలు తెలిపాయి. ఈ ఆహార అభద్రతా పరిస్థితిని ఎదుర్కొనేందుకు శాంతి ఒప్పందాన్ని అమలు చేయటమే కీలకమని ఈ సంస్థలు స్పష్టం చేశాయి.
ఇప్పుడు మొదలవుతున్న కరువు పరిస్థితుల మూలంగా ఎప్పుడు లేని విధంగా దక్షిణ సూడాన్లో, 28 లక్షల మంది ప్రజలు అత్యవసర ఆహార సాయం కోసం, 40 వేల కంటే ఎక్కువ మంది ప్రజలు ఆకలిచావుల అలమటిస్తున్నారని ఐరాసకు సంబంధించిన ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ), బాలల సహాయనిధి (యునిసెఫ్), ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ (డబ్ల్యుఎఫ్పి)అన్నాయి. ఈ పరిస్థితిని అధికమించాలంటే శాంతి ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని సంస్థలు పేర్కొన్నాయి.
20,304
https://www.prajasakti.com/WEBSECTION/International/page330/madhyapradesh-pashchimbengal-bhariga-chamuru-gas-nikshepal
అమెరికా, కెనడాలలో స్వేచ్ఛగా తిరుగుతున్న చైనా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్
చైనా మోస్ట్వాంటెడ్ క్రిమినల్స్గా ప్రకటించిన వారిలో పలువురు అమెరికా, కెనడాలలో ఆశ్రయం పొంది స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆపరేషన్ స్కైనెట్ పేరుతో దాదాపు వందమంది క్రిమినల్స్తో ప్రకటించిన ఈ మోస్ట్వాంటెడ్ జాబితాలో 46 మంది మాత్రమే చైనాకు తిరిగి వచ్చారని అధికారులు తెలిపారు. ఇందులో అమెరికా నుండి వచ్చిన ఒక మహిళ కూడా వుందని, అమెరికా ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లో మరొకరు కూడా చైనాకు బయల్దేరేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పారు. వీరంతా ఈ దేశాల్లో చట్టబద్ధమైన వలసదారులుగా స్వేచ్ఛగా సంచరిస్తుండటం విశేషం.
ఆపరేషన్ స్కైనెట్ పేరుతో సుమారు వందమందిని చైనా మోస్ట్వాంటెడ్ క్రిమినల్స్గా ప్రకటించగా ఈ జాబితాలో 46 మంది మాత్రమే చైనాకు తిరిగి వచ్చారని, మిగిలిన వారు అమెరికా మరియు కెనడాలలో చట్టబద్ధమైన వలసదారులుగా స్వేచ్ఛగా తిరుగుతున్నారని అధికారులు చెప్పారు.
20,432
https://www.prajasakti.com/WEBSECTION/International/page685/afghanistanku-bharat-anto-vishvasaniyamin-bhagswami-pentgan
న్యూ ఆర్లీన్స్ నగరంలోని క్రీడా మైదానంలో కాల్పులు
న్యూ ఆర్లీన్స్ నగరంలోని క్రీడా మైదానంలో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 16 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ గ్రౌండ్లో జరుగుతున్న మ్యూజిక్ వీడియో షూటింగ్ను వందలాది మంది ప్రజలు తిలకిస్తున్న సమయంలో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయని, ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారని అధికారులు వివరించారు. నగరంలోని బన్నీఫ్రెండ్ మైదానంలో ఈ కాల్పుల ఘటన ప్రారంభమైనపుడు పోలీసులు అక్కడి ప్రజలను చెదరగొట్టి సురక్షిత ప్రాంతాలకు పంపేందుకు ప్రయత్నించారని పోలీసులు ఒక ప్రకటనలో వివరించారు. కాల్పుల్లో గాయపడిన వారిలో పదిమందిని ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్లో తరలించగా మరో ఆరుగుకి సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించినట్లు పోలీసులు చెప్పారు.
న్యూ ఆర్లీన్స్ నగరంలోని బన్నీఫ్రెండ్ మైదానంలో జరుగుతున్న మ్యూజిక్ వీడియో షూటింగ్ను వందలాది మంది ప్రజలు తిలకిస్తున్న సమయంలో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకోగా ఈ కాల్పుల్లో మొత్తం 16 మంది గాయపడినట్టు మిగతా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు
20,506
https://www.prajasakti.com/WEBSECTION/National/page293/nedu-rashtralo-pidugulatho-kudin-jallulu
ఐఎస్ లోకి బొకోహరాం ఉగ్రవాదులు
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), బొకోహరాం మధ్య సంబంధాలు ఏర్పడ్డాయని, ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విధంగా పేర్కొన్నారు. 2015 నుంచి ఐఎస్, బొకోహారం మధ్య అనుబంధం ప్రారంభమైందని, దీనివల్ల పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో శాంతి, స్థిరత్వాలకు ప్రమాదకరమని తెలియజేశారు. లిబియాలో బొకోహరాం తీవ్రవాదులు ఐఎస్లో చేరుతున్నట్టు ఖచ్చితమైన సమాచారం అందిందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు.
2015 నుండి ఐఎస్, బొకోహరాం మధ్య సంబంధాలు మొదలయ్యాయని ఐరాస అన్నది. లిబియాలో బొకోహరాం తీవ్రవాదులు ఐఎస్లో చేరుతున్నారు. దీనివల్ల పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో శాంతి, స్థిరత్వాలకు చాలా ప్రమాదమని అన్నది.
20,940
https://www.prajasakti.com/WEBSECTION/International/page995/hitru-vimanashray-vistharannu-khandinchin-plan-stupid
సముద్రంలో మునిగిన మలేసియా పశ్చిమ తీరం నుండి ఇండోనేసియాకు బయల్దేరిన పడవ
మలేసియా పశ్చిమ తీరం నుండి ఇండోనేసియాకు దాదాపు 100 మంది ప్రయాణీకులతో బయల్దేరిన ఓ పడవ సముద్రంలో నీట మునిగిందని అధికారులు గురువారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా 12 మందిని రక్షించారు. మృతదేహాలను మత్స్యకారులు తీరానికి చేరుస్తున్నారు. ఇండోనేసియాలోని సుమత్రా ప్రావిన్స్లో ఉన్న తాంజుంగ్ బలారు పట్టణానికి ఈ వలసదారులు బయల్దేరినట్లు తెలుస్తోందని, పడవలో పరిమితికి మించిన సంఖ్యలో ప్రయాణీకులను ఎక్కించటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
మలేసియా పశ్చిమ తీరం నుండి ఇండోనేసియాకు బయల్దేరిన పడవలో పరిమితికి మించిన సంఖ్యలో ఇండోనేసియాలోని తాంజుంగ్ బలారు పట్టణానికి బయల్దేరిన వలసదారులను ఎక్కించటంతో సముద్రంలో మునిగి 14 మంది మరణించారు.
21,200
https://www.prajasakti.com/WEBSECTION/National/page361/sudhakardi-prabhutva-hatye-bots
శ్రీలంక పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా ఆర్ .సంబంధన్
తమిళ జాతీయ కూటమి(టిఎన్ఎ) నేత ఆర్. సంబంధన్ను శ్రీలంక పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా అధికారికంగా గుర్తించింది. 1977లో తమిళ నేత అమృతలింగం తరువాత రెండోసారి ప్రతిపక్ష నేతగా తమిళ నేత ఎన్నిక కావటం విశేషం. గత నెలలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 225 మంది సభ్యులున్న పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టీగా టిఎన్ఎ అవతరించిన విషయం తెలిసిందే. మూడో స్థానంలో వున్న టిఎన్ఎకు ప్రతిపక్ష హోదా కల్పించాలని మొదటి రెండు పార్టీల నేతలు ప్రధాని విక్రమసింఘె, అధ్యక్షుడు సిరిసేన ఏకాభిప్రాయానికి రావటంతో సంబంధన్ను ప్రతిపక్ష నేతగా స్పీకరు జయసూర్య అధికారికంగా ప్రకటించారు.
ప్రజాప్రతినిధి ఆర్. సంబంధన్ను శ్రీలంక పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా స్పీకరు జయసూర్య అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టీ తమిళ జాతీయ కూటమి(టిఎన్ఎ)కి చెందిన ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం ఇది రెండోసారి.
21,232
https://www.prajasakti.com/WEBSECTION/National/page535/marinni-gols-cheyalsi-undi
సైనిక దళాలను అభినందించిన ఈజిప్ట్ కమ్యూనిస్టు పార్టీ
దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ముస్లిం బ్రదర్హుడ్, ఇతర ఉగ్రవాద సంస్థలు పన్నిన కుట్రను భగ్నం చేసిన సైనిక దళాలకు అభినందనలు తెలియచేస్తున్నట్లు ఈజిప్ట్ కమ్యూనిస్టు పార్టీ(ఇసిపి) ఒక ప్రకటనలో పేర్కొంది. అటార్నీ జనరల్ హత్య తరువాత సినరు, తదితర ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద చర్యలు దేశంలో రక్తపాతాన్ని సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలు పన్నిన కుట్రలను ప్రతిబింబిస్తున్నాయని, ఇందుకు మీడియాలోని ఒక వర్గం పావులా ఉపయోగపడిందని ఇసిపి తన ప్రకటనలో వివరించింది. సామ్రాజ్యవాద శక్తులు, ఈ శక్తులకు తోకలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాంతంలోని దేశాలు ముఖ్యంగా కతార్, టర్కీ ప్రయోజనాలను కాపాడేందుకు ఉగ్రవాద శక్తులు ఈ కుట్రలకు పాల్పడ్డాయని ఇసిపి తన ప్రకటనలో పేర్కొంది. కేవలం ఒక్కసారి నిరోధించినంత మాత్రాన ఉగ్రవాద శక్తులు తమ కుట్రలను ఆపబోవని, ఈ శక్తులకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు అప్రమత్తతతో ఓపికతో వ్యవహరించాలని, ఈ పోరాటం ఎంత కాలం కొనసాగుతుందన్న విషయం ప్రధానం కాదని ఇసిపి తన ప్రకటనలో స్పష్టం చేసింది.
మీడియాలోని ఒక వర్గాన్ని పావులా వాడుకొని ముస్లిం బ్రదర్హుడ్, ఇతర ఉగ్రవాద సంస్థలు పన్నిన కుట్రను భగ్నం చేసిన సైనిక దళాలను ఈజిప్ట్ కమ్యూనిస్టు పార్టీ(ఇసిపి) అభినందించింది. సామ్రాజ్యవాద శక్తులు, కతార్, టర్కీ వంటి దేశాల ప్రయోజనాల కోసం ఉగ్రవాద శక్తులు ఇలా చేశాయని, వీటికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు ఓపిక పట్టాలని ఇసిపి తన ప్రకటనలో పేర్కొంది.
21,288
https://www.prajasakti.com/WEBSECTION/National/page362/rajanganlo-up-mukhyamantri-padave-ledu
మానవ హక్కుల సమస్యలను పేర్కొన్న అమెరికా ప్రభుత్వ నివేదిక
పోలీసులు, భద్రతా బలగాల వేధింపులు భారత్లో ఒక ముఖ్యమైన మానవ హక్కుల సమస్యగా తయారయ్యాయని అమెరికా ప్రభుత్వ నివేదిక శుక్రవారం తెలిపింది. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన భారతదేశ పార్లమెంటరీ ఎన్నికలు చరిత్రలోనే అత్యంత పెద్ద ఎన్నికలను విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తన నివేదికకు రాసిన ముందుమాటలో వ్యా ఖ్యానించారు. అక్కడక్కడా చెదురుమదురుగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ మొత్తమ్మీద ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆ నివేదిక పేర్కొంది. అలాగే ఇతర మానవ హక్కుల సమస్యలు కూడా వున్నాయని, వాటిల్లో కనిపించకుండా పోవడం, ప్రమాదకరంగా జైళ్ళ పరిస్థితులు, ఏకపక్షంగా అరెస్టులు, నిర్బంధాలు, సుదీర్ఘ కాలం విచారణకు ముందుగానే నిర్బంధానికి గురవడం ఇవన్నీ కూడా మానవ హక్కుల సమస్యలేనని ఆ నివేదిక పేర్కొంది.
పూర్వం జరిగిన భారతదేశ పార్లమెంటరీ ఎన్నికలు అత్యంత పెద్దవని విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అమెరికా ప్రభుత్వ నివేదికలో వ్యా ఖ్యానించారు. ఎన్నికల సమయంలో హింసాత్మక కార్యాలు జరిగినప్పటికి ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. ఇతర మానవ హక్కుల సమస్యలను నివేదిక పేర్కొన్నారు.
31,444
https://www.prajasakti.com/WEBSECTION/National/page309/aiesku-maddatistunn-america
పిల్లలను సరిగా నిర్వహించని పలువురు అగ్రికల్చర్ ఆఫీసర్లు సస్పెండ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టడంలో విఫలమైన పలువురు అగ్రికల్చర్ ఆఫీసర్లకు మెమోలు జారీ అయ్యాయి. ఇద్దరు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులకు ఉన్నతాధికారులు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. వీరితోపాటు వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్లు ఇందిర ( దేవరకద్ర ), కవిత ( ఇబ్రహీంపట్నం ), మరో ఇద్దరు మండల స్థాయి వ్యవసాయ అధికారులు అశ్విన్ పంకజ్ ( భూత్పూరు ), రవీంద్రనాథ్ రెడ్డి ( హయత్ నగర్ ) లను సస్పెండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిపై శాఖా పరమైన విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టడంలో విఫలమైన పలువురు అగ్రికల్చర్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. పేరులో వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ ఇద్దరు, మండల స్థాయి వ్యవసాయాధికారులు మరో ఇద్దరు ఉన్నట్లుగా తెలిపారు.
31,902
https://www.prajasakti.com/WEBSECTION/National/page867/videshi-medhaulku-fasttrack-visa
ధర్నా చౌక్ కోసం పోరాటం కొనసాగిస్తాం : టీ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్
ధర్నా చౌక్ కోసం పోరాటం కొనసాగుతుందని టీ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అఖిలపక్షాన్ని పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ధర్నా చౌక్ తొలగించరాదని ఐకాస పోరాటం కొనసాగుతుందని కోదండరామ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా ఐకాస ఛైర్మన్ రాజేందర్రెడ్డికి మాతృవియోగంతో ఆయనను శుక్రవారం కోదండరామ్ పరామర్శించారు.
టీ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ ధర్నా చౌక్ తొలగించకుండా ఉండేందుకు పోరాటం చేస్తామని,దీనికోసం అఖిలపక్షాన్ని పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.
31,974
https://www.prajasakti.com/WEBSECTION/International/page493/naipunyabhivruddhi-shikshanalo-training-partnurs-kilka
మాతృదినోత్సవం సందర్భంగా పాటలతో ఆలరించిన ప్రముఖులు
మాతృదినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యురాలు వరలక్ష్మి, ఆమె కుమారుడు డా. ప్రవీణ్ కుమార్తో కలిసి శ్రీ త్యాగరాయ గానసభలోని లలిత కళావేది కపై సుస్వర 'వర' రాగ మాలిక, వరికూటి ఫౌడేషన్ ఆధ్వర్యంలో సంగీత, నృత్య కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. అమ్మ అంటే చల్లని మాట, అమ్మా అమ్మా అని పిలిచిన, అమ్మను మించిన దైవం వంటి పాటలను డా. వరలక్ష్మితో పాటు అరుణ, మాదవి, శారద, రాజరాజే శ్వరి, సాయిలక్ష్మి తదితరులు ఆలపించి ప్రేక్షకులను అలరించారు.
మాతృదినోత్సవం సందర్భంగా శ్రీ త్యాగరాయ గానసభలోని లలిత కళావేదికపై ఏర్పాటుచేసిన సుస్వర 'వర' రాగ మాలిక కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు వరలక్ష్మి తదితరులు పాల్గొని అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలిపే పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు.
32,199
https://www.prajasakti.com/WEBSECTION/National/page976/kapu-rijarveshnlapai-kendra-samiksh
ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు ఎదురుగాగల ఫ్యాన్సీ గూడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో చేనేత వస్త్ర ప్రదర్శనను ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్లాల్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సమగ్ర చేనేత ఉత్పత్తులు తక్కువ ధరలకు విక్రయిన్తున్నారన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ సతీమణి శైలజ, చేనేత, జౌళి శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు పి కమలేశ్వరరరావు, సహాయ సంచాలకులు జి రామ్మూర్తి నాయుడు, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాకులు ఎం వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.
ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ సోమవారం ఒంగోలు నగరంలో చేనేత వస్త్ర ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, చేనేత ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని, వీటిని ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు.
32,213
https://www.prajasakti.com/WEBSECTION/International/page820/bigep-muslim-vyatirek-mudr
రాజధాని గ్రామాల్లో వ్యవసాయం లేని నేపథ్యంలో పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. రాజధానివాసులకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్న ప్రభుత్వ హామీకనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు త్వరలో రాజధాని గ్రామాల్లో నాలుగు మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణులను గ్రామాల్లో ఏర్పాటుచేసే ఈ శిబిరాలకు తీసుకువచ్చేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పద్మజారాణి కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు అందించిన ఆరోగ్య కార్డుల తరహాలోనే రాజధానిలో భూములిచ్చిన రైతులకూ నగదు రహిత ఆరోగ్య కార్డులు అందించాలని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.
రాజధానివాసులకు ప్రభుత్వ హామీ మేరకు ఉచిత విద్య, వైద్యం అందించేలా గ్రామాల్లో నాలుగు మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా వైద్యరంగంలో అన్ని భాగాలకు చెందిన నిపుణులను ఈ శిబిరాలకు రేసుకువచ్చేలా జిల్లా ఆరోగ్యశాఖ అధికారి పద్మజారాణి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
32,300
https://www.prajasakti.com/WEBSECTION/National/page671/asis-test-cricketter-madox-mriti
తూర్పు గోదావరి జిల్లాలో 101 గ్రామాల పరిధిలో తాగునీటి పథకాలు ( ఆర్డబ్ల్యుఎస్ ) , అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థలను నిర్మించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈమేరకు ఆ జిల్లా కలెక్టర్కు శుక్రవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అవసరమయ్యే నిధులను ఉపాధిహామీ పథకం నిధులను వినియోగించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పనులకు సంబందించి 70:30 శాతం ప్రకారం వాటాలను ఉపాధి హామీ నిధులు, స్థానిక సంస్థల నిధులు ఖర్చు చేసేలా మార్గ దర్శకాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ తురు గోదావరిలో 101 గ్రామాల పరిధిలో త్రాగునీటి పథకాలు , అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థలు నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది . వీటికి అవసరమగు నిధులు ఉపాధి హామీ పథకం నిధులుగా వినియోగించాలని ప్రభుత్వం పేర్కొంది.
32,368
https://www.prajasakti.com/WEBSECTION/International/page303/niluvella-vanukutunn-kashmira
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండు రోజుల పర్యటన కోసం బుధవారంనాడు శ్రీలంక చేరుకున్నారు. ఆదేశంలో 'ఇన్వెస్ట్ ఇన్ ఈస్ట్-2016' పేరిట నిర్వహిస్తున్న రెండో అంతర్జాతీయ పెట్టుబడుల అభివృద్ధి ఫోరమ్ కార్యక్రమంలో స్పీకర్ పాల్గొంటున్నారు. ఈస్ట్ ప్రొవియెన్స్ ఆఫ్ శ్రీలంక ముఖ్యమంత్రి నజీర్ అహ్మద్ ఆహ్వానం మేరకు కోడెల ఆదేశంలో పర్యటిస్తున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకుని శుక్రవారం ఉదయం సభాపతి అమరావతి బయలుదేరి వెళతారని స్పీకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఈస్ట్ ప్రోవిన్స్ ఆఫ్ శ్రీలంక ముఖ్యమంత్రి నజీర్ అహ్మద్ ఆహ్వానం మేరకు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శ్రీలంకలో జరుగనున్న 'ఇన్వెస్ట్ ఈస్ట్ - 2016' అంతర్జాతీయ పెట్టుబడి అభివృద్ధి ఫోరం కార్యక్రమంలో పాల్గొన్నారు.
32,376
https://www.prajasakti.com/WEBSECTION/International/page659/bharat-para-sheitlark-rend-patakalu
రెవెన్యూ శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు కోరారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 30 ఏళ్ల నుండి ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో 400 డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రెవెన్యూ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట లో రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
32,880
https://www.prajasakti.com/WEBSECTION/National/page587/kuturito-tandri-asabhyakar-pravartan
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఎ మల్లాది విష్ణు, ఆయన సోదరుడు శ్రీనివాస్కు శుక్రవారం ఒకటో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మమ్మద్ అబ్దుల్రఫీ రిమాండ్ విధించారు. వారిని ఈ నెల 19 వ తేదీ వరకూ రిమాండ్కు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. మల్లాదిపై ఐపిసి 328, 304, ఎపి ఎక్సైజ్ యాక్ట్ 37 ( 1 ) ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తీర్పు అనంతరం కృష్ణలంక పోలీసులు విష్ణుతోపాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ను భారీ బందోబస్తు నడుమ విజయవాడ సబ్జైలుకు తరలించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసు లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన సోదరుడు శ్రీనివాస్ కు కోర్టు రిమాండ్ విధించింది. తీర్పు అనంతరం వీరిని పోలీసులు భారీ బందోబస్తు తో అరెస్ట్ చేశారు.
33,006
https://www.prajasakti.com/WEBSECTION/International/page891/bigepy-rathyatraku-hacort-no
ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ( ఎపిటిడిసి ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ( ఈడి ) గా గంటూరు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ ( జెడి ) ఆర్ మల్లిఖార్జునరావు నియమితులయ్యారు. ఎపిటిడిసి ఈడిగా ఈయన్ని ఏడాదిపాటు డిప్యుటేషన్పై నియమిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ విజరుకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటకశాఖ ఈడి హోదాలో ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పర్యాటక ప్రాజెక్టులను పర్యవేక్షిస్తారని పేర్కొంది. అలాగే అమరావతి ప్రాజెక్టు బాధ్యతలను కూడా ఆయనకే ప్రభుత్వం అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ కలెక్టర్ ఆర్ మల్లికార్జున ప్రేమిస్తున్నట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
33,131
https://www.prajasakti.com/WEBSECTION/International/page794/iranpai-dadki-kshipanulu-taralistunn-america
కడప జిల్లా కలెక్టరేట్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడంతో పాటు దానిని నిర్మించిన కమిటీ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించడాన్ని నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్ ) , ఇతర దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. విజయవాడ మాచవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ ధర్నానుద్దేశించి కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ, అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, కడపలో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం కలెక్టర్ ద్వారా విగ్రహాన్ని కూల్చివేయించిందని విమర్శించారు. అంబేద్కర్ పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్నిబట్టి విదితమవుతోందన్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్ కృష్ణాజిల్లా అధ్యక్షులు జి. నటరాజు, ప్రసారం మాసపత్రిక సంపాదకులు మాతంగి దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లాలో కలెక్టరేట్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడంతో పాటు దానిని నిర్మించిన కమిటీ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడాన్ని నిరసిస్తూ కుల వివక్ష బ్యతిరేక పోరాట సంగం, ఇతర దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసారు. దీని ఫలితంగా ప్రజలు మరియు స్థానికులు ప్రభుత్వానికి అంబేద్కర్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందొ తెలుస్తుందని విమర్శించారు.
33,252
https://www.prajasakti.com/WEBSECTION/International/page599/iddru-snehitul-darun-hatya
టివి కళాకారులకు ఈనెల 29న అవార్డులు ప్రదానం చేయనున్నట్లు విబి ఎంటర్ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు బొప్పన తెలిపారు. సంస్థ తొలి వార్షికోత్సవ సందర్భంగా బుల్లితెర సీనియర్ నటీ నటులను సత్కరించి, ఆర్థిక సహాయం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కొంపల్లిలోని ధోలారిధనిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విష్ణు మాట్లాడుతూ, విబి ఎంటర్టైన్మెంట్ లెజెండ్రీ 2015, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు సహా వంద మంది నటులకు అవార్డులిచ్చి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. సెవెన్ హిల్స్ మానిక్చంద్ కంపెనీ సౌజన్యంతో ఈ అవార్డులను అందిస్తున్నామన్నారు.
కొంపల్లిలోని ధోలారిధనిలో జరుగుతున్న విబి ఎంటర్టైన్మెంట్ సంస్థ మొదటి వార్షికోత్సవానికి బుల్లితెర టివి కళాకారులకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు వంద మంది నటులకు అవార్డులు ఇచ్చి సత్కరిస్తామని, సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు బొప్పన ప్రసంగించారు.
33,280
https://www.prajasakti.com/WEBSECTION/International/page948/janasenku-pavan-matramurthi-viralam
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ కోరుతూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ నెల 20న నిరసన దీక్ష చేపడుతున్నట్లు మాజీ ఎంపీ, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లకీëప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం ప్రాంగణాలను మినహాయించి హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ప్రవేశాలకు తెలంగాణా ప్రభుత్వం ఈనెల 12న నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. దీనివల్ల ఆంధ్ర ప్రాంతంలోని విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. వర్శిటీలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల వేతనాలను నిలిపేయడం దారుణమన్నారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ కోరుతూ ఈ నెల 20 వ తేదీన ధర్నా చేస్తాం అని, మాజీ ఎంపీ, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు.
33,635
https://www.prajasakti.com/WEBSECTION/National/page2634/koddisepati-kritme-hyderabadku-kuchibhots-srinivas-mritdehan-cherukundi-.
కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం చేరుకుంది. అమెరికాలో జాత్యహంకార దాడిలో కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో శ్రీనివాస్ మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. కడసారి చూసుకునేందుకు శ్రీనివాస్ బంధువులు దుఖంతో గుండె నిండా బాధను నింపుకుని ఉన్నారు.
అమెరికాలో జాత్యహంకార దాడిలో మరణించిన కూచిభొట్ల శ్రీనివాస్ ను కడసారి చూసుకునేందుకు మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు తీసుకొచ్చారు.
34,749
https://www.prajasakti.com/WEBSECTION/International/page949/karnataka-band-sampoorna-prashanta
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ఈనెల 20 నుంచి టిడిపి జన చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు జివిఎస్ ఆంజనేయులు ప్రకటించారు. బుధవారం ఉదయం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జివిఎస్ మాట్లాడుతూ టిడిపి చేపడుతున్న కార్యక్రమం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ విస్తృతంగా జరుగుతుందని చెప్పారు. మాజీ మంత్రి శనక్కాయల అరుణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా నడిపిస్తోందన్నారు.
బుధవారం ఉదయం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయం సమావేశంలో టిడిపి పార్టీ జిల్లా అధ్యక్షులు జివిఎస్ ఆంజనేయులు మాట్లాడుతూ, ఈనెల 20 నుంచి టిడిపి జన చైతన్య యాత్రలను జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజలకి తెలిసేట్టు నిర్వహిస్తున్నామని అన్నారు.
34,891
https://www.prajasakti.com/WEBSECTION/National/page323/top10pai-brazil-guri
మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్పై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఆరోపణలు చేస్తున్నారని ఎపి ప్రొహిబిషన్ ఎక్సైజ్శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేసన్ పేర్కొంది. ఆ సంఘ కార్యనిర్వాహక వర్గం విజయవాడలో ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆదినారాయణ పై వచ్చిన ఆరోపణలను సంఘ కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. ఆయనపై వచ్చిన వార్తలు వాస్తవం కాదని సంఘం నాయకులు రవింద్ర పస్రాద్, ఆనంద్ రాజు, చెన్నకేశవరావు తదితరులు తెలిపారు.
మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదినారాయణ పై చేసే ఆరోపణలు నిజం కాదని పి ప్రొహిబిషన్ ఎక్సైజ్శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేసన్ నాయకులు రవింద్ర పస్రాద్, ఆనంద్ రాజు, చెన్నకేశవరావు మరికొందరు అన్నారు.
37,565
https://www.prajasakti.com/WEBSECTION/International/page875/adhikaralo-50-ellu-konsagutan
ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త టోనీ మరిసన్ మృతి.
ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త, నవలా రచయిత్రి నోబెల్ అవార్డు గ్రహీత టోని మారిసన్ (88) సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆధునిక సాహిత్యానికి మార్గదర్శిగా ఖ్యాతి గడించిన ఆమె బిలవ్డ్ నవల ఆమెకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది. సాంగ్ ఆఫ్ సాలమన్తో పాటు ఇతర రచనలు ఆమెలోని భావుకతకు, ఊహాత్మక శక్తికి దర్పణంగా నిలిచాయి. న్యూయార్క్లోని మోంటిఫియోర్ మెడికల్ సెంటర్లో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని ప్రచురణ కర్త ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్ మంగళవారం ఒక ప్రకటన చేశారు.
ప్రముఖ అమెరికన్ సాహితీ వేత్త, నవలా రచయిత్రి నోబెల్ అవార్డు గ్రహీత టోని మారిసన్ (88) న్యూయార్క్ లో సోమవారం రాత్రి మరణించారు. ఆమె రచించిన బిలవ్డ్ నవల, సాంగ్ ఆఫ్ సాలమన్ అనలేని కీర్తిని సంపాదించాయి.
37,574
https://www.prajasakti.com/WEBSECTION/National/page941/hastkailku-prapanch-sthai-gurtimpu
అగ్రిగోల్డ్ బాధితురాలి కథన.
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితురాలు దిల్షాద్ (58) గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు. . అబ్దుల్ రషీద్ భార్య దిల్షాద్ (58) భవిష్యత్లో కుటుంబానికి ఆర్థిక భరోసా ఉండాలని చిన్న మొత్తంలో తాను సంపాదించిన నగదును అగ్రిగోల్డ్ కంపెనీలో జమచేసింది. ఆ డబ్బు తిరిగి రాకపోవడంతో ఆర్థికంగా కుటుంబం కుదేలవడంతో గుండెపోటుకు గురై మృతి చెందింది. ప్రభుత్వం స్పందించి మృతిరాలి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుని ఆసరాగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలానికి చెందిన దిల్షాద్ (58) అగ్రిగోల్డ్ కంపెనీలో జమచేసి డబ్బు తిరిగి రాకపోవడంతో తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందింది. కావున ప్రభుత్వం స్పందించి, మృతురాలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రమస్థులు కోరుకున్నారు.
37,627
https://www.prajasakti.com/WEBSECTION/National/page649/polendk-shock
పుల్వామా దాడిలో వాయుసేనకు అభినందించిన అసెంబ్లీ స్పీకర్
పుల్వామా దాడికి భారత్ గట్టి సమాధానం ఇచ్చిందని, టెర్రరిస్టులను తుదముట్టించిన వాయుసేనను చూసి గర్వపడుతున్నానని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రతండాలపై విజయవంతంగా దాడులు చేసిన వాయుసేనకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఎంతో గర్వంగా మీకు శాల్యూట్ చేస్తున్నాని ట్విట్టర్లో పేర్కొన్నారు.
మంగళవారం అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పుల్వామా దాడిని భారత్ గట్టిగా ఎదుర్కుందని ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి నారా లోకేశ్ వాయుసేనకు శాల్యూట్ చేస్తూ,అభినందనలు తెలిపారు.
39,026
https://www.prajasakti.com/WEBSECTION/International/page663/aarthik-sankshobhaniki-modi-jitlile-karna
సిద్ధాంతాలకనుగుణంగా పొత్తులు
కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ) జాతీయ అధ్యక్షులు రాందాస్ అథవాలే హైదరాబాద్ పర్యటనలో వైసిపి అధినేత జగన్ను ఎన్డిఎలోకి రావాలని కోరారని టిడిపి నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు, వర్ల రామయ్య తదితరులు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆర్పిఐ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ అన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని వైసిపి మొదటి నుంచి చెబుతుందని, టిడిపి మాత్రం ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వాటి సిద్ధాంతాలకనుగుణంగా పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం వంటి స్వేచ్ఛ ఉందన్నారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ) జాతీయ అధ్యక్షులు రాందాస్ అథవాలే ,వైసిపి అధినేత జగన్ను ఎన్డిఎలోకి రావాలని కోరిన విషయం అవాస్తవమని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో, సిద్ధాంతాలకనుగుణంగా పార్టీలు కలవడం, విడిపోవడం స్వేచ్ఛ అని అన్నారు.
39,030
https://www.prajasakti.com/WEBSECTION/National/page771/apisisi-adhyakshuluga-29na-shailajanath-badhyatal-sveekaran
ఎఐఆర్ టిడబ్ల్యూఎఫ్ సమ్మె
దేశంలోని అన్ని ఆర్. టి. సీల రక్షణకు ఆగస్టు 7న జాతీయ సమ్మె చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎఐఆర్టిడబ్ల్యూఎఫ్) జాతీయ నాయకులు కెకె దివాకరన్, ఆర్ లక్ష్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరువనంతపురంలో నిర్వహించిన రవాణా సంఘాల కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మోటార్ వాహన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టకూడదని డిమాండ్ చేశారు. ఈ సమ్మె విజయవంతం చేసేందుకు ఆర్టీసి ఎస్డబ్ల్యూఎఫ్ సహకారం అందించనున్నట్లు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కె జిలానీ బాషా, ప్రధాన కార్యదర్శి సిహెచ్ సుందరయ్య, ప్రచార కార్యదర్శి ఎం అయపరెడ్డి తెలిపారు.
దేశ ఆర్. టి. సీల రక్షణ కొరకై ఆగస్టు 7న జాతీయ సమ్మె చెపట్టనున్నట్లు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎఐఆర్టిడబ్ల్యూఎఫ్) నాయకులు ప్రకటించారు. మోటార్ వాహన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టకూడదనే డిమాండ్ తో ఈ సమ్మె జరగనుంది.
40,503
https://www.prajasakti.com/WEBSECTION/National/page509/america-nauka-vinyasalpai-bolivia-agraha
కేప్ టౌన్ వేదికగా భారత్ తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
కేప్టౌన్లో జరుగుతోన్న భారత్, సౌతాఫ్రికా తొలి టెస్టులో భారత బౌలర్లు రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 286 కు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికాబ్యాట్స్ మెన్లోడీన్ ఎల్గర్ 0, మార్క్రం 5, ఆమ్లా 3, డివిల్లియర్స్ 65, ప్లెస్సిస్ 62, డి కాక్ 43, ఫిలండెర్ 23, మహరాజ్ 35, రబాడా 26, మోర్కెల్ 2, పరుగులు చేసి అవుట్ అయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక షమీ, బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు చెరో వికెట్ లభించాయి.
కేప్టౌన్ వేదికగా భారత్ తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత బౌలర్లు భువనేశ్వర్ 4, అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ డివిల్లియర్స్ 65, ప్లెస్సిస్ 62, మహరాజ్ 35 పరుగులతో రాణించారు.
40,551
https://www.prajasakti.com/WEBSECTION/National/page3993/13-ends-tarvat-filippinslo-o-china-adhyakshudiga-paryatinchin-jinping.
13 ఏండ్ల తర్వాత ఫిలిప్పీన్స్ లో ఓ చైనా అధ్యక్షుడిగా పర్యటించిన జిన్ పింగ్ .
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫిలిప్పీన్స్లో పర్యటించారు. మనీలా విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఫిలిప్పీన్స్ అధికారులు ఘనస్వాగతం పలికారు. దాదాపు 13 ఏండ్ల తర్వాత ఓ చైనా అధ్యక్షుడు ఫిలిప్పీన్స్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా డ్యుటెర్టే బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు.
దాదాపు 13 ఏండ్ల తర్వాత చైనా అధ్యక్షుడిగా ఫిలిప్పీన్స్లో పర్యటించిన జిన్పింగ్ ను ఫిలిప్పీన్స్ అధికారులు మనీలా విమానాశ్రయమ వద్ద ఘనస్వాగతం పలికారు.
40,966
https://www.prajasakti.com/WEBSECTION/National/page50/niradharamin-aropanle-manukovali
ఓటమి చవిచూసిన భారత్
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో భాగంగా స్కాట్లాండ్లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలైయ్యాడు. కొరియా షట్లర్ సన్వాన్ చేతిలో 14-21, 18-21 తో ఓడిపోయాడు. ఇప్పటికే తెలుగు తేజాలు పీవీ సింధు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా రెండోసీడ్కు షాకిస్తూ క్వార్టర్స్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లో భారత్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ వెనుతిరిగాడు. పీవీ సింధు,సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే.
42,806
https://www.prajasakti.com/WEBSECTION/International/page490/lenin-stalinku-ippatiki-targani-adran
రవీంద్రభారతిలో త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ దశమ వార్షికోత్సవం
ప్రజాశక్తి -కల్చరల్ రిపోర్టర్'చక్కని తల్లికి చాంగుభళా', 'అదిగో అల్లదిగో' అన్నమయ్య సంకీర్తనలను నయనాందనకరంగా నర్తించి వెంకటసుబ్బయ్యార్ కృతిని బృందావన నిలయంలో నర్తకీమణులు ప్రదర్శించిన ఆహభావాలు ప్రేక్షకులను తన్మయులు చేశాయి. రవీంద్రభారతిలో శనివారం త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ దశమ వార్షికోత్సవ సందర్భంగా త్రైలోక్య భావాను కీర్తనం శీర్షికన వాగ్గేయకారుల కీర్తనలను ఇందిరా పరాశరం శిష్యురాళ్లు నర్తించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణ పాల్గొని మాట్లాడుతూ వాగ్గేయకారులు నృత్య శైలిలో రూపకల్పన చేయడంతో జన సామాన్యానికి చేరువవుతాయన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి, భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్న సభకు ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ అధ్యక్షత వహిరచారు.
రవీంద్రభారతిలోని త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ దశమ వార్షికోత్సవ సందర్భంగా త్రైలోక్య భావాను కీర్తనం శీర్షికన వాగ్గేయకారుల కీర్తనలను ఇందిరా పరాశరం శిష్యురాళ్లు నర్తించి అక్కడ పాల్గొన్న ప్రజల నుండి ప్రశంసలందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణ పాల్గొని ఇలాంటి నృత్య శైలిలో రూపకల్పన చేస్తే ప్రజలందరికీ చేరువవుతాయన్నారాని ఆయన చెప్పారు.
49,103
https://telangana.suryaa.com/telangana-updates-31620-.html
మొజాంజాహి మార్కెట్ లో కేటీఆర్ పర్యాటన
హైదరాబాదు:నగరంలోని మొజాంజాహి మార్కెట్ను ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ మార్కెట్ ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన పనులపై కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. రూ. 10 కోట్లతో ప్రాథమిక అంచనాతో పునరుద్ధరణ పనులకు జీహెచ్ఎంసీ ప్రణాళిక రచించింది. మంత్రి కేటీఆర్ వెంట పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్తో పాటు పలువురు అధికారులు ఉన్నారు. మొజాంజాహి మార్కెట్ ప్రాంత పునరుద్ధరణ పనులను అరవింద్ కుమార్ చేపట్టనున్నారు.
సోమవారం ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ మొజాంజాహి మార్కెట్ను పర్యటించి అభివృద్ధికి రూ. 10 కోట్లు ప్రాథమిక అంచనాతో పనులు చేపట్టాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ను ఆదేశించారు.
55,798
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-50406-.html
<span class="text-big">చిత్రయూనిట్లకు కేసీఆర్ అభినందనలు</span>
హైదరాబాద్: జాతీయ చలన చిత్రాల పురస్కారాలలో టాలీవుడ్ కు అవార్డులు రావడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఓ ట్వీట్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతిభావంతులను జ్యూరీ గుర్తించి, గౌరవించిందని అన్నారు. జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన కీర్తి సురేశ్ కు, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన 'మహానటి' చిత్రయూనిట్ కు, ‘చి. ల. సౌ’ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రకు, ‘రంగస్థలం’ చిత్రయూనిట్ తో పాటు ఆ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
జాతీయ చలన చిత్రాల పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు అవార్డులు రావడంపై కేటిఆర్ పలు చిత్ర యూనిట్లను అభినందిస్తూ ట్వీట్ చేశారు. జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన ‘మహానటి’ కథానాయిక కీర్తి సురేశ్ తో పాటు పలు చిత్రాల టీంలకు శుభాకాంక్షలు తెలిపారు.
56,150
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-50742-.html
ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై ఆప్ ఎమ్మెల్యేల దాడిని ఖండించిన బైజల్
ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై ఆప్ ఎమ్మెల్యేల దాడిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ను హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. సీఎం కేజ్రీవాల్, ఆయన క్యాబినెట్ సహచరులను కలిశానని, ఇటీవలి దురదృష్టకర ఘటనను ఖండించానని, ఢిల్లీ అభివృద్ధి కుంటుపడకుండా అధికారుల్లో విశ్వాసం సడలకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఎల్జీ బైజల్ ట్విట్టర్లో రాసుకొచ్చారు.
ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై ఆప్ ఎమ్మెల్యేల దాడి నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్, ఆయన క్యాబినెట్ సహచరులను కలిసి ఈ ఘటనను ఖండించానని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
68,313
https://cinema.suryaa.com/movies-16411-.html
సోషల్ మీడియాలో ఎంపీ కేశినేని నాని వ్యంగ్యంగా పోస్టులు
విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్లు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత నానీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇటీవల. . లోక్సభలో తెదేపా విప్, ఉపనేత పదవుల్ని తిరస్కరిస్తూ నాని చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. తాను అంత పెద్ద పదవులు నిర్వహించలేనని, మరొకరికి ఇవ్వాలని తన ఫేస్బుక్ ఖాతాలో వ్యంగ్యంగా పోస్టు చేయడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. అనంతరం తెదేపా అధిష్ఠానం రంగంలోకిదిగి పరిస్థితి చక్కదిద్దింది.
తెదేపా ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో సార్వత్రిక ఎన్నికల తర్వాత తెదేపా విప్, ఉపనేత పదవుల్ని నేను అంత పెద్ద పదువులకు సరిపోనని తిరస్కరిస్తూ వ్యంగ్యంగా పోస్టు చేసాడు. తెదేపా అధిష్ఠానం ఈ సమస్యని సామరస్యంగా చక్కదిద్దింది.
83,645
https://www.prabhanews.com/2019/09/this-is-two-marks-for-gram-sachila-category-i-examination/
గ్రామసచివాలయాల కేటగిరీ-1 పరీక్ష కీ విడుదల
అమరావతి: ఏపీ ప్రభుత్వం గ్రామసచివాలయాల పోస్టులకు నిర్వహించిన కేటగిరీ-1 పరీక్షకు అదనంగా మరో రెండు మార్కులు కలపనున్నారు. సబ్జెక్టు నిపుణులు, అభ్యంతరాల అనంతరం తాజాగా కేటగిరి-1 పరీక్షకు తుది’కీ’ విడుదల చేసిన అధికారులు ‘కీ’ను వెబ్ సైట్లో ఉంచారు. కాగా ప్రశ్నాపత్రంలో ఒకప్రశ్నకు జవాబు లేకపోవడం, మరో ప్రశ్నలో అనువాదం దోషం గుర్తించామని ఈ తప్పుల వలన రెండు అదనపు మార్కులను కలపనున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రశ్నలకు జవాబులు రాసినా, రాయకపోయినా పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్నలకు మార్కులు కలపనున్నామన్నారు.
ఏపీ ప్రభుత్వం గ్రామసచివాలయాల పోస్టులకు నిర్వహించిన కేటగిరీ-1 పరీక్ష ప్రశ్నాపత్రంలో ఉన్న లోపాల వలన అందరికి అదనంగా మరో రెండు మార్కులు కలపనున్నారు. తప్పులను సరిచేసిన అనంతరం తుది’కీ’ను వెబ్ సైట్లో ఉంచారని అధికారులు వెల్లడించారు.
88,685
https://www.prabhanews.com/2019/03/%e0%b0%90%e0%b0%a6%e0%b1%87%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%bf%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/
మరో ఐదేళ్లు కష్టపడాలంటున్న
విజయవాడ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఐదేళ్ల నాడు అరవై ఏళ్ల అభివృద్ధిని హైదరాబాద్ లో వదిలేసి రాష్ట్రానికి వచ్చిన పరిస్థితులు తలచుకుంటే కడుపు మండిపోతుందన్నారు. ఏపీని దిక్కులేని రాష్ట్రంగా విడదీసి అప్పుల నెత్తిన పెట్టి అనాథను చేస్తే కట్టుబట్టలతో విజయవాడ వచ్చేశామని, అన్ని పరిస్థితులను అధిగమించి ఈరోజు సంక్షేమ పథకాలలో కూడా మనం ముందున్నామంటే అది ఎవరికి కష్టమో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. హీరో హొండా, కియా మోటార్స్, అపోలో టైర్స్, వందలాది ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, పదులలో ఐటీ కంపెనీలు వచ్చాయంటే అది టీడీపీ ప్రభుత్వం వలనేనని, మరి ఎనిమిది వందల పరిశ్రమలు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయని, మరో ఐదేళ్లు కష్టపడితే దేశం మన రాష్ట్రంవైపు ఎందుకు తలెత్తి చూడదో మనం ఛాలెంజ్ చేసి ముందుకు వెళ్లాలన్నారు. ఏప్రిల్ మొదటి వారం నుండి ఎన్టీఆర్ సేవ ద్వారా ఐదు లక్షల భీమా, ఉచిత మందులు, రైతు రుణమాఫి రెండువిడతల చెల్లింపు, అన్నదాత సుఖీభవ నగదు అన్నీ మీకొచ్చి చేరుతాయని, అప్పుల రాష్ట్రం నుండి ఈరోజు సంక్షేమ రాష్ట్రంగా మారమంటే మనం ఎంత ముందుకొచ్చామో మీరే నిర్ణయించుకోవాలన్నారు.
ఐదేళ్ల నాడు అరవై ఏళ్ల అభివృద్ధిని హైదరాబాద్ లో వదిలేసి రాష్ట్రానికి వచ్చిన పరిస్థితులు తలుచుకుంటే కడుపు మండిపోతుందని చంద్రబాబు అన్నారు. ఏపీని విడదీసి అప్పుల నెత్తిన పెట్టి అనాథను చేసిన, అన్ని పరిస్థితులను అధిగమించి సంక్షేమ పథకాలలో ముందున్నమంటే ఎంత ముందుకు వచ్చామో ప్రజలు ఆలోచించాలన్నారు. టీడీపీ ప్రభుత్వం వల్లనే ఐటీ కంపెనీలు వచ్చాయని, మరో ఐదేళ్లు కష్టపడితే దేశం రాష్ట్రంవైపు తలత్తి చూస్తారని అన్నారు. ఏప్రిల్ నుండి ఐదు లక్షల భీమా ఇంకా ఎన్నో వస్తాయని అన్నారు.
88,992
https://www.prabhanews.com/2019/02/%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e2%80%8c-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%81%e0%b0%96-%e0%b0%b0%e0%b0%9a%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4/
ద్వా.నా.శాస్త్రి తుదిశ్వాస
ప్రముఖ రచయిత, సాహితీవేత్త ద్వా. నా. శాస్త్రి (72) కన్నుమూశారు. హైదరాబాద్లో అర్ధరాత్రి ద్వా. నా. శాస్త్రి తుదిశ్వాస విడిచారు. ద్వా. నా. శాస్త్రి పూర్తి పేరు ద్వాదశి నారాయణ శాస్త్రి. ద్వానాశాస్త్రి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
ద్వా. నా. శాస్త్రి గా పేరుగాంచిన ప్రముఖ రచయిత ద్వాదశి నారాయణ శాస్త్రి(72) హైదరాబాదులో అర్ధరాత్రి మరణించారు.
89,560
https://www.prabhanews.com/2016/11/%e0%b0%85%e0%b0%ae%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%90-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a8%e0%b0%bf/
ఎస్ ఐ పోస్టుల నియామక రాతపరీక్ష ప్రాథమిక కీ విడుదల…
ఎస్ఐ పోస్టుల నియామక రాతపరీక్ష ప్రాథమిక కీ ని రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ అతుల్సింగ్ విడుదల చేశారు. ో అందుబాటులో ఉందన్నారు. అభ్యంతరాలుంటే ు మెయిల్ పంపవచ్చన్నారు. అభ్యంతరాలను డిసెంబర్ 2 సాయంత్రం 5గంటల్లోపు మెయిల్ పంపాలన్నారు.
ఎస్ఐ రాతపరీక్ష ప్రాథమిక కీ ో ఉందని, ు అభ్యంతరాలుంటే మెయిల్ చెయ్యాలని అతుల్సింగ్ అన్నారు.
90,660
https://www.prabhanews.com/2019/03/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b0%e0%b0%be%e0%b0%b8-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%ad%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4/
గవర్నర్ కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
కొద్దిసేపటి క్రితమే గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాస పార్టీలోకి లాక్కుంటున్నారని, అధికారం, డబ్బు ఉపయోగించి తెరాస నేతలు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ఫిరాయింపులపై గవర్నరుకు ఫిర్యాదు చేశారు. తెరాస పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్నారని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తెరాస పార్టీ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని కోరామని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యన్ని కాపాడాలని గవర్నరును కోరామన్న వీరప్ప మొయిలీ, ఫిరాయింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, స్పీకర్, మండలి చైర్మన్ పై కెసిఆర్ ఒత్తిడి ఉందన్నారు.
గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయిన తరువాత, భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికారం, డబ్బు ఉపయోగించి తెరాస పార్టీలోకి లాక్కుంటున్నారని గవర్నరుకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యన్ని కాపాడాలని, తెరాసా పార్టి ప్రభ్త్వాన్ని భర్తరఫ్ చెయ్యాలని కోరారు.
90,812
https://www.prabhanews.com/2019/04/%e0%b0%95%e0%b0%be%e0%b0%95%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%8e%e0%b0%82%e0%b0%aa%e0%b1%80%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b/
ప్రత్యేకహోదా దిశగా జగన్
తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలను కలుపుకొని ప్రత్యేకహోదా సాధిస్తామన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో తెరాస పార్టీకి 17 మంది ఎంపీలు గెలుస్తారని ఏపీలో వైసీపీ కూడా 25 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే మొత్తం 42 మంది ఎంపీలతో రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తామన్నారు. ప్రత్యేకహోదాతో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని జీఎస్టీ కట్టాల్సిన పని ఉండదని హోదాతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తాయని రాష్ట్రంలో ప్రజలంతా అభివృద్ధి చెందుతారన్నారు. చంద్రబాబు పాలనంతా మోసమేనని ప్రత్యేకహోదాను చంద్రబాబే తాకట్టు పెట్టారని అసలు హోదాను తాకట్టుపెట్టడానికి చంద్రబాబు ఎవరని ప్రజలే అడుగుతున్నామన్నారు.
గిద్దలూరులో ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ తెరాస పార్టీకి 17 మంది ఎంపీలు,వైసీపీ 25 ఎంపీలు మొత్తం 42 మంది ఎంపీలతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాదిస్తామని చెప్పారు. ఈ ప్రత్యేకహోదా లో ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని అన్నారు.
3,857
https://www.prajasakti.com/WEBSECTION/International/page672/jet-airwes-prayanikulku-aswasthit
పెల్లెట్ గన్స్ ను తప్పనిసరి
కాశ్మీరు లోయలో నిరసనలను అదుపు చేయడానికి ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్స్ను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను జమ్మూ కాశ్మీర్ హైకోర్టు తిరస్కరించింది. పెల్లెట్స్ను నిషేధించలేమని పేర్కొంది. లోయలో నెలకొన్న పరిస్థితే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంటూ ఆందోళనలు, ఘర్షణలు వున్నంత కాలమూ బల ప్రయోగం అనివార్యమని తేల్చి చెప్పింది. అలాగే పెల్లెట్ గన్స్ ఉపయోగించమని ఆదేశాలు జారీ చేసిన అధికారులను, లేదా ప్రయోగించిన భద్రతా సిబ్బందిని ప్రాసిక్యూట్ చేయాలని కోరుతున్న పిటిషన్ను కూడా హైకోర్టు బెంచ్ తిరస్కరించింది.
కాశ్మీరు లోయలో పరిస్థితులను అదుపు చేయడానికి వాడుతున్న పెల్లెట్ గన్స్ను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను జమ్మూ కాశ్మీర్ హైకోర్టు నిరాకరించింది. లోయలో ఉన్న పరిస్థితుల రీత్యా ఇది అసంభవమని పేర్కొంది.
4,965
https://www.prajasakti.com/WEBSECTION/National/page345/hoda-adigite-lathicharja
రాజ్ భవన్ లో జగన్మోహన్ రెడ్డి
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రాజ్భవన్లో కలిశారు. అయితే ఈ సమావేశానికి ఎటువంటి ప్రాధాన్యత లేదని, మర్యాద పూర్వకంగానే గవర్నర్ని కలిసారని వైసిపి నేతలు చెప్పారు. శుక్రవారం జగన్ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో గవర్నర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన స్వయంగా శనివారం కలిసి గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సభలో పని ఉండటం వల్ల ఫోన్లో గవర్నర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రోజు స్వయంగా రాజ్భవన్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
5,761
https://www.prajasakti.com/WEBSECTION/National/page275/girijan-hakkulu-chattalk-tuts
తప్పు చేస్తే రాజకీయం నుండి తప్పుకుంటాను
ఒంగోలు కరణం వర్గీయులతో జరిగిన ఘర్షణపై ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. తనలాంటి హత్య రాజకీయాలకు పాల్పడలేదని, తనది సర్దుకుపోయే మనస్తత్వమని గొట్టిపాటి అన్నారు. వేమవరం హత్యలపై విచారణకు తాను సిద్ధమని, తాను తప్పు చేసినట్లు తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టంచేశారు. కరణం అనుచరులు ప్రతీసారి తనను అడ్డుకుంటున్నారని, తప్పు ఎవరు చేశారో సీఎంకు తెలుసునని పేర్కొన్నారు.
గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ వేమవరం హత్యలపై విచారణకు సిద్ధమని, తప్పు చేసినట్లైతే రాజకీయం నుండి తప్పుకుంటానని, తనది సర్దుకుపోయే మనస్తత్వమని, తప్పెవరిదో సిఎంకి తెలుసు అన్నారు.
6,687
https://www.prajasakti.com/WEBSECTION/International/page854/belzeum-chetilo-otami
రోడ్డు పన్నుల శ్రీకారం
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మొత్తం 136 రోడ్డు పనులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రూ. 259.40 కోట్లు నిధుల విడుదలకు ఆమోదిస్తూ రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యాంబాబ్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 2016-17 ప్రణాళికలో భాగంగా 13 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్డు పనులకు ఈ నిధులు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మొత్తం 136 రోడ్డు పన్నుకలు శ్రీకారం చూటింది దీని కోసం రూ. 259.40 విడుదల చేసినట్టు కార్యదర్శి శ్యాంబాబ్ తెలియ చేసారు .
7,603
https://www.prajasakti.com/WEBSECTION/National/page830/147-kots-mandiki-aarthik-sayam
భర్తలకు బెయిల్ మంజూరు చేయాలి...
త్రిపుల్ తలాక్ పద్ధతిలో భార్యలకు తక్షణ విడాకులిచ్చే కేసుల్లో దోషులుగా తేలిన పురుషులకు బెయిల్ మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. త్రిపుల్ తలాక్ ద్వారా భార్యకు విడాకులిస్తే అది చట్టవిరుద్ధమైన నేరం అని, భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధించాలని ఈ బిల్లులో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇప్పటికే లోక్సభ ఆమోదముద్ర పొందిన ఈ బిల్లు రాజ్యసభలో ప్రభుత్వానికి మెజార్టీ లేకపోవటంతో ఆమోదం పొందలేక పెండింగ్లో పడిపోయింది. ఈ బిల్లులో దోషులుగా తేలిన పురుషులకు బెయిల్ మంజూరు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
త్రిపుల్ తలాక్ ద్వారా భార్యకు విడాకులిస్తే అది చట్టరిత్య నేరమని, భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధించాలని ఆమోదించిన బిల్లుని వ్యతిరేకిస్తూ, భర్తలకు బెయిల్ మంజూరు చేయాలన్న దానిపై లోక్సభ ఆమోదముద్ర పొందినప్పటికీ రాజ్యసభలో ప్రభుత్వానికి మెజార్టీ లేకపోవటంతో పెండింగ్ పడింది.
8,396
https://www.prajasakti.com/WEBSECTION/International/page914/adde-bassu-tendarl-notiphikeshan-raddu-cheyali-artiesi-iyu
సత్యేంద్రనాధ్ 125వ జయంతి
శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన కమ్యూనికేషన్లలో ప్రాంతీయభాషల వినియోగాన్ని విస్తరించాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. ప్రాంతీయ భాషల్లో శాస్త్ర విజ్ఞాన కమ్యూనికేషన్లను ప్రోత్సహిస్తే యువతలో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని, ఇందుకు ద్వితీయ భాష ఏ మాత్రం అడ్డంకి కాబోదని ఆయన అన్నారు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన సత్యేంద్రనాధ్ 125వ జయంతి సందర్భంగా ఏర్పాటయిన స్మారకోపన్యాస కార్యక్రమాన్ని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. శాస్త్ర విజ్ఞానాన్ని ప్రాంతీయభాషల్లో బోధన ప్రారంభించి బెంగాలీ సైన్స్ మ్యాగజైన్ను ప్రారంభించిన ఘనత బోస్దేనన్నారు.
సత్యేంద్రనాధ్ 125వ జయంతి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రాంతీయ భాష వినియోగం పెంచాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా బోస్ ఘనతను కొనియాడారు.
8,598
https://www.prajasakti.com/WEBSECTION/International/page747/sodar-tallini-tupakito-kalchin-mahil
దినకరన్ కు అండగా నటుడు విశాల్
టి. నగర్(చెన్నై): ఆర్కే నగర్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు దినకరన్కు తాను అండగా ఉంటానని నటుడు విశాల్ పేర్కొన్నారు. ఆ నియోజకవర్గం ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారంలో తాను ఆయనకు అన్ని విధాలా సహకరిస్తాననిని తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనను జారీ చేస్తూ కుక్కర్ చిహ్నంపై గెలిచిన దినకరన్ ఆ నియోజకవర్గంలోని మహిళలంతా కుక్కర్తో హాయిగా వంట చేసుకునే పరిస్థితులు తెప్పించేందుకు పాటుపడాలన్నారు. నియోజకవర్గంలో మురుగుకాల్వలు, నీటి సదుపాయాలు లేకుండా ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఈ కీలకమైన సమస్యల పరిష్కారానికి దినకరన్ కృషి చేయాలన్నారు.
చెన్నైలో ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఎన్నికల్లో గెలుపొందిన అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు దినకరన్కు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నటుడు విశాల్ అండగా ఉంటాను అని తెలియపరిచారు. కుక్కర్ చిహ్నంపై గెలిచిన దినకరన్ అక్కడ మహిళలంతా కుక్కర్తో హాయిగా వంట చేసుకునే విధంగా పాటుపడాలి అన్నారు.
8,818
https://www.prajasakti.com/WEBSECTION/International/page348/kott-rajangampai-charchlku-saradhyam-vahinchin-chile-adhyakshuram
ఘన విజయంతో ప్రధాని నరేంద్ర మోడీ
దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు బీజేపిని గెలిపించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసిన బీజేపి కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. అటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తన విజయానికి కారణం బీజేపి కార్యకర్తలు, తమ పార్టీపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలే కారణమని వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.
9,155
https://www.prajasakti.com/WEBSECTION/National/page675/vanijula-digital-karency-petro
న టుడు దిలీప్ కు హైకోర్టులో ఊర ట.
మళయాళ నటుడు దిలీప్కు హైకోర్టులో ఊరట లభించింది. దుబాయ్ వెళ్లడానికి దిలీప్కు కేరళ హైకోర్టు అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు దిలీప్కు నాలుగు రోజులపాటు దుబాయ్లో పర్యటించడానికి అనుమతిని మంజూరు చేసింది. కాగా మళయాళ నటిని అపహరించిన కేసులో ఆరోపణల నేపథ్యంలో దిలీప్ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం విధితమే.
మళయాళ నటుడు దిలీప్ నటిని అపహరించిన కేసు ఆరోపణలో భాగంగా కేరళ హైకోర్టు తనకు నాలుగు రోజులపాటు దుబాయ్లో పర్యటించడానికి అనుమతి జారీ చేసింది.
9,848
https://www.prajasakti.com/WEBSECTION/National/page601/terkiki-trump-bedarimpulu
సీనియర్ న్యాయవాది కన్నుమూత
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పావని పరమేశ్వరరావు(84) కన్నుమూశారు. దిల్లీలోని ఇండియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పీపీ రావు స్వస్థలం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్ల. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
సుప్రీమ్ కోర్ట్ సీనియర్ న్యాయవాది,పద్మభూషణ్ గ్రహీత పావని పరమేశ్వరరావు ఇండియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.
14,150
https://www.prajasakti.com/WEBSECTION/International/page3684/"tichar-kad-gugul-ni-nammandi"-varm-tweet
"టీచర్లను కాదు గూగుల్ ని నమ్మండి"-వర్మ ట్వీట్
తిరుపతి: టీచర్లను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్వర్మపై పలువురు ఉపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్లను నమ్ముకోవద్దు గూగుల్ని నమ్మండి అంటూ వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
టీచర్లను నమ్ముకోవద్దు గూగుల్ని నమ్మండన్న వర్మ ట్వీట్ పై కొంతమంది ఉపాధ్యాయులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేసి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
15,571
https://www.prajasakti.com/WEBSECTION/National/page432/janasenadi-badhyatayut-rajkiya
వీలైనంత శాంతియుతంగా ఎన్నికలు జరగాలని విజ్ఞప్తి.
పశ్చిమబెంగాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను అయిదు లేదా ఆరు దశల్లో జరపాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీకి ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. 2016లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నసీమ్ జైదీ నేతృత్వంలో ఎన్నికల అధికారులు గురువారం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, జిల్లా యంత్రాంగంతో వరుస భేటీలు నిర్వహించారు. 'ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వతంత్రంగా ఓటువేసే పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఈసీకి మేము విజ్ఞప్తి చేశాము. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున, ఎన్ని దశల్లో జరపాలన్నది మేం ప్రత్యేకంగా పేర్కొనలేదు' అని సీపీఎం సీనియర్ నేత రాబిన్ దేబ్ సమావేశం అనంతరం మీడియాతో చెప్పారు.
2016లో పశ్చిమబెంగాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల గూర్చి అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. అందులో భాగంగా ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రజల్లో ఎలాంటి భయాలు లేకుండా ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఉండాలని విజ్ఞప్తి చేసామని, ఎన్ని దశల్లో జరపాలన్నది ప్రత్యేకించి చెప్పలేదని అన్నారు రాబిన్ దేబ్.
15,888
https://www.prajasakti.com/WEBSECTION/International/page976/franslo-vadgadpulu-700-mandiki-paga-mriti
కాంగ్రెస్ నెరవేర్చలేని హామీలను బిజెపి నెరవేర్చింది - స్మృతి ఇరానీ
గత 60 ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేని అనేక హామీలను బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే నెరవేర్చిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం చెప్పారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, కేరళకు ఐఐటి ఇస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ కార్యరూపం దాల్చలేదని, బిజెపి ప్రభుత్వం తన మొదటి బడ్జెట్లో ఐఐటిని ప్రకటించిందని, గతవారమే పాలక్కాడ్లో ఐఐటి ప్రారంభమైందని తెలిపారు. స్థానిక ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ పై ఇరానీ విమర్శల వర్షం కురిపించారు. తన రాష్ట్రం కోసం కాంగ్రెస్ హెచ్ఆర్డి మంత్రి చేయలేని పనిని బిజెపి ఏడాదిలో పూర్తి చేసిందని చెప్పారు.
గత 60 సంవత్సరాలలో కాంగ్రెస్ నెరవేర్చలేని చాలా హామీలను బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే నెరవేర్చిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. దానికి ఉదాహరణ కేరళలో ఉన్న ఐఐటి అని ఆవిడ పేర్కొన్నారు.
16,362
https://www.prajasakti.com/WEBSECTION/International/page251/akshaykumar-garbha-dalcharu
గ్వాటెమాలాకు చెందిన ఏడేళ్ల బాలిక డిహైడ్రేషన్ షొక్ తో మరణం
బోర్డర్ పెట్రోల్ పోలీసులు అరెస్ట్ చేసిన గ్వాటెమాలాకు చెందిన ఏడేళ్ల బాలిక డిహైడ్రేషన్, షాక్తో మరణించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. బోర్డర్ పెట్రోల్ పోలీసులు అరెస్ట్ చేసిన బాలిక మరణించిన విషయాన్ని అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ (డిహెచ్ఎస్) కూడా గురువారం నిర్ధారించింది. బోర్డర్ పోలీసులు అరెస్ట్ చేసిన దాదాపు ఏడుగంటల తరువాత గ్వాటెమాలాకు చెందిన ఈ బాలిక డిహైడ్రేషన్తో పాటు షాక్కు గురై మరణించిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఈ నెల ఆరవ తేదీన ఈ బాలికను, ఆమె తండ్రిని అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర సరిహద్దుల్లో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారని వెల్లడించింది.
గ్వాటెమాలాకు చెందిన ఏడేళ్ల బాలికను, ఆమె తండ్రిని న్యూ మెక్సికో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టు అవ్విన కొన్ని గంటలకే డిహైడ్రేషన్తో షొక్ గురై చనిపోయిందని, అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ తెలిపింది.
17,437
https://www.prajasakti.com/WEBSECTION/National/page96/bengal-raboyedi-bijepi-prabhutvame
ఆఫ్ఘనిస్తాన్ లో మోటార్ సైకిల్ బాంబు
ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతంలోని నాన్ఘర్ ప్రావిన్స్లో ఆదివారం ఉదయం మోటార్సైకిల్ బాంబు పేలిన ఘటనలో కనీసం ఐదుగురు మరణించినట్లు అధికారులు చెప్పారు. రాజధాని జలాలాబాద్లోని సాకర్ స్టేడియం ముందు ఆదివారం ఉదయం జరిగిన ఈ పేలుడులో మరో ఎనిమిది మంది గాయపడ్డారని ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అతావుల్లా ఖోగ్యానీ వివరించారు. ప్రభుత్వ అనుకూల ర్యాలీ ముగిసిన కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించిందని ఆయన వివరించారు. అయితే ఈ పేలుడుకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని జలాలాబాద్లోని నాన్ఘర్ ప్రావిన్స్కి సంబంధించిన సాకర్ స్టేడియం ముందు భయంకరమైన మోటార్సైకిల్ బాంబు పేలడంతో ఐదుగురు మరణించగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైయాయని ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అతావుల్లా ఖోగ్యానీ తెలిపారు.
17,441
https://www.prajasakti.com/WEBSECTION/International/page931/2-lakshalku-paga-companeel-registresion-raddu
హఫీజ్ కు గృహ నిర్బంధం నుంచి విముక్తి
ముంబైలో జరిగిన 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు పాకిస్తాన్లో గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది. హఫీజ్ను విడుదల చేయాలని పాక్ కోర్టు ఆదేశించింది. 2008 నవంబర్ 26న ముంబై దాడుల అనంతరం 2009 జూన్లో పాక్ ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినప్పటికీ ఆరు నెలల తరువాత విడుదల చేసింది. దీంతో హఫీజ్ చాలాకాలం పాకిస్తాన్లో స్వేచ్ఛగా సంచరించాడు.
ముంబై ప్రజలను 2008 నవంబర్ 26న 26/11 దాడితో పొట్టనబెట్టుకున్న హఫీజ్ సయీద్ 2009 జూన్లో పాక్ విధించిన గృహ నిర్బంధం నుంచి ఆరు నెలల తరువాత విముక్తిని అందుకున్నాడు.
17,521
https://www.prajasakti.com/WEBSECTION/National/page447/maji-sienl-aastula-atach-chacin-idi
వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఉగ్రాదాడా?
న్యూఢిల్లీ : న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జనంపై ట్రక్కు దూసుకెళ్లిన ప్రమాద ఘటనను పోలీసులు ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. న్యూయార్క్లో ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ట్రంప్,బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జనంపై ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందగా, 15 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే.
న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జనంపై ట్రక్కు దూసుకెళ్ళడం వల్ల 8 మంది చనిపోయారు. 15 మంది గాయపడ్డారు. దీనిని ట్రంప్ చాలా ఖండించారు. ఇది ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు.
17,620
https://www.prajasakti.com/WEBSECTION/International/page883/14-nuchi-piesies-udyogul-nirvadhik-samme
గృహ నిర్బంధం నుంచి హఫీజ్ కి విముక్తి
పాకిస్థాన్ ప్రభుత్వం జమాత్ ఉద్ దవ(జేయూడీ )చీఫ్ హఫీజ్ సయీద్ పై టెర్రరిజం అభియోగాలను ఉపసంహరించుకుంది. ఈ మేరకు పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం పాకిస్థాన్ సుప్రీం కోర్టు రివ్యూ బోర్డుకు ఈ రోజు తెలియజేసింది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ను ఉగ్రవాద అభియోగాలపై గత కొంత కాలంగా పాకిస్థాన్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. నేడు ఆ అభియోగాలను ఉపసంహరించుకోవడంతో హఫీజ్ సయీద్ గృహ నిర్బంధం నుంచి విముక్తుడు కావడానికి మార్గం సుగమమైంది.
ముంబైలో ఉగ్రవాద అభియోగాలపై గృహ నిర్బంధంలో ఉంచిన హఫీజ్ సయీద్ పై పాకిస్థాన్ సుప్రీంకోర్టు టెర్రరిజం అభియోగాలను ఉపసంహరించుకొని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వానికి తెలియపరిచింది. దీంతో గృహ నిర్బంధం నుంచి తప్పించుకోవడానికి అతనికి మార్గం సులభమైంది.
19,311
https://www.prajasakti.com/WEBSECTION/National/page847/mahilpai-doctor-atyachara
బందీలుగా ఉన్న ప్రజలకు క్షమాభిక్ష అవకాశం
మూడు నెలల్లో గా ఆయుధాలను విసర్జించి ప్రభుత్వానికి లొంగి పోయే తిరుగుబాటుదారులకు ప్రభుత్వం క్షమాభిక్ష పెడుతుందని సిరియా అధ్యక్షుడు బషరల్ అసద్ ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్న వారు నెల రోజుల్లోగా ప్రభుత్వానికి అనుకూలంగా మారితే వారికి శిక్షనుండి మినహాయింపు నిచ్చి విడుదల చేస్తామని అధ్యక్షుడు అసద్ గురువారం జారీ చేసిన డిక్రీలో వెల్లడించారు. ఖైదీలందరినీ త్వరలోనే విడుదల చేస్తామని, నెల రోజుల్లోగా ప్రభుత్వానికి అనుకూలంగా మారే వారికి శిక్షనుండి మినహాయింపునిస్తామని ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. అలెప్పో నగరంలో తిరుగుబాటుదారులను చుట్టు ముట్టి వారి నుండి నగరాన్ని స్వాధీనం చేసుకోవటంలో ప్రభుత్వ సేనలు విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయటం విశేషం.
సిరియాలోని అలెప్పో నగరం లో తీవ్రవాదుల నుంచి వారి నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఆనందంలో, ప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్న వారు నెల రోజుల్లోగా ప్రభుత్వానికి అనుకూలంగా మారితే వారిని శిక్ష నుండి మినహాయించే క్షమాభిక్ష పెడతామని సిరియా అధ్యక్షుడు బషరల్ అసద్ ప్రకటించారు.
20,532
https://www.prajasakti.com/WEBSECTION/National/page14/smugglerlaku-11ellu-jailushiksh
సోమాలియాలో మెరుపు వరదల కలకలం
సోమాలియా దక్షిణ ప్రాంతంలో గత కొద్దివారాలుగా కొనసాగుతున్న వరదలకు దాదాపు 90 వేల మందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. జనాభాలో దాదాపు సగం మంది నిర్వాసితులేనని ఐరాస మానవీయ వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఒసిహెచ్ఎ) ఒక ప్రకటనలో వివరించింది. మెరుపు వరదలు, నదుల వరదల కారణంగా దాదాపు 42 వేల మంది ప్రజలు నిర్వాసితులయ్యారని అంచనా వేసినట్లు ఐరాస తన ప్రకటనలో పేర్కొంది. వరదల ధాటికి సోమాలియా దక్షిణ ప్రాంతంలోని బకూల్, బే, లోయర్ జుబా, మధ్య జుబా, మధ్య షాబెల్ తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది.
సోమాలియాలో వరదలు అలుపు లేకుండా సాగుతూనే ఉన్నాయి. దీనివల్ల దేశంలో సగం మంది నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. దక్షిణ ప్రాంతాలయిన బకూల్, బే, లోయర్ జుబా, మధ్య జుబా, మధ్య షాబెల్ మొదలైనవి తీవ్రంగా నష్టపోయాయి.
20,795
https://www.prajasakti.com/WEBSECTION/National/page212/abhivriddi-sankshema-dhveyanga-meniesto
సైనికులపై తెలియని వ్యక్తుల దాడి
దేశ ఉత్తర ప్రాంతంలో ఖుష్ తేపా జిల్లాలో సైనికులపై మంగళవారం ఉదయం జరిగిన దాడిలో 10 మంది ఆఫ్ఘన్ సైనికులు చనిపోయారని ఉత్తర ప్రాంత జావ్జాన్ ప్రావిన్స్ డిప్యూటీ ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ అబ్దుల్ హఫీజ్ ఖాశి తెలిపారు. చెక్ పాయింట్ వద్ద ఒక సైనికుడు తిరుగుబాటు దారులను లోనికి అనుమతించినపుడు 'అంతర్గత దాడి' వల్లే వీరు చనిపోయారు. ఆఫ్ఘన్ సైనికుల జరిపిన ఎదురుదాడిలో ముందుగా దాడిచేసిన అలీమ్తో పాటు మరికొందరు కూడా మరణించారన్నారు. ఈ దాడికి ఏ గ్రూపూ ఇప్పటివరకూ బాధ్యత వహించలేదు.
ఆఫ్ఘనిస్థాన్ లోని ఖుష్ తేపా జిల్లాలో మంగళవారం ఆయుధ జీవి అయినా సైనికులపై గుర్తుతెలియని వారు ధ్వజమెత్తారు. ఈ కాంరణంగా 10 మంది చనిపోయారని జావ్జాన్ ప్రావిన్స్ డిప్యూటీ ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ అబ్దుల్ హఫీజ్ వెల్లడించారు.
31,159
https://www.prajasakti.com/WEBSECTION/National/page88/upadhyaksha-abhyarthipai-trump-drushti
ప్రశాంతంగా జరిగిన వెటర్నరీపోస్టుల రాత పరీక్ష
పశుసంవర్ధక శాఖలో 541 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఎ. వాణీప్రసాద్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 4,230 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, ఉదయం 3,889 ( 91.93 శాతం ) మంది, మధ్యాహ్నం 3,883 ( 91.79 శాతం ) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. నాలుగు కేంద్రాల్లోకి నిర్వహించిన ఈ పరీక్షను ప్రత్యేకంగా నియమించిన అధికారులు పర్యవేక్షించారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఏ వాణీప్రసాద్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలో 541 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు. మొత్తం 4230 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు.
31,482
https://www.prajasakti.com/WEBSECTION/International/page244/hamile-neraverchadalo-modi-vifalamayyar-sitaram-echuri
హైదరాబాదులో భారీ వర్షం కురవడం వల్ల నిలిచిన వాహన రాకపోకలు
హైదరాబాద్ జంటనగరాల్లో పలుచోట్ల సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉప్పల్, హబ్సిగూడ, రామాంతాపూర్, ఎల్బీనగర్, నాగోల్, మాన్సూరాబాద్, వనస్థలిపురం, బీఎన్రెడ్డి నగర్, మీర్పేట, పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు చేరింది. పలు లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై వరదనీరు పారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాదులో భారీ వర్షం కురవడం వల్ల పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరడంతో రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
31,741
https://www.prajasakti.com/WEBSECTION/National/page3391/raippllo-dopidiki-palpadutunn-mutha-arest.
రైళ్లలో దోపిడీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్.
రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన పార్థు ముఠాను అరెస్టు చేసినట్లు ఎర్రుపాలెం పోలీసులు తెలిపారు. ముఠాలోని నలుగురిని మీనవోలు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన పార్థు ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు ఎర్రుపాలెం పోలీసులు తెలిపారు.